*మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ
పంపిణీ కేంద్రాల వద్ద ప్రజలు సంతోషం వ్యక్తo చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు
మొగుళ్లపల్లి నేటి ధాత్రి
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం అందించడం పట్ల మొగుళ్లపల్లి మండలకాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము ఆనందం వ్యక్తం చేస్తున్నారు.పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో అభినందనీయమని వారు తెలిపారు.ప్రజలకు సకాలంలో అవసరమైన ఆహార భద్రత కల్పించడంలో ఇది కీలక నిర్ణయమని పేర్కొన్నారు.ఈ సందర్బంగా నడిగోటి రాము మాట్లాడుతూ,మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి అందించడం వల్ల ప్రజలకు సౌలభ్యం కలుగుతుందని,ముఖ్యంగా కూలీ వర్గాలకు ఇది ఎంతో ఉపయోగకరమని తెలిపారు.ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రేషన్‌ను పొందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.పంపిణీ కేంద్రాల వద్ద ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు గారికి కృతజ్ఞతలు తెలిపారు. తదితరులు పాల్గొన్నారు.
