అంబేద్కర్ జయంతి వేడుకలలో తెలుగుదేశం పార్టీ నేతలు…

అంబేద్కర్ జయంతి వేడుకలలో తెలుగుదేశం పార్టీ నేతలు

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి జిల్లా తెలుగుదేశం పార్టీ అద్యరములో డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలలో తెలుగుదేశం పార్టీనేతలు పాల్గొన్నారు డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన o గా నివాళులర్పించారు
ఈసందర్భంగా తెలుగుదేశం పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ కన్వీనర్ రాములు మాట్లాడుతూ సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు ఒక కులానికి లీడర్ కాదు ,ప్రతి మహిళ సమస్య కోసం పోరాటం ,కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయుడు.
ఆ మహనీయుని ఆశయాలను కొనసా గి నా oచాలని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వనపర్తి పట్టణ అధ్యక్షులు లక్ష్మయ్య , షాకీర్ హుస్సేన్ ,ఆవుల శ్రీను, గంధం ట్రాక్టర్ బాలయ్య చిన్నయ్య,అప్పాయిపల్లి బాలయ్య , జి లక్ష్మయ్య,జి కృష్ణయ్య, శేఖర్, రాజు మేస్త్రి, దాసు, కొత్తగొల్ల శంకర్ ద్యారపోగు బాలరాజు తదితరులు పాల్గొన్నారు

కొత్త రేషన్ దుకాణం ప్రారం భించిన ఎమ్మెల్యే/….

కొత్త రేషన్ దుకాణం ప్రారం భించిన ఎమ్మెల్యే

గండ్ర సత్యనారాయణ రావు

శాయంపేట నేటిధాత్రి :

శాయంపేట మండలంలోని మాందారిపేట గ్రామానికి చెందిన బడుగు అశోక్ నూతన రేషన్ దుకాణంను ఎమ్మెల్యే గండ్ర సత్యనార యణరావు ప్రారంభించా రు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజలకు నిత్యావసర సరుకు లను సమయానికి, పారద ర్శకంగా ప్రభుత్వంఅందిస్తుంది గ్రామస్థాయిలో రేషన్ దుకా ణాల ఏర్పాటు ద్వారా ప్రజల కు సులభంగా సరుకులుఅందే విధంగా చర్యలు తీసుకుంటు న్నామని పేర్కొన్నారు.ఈ కొత్త రేషన్ షాప్ ద్వారా మాందా రిపేట గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా అధికా రులు కృషి చేయాలని సూచించారు.ప్రజలు కూడా రేషన్ సరుకులను సద్వి నియోగం చేసుకుని కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డిఓ ,శాయంపేట మండలం ఎమ్మార్వో , కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నా రు.

 

 

ఘనంగా బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

ఘనంగా బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నాగారం నేటిదాత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా

నాగారం డివిజన్ బీజేపీ అధ్యక్షులు కొండబోయిన నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో నాగారం డివిజన్‌లో పెద్ద ఎత్తున బీజేపీ జెండాలు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రా రెడ్డి పాల్గొని మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ నేషన్ ఫస్ట్ అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతుందని తెలిపారు.
47 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో పార్టీ నాయకులు, కార్యకర్తల త్యాగాల వల్లే ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే భావంతో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే పార్టీ లక్ష్యమని చెప్పారు. పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి అంత్యోదయ సిద్ధాంతాన్ని గుర్తు చేస్తూ, సమాజంలోని చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ పథకాలు చేరాలనే లక్ష్యంతో బీజేపీ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నాగారం డివిజన్‌ ను బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. నాగారం డివిజన్‌లో సుమారు 20 బూత్‌లలో జెండాలు ఎగరవేయడం పార్టీ ఎదుగుదలకు మంచి పరిణామమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మునిగంటి సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు శ్యామ్ సుందర్ శర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి బుధవరం లక్ష్మి, మాజీ ఎంపిటిసి తరిగొప్పుల బలరాం, మాజీ కౌన్సిలర్ బిజ్జా శ్రీనివాస్ గౌడ్ ,మాజీ పీఎస్ఎస్ డైరెక్టర్ కొండేటి ఎల్లారెడ్డి, సీనియర్ నాయకులు బొమ్మిడి బుచ్చిరెడ్డి, రామారం మహేందర్ గౌడ్, నక్క కిషోర్ గౌడ్, డివిజన్ ప్రధాన కార్యదర్శులు మామిడి జంగారెడ్డి, పోతంశెట్టి వెంకటేశ్వర రావు, ఉపాధ్యక్షులు వల్లల శ్రీనివాస్ గౌడ్, ఎలసాని నాగరాజ్ యాదవ్, కార్యదర్శి బోల్లపు సురేందర్ రెడ్డి, సతీష్ రెడ్డి, నాయకులు శంకర్ రెడ్డి , జమ్మల శంకర్ తాటకొండ రవీందర్,బుధవరం వేణుగోపాల్, రవీందర్ రెడ్డి, సూర్య శేఖర్ రెడ్డి, నెల్లుట్ల నవీన్, మంచాల మహేందర్, జూపల్లి నరేష్, అక్కల సురేష్, భువనేశ్వరి, విజయలక్ష్మి, ముద్రగణం శ్రీనివాస్ యాదవ్, సూర్వి రాజు, రమాదేవి, షాజీ, కృష్ణ చారి, విజయ్, సతీష్ , శ్రీకాంత్ యాదవ్, బూత్ అధ్యక్షులు శంకర్ ముదిరాజ్, కత్తురోజు అశోక్ చారి, వెంకట చారి, గుమ్మడి చంద్ర రెడ్డి, యాదగిరి, మహేష్, సంజయ్, కుమార్ యాదవ్, పొట్ట సుధాకర్, మల్యాల మధు, రఘు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా బిజెపి వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు.

