వంటనూనెల జీఎస్టీ రీఫండ్స్ ఆంక్షలు ఎత్తేయండి – ఐవీపీఏ విజ్ఞప్తి.

వంటనూనెల జీఎస్టీ రీఫండ్స్‌పై విధించిన ఆంక్షలు ఎత్తేయండి.. ఐవీపీఏ విజ్ఞప్తి

 

 

వంటనూనెలకు సంబంధించి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ రీఫండ్‌పై ఆంక్షలను ఎత్తేయాలని ఇండియన్ వెజిటెబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ ఆంక్షల వల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఇబ్బంది పడుతున్నాయని తెలిపింది.

ఇంటర్నెట్ డెస్క్: వంటనూనెలకు సంబంధించి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ రీఫండ్స్‌‌పై విధించిన ఆంక్షలను ఎత్తేయాలని వెజిటెబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐవీపీఏ) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రీఫండ్స్ లేని కారణంగా వర్కింగ్ క్యాపిటల్, నగదు లభ్యత తగ్గి చిన్న,మధ్య తరహా సంస్థలు ఇబ్బంది పడుతున్నాయని పేర్కొంది. ఈ రంగంలో పెట్టుబడులు తగ్గుతున్నాయని కూడా పేర్కొంది.

రీఫండ్స్‌కు సంబంధించి జీఎస్టీ కౌన్సిల్ 2022 జులైలో ఆంక్షలు విధించిందని ఐవీపీఏ తెలిపింది. వంటనూనెలకు సంబంధించి ఇన్‌వర్టెడ్ సుంకాలు, ఆంక్షల కారణంగా తమ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరుకుపోతున్నాయని తెలిపింది. ఫలితంగా నగదు లభ్యత తగ్గుతోందని, ఇది చిన్న, మధ్య తరహా సంస్థలపై ప్రభావం చూపుతోందని పేర్కొంది. ‘వర్కింగ్ క్యాపిటల్‌కు కొరత ఏర్పడుతోంది. నగదు లభ్యతకు అవాంతరాలు పెరుగుతున్నాయి. కార్యకలాపాలు నిర్వహించడం కష్టంగా మారింది’ అని ఐవీపీఏ ఓ ప్రకటనలో తెలిపింది.

రీఫండ్స్ లేని కారణంగా ఈ అదనపు ధరాభారం వినియోగదారులకు బదిలీ కావడంతో వంట నూనెల రేట్లు పెరుగుతున్నాయని ఐవీపీఏ తెలిపింది. రేట్లు తట్టుకోలేక కొందరు వినియోగదారులు తక్కువ నాణ్యత గల ప్రత్యామ్నాయాలవైపు మళ్లుతున్నారని తెలిపింది. బటర్, నెయ్యి వలెనే వంటనూనెలకు సంబంధించి ట్యాక్స్ క్రెడిట్స్ రీఫండ్ తక్షణం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రీఫండ్స్ విధానంలో సుస్థిరత వస్తే దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం కూడా తగ్గుతుందని ఐవీపీఏ తెలిపింది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, 2030-31 నాటికి దేశంలో వంటనూనెలకు డిమాండ్ 30 మిలియన్ టన్నులకు చేరే అవకాశం ఉంది. ఆహార నూనెల మార్కెట్ 2023-28 మధ్య కాలంలో 5.26 వార్షిక వృద్ధి రేటుతో పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సహేతుకమైన రీఫండ్ పాలసీ దేశంలో ఆహారభద్రతకు బాటలు వేస్తుందని కూడా ఐవీపీఏ పేర్కొంది.

పేదలకు లబ్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం…

పేదలకు లబ్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి

 

ప్రతి పేదలకు అన్ని విధాలుగా లబ్ధి చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న కొత్త రేషన్ కార్డులను బుధవారం పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డిల ఆదేశాల మేరకు తొర్రూరు పట్టణంలోని రేషన్ షాప్ లో నూతన లబ్ధిదారులకు కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పేదల కష్టాలను అర్థం చేసుకొని ఆహార భద్రతతో పాటు రేషన్ కార్డులను అందించిందన్నారు. పల్లె ప్రజలకు అండగా నిలిచే విధంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య,చాపల బాపురెడ్డి,గంజి విజయపాల్ రెడ్డి,గుండాల నర్సయ్య,జలకం శ్రీనివాస్, వెంకటాచారి,తాళ్లపల్లి బిక్షం గౌడ్, సొంటి రెడ్డి భాస్కర్ రెడ్డి, నడిగడ్డ శ్రీనివాస్,కల్లూరి కుషాల్, రాజేష్ యాదవ్, జింజిరాల మనోహర్,ముద్దసాని సురేష్, వెలుగు మహేశ్వరి, పంజా కల్పన, జలీల్,గూడేల్లి రామచంద్రయ్య, జలగం వెంకన్న,మహేష్ యాదవ్, యశోద,దేవేందర్, రేషన్ షాప్ డీలర్లు సోమిరెడ్డి, సోమయ్య, శ్రీనివాస్, వార్డు ఆఫీసర్లు మురళి, అజయ్, నరేష్, సురేష్, బ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

పేదల ఆకలికేకలు లేకుండా చూడటమే మా ప్రభుత్వ లక్ష్యం

“పేదల ఆకలికేకలు లేకుండా చూడటమే మా ప్రభుత్వ లక్ష్యం”

రాజాపూర్ మండలానికి 433 కొత్త రేషన్ కార్డులు.

జడ్చర్ల /నేటి ధాత్రి

 

రాష్ట్రంలోనీ పేదల ఇళ్లల్లో ఆకలికేకలు లేకుండా చూడటమే మా ప్రజా ప్రభుత్వ లక్ష్యమని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి వెల్లడించారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల కేంద్రంలోని జెకె ప్యాలెస్ లో నిర్వహించిన నూతన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని,మండల కేంద్రంలో రూ. 30 లక్షలతో వేస్తున్న సిసి రోడ్డు మరియు అండర్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ప్రథమ కర్తవ్యంమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
రేషన్ కార్డు కేవలం ఒక పత్రం కాదు, ఇది ప్రతి పేద కుటుంబానికి భరోసా అని ప్రస్తావించారు. భవిష్యత్తుకు ఆర్థిక బలంతో పాటు, పేదల ఆకలి తీర్చడమే కాకుండా, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో ఈ ప్రక్రియ కీలకమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
రాజాపూర్ మండలానికి 433 కొత్త రేషన్ కార్డులు,1667 పాత కార్డులకు ఆడిషన్స్ పూర్తయ్యాయని తెలిపారు. గతంలో అర్హులు ఎన్నో ఏళ్లు రేషన్ కార్డుల కోసం ఎదురుచూసిన దరఖాస్తులు పెండింగ్ లోనే ఉన్నాయని గుర్తు చేశారు. కానీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హులందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version