నర్సంపేటను మోడల్ సిటీగా తీర్చిదిద్దుతాం..

నర్సంపేటను మోడల్ సిటీగా తీర్చిదిద్దుతాం

మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీలక్ష్మీరామానంద్

నర్సంపేట, నేటిధాత్రి:

నర్సంపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మోడల్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ తెలిపారు. పట్టణ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆమె స్పష్టం చేశారు.నర్సంపేట మున్సిపల్ పరిధిలోని 26వ వార్డులో చైర్‌పర్సన్ శ్రీలక్ష్మీరామానంద్, వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా, స్థానిక కౌన్సిలర్ మండల శ్రీదేవి-శ్రీనివాస్‌లతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ, ఇటీవల రూ.90 లక్షల వ్యయంతో పలు సీసీ రోడ్లు, సైడ్ కాలువలు, కల్వర్టుల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు.జయశ్రీ థియేటర్ నుంచి పెద్ద కాలువ వరకు, భవాని టెంట్ హౌస్ నుంచి పెద్ద కాలువ వరకు, సెంట్రల్ బ్యాంక్ నుంచి పెద్ద కాలువ వరకు సీసీ రోడ్లు, కాలువలు నిర్మించడంతో పాటు ఇతర కాలనీల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. పెద్ద కాలువపై డబుల్ సీసీ రోడ్డు, సంజీవని అనాథ ఆశ్రమం వద్ద రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు వివరించారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, వార్డులో గుర్తించిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నీటి సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకుంటామని, పారిశుద్ధ్యం, సానిటేషన్ పనులను మరింత మెరుగుపరచాలని సిబ్బందికి ఆదేశించినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కాట భాస్కర్,స్థానిక ప్రజాప్రతినిధులు, వార్డు అధికారులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version