అక్రమ అరెస్టులు గృహనిర్బంధాలను ఖండిస్తున్నాం కొంకుల రాజేష్…

అక్రమ అరెస్టులు గృహనిర్బంధాలను ఖండిస్తున్నాం కొంకుల రాజేష్ అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు.

బెల్లంపల్లి నేటిధాత్రి :

క్యాతనపల్లి మున్సిపాలిటీ 22 వార్డులకు ఎన్నికలు జరగగా పొత్తులో భాగంగా బీఆర్ఎస్ సిపిఐ 14 వార్డులు గెలవగా కాంగ్రెస్ 7వార్డులు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలవడం జరిగింది, మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు బీఆర్ఎస్ సిపిఐ కి తగిన మెజారిటీ ఉన్న అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రి ఎంపీలు ఈ ఎన్నిక ను వాయిదా వేయటానికి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు, నిన్న కేతనపల్లి మున్సిపాలిటీలో బిఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్ల మీద జరిగినటువంటి దాడి వైఖరిని చూస్తే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుందని కళ్లకు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది నిన్న జరిగినటువంటి దురాగాతానికి ఈరోజు కేతనపల్లి బంద్ కి సిపిఐ బిఆర్ఎస్ బందు పిలుపు ఇవ్వడం జరిగింది, ప్రభుత్వం ఈ బందు కొనసాగకుండా పోలీస్ బలగాలను పట్టణంలోని మోహరించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు వనం సత్యనారాయణ నీ అరెస్టు చేసి జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, మిగతా కామ్రేడ్స్ అందరి ఇంటి వద్ద బీఆర్ఎస్ నాయకుల ఇంటి వద్ద పోలీస్ బలగాలను పెట్టి వారిని ఇంట్లోనే నిర్బంధించి హౌస్ అరెస్టులను చేయడాన్ని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ మంచిర్యాల జిల్లా సమితి తీవ్రంగా ఖండిస్తోందని వారన్నార, మంత్రివర్యులు ఇప్పటికైనా ప్రజల తీర్పును గౌరవించి క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఎన్నికను సజావుగా జరగనివ్వాలని నిర్బంధాలతో తెలంగాణ ప్రజలను అణిచివేయలేరని గ్రహించాల్సిందిగా కోరుతున్నాం.

ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తా..

ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తా

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా బిఆర్ఎస్, సిపిఐ పార్టీ కలిసి పోటీ చేస్తున్న నేపద్యంలో ఒకటో వార్డులో సిపిఐ పార్టీ అభ్యర్థి కౌడగాని సాంబయ్య జోరుగా ప్రచారం నిర్వహించారు.
ఒకటో వార్డ్ లో తనను గెలిపిస్తే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని, తారక రామ కాలనీ, అల్లూరి సీత రామ రాజు నగర్ ల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.
ప్రచారంలో భాగంగా కూటమి బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రచారం నిర్వహించారు. 40 ఏండ్లు గా సీ. పి. ఐ పార్టీ లో కార్య కర్త గా కొనసాగుతున్న తనకు ఒకటో వార్డ్ అభ్యర్ధి గా సీ.పి. ఐ& బి. ఆర్.ఎస్ లు బల పరచారని తెలిపారు. కంకి కొడవలి గుర్తు కు ఓటు వేసి
బారి విజయం అందించాలని కోరారు.

క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్–సిపిఐ పొత్తు

క్యాతనపల్లి లో బిఆర్ఎస్ సిపిఐ దోస్తానకు సై..

స్కాములే తప్ప స్కీములు లేని ప్రభుత్వం నడుస్తుంది..

చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

సింగరేణి సంస్థ వ్యక్తుల చేతిలో బలి అవుతుంది…

ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ సిపిఐ పార్టీ కలిసి పోటీ చేస్తున్నట్లు చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య లు తెలిపారు. శనివారం రామకృష్ణాపూర్ పట్టణంలోని బారాస పార్టీ కార్యాలయంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని, బిఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగిందని బాల్క సుమన్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేక విఫలమయ్యిందని ఆరోపించారు. క్యాతన పల్లి మున్సిపాలిటీ లో సిపిఐ పార్టీతో కలిసి పోటీ చేసి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

సింగరేణి ప్రాంతంలో రాజకీయ జోక్యం ఎక్కువైందని, సంస్థ వ్యక్తుల చేతిలో బలవతోందని సిపిఐ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య ఆరోపించారు.భవిష్యత్తులో కూడా బిఆర్ఎస్ పార్టీ తో పాటు కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. పొత్తుల్లో భాగంగా ఏ ఏ స్థానాల్లో బరిలో గెలుస్తామో మూడవ తేదీన తెలియజేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, బి ఆర్ ఎస్ నాయకులు డాక్టర్ రాజా రమేష్, పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు రామిడి కుమార్ , మేడిపల్లి సంపత్, బారాస, సిపిఐ నాయకులు, మాజీ కౌన్సిలర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version