ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత: ఛైర్‌పర్సన్ లక్ష్మీరామానంద్…

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత: ఛైర్‌పర్సన్ లక్ష్మీరామానంద్

నర్సంపేట,నేటిధాత్రి:

ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏ.ఎస్.ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నర్సంపేట బాయ్స్ హైస్కూల్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఛైర్‌పర్సన్ లక్ష్మీరామానంద్, మున్సిపల్ కమిషనర్ భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్ లక్ష్మీరామానంద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిత్యం వాకింగ్, యోగా చేయడంతో పాటు క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని, లేకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
మున్సిపల్ కమిషనర్ భాస్కర్ మాట్లాడుతూ, మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారంలోనే ఆరోగ్యం దాగిఉందని పేర్కొన్నారు. ప్లాస్టిక్ కవర్లలో వేడి ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని, వాటికి బదులుగా బయో కవర్లను వినియోగించాలని సూచించారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కన్స్యూమర్ ఫోరం జిల్లా అధ్యక్షుడు గిరిగాని సుదర్శన్ గౌడ్, కౌన్సిలర్ పొన్నాల మనిషా, ఇన్‌చార్జి హెడ్ మాస్టర్ రవికుమార్, బిక్షపతి, రాంబాబు, ఏ.ఎస్.ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి తంగెళ్ల రవికాంత్, సభ్యుడు రాముసేవక్, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించే ందుకు ముందుకు రావాలి ప్రపంచ..

ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించే ందుకు ముందుకు రావాలి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి

మొగుళ్లపల్లి నేటి ధాత్రి

భూపాలపల్లి జిల్లామొగుళ్లపల్లి మండల కేంద్రంలోనిప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 లో భాగంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా డాక్టర్ నవత ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ను ఏర్పాటు చేయడం జరిగినది, ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించేందుకు యువత ముందుకు రావాలని అన్నారు అసంక్రమణ వ్యాధులు అయినటువంటి(NCD) బిపి, షుగర్, క్యాన్సర్ లాంటి వ్యాధులను అరికట్టేందుకు ఆశా కార్యకర్తలు పాత్ర కీలకమైనదని ఆశా కార్యకర్తల సమావేశంలో తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో భాగంగా అడిషనల్ కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పూర్తిగా తనిఖీ చేసి ప్రతి డిపార్ట్మెంటు లోని సాధక బాధకాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి మొగుళ్లపల్లి సర్పంచ్ చాట్ల విజయ రవి , ఎంపీడీఓ సురేందర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కె. రాజేంద్రప్రసాద్, మ్మెలహ్ప్ డాక్టర్స్, సూపర్వైజర్స్, హెల్త్ అసిస్టెంట్, ఆస్పత్రి సిబ్బంది, Ann’s, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది నాగర్కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్

ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది నాగర్కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు మరియు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు

నేటి దాత్రి నాగర్ కర్నూలు జిల్లా

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నాగర్ కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్ లో నిర్వహించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్యమే మహాభాగ్యమని తల్లి శిశు ఆరోగ్య టీకాలు పారిశుభ్రత పై దృష్టి అవసరమని ప్రభుత్వ ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచన ఇచ్చారు మరియు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అందుబాటులో సేవలు తెచ్చిందని వ్యాధి నివారణకు అవగాహన కీలకమని ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్ దీటుగా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుందని ఏ వ్యాధి కైనా గవర్నమెంట్ హాస్పిటల్ లో అన్ని సదుపాయాలు ఉన్నాయని ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గారు మాట్లాడారు
ఈ కార్యక్రమంలో డాక్టర్స్ హాస్పిటల్ స్టాప్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ప్రజలందరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం అవసరం…

ప్రజలందరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం అవసరం

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చెల్పూరు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్సార్ దిలీప్ కుమార్ నాయక్ ప్రజలు డ్రగ్స్ కు మాదక ద్రవ్యాలకు బానిసలు కావద్దని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి ప్రజలు పాల్గొనడం జరిగింది

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు…

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు

డాక్టర్ తిక్క వినోద్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న జరుపుకునే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా భూపాలపల్లి మమత హాస్పిటల్ వైద్యులు డాక్టర్.తిక్క వినోద్ కుమార్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఆరోగ్యమే మహాభాగ్యం అని,ప్రతి వ్యక్తి తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన సూచించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా అనేక రకాల వ్యాధులు పెరుగుతున్నాయని అన్నారు.క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం,సమతుల్య ఆహారం తీసుకోవడం,సరైన నిద్రపోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వివరించారు.ప్రజలు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరచుకోవాలని భూపాలపల్లి పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు తెలిపారు.

ఏప్రిల్ 7: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం…

ఏప్రిల్ 7: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

 

ఆరోగ్యమే అసలైన ఆనందం_మంజుల పత్తిపాటి

మన జీవితం ఒక సుదీర్ఘ ప్రయాణం కావాలి అంటే
కావలసింది ఆరోగ్యమే..!
డబ్బు, పేరు ఎంత ఉన్న ముందుగా
కావలసింది ఆరోగ్యమే..!

మన శుభ్రతే ఆరోగ్యానికి మొదటి మెట్టు
అని మరచిపోకు..!
పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే
నీకు ఆరోగ్యం అని మరచిపోకు..!

నీవు మారితే నీ వాడ మారుతుంది..!
నీ వాడ పరిశుభ్రత నీ చేతుల్లో వుంది..!

ఆరోగ్యంతో ఉన్న వాడు నిజమైన ధనవంతుడు..!
అనారోగ్యంతో బాధపడుతున్న వాడు నిజమైన
పేదవాడు..!

మార్పు మన నుండి మొదలు పెడుదాం..!
బావి తరాలకు మార్గదర్శి అవుతాం..!

రచన మంజుల పత్తిపాటి( కవయిత్రి)
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
చరవాణి 9347042218

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version