ఘనంగా బిజెపి వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

 

భారతీయ జనతా పార్టీ 47వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం నాడు కల్వకుర్తి బిజెపి పార్టీ కార్యాలయం పైన బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్దారి పర్వతాలు పార్టీ జెండా ను ఆవిష్కరిoచారు.
పట్టణంలోని పలు వార్డులలో బిజెపి బూత్ అధ్యక్షులు జెండాను ఆవిష్కరించారు.పార్టీకార్యాలయం, బూత్ ల వారిగా జరిగిన జెండా ఆవిష్కరణలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్,జిల్లా ఉపాధ్యక్షులు మున్సిపల్ కౌన్సిలర్ బోడ నరసింహ, జిల్లా కార్యదర్శి గుర్రాల రాంభూపాల్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ లు రామకృష్ణ, శ్రీరాములు,సీనియర్
నాయకులు నీరుకంటి రాఘవేందర్ గౌడ్, నారెడ్ల శేఖర్ రెడ్డి, కృష్ణ గౌడ్, పాలకూర్ల రవి గౌడ్, గంగాధర్, వంశీ నాయక్, పెద్దారి విజయ్, ధన్నోజు నరేష్ చారి, కుడుముల రాంరెడ్డి,,శివాజీ, లక్ష్మీనరసింహ, అరవింద్ రెడ్డి, కూన ప్రవీణ్, వెంకటేష్, కిరణ్ యాదవ్,శివకుమార్, రాఘవేందర్ సాగర్, హనుమంతు గౌడు,మణికంఠ గౌడ్,శేఖర్, శ్రీకాంత్,రమేష్, పట్టణ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.పార్టీ స్థాపకులకు, మహానేతలకు ఘన నివాళులు అర్పించారు. ప్రతి కార్యకర్త పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిస్తూ, దేశ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ మరింత బలపడాలని ఆకాంక్షించారు.భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6న స్థాపించబడినప్పటి నుండి సాధారణ కార్యకర్తల శక్తితో ఎదుగుతూ దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించింది. ప్రారంభ దశలో కేవలం 2 ఎంపీ స్థానాలతో ప్రారంభమైన ఈ పార్టీ, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటూ క్రమంగా తన బలాన్ని పెంచుకుంది.అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తన సత్తాను చాటుకున్న బీజేపీ, అనంతరం నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అఖండ విజయాలను సాధిస్తూ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశ అభివృద్ధికి కొత్త దిశను చూపుతోందన్నారు.

దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించిన పార్టీ బీజేపీ…

దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించిన పార్టీ బీజేపీ

#మండలంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు.

#తడుక అశోక్ గౌడ్ సీనియర్ నాయకుడు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

సాధారణ కార్యకర్తల శక్తితో ఎదుగుతూ దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని బీజేపీ మాజీ జిల్లా కార్యదర్శి సీనియర్ నాయకుడు తడుక అశోక్ గౌడ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అశోక్ గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6న స్థాపించబడినప్పటి నుండి సాధారణ కార్యకర్తల శక్తితో ఎదుగుతూ దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించింది. ప్రారంభ దశలో కేవలం 2 ఎంపీ స్థానాలతో ప్రారంభమైన పార్టీ, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటూ క్రమంగా తన బలాన్ని పెంచుకుందని,అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తన సత్తాను చాటుకున్న బీజేపీ, అనంతరం నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అఖండ విజయాలను సాధిస్తూ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశ అభివృద్ధికి కొత్త దిశను చూపిందన్నారు.“సబ్కా సాథ్ – సబ్కా వికాస్ – సబ్కా విశ్వాస్” అనే సిద్ధాంతంతో అన్ని వర్గాల అభ్యున్నతి కోసంల భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రంగాపురం గ్రామ సర్పంచ్ ఓరుగంటి మాధురి రాజు , మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నాగరాజు,మండల ఉపాధ్యక్షులు గుర్రపు నరేష్,బత్తిని కుమారస్వామి, మండల కార్యదర్శి ఓదెల అశోక్ ,కోశాధికారి మురికి మనోహర్, సీనియర్ నాయకులు వల్లే పర్వతాలు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

