ఎస్ జి వి పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవం వేడుకలు

ఎస్ జి వి పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవం వేడుకలు

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

 

చెన్నూరు ఎస్ జి వి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు చల్లా సుధాకర్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ కెవి సత్యనారాయణ,టిఆర్ఏ ఎస్ఎంఎ జిల్లా కార్యదర్శి కోరల్ల శ్యాంసుందర్,టిఆర్ఏ ఎస్ఎంఎ మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రెటరీ సమీర్,సి ఆర్ పి పుప్పాల ప్రవీణ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చల్లా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నవోదయ గురుకుల పాఠశాలలో సీట్లు సాధించిన విద్యార్థులను అభినందించారు.అనంతరం ఎంఈఓ కెవి సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.అలాగే నవోదయలో ఆరవ ర్యాంక్ సాధించిన చిలువేరు శ్రీహసన్ ను ప్రత్యేకంగా అభినందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version