ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే జిఎస్ఆర్
విద్యార్థుల సమస్యలను ఐటీడీఏ పీవో కు ఫోన్ లైన్లో వివరించిన ఎమ్మెల్యే
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతీ తరగతి గదిని ఎమ్మెల్యే తిరుగుతూ విద్యార్థుల వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు తమ సమస్యలను చెప్పుకున్నారు.
MLA Inspects Tribal Girls Hostel in Bhoopalapalli
గత పదేళ్ల కిందట ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ పని చేయడం లేదని కొత్త ఆర్వో ప్లాంట్ కావాలని, వేడి నీటి కొరకు గ్లీజర్, మూడు నెలల నుండి కాస్మోటిక్ సామాగ్రి ఇవ్వడం లేదని, డిజిటల్ క్లాస్ రూమ్స్ కావాలని, క్రీడా సామాగ్రి, దోమలు రాకుండా కిటికీలకు మెష్ డోర్లు ఏర్పాటు చేయాలని, ఫ్యాన్లు కూడా సరిగా తిరగడం లేదని తదితర సమస్యలను ఎమ్మెల్యేకు విద్యార్థులు తెలిపారు. సమస్యలను విన్న ఎమ్మెల్యే వెంటనే ఏటూరునాగారం ఐటిడిఏ పీఓకు ఫోన్ చేసి సమస్యలను వివరించారు. సమస్యలను వీలైనంత త్వరగా ఎస్టిమేట్స్ వేసి పనులను ప్రారంభించి పూర్తయ్యేలా చూడాలని కోరారు. విద్యార్థుల వసతి గృహాన్ని పక్కనున్న భవనంలోకి మార్చాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు భోజనాన్ని అందించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే విద్యార్థులకు మెస్ చార్జీలతో పాటు కాస్మోటిక్ ఛార్జీలను కూడా పెంచినట్లు ఎమ్మెల్యే గుర్తుచేశారు. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
కోనాపూర్ గ్రామంలో దివంగత కుటుంబానికి లీలా గ్రూప్ చైర్మన్ మోహన్ నాయక్ పరామర్శ..
రామాయంపేట సెప్టెంబర్ 3 నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట మండలంలోని కోనాపూర్ గ్రామంలో లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ గారు దివంగత కరికి బాబు కుటుంబాన్ని ఈరోజు పరామర్శించారు. ఇటీవల మరణించిన కరికి బాబు కుటుంబానికి ఆయన ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా రూ.5,000 నగదు, 25 కిలోల బియ్యం అందజేసి వారి కుటుంబానికి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు చింతాల స్వామి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు విద్యాసాగర్, మండల నాయకులు మామిడి సిద్ధిరాములు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పసుల అంజయ్య, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం సురేష్, యూత్ అధ్యక్షులు మామిడి సతీష్, ప్రధాన కార్యదర్శి కరికి రాజు, చాకలి భీమయ్య తదితరులు పాల్గొన్నారు.
మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాలి
అభ్యర్థుల తరలింపునకు తగిన ఏర్పాట్లు చేయాలి
హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
జీ.పీ.ఓ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 5 వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నట్లు సీసీఎల్ఏ లోకేష్ కుమార్ వెల్లడించారు. జీ.పీ.ఓ అభ్యర్థులకు నియామక పత్రాలు హైదరాబాద్ లో అందజేయనున్న సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీసీఎల్ఏ లోకేష్ కుమార్ మాట్లాడారు. భూ భారతి చట్టం అమలులో భాగంగా జీపీఓల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పరీక్ష నిర్వహించిందని తెలిపారు. ఇందులో భాగంగా ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 5 వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. అన్ని జిల్లాల్లో పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు సమాచారం అందించాలని సూచించారు. వారిని హైదరాబాద్ తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు.ఆయా జిల్లాల నుంచి ప్రత్యేక బస్ లలో వారిని నిర్ణీత సమయానికి తరలించాలని సూచించారు.వారికి కావలసిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నియామకాలకు సంబంధించిన సమాచారాన్ని ఆయా జిల్లాల్లోని మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. తగిన అన్ని ఏర్పాట్లు చేయాలి జిల్లా నుంచి జీ.పీ.ఓ పరీక్ష రాసి 66 మంది ఉత్తీర్ణత సాధించారని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. అభ్యర్థులను ఈ నెల 5 వ తేదీన జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి తరలించాలని సూచించారు.ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ను నోడల్ ఆఫీసర్ గా నియమించామని తెలిపారు. హైదరాబాద్ తరలివెళ్లే అభ్యర్థులకు కావల్సిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ ఏ.ఓ. రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని వర్షకొండ గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు భాగంగా గాంధీనగర్ గరుడ సేన యూత్ ఆధ్వర్యంలో గణపతి కి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మహా అన్న ప్రసాదం కార్యక్రమాన్ని ప్రారంభించారు మరియు మహిళలు పెద్ద ఎత్తున కుంకుమ పూజలో పాల్గొంటారు విగ్రహ దాత యాస రాకేష్ మరియు అన్న ప్రసాదం దాత సల్వాల లవ కుమార్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీటీసీల పోరం ఫోనుకంటి వెంకట్ మరియు దంతుల శివారెడ్డి. గుజ్జరి గణేష్. పి రాజ్ కుమార్. మరియు గాంధీనగర్ గరుడ సేన యూత్ సభ్యులు.