బెల్టు జోరు… కుటుంబాలు బేజారు…

బెల్టు జోరు… కుటుంబాలు బేజారు

అడ్డగోలుగా మద్యం విక్ర యాలు

పట్టించుకొని ఎక్సైజ్ అధికారులు

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో రాత్రింబవ ళ్ళు పొద్దున్న కొడుకుయక ముందే యథెచ్చగా మద్యం వ్యాపారం కొనసాగుతుంది. బెల్టు దుకాణాల్లో జరుగుతు న్న ఈ అక్రమ వ్యాపారానికి సంబంధించిన అధికారులు అండదండలతో అడ్డుఅదుపు లేకుండా ఈ మద్యం వ్యాపా రం దందా మండలంలో మూ డు పూలు ఆరు కాయలుగా విరజిల్లుతుంది. దీన్ని ఆసరా గా చేసుకున్న మద్యం వ్యాపా రులు ఈ దందాను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకొని కొనసాగిస్తున్నారు. మండ లంలో వివిధ గ్రామాలలో మద్యం ఏరులై పారుతున్నది. ప్రతి గ్రామం పల్లెలలో కిరాణా దుకాణాల కంటే ఎక్కువ మద్యం దుకాణాలే దర్శనమి స్తున్నాయి. మద్యానికి బాని సలై ఎంతో మంది పేద బతు కులు చింద్ర మౌతున్నాయి. అయినా ఎక్సైజ్ పోలీసులు యంత్రానికి చీమకుట్టినట్లు కూడా లేదు వాళ్లకు నెలకు మాములు ఇస్తే చాలు. నాలు గు నెలలకు ఒకసారి తూతూ మంత్రంగా చుట్టపు చూపుగా తనిఖీలు నిర్వహిస్తూ చూసి చూడనట్టు వ్యవహరిస్తు న్నారు. బెల్టు షాపుల యజ మానులు ఒక బీరు, ఒక క్వాటర్ నుండి రూ. 20 నుండి రూ. 40 రూపాయల వరకు మద్యంపై అధికంగా వసూలు చేస్తున్నారు. మండ లంలో బెల్టు షాపులు ఎక్సైజ్ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఎనీ టైం మద్యంను అరిక ట్టలేరా!

ప్రభుత్వ అనుమతి కలిగిన మద్యం దుకాణాల నిర్వహణ కు సమయపాలనలో నిబంధ న ఉంది. కానీ ఎనీ టైంమద్యం దొరికేది ఒక బెల్టు షాప్ దుకా ణాలోనే ఎనీ టైం మందును అరికట్టే వారే అధికారులు లేరా!

ఇబ్బంది పడుతున్న మహిళలు

గ్రామాల్లో అక్రమంగా వెలసిన బెల్టుషాపుల దుకాణాల వల్ల మహిళలు ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. మద్యం సేవిం చిన మత్తులో బెల్టు దుకాణా ల వైపు వెళ్తున్న మహిళలను ఇబ్బందులకు గురిచేసిన ఘ టనలు అనేకం చోటుచేసు కున్నాయి. ఈ బెల్టు దుకా ణాల వల్ల చెడు మార్గాలు పడుతున్నట్టు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చని సంసారాల్లో బెల్టు దుకాణాలు చిచ్చు పెడుతు న్నాయని మహిళలు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. బెల్టు దుకాణాలపై అధికారులు కొరడా జరిపించాలని పలు వురు మహిళలు కోరుకుం టున్నారు.

యువతపై త్రీవప్రభావం

BJP Celebrates Foundation Day in Narsampet

 

 

 

మండలంలోని అనేక గ్రామాల్లో బెల్టు దుకాణాలు విచ్చలవిడిగా మొదలయ్యా యి. అందుబాటులో మద్యం దొరుకుతుంది. దీనివల్ల యు వత మద్యానికి బానిసై భవి ష్యత్తును నాశనం చేసుకుం టున్నారు. అధికారులు చర్య లు తీసుకోకపోతే భవిష్యత్తు లో ఇంకా ఎన్నో అనార్థాలు జరిగే ప్రమాదం ఉందని పలు వురు మేధావులు అంటున్నారు.

పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు

బస్టాండ్, ఆటో స్టాండ్ ఆవ రణంలో రోడ్డు పక్కనే , కిరాణం దుకాణాల్లోచాలా మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు.మండల కేంద్రం నుండి గ్రామాల్లో గల్లీకోక్క మద్యం దుకాణం. దీనికి తోడు ఇక్కడ మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడంతో అనుక్షణం ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మద్యం షాపు పూర్తిగా రోడ్డుకు ఆనుకునే ఏర్పాటు చేశారు.ఈ దుకా ణంలో విచ్చలవిడిగా మద్యం కొనుగోలు చేసిన వారు దుకా ణం ముందురోడ్డుపైనే మద్యం తాగి అక్కడే పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బం దులు ఏర్పడుతున్నాయి. అదే విధంగా ఈ దుకాణం పక్కనే ఇళ్ళు ఉండడంతో మందుబాబుల ఆగడాలతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ దుకాణం ముందు పలుసార్లు ఇక్కడ ఎదురెదురుగా వస్తున్న వాహ నాలు ఢీకొన్న సంఘటనలు కూడా ఉన్న సంబంధిత అధికారులు ఏ మాత్రం పట్టిం చుకోవడం లేదని తీవ్ర ఆరోప ణలు వస్తున్నాయి. మామ్ము ళ్లకు అలవాటు పడిన సంబం ధిత ఎక్సైజ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకో లేదు.దీంతో ప్రజల సమస్యలు నిత్య కృత్యం అయ్యాయి. అంతేగాక పలు గ్రామాల్లో బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి విచ్చ లవిడిగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్న అధికారులు కిమ్మనక పోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుకాణం నుండి ఆటోలు ఇతర వాహనాల్లో అక్రమంగా మద్యంను గ్రామాల్లో కొనసా గుతున్న బెల్ట్ షాపులకు తరలించి అధిక ధరలకు అమ్మకాలు చేపడుతున్నా రు.దీంతో తాగుబోతుల జేబులకు చిల్లులు పడుతున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

సిద్ధాంతిక నిబద్ధతతో ప్రజల మన్ననలు పొందిన పార్టీ బీజేపీ….

సిద్ధాంతిక నిబద్ధతతో ప్రజల మన్ననలు పొందిన పార్టీ బీజేపీ

భాజపా జిల్లా కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

నర్సంపేటలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నర్సంపేట, నేటిధాత్రి:

సిద్ధాంతిక నిబద్ధతతో ప్రజల మన్ననలు పొందిన పార్టీ బీజేపీ అని వరంగల్ జిల్లా కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు.నర్సంపేట పార్టీ కార్యాలయంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ సిద్ధాంతిక నిబద్ధతతో క్రియాశీల రాజకీయాలు నెరుపుతూ ప్రజల మన్ననలు పొందిన పార్టీగా బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిందన్నారు. 1980 ఏప్రిల్ 6న దేశ సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణ మరియు అంత్యోదయ సిద్ధాంత ప్రాతిపదికన ఆవిర్భవించిన బీజేపీ అవినీతి రహిత పారదర్శక పాలనతో దేశ అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు.

దివంగత మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజపేయి సుపరిపాలనకు బాటలు వేస్తే, నేడు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌ను ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు వికసిత్ భారత్ లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో యువత, మహిళలు, రైతులు అన్ని వర్గాల ప్రజల మద్దతుతో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, నర్సంపేట నియోజకవర్గంలో కూడా బీజేపీ జెండా ఎగురుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహారాములు, జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్, పార్లమెంట్ కో-కన్వీనర్ కట్ల రామచందర్ రెడ్డి, బీజేపీ ఫ్లోర్ లీడర్ జూలూరు రోజా రాణి, సీనియర్ నాయకులు గడ్డం ఆంజనేయులు, కుంభం కోమల్ రెడ్డి, బాల్నే జగన్, దుగ్యాల సమ్మయ్య, మాజీ కౌన్సిలర్ జుర్రు రాజు, రూరల్ అధ్యక్షులు తనుగులు అంబేద్కర్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్, ఉపాధ్యక్షులు కొంకీసా విగ్నేష్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి సూత్రపు సరిత, ఉపాధ్యక్షులు ఠాకూర్ విజయ్ సింగ్, కందగట్ల నాగరాజు, కాసుల నాగేంద్రబాబు, ముత్యాల శ్రీనివాస్, పోనుగొటి రవీంద్ర చారి, పులిపాక అశోక్, శోభన్, చిల్వేర్ అన్వేష్, సామల ప్రవీణ్ కుమార్, ఆముదాల రమేష్, సామల సాయి, నూనె రంజిత్, కట్ల మహేందర్, నరసయ్య, అల్లం నిఖిల్, వేల్పుల సుమన్ తదితరులు పాల్గొన్నారు.

