రోడ్డు భద్రత నియమావళి పాటించాలి…

రోడ్డు భద్రత నియమావళి పాటించాలి

జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.హెచ్ రమేష్ బాబు

భూపాలపల్లి నేటిధాత్రి

 

రోడ్డుపైన వాహనాలు నడుపుతున్నప్పుడు క్రమశిక్షణతో, బాధ్యతతో మెలగాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.హెచ్ రమేష్ బాబు తెలిపారు. న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం రోడ్డు భద్రత నేషనల్ యూత్ డే ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని జయశంకర్ విగ్రహం నుండి అంబెడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధాన న్యాయమూర్తిగారు ప్రసంగించారు. నిర్లక్ష్యంతో డ్రైవింగ్ చేస్తే కఠిన శిక్షలు పడతాయని అన్నారు. ముఖ్యంగా లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు వాటి ఓనర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. వెయ్యి మంది విద్యార్థులు రోడ్డు భద్రత అవగాహనలో పాలుపంచుకోవడం అభినందనీయమని జడ్జి ఆనందాన్ని వ్యక్తం చేసారు. భవిషత్తులో బాధ్యతాయుత పౌరులుగా తయారు కావాలని విద్యార్థులకు సూచించారు. రోడ్డు భద్రతకు సంబంధించి జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రతిజ్ఞ చేపించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఏ. నాగరాజ్ ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.ఆర్. దిలీప్ కుమార్ నాయక్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి అఖిల అడిషనల్ ఎస్.పి. నరేష్ కుమార్ గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్ అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి. శ్రీనివాస చారి ప్రధాన కార్యదర్శి వి. శ్రావణ్ రావు చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ పి.శ్రీనివాస్ డి.ఎస్.పి. సంపత్ రావు ఆర్.టి.ఓ. సందాని డి.ఈ.ఓ. రాజేందర్ సి ఐ నరేష్ కుమార్, ఎస్.ఐ. సాంబమూర్తి వెయ్యి మంది విద్యార్థులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం….

జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ అధ్యక్షురాలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి బి పుష్పలత. ఆదేశాలతో సీనియర్ సివిల్ జ కార్యదర్శి.DLSA. పి లక్ష్మణ చారి సమన్వయవంతో ఈ సదస్సు ఏర్పాటు చేయడం వారి ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి ప్రైమరీ పాఠశాలలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం పురస్కరించుకొని. మాట్లాడుతూ. వికలాంగులు సాధారికతకుప్రతి పౌరుడు బాధ్యత యుతంగా వ్యవహరించాలి అనివికలాంగుల సాధరికతనుప్రోత్సహిస్తూ సమాజ నిర్మాణం కోసం ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని. వికలాంగుల హక్కుల ప్రభుత్వ పథకాలు. న్యాయ సహాయం యొక్కప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ. జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ ఆధ్వర్యంలో వికలాంగుల దినోత్సవంనుజరుపుకొని భవిత కేంద్రంలో న్యాయ సేవాధికారిక సంస్థ. వారు వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అనంతరం భవిత కేంద్రంలో చిన్నారులకు పండ్లు బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగిందని ఈ సదస్సులో. సీనియర్ సివిల్ జడ్జి. కార్యదర్శి. DLSA. శ్రీ పి లక్ష్మణ చారి. ప్రైమరీ పాఠశాల హెడ్మాస్టర్ వెంకటేశ్వర స్వామి. భవిత కేంద్రం ఐ ఈ ఆర్ పి. కళ్యాణి తదితరులు పాల్గొన్నారు

జిల్లా కోర్టులో ఘనంగా జాతీయ న్యాయసేవల దినోత్సవం..

జిల్లా కోర్టులో ఘనంగా జాతీయ న్యాయసేవల దినోత్సవం

ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి దిలీప్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