ఎం మురళి. మహేష్. లోకేష్. రాజ్ కుమార్. రాకేష్. లవ కుమార్.వర్షిత్. నాగేష్.చారి. నారాయణ. గంగాధర్. రజనీకాంత్. మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన హనుమంతరావు పటేల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల కుప్పా నగర్ గ్రామంలో ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం పంపిణిలో రాష్ట్ర ప్రభుత్వానిదే పెద్ద వాటా అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమంతరావు పటేల్ అన్నారు. గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద లబ్ధిదారులకు కొత్త రేషన్ పంపిణి చేసిన సందర్భంగా మాట్లాడారు. గత పాలకులు 10సంవత్సరాల పాటు రేషన్ కార్డు లు ఇవ్వక పోవడం తో పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందించడం మంచి పరిణామం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హాయంలో కుటుంబాలకు రేషన్ కార్డులు అందించడం సంతోషంగా ఉందన్నారు.కార్డుల పంపిణి ప్రక్రియ నిరంతరాయంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ రెడ్డి రాజ్ కుమార్ స్వామి రాఘవేంద్ర కృష్ణ ప్రకాష్ రవి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు,
స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ కు ప్రాధాన్యతియ్యాలి
నియోజకవర్గ అధ్యక్షుడు తుమ్మలపెల్లి సందీప్
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి వినతిపత్రం
నర్సంపేట,నేటిధాత్రి:
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నాయకులకు 20 శాతం సీట్లు కేటాయించి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు తుమ్మలపెల్లి సందీప్ కోరారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జెక్కిడి శివచరణ్ రెడ్డి ఆదేశాలతో బుదవారం దొంతి మాధవరెడ్డిని హన్మకొండలోని సగృహంలో వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరవి పరమేష్ తో కలిసి తుమ్మలపెల్లి సందీప్ వినతిపత్రాన్ని అందించారు.ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ కు ప్రాధానత్య ఇవ్వాలని కోరగా సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.స్పందించిన ఎమ్మెల్యే దొంతి యూత్ కాంగ్రెస్ తోనే కాంగ్రెస్ పార్టీకి, దేశానికి బంగారు భవిష్యత్ అని కొనియాడారన్నారు.యువత కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారని కష్టపడి పనిచేసే ప్రతి యూత్ కాంగ్రెస్ కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలోనే అధిక ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్న.. తప్పక అమలు చేస్తానని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హమి ఇచ్చినట్లు సందీప్ తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రెటరీ మోడెం ఎల్లా గౌడ్,నల్లబెల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పురుషోత్తం సురేష్, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొంత రంజిత్, నర్సంపేట పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్కె షఫిక్,దుగ్గొండి మండల యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నరిగె ప్రవీణ్, శ్రీకాంత్, అవినాష్, ఇస్మాయిల్, తదితరులు పాల్గొన్నారు.
శాయంపేట మండలంలోని మాందారిపేటకూడలి వద్ద బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యులుగండ్ర వెంకట రమణారెడ్డి నాయ కత్వంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది కెసిఆర్ పైన చేస్తున్న కుట్ర మాత్రమే కాదు కాలేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయ త్నంలో భాగంగానే ఇది జరుగు తున్నది.సిబిఐకి కాలే శ్వరం అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసేయడమే.
BRS Holds Protest
నిన్నటిదాకా సిబిఐ పైన వ్యతి రేకంగా మాట్లాడిన రేవం త్ రెడ్డి ఒక్కరోజులోనే మాట ఎందుకు మార్చాడు.తె లంగా ణా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజె క్టును సీబీఐ కి అప్పజెప్పడం వెంటనే ఉపసంహరించుకోవా లి. లేదంటే మున్ముందు ధర్నా కార్యక్రమాలు ఇంకా ఉదృతం చేస్తామని, బెదిరింపులు కేసు లు మా పార్టీకి కొత్త కాదని అన్నారు.ఒక వైపు రైతులు పంటలకు యూరియా లేక అల్లాడిపోతుంటే వారి గురించి పట్టించుకునే వారే కరువ య్యారని అన్నారు. రోడ్డుపై బఠాయించి ధర్నాచేసి నిరసన తెలిపారు ఎరువుల కొరతకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం మే కారణం అంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంవచ్చి న తర్వాత రైతులు ఆరిగోస పడుతు న్నారన్నారు సకాలం లో రైతు బంధు అందక ఎరు వులు లేక అష్ట కష్టాలు పడు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అబద్దాల మాటలు తప్పుడు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతున్నా రని మండి పడ్డారు రైతులకు యూరియా కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్ర మంలో మండల కేంద్రంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు అధిక మొత్తంలో పాల్గొన్నారు.