మైలారంలో బిజెపి పార్టీ ఆవిర్భావదినోత్సవ వేడుకలు…

మైలారంలో బిజెపి పార్టీ ఆవిర్భావదినోత్సవ వేడుకలు

శాయంపేట, నేటిధాత్రి;

శాయంపేట మండలం మైలా రం గ్రామంలో భారతీయ జన తా పార్టీ ఆవిర్భావదినోత్సవ వేడుకలను ఘనంగానిర్వహిం చారు. మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.ఈసందర్భంగా మండల అధ్యక్షుడు చేతుల మీదుగా పార్టీ జెండాను ఆవి ష్కరించారు . అనంతరం పార్టీ స్థాపకుల త్యాగాలు, సేవలను స్మరించుకున్నారు మాట్లాడుతూ దేశాభివృద్ధి దిశగా బిజెపి చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. గ్రామ స్థాయిలో పార్టీ బలోపే తానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవే యాలని పిలుపునిచ్చా రు.ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు ఉత్సాహంగా నినాదాలు చేస్తూ కార్యక్రమాన్ని విజయ వంతం చేశారు. ఈ కార్యక్ర మంలో రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ రాయరాకుల మొగిలి, మండ ల ప్రధాన కార్యదర్శి భూతం తిరుపతి, సీనియర్ నాయ కులు బాసని విద్యా సాగర్, ఉప్పు రాజు, మండల ఉపా ధ్యక్షులు కోమటి రాజశేఖర్ మండల కార్యదర్శి మేకల సుమన్, భూత అధ్యక్షులు కన్నేబోయిన రమేష్, బాసాని నవీన్,నూనె వెంకటేష్ పాల్గొ న్నారు..

బాలానగర్‌లో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

బాలానగర్‌లో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

జడ్చర్ల / నేటి ధాత్రి.

 

జడ్చర్ల నియోజకవర్గంలోని బాలానగర్ మండల కేంద్రంలోని జనార్దన్ రెడ్డి కాంప్లెక్స్‌లో సోమవారం భారతీయ జనతా 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల బీజేపీ అధ్యక్షుడు గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో.. నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..1980లో ఏర్పడినప్పుడు 2 సీట్లతో ప్రారంభమై, నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిందన్నారు.పార్టీ సిద్ధాంతం ప్రకారం “దేశ ప్రథమం” నినాదంతో, జాతీయవాదం, సమగ్ర అభివృద్ధి కోసం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో.. మండల బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు మల్లేష్ , శ్రీనివాస్ కార్యదర్శి బాలరాజు, జిల్లా కౌన్సిలర్ మెంబర్ శ్రీశైలం, బీజేపీ సీనియర్ నాయకులు నర్సింలు,యాదయ్య, సామ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

ఘనంగా బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జిల్లా బీజేపీ అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు.
జిల్లా అధ్యక్షులు నిషిధర్ రెడ్డి మాట్లాడుతూ…
1980 ఏప్రిల్ 6న మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందని, ఈ 47 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు సాధించిందని తెలిపారు. పార్టీ కార్యకర్తల కృషి, శ్రమ, త్యాగాలు, పోరాటాల ఫలితంగా బీజేపీ ఈ స్థాయికి ఎదిగి, కేంద్రంలో అలాగే అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉందని పేర్కొన్నారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్‌తో రానున్న రోజుల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర కార్యవర్గ లు జన్నే మొగిలి పార్లమెంట్ కొ కన్వీనర్ లింగంపల్లిప్రసాద్ రావు జిల్లా ప్రధాన కార్యదర్శిలు దొంగల రాజేందర్ పెండ్యాల రాజు జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతి రెడ్డి కార్యాలయం కార్యదర్శి వట్టం తిరుపతి మీడియా ఇంచార్జ్ మునెందర్ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సయ్యద్ గాలీఫ్, జిల్లా నాయకులు పొన్నాల కొమురన్న,తుమ్మటి రాంరెడ్డి,తాటికంటి రవి కుమార్ తాటికంటి రవికుమార్,ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు తీగల జగ్గయ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

మండల బిజెపి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ…..

మండల బిజెపి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ…..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని బిజెపి పార్టీ ఆఫీసులో బిజెపి మండల అధ్యక్షులు బిజెపి నాయకుల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ 47 వ స్థాపన దివస్ సందర్భంగా. పార్టీ స్థాపకులకు మహానేతలకు ఘన నివాళులు అర్పిస్తూ స్తూ భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్. 6. స్థాపించబడినప్పటి నుండి సాధారణ కార్యకర్తల శక్తితో ఎదుగుతూ దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించిందని ప్రారంభ దశలో కేవలం రెండు ఎంపీ స్థానాలతో మాత్రమే ప్రస్థానం ప్రారంభించిన పార్టీ క్రమక్రమంగా ప్రజల విశ్వాసాన్ని గెలిచుకుంటూ తన బలం పెంచుకుందని మొదటి సారి అటల్ బిహారీ వాజపేయి గారి నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా బిజెపి తన సత్తాను చాటుకుందని అనంతరం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా అఖండ విజయాలు సాధిస్తూ పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధికి కొత్త దిశను చూపుతుందని తెలియజేస్తూ. సబ్కా సాత్ -సబ్కా వికాస్-సబ్కా విశ్వాస్”. అనే సిద్ధాంతంతో అన్ని వర్గాల అభ్యున్నతని లక్ష్యంగా చేసుకొని దేశంలో ప్రజల ఆశీర్వాదం పొందుతూ ప్రపంచంలోనే అత్యధిక శక్తివంత దేశంగా తీర్చిదిద్దుతున్న మన ప్రధాని నరేంద్ర మోడీకి యావత్ భారతదేశం ప్రజలు దీవిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటూ తన బలం పెంచుకుందని తెలియజేస్తూ మండల బిజెపి నాయకులు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ 47 వ స్థాపన దివస్ సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేసి. మహానేతలకు ఘన నివాళులు అర్పిస్తూ పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిస్తూ దేశ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బిజెపి మరింత బలపడడానికి ఆకాంక్షించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. మండల బిజెపి అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు. ప్రధాన కార్యదర్శి ఇటికలరాజు. కోసినివిజయ్. ఇటుకల మహేందర్. యాదవ్. బోల్గంభాస్కర్ గౌడ్. బక్క శెట్టి రాజేందర్. రెడ్డి మల్ల నరసింహ. గణేష్. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

