భూముల కబ్జాలపై ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులా….

 భూముల కబ్జాలపై ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులా..?

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఫైర్

రైతుల పరామర్శకు వెళ్తున్న సమయంలో అరెస్ట్ అన్యాయం

భూముల కబ్జాలు, మైనింగ్ దందాలపై ప్రశ్నించినందుకే టార్గెట్

ప్రతిపక్షాలను అణచివేయడం అప్రజాస్వామికం

హరీష్ రావు అరెస్టు పట్ల పెద్ది సుదర్శన్ రెడ్డి ఖండన

నర్సంపేట, నేటిధాత్రి:

భూముల కబ్జాలు, మైనింగ్ దందాలపై ప్రశ్నించినందుకే టార్గెట్ చేసి మాజీ మంత్రి హరీష్ రావును అరెస్ట్ లు చేస్తారా అని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఫైర్ అయ్యారు.
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది తీవ్రంగా ఖండించారు. పరిగి నియోజకవర్గంలోని కళాపూర్, రాపోల్ గ్రామాల్లో ఇండస్ట్రియల్ పార్క్ పేరిట భూములు కోల్పోతున్న రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో హరీష్ రావును అరెస్టు చేయడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు.ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన ప్రభుత్వం, మంత్రులు చేస్తున్న మైనింగ్ మరియు భూముల దందాలను అసెంబ్లీలోనూ, బయట మీడియాలోనూ ప్రశ్నిస్తున్న హరీష్ రావును కోకాపేటలోని నివాసంలో గృహనిర్బంధం చేసి అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రజల భూములను కబ్జా చేస్తోందని ఆరోపించారు.కబ్జాలు, అక్రమ మైనింగ్ దందాలను అరికట్టాల్సిన ప్రభుత్వం ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని గృహనిర్బంధాలు, అక్రమ అరెస్టులు చేయడం తీవ్రంగా ఖండించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఇటీవల అదిలాబాద్‌లో అక్రమ అరెస్టులు చేయమని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు విరుద్ధంగా వ్యవహరించడం పిరికిపాందా చర్యగా అభివర్ణించారు.రాష్ట్రవ్యాప్తంగా రైతులకు రైతు భరోసా అందకపోవడం, రుణమాఫీ అమలు కాకపోవడం, ఎరువులు సకాలంలో అందకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తోందని మండిపడ్డారు.ప్రజల పక్షాన పోరాటం చేస్తే కేసులు, అరెస్టులు చేయడం కొత్త కాదని, పోలీసుల బలంతో ప్రతిపక్షాలను అణచివేయాలనే ప్రయత్నాలు అప్రజాస్వామికమని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు ఎలాంటి బెదిరింపులకు భయపడరని పెద్ది సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.
[4:03 pm, 7/4/2026] +91 99087 62239: ఈ వార్త లింక్ రాలేదు..

ప్రతిపక్ష నేతల గొంతు నొక్కుతున్న రేవంత్ ప్రభుత్వం: గండ్ర వెంకట రమణా

ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కుతున్న రాష్ట్ర ప్రభుత్వం

హరీష్ రావు ని విచారణకు పిలవడం ప్రభుత్వం యొక్క నిరంకుశ పాలనకు నిదర్శనం

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

రాష్ట్ర మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పై ఫోన్ ట్యాపింగ్ విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష్యపూరితంగా వారిని విచారణకు పిలవడం హేయమైన, ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన చర్యగా పరిగణించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, వాటి నుంచి తప్పించుకునే కుట్రలో భాగంగా ప్రతిపక్ష పార్టీ నాయకుల గొంతు నొక్కే ప్రయత్నాలు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచే చేస్తున్నారు.
ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ అనే అస్త్రాన్ని ఉపయోగించి హరీష్ రావు పై కేసులు పెట్టి రాజకీయ కుట్రలకు పాల్పడ్డారు.
హరీష్ రావు పై విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ, నిన్న మళ్లీ విచారణకు పిలవడం అనేది పూర్తిగా ప్రతిపక్షాన్ని ఎదుర్కోలేని అసహనానికి నిదర్శనం.
భారత రాష్ట్ర సమితికి ఉన్న అపార ప్రజాదరణను చూసి, మునిసిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకులను ఎదుర్కొనే ధైర్యం లేక, బీఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలను వేధింపులకు గురిచేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తోంది.
ఇలాంటి బెదిరింపులకు బీఆర్‌ఎస్ పార్టీ ఎప్పటికీ భయపడదు.
ఎంతమందిని విచారణలకు పిలిచినా, ఎంతమంది కార్యకర్తలను వేధించినా, బీఆర్‌ఎస్ పార్టీ రెట్టింపు ఉత్సాహంతో ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది.
ఈ ప్రభుత్వాన్ని పదవి నుంచి దించే వరకు ప్రజాపక్షంలో పోరాడటం ఖాయం. ఈ క్రమంలో అసెంబ్లీలో పార్టీ ఉపనాయకుడిగా హరీష్ రావు ప్రభుత్వ వైఫల్యాలను, బొగ్గు కుంభకోణంలో వేల కోట్ల రూపాయల అవినీతిని ధైర్యంగా బయటపెడుతున్నందుకే ప్రభుత్వం ఇలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది.
కాంగ్రెస్ పార్టీ ప్రజావ్యతిరేక చర్యలను ప్రజలు క్షేత్రస్థాయిలో గమనిస్తున్నారు.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేస్తే ప్రజలు హర్షిస్తారు.లేకపోతే, ఇలాంటి నిరంకుశ చర్యలతో చరిత్రలో తప్పకుండా చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. వారు హెచ్చరించారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version