BRS Holds Protest
అల్లాడుతున్న అన్నదా తలు గంటల తరబడి నిరీక్షణ
వేసినపంట అదను దాటి పోవడంతో యూరియా రైతులు అల్లాడిపోతున్న పనులన్నీ మానుకొని ఎరువుల దుకాణం వద్ద పడికా పులు కాస్తున్నాం అన్నదాతలు ఎరువుల కేంద్రం వద్ద క్యూ కట్టారు యూరియా బస్తాలు తక్కువ రావడంతో ఉన్నవారికి ఒక్కొక్కడిగా ఇవ్వడం జరుగుతుంది. మండల కేంద్రంలో పంపిణీ చేస్తున్న యూరియా బస్తాలను రైతులను అడిగి తెలుసుకు న్నారు. మండల వ్యవసాయ అధికారికి రైతుల గురించి చెప్పడం జరిగింది. ప్రతి రైతుకు సంపూర్ణంగా అందే టట్లు చూడాలని మాట్లాడడం జరిగింది.రైతులకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుం దని మాజీ ఎమ్మెల్యే అన్నారు
జహీరాబాద్‌లో సీరత్‌ఉన్‌నబీ సభ – మహిళల ఉత్సాహభరిత పాల్గొనిక
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్,రబీ ఉల్ అవ్వల్ నెల సందర్బంగా జమాత్ ఇస్లామీ హింద్ సౌత్ ఉమెన్స్ వింగ్ ఆధ్వర్యంలో శాంతినగర్ ఇస్లామిక్ సెంటర్‌లో సీరత్‌ఉన్‌నబీ సభ జరిగింది.సభకు అధ్యక్షత వహించిన జమాత్ ఇస్లామీ హింద్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాజిదా బేగం మాట్లాడుతూ ప్రవక్త మహ్మద్ ముస్తఫా జననం మానవాళికి వరమని, అజ్ఞానాంధకారాన్ని తొలగించి కరుణ, ప్రేమ, న్యాయం ప్రసాదించారని పేర్కొన్నారు.
Seerat-un-Nabi Sabha Held in Jahirabad
ప్రత్యేక అతిథి సుమయ్య లతీఫీ అసిస్టెంట్ సెక్రటరీ, ఉమెన్స్ వింగ్, తెలంగాణ మాట్లాడుతూ సీరత్ బోధనలు కేవలం రబీ ఉల్ అవ్వల్‌లోనే కాక, జీవితాంతం ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.హాజరా బేగం, సయ్యదా మేహనాజ్, ఫహ్మీదా మఖ్మూర్, హాఫిజా సఫూరా సిద్దీఖా వేర్వేరు అంశాలపై ప్రసంగించారు.
Seerat-un-Nabi Sabha Held in Jahirabad
హాఫిజా ఉమ్తుల్ ముబీన్ ఖురాన్ తిలావత్ చేశారు. జీఐఓ అధ్యక్షురాలు హుజైఫా అఫ్నాన్ నాత్ పఠించగా, సీఐఓ విద్యార్థినులు సున్నత్ పై నాటిక ప్రదర్శించారు.పిల్లల కోసం సీరత్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మహిళలు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వనపర్తి జిల్లా కేంద్రంశంకర్ గంజ్ లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వినాయక పూజల సందర్భంగా వర్తక సంగం అధ్యక్షులు పాలాది సుమన్ ను ఆలయ కమిటీ నిర్వహికులు ఆహ్వానించారు ఈమేరకు సుమన్ దంపతులను సన్మానం చేశారు ఈసందర్భంగా ఆలయ కమిటీ నిర్వహికులను సుమన్ అభినందించారు ఈకార్యక్రమంలో చిట్యాల నాగరాజు దాచ లక్ష్మినారాయణ గోనూర్ రామకృష్ణ దాచశివ తదితరులు పాల్గొన్నారు
యూరియా కష్టాలు రైతులను వెంటాడుతున్నాయి. నిజాంపేట మండల కేంద్రంలో గల ఓ ప్రైవేట్ ఫర్టిలైజర్ లో యూరియా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ యూరియా పంపిణీలో రైతులు అధిక సంఖ్యలో టోకెన్ తీసుకొని క్యూ లైన్ లో ఉదయం నుండి వేచి ఉండగా పోలీస్ బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా పలువు రైతులు మాట్లాడుతూ.. గత కొన్ని నెలలో క్రితం వర్షాలు లేక వర్షాలకు ఏడిస్తే.. ఇప్పుడు వర్షాలు సంమృద్ధిగా కురిసినప్పటికీ యూరియా కోసం పడిగాపులు కాయవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట వేసి యూరియా చల్లకపోతే.. వేసిన పంట ఎదుగుదల నిలుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందుబాటులోకి యూరియా తీసుకురావాలని వేడుకుంటున్నారు.
జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ కలిసి మన ప్రాంతీయ పార్టీ తెలంగాణ రాష్ట్రము సాధించిన బిఆర్ఎస్ పార్టీ ని లేకుండా చేయాలని చేస్తున్న కుట్రలు సాగవు కెసిఆర్ కాళేశ్వరం నిర్మించి అపర భగీరతుడు అయ్యారు. కాంగ్రెస్, బీజేపీ నాటకాలు గట్టిగ ఎండగట్టాడు మరియు వీళ్ళ ఆటలు సాగాలేవు అందుకని కక్ష సాధింపు చర్యలకు కాంగ్రెస్ బీజేపీ లు కలసి కవిత ని కేసులు పేరుతో బెదిరించి పావుగా చేసి ఆడిస్తున్న నాటకం. ఒక రకంగా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీ లేకుండా చేసే కుట్ర ఇది.జాతీయ పార్టీ రాష్ట్రము లో అధికారం లో ఉంటే రాష్ట్రాన్ని వాళ్ళ చెప్పు చేతల్లో, ఢిల్లీ కి గులాం గిరి చేయిస్తారు, స్వతంత్ర నిర్ణయం తీసుకొనే అధికారం వీళ్లకు ఉండదు. జాతీయ పార్టీల కన్నా, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, అవసరాలు, ప్రాధాన్యతలు ప్రాంతీయ పార్టీ బిఆర్ఎస్ కె బాగా తెలుసు. రాష్ట్రానికి ప్రత్యేకమైన ప్రాజెక్టులు, పథకాలు, నిధుల కోసం కేంద్రం దగ్గర బలంగా డిమాండ్ చేయగలదు. స్థానిక సంస్కృతి, భాష, ఆర్థిక వ్యవస్థ, రైతాంగం, పరిశ్రమలు వంటి అంశాల్లో ప్రాంతీయ పార్టీలు ఎక్కువ దృష్టి ప్రాధాన్యత ఇస్తుంది.ప్రజల్లారా జాగ్రత్త బిఆర్ఎస్ పార్టీ మన ప్రాంతీయ పార్టీ, అందరు కలసి కట్టుగా మన ప్రాంతీయ పార్టీ అయిన బిఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయాల్సిన సమయం ఇది, లేదంటే శాశ్వతంగా ఢిల్లీ గులాముల చేతిలో రాష్టం బందిగా ఉంటుంది.
గణనాథులను దర్శించుకున్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..
జహీరాబాద్ నేటి ధాత్రి:
గణేష్ నవరాత్రి ఉత్సవాల మొగుడంపల్లి మండల కేంద్రంలో* గణనాథుని దర్శనం, పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనిలో స్త్రీ శక్తి గణేష్ ఆద్వర్యంలో ఏర్పాట్లు చేసిన వినాయకుడుని దర్శనం,పట్టణంలో ఆర్యనగర్ వీధిలో శివాజీ సేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడుని,సుభాష్ గంజ్ లో శ్రీ సేనా గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన గణనాథుడుని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం ఈ కార్యక్రమంలో నాయకులు జి.నర్సింలు,శికారి గోపాల్, చెంగల్ జైపాల్,వెంకట్, మంజుళ,బి.జి.సందీప్,వంశి క్రిష్ణ,సురేష్, శికారి శ్రీనివాస్, సాయి కిరణ్,మహేష్,రమేష్, సుశీల్,నవీన్,బి.దిలీప్,ఆకాశ్,మల్లికార్జున్,ప్రశాంత్,విశాల్,తదితరులు పాల్గొన్నారు,
హనుమాన్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సి హెచ్ సంగమేష్ సాయిగౌడ్ కాశీ రామ్ లక్ష్మణ్ డి శేఖర్ పాండు హరి శ్రీనివాస్ పాటిల్ మల్లేష్ విష్ణువర్ధన్ రెడ్డి శ్రీశైలం మరియు యుత్ సభ్యులు కొల్లూరు అధ్వర్యం లో ఏర్పటు చేసిన గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో పాలుగొన్న గ్రామ పెద్దలు నాయకులు.ఇట్టి కార్యక్రమములో కొల్లూరు మాజీ ఎంపీటీసీ సీ హెచ్ రాజ్ కుమార్ కొల్లూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డప్పూరు సంగమేష్,మాజీ వార్డు సభ్యులు వై నగేష్ ఎం విష్ణు యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఝరాసంగం చింతలగట్టు శివరాజ్, సంగారెడ్డి నర్సింహారెడ్డి,దేవేందర్ దారా గోరఖ్ కాశీనాథ్ ఉమాకాంత్ సి ప్రకాష్ మరియు గ్రామ ప్రజలు పాల్గోని బాల గణేశునికి పూజలు చేసి నిమజ్జనం కార్యక్రమన్ని విజయవంతంగా పూర్తి చేసారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పురపాలక సంఘం 7 అవార్డు లోబిఆర్ ఎస్ నాయకులు మంజు లో వెంకట్ స్థాపించిన గణేష్ మహరాజ్ ను మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే మాణిక్ రావు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గణేష్ మహరాజ్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జహీరాబాద్ నియోజకవర్గంలో ఈ గణేష్ మహరాజ్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమ్మెల్యే మాణిక్ రావు నాయకులతో కలిసి గణేష్ మహరాజ్ ను దర్శించుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ బలం
◆:- యువ నాయకులు మహ్మద్ హఫీస్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల చిల్లెపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మహ్మద్ హఫీస్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 18 నెలలోనే ఐదు గ్యారంటీలను అమలు చేసి ప్రజల మన్న లను పొందింది అన్నారు. రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఉందన్నారు. గతంలో పది సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ మోసపూరిత హామీలతో, పథకాలతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందన్నారు. అందుకే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో బొంద పెట్టారన్నారు. జరగబోయే ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిలను అత్యధిక మెజార్టీతో గెలిపించి,రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఉందన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని పంచాయతీలు, వార్డులలోని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియపరుస్తూ ఓట్లను అడిగి ఎంపీటీసీ జెడ్పిటిసిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు.