దేశం కోసం ధర్మం కోసం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే పార్టీ బిజెపి.

దేశం కోసం ధర్మం కోసం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే పార్టీ బిజెపి.

బిజెపి మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్.

చిట్యాల, నేటిదాత్రి :

భారతదేశంలో ఆదర్శాలకు సంస్కృతికి సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ బిజెపి అని చిట్యాల మండలాధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్* అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
భారతీయ జనతా పార్టీ జన సంఘ్* , జనతా పార్టీ* నుండి 1980 ఏప్రిల్ 6వ తేదీన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి*, లాల్ కృష్ణ అద్వాని నేతృత్వంలో ఆవిర్భంచి నేటికీ 46 సంవత్సరాలు పూర్తికావస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ జెండాను చిట్యాల మండల కేంద్రంలో గల బీజేపీ కార్యాలయంలో బిజెపి జెండా ఎగరవేయడం జరిగిందిఅని సిద్ధాంతాలకు* కట్టుబడి పనిచేస్తూ ప్రపంచంలోనే* ఎక్కువ సభ్యత్వాలు గలఅతిపెద్ద పార్టీగా బిజెపి అవతరించిందని 2 పార్లమెంటు సీట్లతోనే ప్రారంభమై వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అధికారంలో ఉండి అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దని 500 సంవత్సరాల క్రితం నెరవేరని అనేకమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తూ ఈరోజు దేశభక్తిని ప్రతి పౌరునికి అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని దేశం కోసం ధర్మం* కోసం దేశ ప్రజల శ్రేయస్ కోసం బిజెపి పనిచేస్తుందని ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీనీ ఆదరించాలని వెంకటేష్ గౌడ్ అన్నారు
ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మైదం శ్రీకాంత్ బిజెపి సీనియర్ నాయకులు గజానాల రవీందర్ ఓదెల శ్రీహరి సాదా సదానందం గుర్రపు రవి రాయిని శ్రీనివాస్ చింతల రాజేందర్ కేంసారపు ప్రభాకర్ పల్లాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

ఏకాత్మ మానవవాద సిద్ధాంతమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం: మోడీ రవీందర్…

ఏకాత్మ మానవవాద సిద్ధాంతమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం: మోడీ రవీందర్

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో పార్టీ నలభై ఏడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ జెండా ఆవిష్కరించి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఏకాత్మ మానవవాద సైద్ధాంతిక పునాదుల మీద ఏర్పడి దేశ నిర్మాణం లో సమస్యల పరిష్కారనికి భారతీయ జనతా పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తుందని అన్నారు. బీజేపీ కార్యకర్తలు సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి రావడానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పోచంపెల్లి నరేష్, దళిత మోర్చా మండల అధ్యక్షులు సంటి జితేందర్, యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడవెళ్లి రాం, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి ఎడవేల్లి లక్ష్మణ్, మండల ఉపాధ్యక్షులు కారుపాకల అంజిబాబు, బూత్ కమిటీ అధ్యక్షులు కడారి శ్రీనివాస్, ఉత్తేం కనుకరాజు, నాయకులు వడ్లూరి రాజేందర్, వేముల రమేష్, ఐతరవేణి శ్రీనివాస్, బొజ్జ తిరుపతి, పురేళ్ల శేఖర్, రామకృష్ణ, గంగారెడ్డి, మల్లేశం, హరీష్,
పర్శరం, సంజీవ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

నూతన మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లును సన్మానించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు…

నూతన మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లును సన్మానించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు

◆-: డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ ఫిబ్రవరి23:పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీ డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారి నివాసంలో సోమవారం నూతనంగా ఎన్నికైన జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లుకు శాలువాతో సన్మానించి వారికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.వారు మాట్లాడుతూ జహీరాబాద్ పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యునూస్,వైస్ చైర్మన్ శిరీష సురేందర్ రెడ్డి,కౌన్సిలర్లు శ్రీధర్ రెడ్డి,జాఫర్,అరుణ్ కుమార్, జమిలుద్దిన్,జావిద్,జహంగీర్,అక్రం,నిజాం,అక్కాన్,ఖదీర్ మరియు యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి,సీనియర్ నాయకులు శుక్లవర్ధన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి,నర్సింహా యాదవ్,బర్కత్,ముస్తఫా మరియు తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్ నారాయణఖేడ్ మున్సిపాలిటీల బీఫాంలు అందజేత..

జహీరాబాద్ నారాయణఖేడ్ మున్సిపాలిటీల బీఫాంలు అందజేత

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్, నారాయణఖేడ్ మున్సిపాలిటీలకు సంబంధించిన బీఫాంలను పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అజారుద్దీన్, ఎంపీ సురేష్ షెట్కార్, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, మాజీమంత్రి చంద్రశేఖర్, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

సీనియర్ నాయకుడు వెంకట్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా

సీనియర్ నాయకుని ఘనంగా జరుపుకున్న జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల కేంద్రంలోని జిర్లపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి జన్మదిన వేడుకలు తన గ్రామంలో శాలువా పూలమాలలతో సన్మానించి బాణా సంచలు కాల్చి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించిన గ్రామ నూతన సర్పంచ్ అమరేశ్వరి శివమణి ఘనంగా నిర్వహించారు, ముఖ్యఅతిథిగా గోరేగావ్ గ్రామ సర్పంచ్ నాగేందర్ పటేల్ తమ కార్యకర్తలతో పాల్గొని వెంకట్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,

నారావారిపల్లెలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

*సంక్రాంతి వేడుకల్లో నారావారికుటుంబీలతో కలిసిన
జిల్లా తెలుగు దేశంపార్టీ అధ్యక్షులు
షణ్ముగరెడ్డి..

నారావారిపల్లి(నేటిధాత్రి :

 

 

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చెక్కుడుకుప్పం షణ్ముగం రెడ్డి కలిసి వారి స్వగ్రామం నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం జరిగింది. సీఎం చంద్రబాబు తో పాటు, ఆయన సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి రాష్ట్ర మంత్రి యువనేత లోకేష్ నారా బ్రాహ్మణి పాల్గొన్నారు. సంబరాల్లో భాగంగా గ్రామంలోని చిన్నారులకు మ్యూజికల్ చైర్స్, బ్యాలెన్స్ వాకింగ్, గన్నీ బ్యాగ్ రేస్, లెమన్ అండ్ స్పూన్, కాక్ ఫైట్, త్రీలెగ్ రేస్, గ్లాస్ అండ్ బెలూన్ రన్ వంటి పలు క్రీడలను నిర్వహించారు. వీటన్నింటినీ సీఎం చంద్రబాబు ఆసక్తిగా తిలకించి సంతోషంగా గడిపారు. క్రీడల్లో చంద్రబాబు, బాలకృష్ణ మనవళ్లు కూడా పాల్గొన్నారు. అనంతరం ఆటల్లో విజేతలైనవారికి బహుమతులు అందజేశారు. చిన్నారులందరితో ఫోటోలు దిగి ఆప్యాయంగా సీఎం చంద్రబాబు ముచ్చటించారు. దాదాపు రెండు గంటల సేపు గ్రామస్తులు, చిన్నారులతో సీఎం గడిపారు. మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి వారికి బహుమతులను అందించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి అర్జీలను అందుకుని పరిష్కారానికి సీఎం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని ,ఏం.ఎల్.సి శ్రీకాంత్, యువ నాయకులు వినీల్ ,పార్టీ ప్రధాన కార్యదర్శి సునీలకుమార్ చౌదరి జిల్లా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు…

సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు.

 

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-09T142417.423.wav?_=1

 

సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్,తెలంగాణ ఏర్పాటులో చారిత్రాత్మక పాత్ర పోషించిన సీనియర్ ఎఐసిసి నాయకురాలు సోనియా గాంధీ జయంతి సందర్భంగా, జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆమె జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా, పార్టీ నాయకులు దేశం తెలంగాణ కోసం సోనియా గాంధీ చేసిన సేవలకు సేవలందించారనరు కేక్ కట్ చేసి వేడుకను ప్రారంభించారు.తెలంగాణ ప్రజల మనోభావాలను మరియు యువత త్యాగాలను అర్థం చేసుకున్న సోనియా గాంధీ, రాష్ట్ర ఏర్పాటు నిర్ణయంలో ముఖ్యమైన పాత్ర పోషించారని, ఇది ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందని కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో అన్నారు.
పెద్ద సంఖ్యలో నాయకులు మరియు కార్యకర్తల భాగస్వామ్యం కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది నాయకులు, సీనియర్ కార్యకర్తలు మరియు యువ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మరియు సోనియా గాంధీ ఆరోగ్యం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

