ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను కలిసిన.!

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను కలిసిన బీఆర్ఎస్వి మండల అధ్యక్షులు

నడికూడ,నేటిధాత్రి:

హైదరాబాద్ లో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ని మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్వి నడికూడ మండల అధ్యక్షులు దురిశెట్టి వెంకటేష్
అనంతరం కవిత పలు విషయాలపై చర్చించారు.

అన్న ప్రసాదం అందజేసిన కవిత కిషన్ దంపతులు .

స్వాములకు అన్న ప్రసాదం అందజేసిన కవిత కిషన్ దంపతులు

పరకాల నేటిధాత్రి :

 

మండలంలోని మల్లక్కపేట గ్రామంలోని ఈ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో బొజ్జం కవిత కిషన్ దంపతులు మంగళవారం రోజున ఆంజనేయ స్వామి మాల ధరించిన దాదాపు 250 మంది స్వాములకు అన్నప్రసాదం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,ఆలయ చైర్మన్ అంబిరు మహేందర్,ఇఓ వెంకటయ్య,అర్చకులు కాటూరి జగన్నాధాచార్యులు,డైరెక్టర్స్ దొమ్మటి శంకరయ్య,నిట్టె బాలరాజు,బొజ్జం రాజేందర్ అలాగే,నల్ల విష్ణువర్థన్ రెడ్డి,భక్తులు పాల్గొన్నారు.

మన సంస్కృతిని ప్రపంచానికి చాటిన ఘనత కవితక్కదే.

మన సంస్కృతిని ప్రపంచానికి చాటిన ఘనత కవితక్కదే….
– జాగృతితోనే బతుకమ్మ సంబరాలకు పునర్జీవం
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌
– మంథనిలో ఘనంగా కవితక్క జన్మదిన వేడుకలు

మంథని :- నేటి ధాత్రి

మన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచస్థాయిలో చాటిన ఘనత కల్వకుంట్ల కవితక్కకే దక్కుతుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. మాజీ ఎంపీ,ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకల్లో బాగంగా గురువారం మంథని పట్టణంలోని రాజగృహాలో వేడుకలు నిర్వహించారు. ఈసందర్బంగా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కూతురు అయినా ఒక సాధారణ నాయకురాలిగా కవితక్క తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుందన్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో సైతం తనవంతుగా ముఖ్య పాత్ర పోషించిందని, ప్రజల్లో అనునిత్యం మమేకమై వారి కష్టసుఖాలను తెలుసుకునేవారన్నారు. జాగృతి సంస్థను ఏర్పాటుచేసి అనేక సేవలు అందించడంతో పాటు ప్రపంచంలోని తెలుగువాళ్లకు మన సంస్కృతిని చాటి చెప్పారన్నారు. అలాగే ప్రతి గ్రామంలో బతుకమ్మ ఆటలు ఆడుకునేవారని, కానీ జాగృతి సంస్థ ద్వారా కవితక్క అంగరంగ వైభవంగా బతుకమ్మసంబరాలు నిర్వహించి విశిష్టతను చాటారని, తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మకు పునర్జీవం ఇచ్చారని ఆయన కొనియాడారు. నిత్యం ప్రజల కోసం, తెలంగాణ కోసం ఆలోచన చేసే కవితక్కకు మంథని నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అభిమానుల పక్షాన పుట్టిన రోజు శుభాకాంక్షలను ఈ సందర్బంగా ఆయన తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version