జహీరాబాద్: ఝరాసంగం మండలంలోని బొప్పనపల్లి గ్రామంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. బుధవారము గ్రామ పంచాయతీలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ షకీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం రేషన్ కార్డులను అందజేస్తుందన్నారు. ఆధార్కార్డుతో పాటు రేషన్ కార్డు ముఖ్యమన్నారు. ప్రభుత్వ పథకాలకు అర్హులు కావాలంటే రేషన్ కార్డు తప్పనిసరి అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ది శ్రీనివాస్ రెడ్డి అమృత్ బాలయ్య బసిరెడ్డి ప్రవీణ్ డీలర్ సత్తార్ తదితరులు లబ్ధి దారులు పాల్గొన్నారు
అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అంటే ఇదే! ఎమ్మెల్సీ కల్వకుంట్ల తన వేలుతో తన కన్నే పొడుచుకున్నారు.. మాజీ మంత్రి హరీష్‌రావు, సోదరుడు సంతోష్‌లను అబాసు పాలు చేయాలన్న తాపత్రయంలో మొదటికే మోసం తెచ్చుకున్నారు. విపరీతమైన వ్యాఖ్యలు చేసి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. పార్టీలో కొందరు పొగబెడుతున్నారంటూ చేసిన తన వ్యాఖ్యలకన్నా, తానే పొగ పెట్టుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. అయినా హరీష్‌రావు లాంటి నాయకుడిపై ఆరోపణలు చేస్తే జనం నమ్ముతారనుకోవడం కవిత మూర్ఖత్వం. కవిత లేనప్పుడే పార్టీ పురుడు పోసుకున్నది. కవిత లేనప్పుడే పార్టీ బలమైన పునాదులువేసుకున్నది. కవిత లేనప్పుడే పార్టీ బలమైన శక్తిగా మారింది. కవిత వల్లపార్టీకి జరిగిన మేలు లేదు. బిఆర్‌ఎస్ లేకపోతే కవిత లేదు. కేసిఆర్ కూతురు కాకపోతే కవితకు రాజకీయమే లేదు. ఆ విషయం మర్చిపోయినట్లున్నారు. కవితను నాయకురాలు చేసిందే బిఆర్‌ఎస్ పార్టీ. ఆమెకు రాజకీయ జీవితం ఇచ్చిందే బిఆర్‌ఎస్. ఆ పార్టీ కేసిఆర్ చేతనే పురుడుపోసుకోవచ్చు. కాని ఆ పార్టీ అడుగులు వేయడంలో హరీష్ పాత్రే కీలకమైంది. గొప్పది. ఒక రకంగా చెప్పాలంటే హరీష్‌రావు లేకుంటే పార్టీ నడిచేదే కాదు. హరీష్‌రావు లేకుంటే పార్టీ ఇంత కాలం బతికేదే కాదు? ఇది ముమ్మాటికీ నిజం. తన జీవితం మొత్తం పార్టీకోసం అంకితం చేసిననాయకుడు హరీష్‌రావు. తన జీవిత లక్ష్యాన్ని కాదనుకొని పార్టీ కోసం జీవితం త్యాగం చేసిన నాయకుడు హరీష్‌రావు. వస్తుందో రాదో తెలియని తెలంగాణకోసం ఆయన పడిన తాపత్రయం అంతా ఇంతా కాదు. కేసిఆర్ రాజకీయ పార్టీ నామకరణం చేసి, హరీష్‌రావు భుజాల బాద్యతలు పెట్టారు. అప్పుడు కవిత ఇండియాలో కూడా లేరు. ఎప్పుడైతే టిఆర్‌ఎస్ పార్టీ తెలంగాణలో బలపడిరదో అప్పుడు కవిత ఇండియాకు వచ్చారు. అప్పటికే కేసిఆర్ బలమైన నాయకుడుగా మారిపోయారు. అందుకు హరీష్‌రావు పాత్ర ఎంతో గొప్పది. నిజంగా తండ్రి మీద కవితకు ప్రేమ వుంటే ఆమె ఆనాడు టిఆర్‌ఎస్‌లో చేరాలి. పార్టీకోసం పనిచేయాలి. కాని ఆ పని చేయలేదు. తండ్రి పేరు చెప్పుకొని జాగృతి సంస్ధ ఏర్పాటు చేశారు. జాగృతితో ముందుకు సాగారు. కాని ఏనాడు పార్టీ కోసం కష్టపడిరది లేదు. తనదారి తాను ఎంచుకొని వెళ్లారు. తెలంగాణ ఉద్యమంలో భాగాస్వామ్యమయ్యారే గాని, బిఆర్‌ఎస్‌కు మేలుచేసింది లేదు. బిఆర్‌ఎస్ కోసం పని చేసింది లేదు. తెలంగాణ వచ్చిన తర్వాతే కవిత పార్టీలోకి వచ్చింది. ఎంపి సీటు తీసుకున్నది. గెలిచింది. బిఆర్‌ఎస్‌లో ఆమె ప్రస్తానమంతా పదేళ్లు మాత్రమే. కాని హరీష్‌రావు పాత్ర 26 సంవత్సరాలు. పార్టీ పురుడు పోసుకున్న నాటి నుంచి పార్టీకి ప్రాణం పెట్టి పనిచేశాడు. అలాంటి నాయకుడిని అవినీతి పరుడు అని కవిత అంటే జనం కూడా నమ్మరు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవిత మాట్లాడడం అంటేనే పరోక్షంగా తన తండ్రి కేసిఆర్‌ను ఇరికించినట్లే లెక్క. పైగా హరీష్‌రావును రెండోసారి అందుకే పక్కన పెట్టారంటూ లేనిపోని ముచ్చట్లు చెప్పితే కేసిఆర్ మీద ప్రజలకు వున్న నమ్మకాన్ని కవితే సన్నగిల్లేలా చేసినట్లౌవుంది. పార్టీ కోసం అంత పనిచేసిన హరీష్‌రావుపై హరీష్‌రావుపై కవిత వ్యాఖ్యలు ఎట్టిపరిస్ధితుల్లోనూ సరైనవి కాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. ఒక్కసారిగా పార్టీని కుదిపేసినంత పనైంది. నిజానికి కవితపై గతంలోనే షోకాజ్‌లు నోటీసులిస్తారని అందరూ భావించారు. కాని కేసిఆర్ వేచి చూసే ధోరణి అనుసరించారు. గతంలోనే ఓసారి కేసిఆర్ ఎంతటి వ్యక్తులైనా సరే పార్టీ లైన్ దాటితే ఉపేంక్షించేదిలేదని పలు మార్లు ప్రకటించారు. ముఖ్యంగా ఈటెల రాజేందర్‌ను పంపించిన సందర్భంలోనూ ఇదే విషయం స్పష్టం చేశారు. పార్టీలో ఏ స్ధాయిలో వున్నవారికైనా ఇదే వర్తిస్తుందని హెచ్చరించారు. అయితే కవిత తనకు ప్రాధాన్యత తగ్గుతుందని భావించి, రకరకాల వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఆఖరుకు పార్టీ రజతోత్సవ వేడుకల్లో తనకు తగిన ప్రాదాన్యత కల్పించలేదన్న అక్కసును దృష్టిలో పెట్టుకొని కేసిఆర్‌కు లెటర్ రాశారు. అది బైటకొచ్చింది. అందులో ఆమె చేసిన సూచనల ముసుగులో ఏకంగా కేసిఆర్‌ను ప్రశ్నించినట్లైంది. నిజానికి ఏ ప్రాంతీయ పార్టీలోనైనా సరే అంతర్గత ప్రజాస్వామ్యం చాలా తక్కువ. అది ఎవరైనా సరే, పార్టీ అంతర్గత సమావేశాలలో మాత్రమే వెల్లడిరచాలి. ఆఖరుకు రజతోత్సవ వేదికపై కేసిఆర్ ఇలా అనుసరించేది వుండే అంటూ కొన్ని కీలక సూచనలు చేశారు. అది నిజానికి పార్టీ దిక్కరణ కిందకే వస్తుంది. పైగా ఆ లెటర్ లీకైన తర్వాత పార్టీలో కేసిఆర్ చుట్టూ దెయ్యాలున్నారంటూ మరో రకమైన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కూడా కేసిఆర్ పట్టించుకోలేదు. పార్టీ శ్రేణులను కూడా పట్టించుకోవద్దని సూచించారు. ఇక మాజీ మంత్రి జగదీష్‌రెడ్డినిద్దేశించి మాట్లాడినప్పుడే ఆమెపై చర్యలు తీసుకుంటారన్న వార్తలు వచ్చాయి. ఓ వైపు కవిత తాను పార్టీలోనే వున్నానంటూనే మరో వైపు పార్టీ గురించి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వుండేవారు. చివరికి ఆమె ఏకంగా హరీష్‌రావు, సంతోష్‌రావులనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆమె మెడకే చుట్టుకున్నాయి. పార్టీలో ఇంకా ఎవరిపై కవిత వ్యాఖ్యలు చేసినా సహించేవారేమో? కాని హరీష్‌రావు, సంతోష్‌రావులపై చేసిన వ్యాఖ్యలు ఆమెను సస్పెండ్ చేసే వరకు వచ్చాయి. ఏ మాటకామాట చెప్పుకోవాలి. అసలు హరీష్‌రావు లేని బిఆర్‌ఎస్‌ను ఊహించుకోవడమే కష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే హరీష్ రావు లేకుంటే కేసిఆర్ కూడా పార్టీని నడపడం కష్టం. బిఆర్‌ఎస్ పార్టీకి మొదటి సైనికుడు హరీష్‌రావు. అసలైన సైన్యాధ్యక్షుడు హరీష్‌రావు. కేసిఆర్ తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టిన నాడు హరీష్ తప్ప ఇంకొకరు లేరు. సంతోష్‌రావు కూడా తర్వాత వచ్చారు. అడుగడుగునా కేసిఆర్ కు