కె.సి.ఆర్ ఆమరణ దీక్ష,అమరవీరుల త్యాగాల విజయ దివాస్..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-09T113712.199.wav?_=2

 

కె.సి.ఆర్ ఆమరణ దీక్ష,అమరవీరుల త్యాగాల విజయ దివాస్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

విజయ దివాస్ డిసెంబర్ 9 సందర్భంగా , బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ & మాజి మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు ఆదేశాల మేరకు కొనింటి మాణిక్ రావు , తెలంగాణ తల్లికి పాలాభిషేకం & డాక్టర్.బి.ఆర్ అంబేద్కర్ గారికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కె.సి.ఆర్ సచ్చోడో తెలంగాణ వచ్చాడో అంటూ నవంబర్29నుండి డిసెంబర్ 9 వరకు చేసిన ఆమరణ దీక్షతో కేంద్రం తెలంగాణ ప్రకటన చేసిందని కె.సి.ఆర్ రణబేరీ,ఆత్మార్పణకు సంకల్పించిన రోజు కాబట్టి డిసెంబర్9నీ విజయ దివాస్ గా జరుపుకుంటున్నామని అన్నారు.
డిసెంబర్9తర్వాత ఎన్నో ఒడిదొడుకులు,నిర్బంధాలు ఎదుర్కొని కె.సి.ఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపారని కొనియాడారు.
దేశ చిత్రపటంలో మాయమైన తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి దిక్సూచిగా మార్చిన ఘనత కె.సి.ఆర్ గారిది అని అన్నారు. కె.సి.ఆర్ ఆమరణ దీక్ష,అమరవీరుల త్యాగాల వల్ల వచ్చిన రాష్టం నేడు తిరోగమన దశలో ఉందని ఇది భావితరాలకు ప్రమాదకరం అని ఆందోళన వ్యక్తం చేశారు.తెలంగాణలో సుపరిపాలన కావాలంటే మళ్ళీ కె. సి.ఆర్ సర్కార్ రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమములో మాజి మున్సిపల్ చైర్మన్ తంజిం, సీనియర్ నాయకులు నామ రవికిరణ్, మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్, మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,యూత్ అధ్యక్షులు కళ్లెం రవి, మాజి హజ్ కమిటీ సభ్యులు యూసఫ్ సాబ్,యువ నాయకులు మిథున్ రాజ్,గణేష్, వెంకటేశం,చంద్రయ్య,నరసింహ రెడ్డి,నాగన్న పటేల్,ఇబ్రహీం,లక్ష్మీకాంత్, అలి, జుబేర్,జాఫర్,జాకీర్, అమెర్, బిఆర్ఎస్వీ నాయకులు ఫయాజ్, సాజిద్,రఘు తేజ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ప్రజా పాలనలోనే ప్రజలందరికీ సంక్షేమ పథకాలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T155040.612.wav?_=3

 

కాంగ్రెస్ ప్రజా పాలనలోనే ప్రజలందరికీ సంక్షేమ పథకాలు

కొత్తగూడ, నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం దుర్గారం గ్రామపంచాయతీ పరిధిలోని నాలుగు కుటుంబాలు మంగళవారం రోజు టిఆర్ఎస్ పార్టీని వీడి ప్రజా ప్రభుత్వంలో ప్రజల సంక్షేమ పథకాల ప్రజలందరికీ దక్కుతున్నాయని భావించి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ప్రజా పాలనలో అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి వారి సొంత ఇంటి కలలు నెరవేర్చిందని అధికార పార్టీ అండగా నిలిచి మన గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకోవాలని మహాసంకల్పంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న చేరబోతున్న కొత్తగూడా మండలం లోని ప్రతి ఒక్క పౌరునికి సాదర స్వాగతం తెలుపుతున్నామని
మనమందరం కలిసి గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకుందామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు
కాంగ్రెస్ పార్టీ లో చేరిన వారు
గట్టి సారంగపాణి
బోడ శ్రీను
గట్టి పాపారావు..
తదితరులు
ఈ కార్యక్రమం లో
జిల్లా జనరల్ సెక్రెటరీ
బానోత్ రూప్ సింగ్,
జిల్లా నాయకులు వీరనేని వెంకటేశ్వరరావు,
అధికార ప్రతినిధి ఇర్పరాజేశ్వర్
బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
కాయితోజు ఉపేంద్ర చారి,
కల్తీ నరేష్, వెలుదండి వేణు,ఇర్ప కొమ్మయ్య,,సిరిగిరి సురేష్,యాదగిరి కిరణ్, ఆటో వెంకట్, మహిళలు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు,,,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version