మనుషులు కలసి మెలసి జీవించడానికే చట్టాలు ఏర్పడ్డాయని, ఎప్పుడైతే ఇద్దరి మధ్య వివాదం తలెత్తుతుందో అప్పుడు వారిని చక్కదిద్దడానికి చట్టం పనిచేయడం ప్రారంభిస్తుందని ప్రిన్సిపాల్ దిలీప్ కుమార్ నాయక్ అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ న్యాయసేవల దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ
కార్యక్రమానికి అతిధిగా హాజరైన జడ్జి మాట్లాడుతూ చట్టాలను వినియోగించుకోవడం తో పాటు పౌరుల బాధ్యతలను తెలిసుకొని మెలగాలని సూచించారు. న్యాయ సహాయం అనేది ముందుకు నడిపించే విధంగా ఉండాలని, సామజిక స్పృహ కలిగి వున్నప్పుడే అది సాధ్యం అవుతుందని తెలిపారు. కేసులు, వివాదాలు లేని సమాజ నిర్మాణం కోసమే న్యాయసేవాధికార సంస్థ పనిచేస్తుందని, లక్ష్యం నెరవేరినప్పుడు గొప్ప సమాజం ఏర్పడుతుందని జడ్జి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్, అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి. శ్రీనివాస చారి, ప్రధాన కార్యదర్శి శ్రీ వి. శ్రావణ్ రావు, చీఫ్ డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్స్ పి. శ్రీనివాస్, కే.అక్షయ, న్యాయవాదులు మంగళపల్లి రాజ్ కుమార్, కే.అఖిల, పారా లీగల్ వాలంటీర్లు, కోర్టు సిబ్బంది, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పంట నష్టం కౌలు చట్టాలపై రైతులకు న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు…

పంట నష్టం కౌలు చట్టాలపై రైతులకు న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు
వర్దన్నపేట (నేటిధాత్రి):

 

వరంగల్ జిల్లా, వర్ధన్నపేట నియోజక వర్గం, వర్ధన్నపేట మండలంలోని, కట్రీ యాల గ్రామములో ఉన్న రైతు వేదిక నందు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ వారి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ చంద్ర ప్రసన్న గారు హాజరై రైతులకు పంట నష్టం,భూమి పట్టా దారు , ఇనామ్ భూములు, కౌలు రైతు చట్టాల పై రైతులకు అవగాహన కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమములో డిపెన్స్ కౌన్సిల్ మెంబర్ సురేష్,ట్రైనింగ్ డిప్యూటీ కలెక్టర్ శృతి,వర్ధన్నపేట తహిసిల్ధర్ విజయ సాగర్, ఎ.ఓ విజయ్ కుమార్, వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య,ఎస్సై సాయిబాబు,రైతులు పాల్గొనడం జరిగింది.

మానసిక ఆరోగ్యం సరిగా లేనివారే నేరాలకు పాల్పడుతారు…

మానసిక ఆరోగ్యం సరిగా లేనివారే నేరాలకు పాల్పడుతారు

దివ్యాంగులకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ అండగా ఉంటుంది

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.హెచ్.రమేష్ బాబు

భూపాలపల్లి నేటిధాత్రి

 

శరీర అంగాలు అన్ని సరిగా ఉంటేనే సరిపోదని, మానసిక ఆరోగ్యం బావున్నప్పుడే ఆరోగ్యం జీవితం బాగుంటాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్పర్సన్ సి.హెచ్.రమేష్ బాబు తెలిపారు.
న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని హెచ్.ఎం.ఆర్.డి.ఎస్. ఆధ్వర్యంలో నడుస్తున్న దివ్యాంగ బాలల పాఠశాలలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రధాన న్యాయమూర్తి హాజరై ప్రసంగించారు.

గంజాయి, డ్రగ్స్ కు అలవాటు పడినవారు, వ్యసనాలకు అలవాటు పడినవారు నేరాలకు పాల్పడేవారు చాలా మంది మానసిక ఆరోగ్యం సరిగాలేని కారణంగానే చెడిపోతారని అన్నారు. మానసిక అనారోగ్యంతో వుండేవారివల్లనే సమాజానికి చేటు అని పేర్కొన్నారు. శరీరం పై చూపే శ్రద్ధతో పాటుగా, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారు సూచించారు.

దివ్యాంగ పిల్లలకు పండ్లు, చాకోలెట్లు పంపిణి చేశారు. హియరింగ్ ఎయిడ్స్, హెల్త్ క్యాంపు మరియు ఇతర ఏ సహాయం కావాలన్నా న్యాయసేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు.

అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి. శ్రీనివాస చారి గవర్నమెంట్ ప్లీడర్
బోట్ల బిక్షపతి లు ప్రధాన న్యాయమూర్తి చేతులమీదుగా పదివేల రూపాయల ఆర్థిక సహాయం హోమ్ నిర్వాహకులకు అందించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఏ. నాగరాజ్ ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.ఆర్. దిలీప్ కుమార్ నాయక్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి. అఖిల డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కే.అక్షయ హెచ్.ఎం.ఆర్.డి.ఎస్ సంస్థ నిర్వాహకులు రజిత రాజయ్య న్యాయవాది మొయినుద్దీన్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు, దివ్యంగా విద్యార్థులు, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version