అండగా వుంటూ వచ్చిన హరీష్ రావు పోషించిన పాత్ర అంత సులభమైంది కాదు. సహజంగా రాజకీయాలు వేరు. ఉద్యమ రాజకీయాలు వేరు. రెండు రకాల పాత్రలు సమర్ధవంతంగా పోషించిన నాయకుడు హరీష్‌రావు. అటు కేసిఆర్ కోసం పనిచేయాలి. ఇటు ఉద్యమం కోసం పనిచేయాలి. మరో వైపు నియోజకవర్గాన్ని అభివృద్ది చేయాలి. ఇలా మూడు పాత్రలను కూడా అలవోకగా పోషించిన ఏకైక నాయకుడు హరీష్‌రావు. పార్టీ కోసం ఆయన తిండి,నిద్రలు మానుకొని పనిచేసినరోజులు అనేకం వున్నాయి. మంత్రిగా పనిచేసిన సమయంలో కూడా హరీష్‌రావు కాళేశ్వర నిర్మాణం సమయంలో అనేక రాత్రులు అక్కడే నిద్రలు చేశారు. ఉదయమంతా పర్యటనలు, అదికారులతో రివ్యూలు, అభివృద్ధిపనులు, రాత్రికి మళ్లీ కాళేశ్వరానికి చేరి ఆ పనులు పర్యవేక్షలు చేసిన నాయకుడు హరీష్‌రావు. అలా ప్రాజెక్టు పూర్తయ్యేవరకు కాళేశ్వరం నిర్మాణ పనులతో సతమతమయ్యారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒక అధ్భుతమైన కట్టడాన్ని తనచేతుల మీద నిర్మాణమౌతుందన్న ఆనందం ఒక వైపు, ఎంతో బాధ్యతతో పనిచేశారు. అనుకున్న సమయంలో అనుకున్న రీతిలో కాళేశ్వరం పూర్తి కావడం లో హరీష్ పాత్రను ఎవరూ శంకించలేదు. అంతగొప్పగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించని ఏకైక నాయకుడు హరీష్‌రావు. ఇక సంతోష్‌రావు విషయానికి వస్తే మొదటినుంచి కేసిఆర్ బాగోగులు చూసుకుంటూ వచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా కేసిఆర్ అనేక వేదికల మీద చెప్పారు. తన కోసం తన జీవితాన్ని త్యాగం చేసినందుకే సంతోష్‌రావుకు రాజ్యసభ ఇస్తున్నానని కూడా చెప్పారు. హరీష్‌రావుపై లేనిపోని వ్యాఖ్యలు చేసి కవిత తప్పు చేసింది. కవితపై చర్యలు తీసుకోకపోతే నేరుగా పార్టీ మీద మాట్లాడేవారు పెరుగుతారు. కవిత కూడా సరిగ్గా పార్టీ ఎదుగుతున్న తరుణంలో మరింత బలపడుతుందన్న విశ్వాసం ఏర్పడుతున్న సందర్భాన్ని చూసుకొని వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. పార్టీ రజతోత్సవ సభ విజయవంతమైందని పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్న సమయంలో లేఖ రాశారు. పార్టీలో అందరికీ వేదిక మీద మాట్లాడే అవకాశమిస్తే బాగుండేదంటూ మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ అనేది జరగలేదంటూ పార్టీ శ్రేణులన్నీ కాంగ్రెస్ పార్టీ మీద ఎదురు దాడి చేస్తున్న సమయంలో తన ఫోన్ ట్యాప్ అయ్యిందని కవిత చెప్పడంతో బిఆర్‌ఎస్ డిఫెన్స్‌లో పడే పరిస్తితి విచ్చింది. ఇప్పుడేమో కాళేశ్వరం విషయంలో ఎలాంటి అవినీతి జరగలేదని ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లో పడేసి, కాళేశ్వరం తెలంగాణ వర ప్రదాయిని అని నిరూపించే సమయంలో కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీకి పూర్గిగా వ్యతిరేకమైనవే అన్నది తేలింది. ఓ వైపు కేసిఆర్ మీద ప్రేమను చూపిస్తూనే, పరోక్షంగా కాళేశ్వరంలో అవినీతికి కారకుడు కేసిఆరే అనే అర్దం సృరించేలా కవిత వ్యాఖ్యలు చేసిన పార్టీ నుంచి దూరమైంది. ఏది ఏమైనా హరీష్‌రావుపై కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ సమాజం కూడా స్వాగతించలేదు. ఆమెపై తెలంగాణ సమాజం నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురైందని చెప్పక తప్పదు.
రైతులకు యూరియా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం.
రైతుల గోస పట్టించుకోని ప్రభుత్వం
మారపల్లి మల్లేష్ సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి
భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల.. మండల కేంద్రంలో రైతులు యూరియాకోసం గంటల తరబడి లైన్లో నిలబడిన పూర్తిస్థాయిలో రైతులకు సరిపడా యూరియా దొరకలేదు అని సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక లారీ లోడ్ రావడానికి వారం పట్టింది వచ్చిన లారీ యూరియా రైతులకు ఏమాత్రం సరిపోలేదు ఒకటి రెండు బస్తాలతో సరిపెట్టుకున్న దొరకని రైతులు నిరాశతో వెనుతిరిగి పోతున్నారు మళ్లీ లారీ వస్తదని చిట్టీలు ఇచ్చిన ఈ లారీ రావడానికి వారం పడతదో పది రోజులు పడుతదో అని రైతుల నిరాశ చెందుతున్నారు రైతులకు సరిపడా యూరియా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పూర్తి స్థాయిలో యూరియా అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం వర్షాకాల సీజన్లో రైతుల పంటలు ఎర్రబడి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయినప్పటికీ సరిపడా యూరియా అందించడంలో జిల్లా ఉన్నతాధికారులు సమన్వయంతో పనిచేసి తక్షణమే ఈ ప్రాంత రైతులకు సకాలంలో లారీ వచ్చే విధంగా చర్యలు తీసుకొని మిగిలిన రైతులకు రేపే యూరియా పంపిణీ చేయాలని అన్నారు చిట్టీలు తీసుకున్న రైతులందరికీ యూరియాసరఫరా చేయాలని రైతులను ఈ విధంగా ఇబ్బంది చేస్తే రానున్న రోజుల్లో ఉద్యమాలు తప్పవని హెచ్చరిస్తావున్నాం ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు రామ్ రామచంద్ర మాదిగ ఆకునూరి జగన్ పాల్గొన్నారు
ఎమ్మెల్యే జన్మదిన సందర్బంగా రక్తదానం చేసిన దొమ్మటి శ్రీను
పరకాల నేటిధాత్రి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి జన్మదిన సందర్బంగా పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరంలో మల్లక్కపేట గ్రామానికి చెందిన దొమ్మటి శ్రీనివాస్ తనవంతుగా రక్తదానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ దావాఖానా సూపరిండెంట్ గౌతమ్ చౌహన్, ఆర్ఎంఓ బాలకృష్ణ,గ్రామ అధ్యక్షులు మామూనూరి రాజు,మాజీ సర్పంచ్ అల్లం రఘు నారాయణ,దొమ్మటి మల్లయ్య,బయ్యా మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
కొయ్యాడా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి
అనంతరం సాయుదపోరాట యోధులకు నివాళులు అర్పించిన నాయకులు
పరకాల నేటిధాత్రి
పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రక్కల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ ఏఎంసీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి లు రాజశేఖర్ రెడ్డికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కొయ్యడ శ్రీనివాస్ మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలందరికీ గుండెల్లో నిలిచిన నాయకుడు ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కృషిచేసి ఈరోజు దేశంలోనే ఎవరూ చేయలేని విధంగా ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు అందించిన మహా గొప్ప నేత ఆరోగ్యశ్రీ కార్డుతో దేశంలోనే గొప్ప పేరుగాంచిన మహా నాయకుడు రాజశేఖర్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక ఎంపీ లోని గెలిపించుకొని దేశంలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినటువంటి మహానాయకుడని నాటి నుంచి నేటి వరకు రాజశేఖర్ రెడ్డి గుర్తులు ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నాయని అన్నారు.ఆ మహానీయుడు మన మధ్యలో లేకపోవడం బాధాకరమని కొయ్యడ శ్రీనివాస్ అన్నారు.సెప్టెంబర్ 2 తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులు బాసిన తెలంగాణ అమరవీరులకు,పరకాల అమరవీరులకు వర్గాల అమరధామంలో వారిని స్మరిస్తూ నివాళులర్పించడం జరిగింది.నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పరకాల ప్రాంతంలో పెద్ద ఎత్తున జాతీయ జెండాలు పట్టుకుని పరకాల ప్రాంతంలో తిరుగుతున్న వారిని నిజాం ప్రజకారులు కాల్పులు జరిపి ఎంతో మందిని చిత్రహింసల గురిచేసి మహిళలు వృద్ధులు చిన్నపిల్లలను చూడకుంట విచక్షణ రహితంగా కాల్పులు జరిపి నటువంటి రజాకారులను ఎదిరించి పోరాడిన మహనీయులను స్మరిస్తూ తెలంగాణ కోసం పరకాల ప్రాంతానికి చెందిన అమరులు ప్రాణ త్యాగం చేసిన వారిని గుర్తుంచుకొని వారికి స్మరించడం జరిగింది కొయ్యడ శ్రీనివాస్ అన్నారు.ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ సభ్యులు చిన్నల గునాథ్,ఒంటేరు రామ్మూర్తి,పోరండ్ల సంతోష్,మడికొండ సంపత్,మెరుగు శ్రీశైలం గౌడ్,పసుల రమేష్,దుబాస్ వెంకటస్వామి,పాడి ప్రతాప్ రెడ్డి,సదానందం గౌడ్,బొచ్చు బాబు,నల్లల అనిల్,ఒంటేరు శ్రావణ్ కుమార్,పాలకుర్తి శ్రీనివాస్,బొచ్చు మోహన్ తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.