ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ బలం….

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T121001.744-1.wav?_=1

ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ బలం

◆:- యువ నాయకులు మహ్మద్ హఫీస్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల చిల్లెపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మహ్మద్ హఫీస్ మాట్లాడుతూ
అధికారంలోకి వచ్చిన 18 నెలలోనే ఐదు గ్యారంటీలను అమలు చేసి ప్రజల మన్న లను పొందింది అన్నారు. రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఉందన్నారు. గతంలో పది సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ మోసపూరిత హామీలతో, పథకాలతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందన్నారు. అందుకే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో బొంద పెట్టారన్నారు. జరగబోయే ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిలను అత్యధిక మెజార్టీతో గెలిపించి,రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఉందన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని పంచాయతీలు, వార్డులలోని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియపరుస్తూ ఓట్లను అడిగి ఎంపీటీసీ జెడ్పిటిసిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు.

స్థానిక సంస్థ ఎన్నికల్లో భాజపా పార్టీ సత్తా చాటుతుంది.

స్థానిక సంస్థ ఎన్నికల్లో భాజపా పార్టీ సత్తా చాటుతుంది. మెట్ పల్లి బీజేపి కార్యాలయంలో రాష్ట్ర నాయకుడు చిట్నేని రఘు..
మెట్ పల్లి ఆగస్ట 1 నేటి దాత్రి
రాబోయే స్థానిక సర్పంచ్,ఎంపీటీసి ఎన్నికల్లో బిజెపి పార్టీ సత్తా చాటుతుందని అధికార కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలకు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు బుద్ధి చెబుతారని బిజెపి రాష్ట్ర నాయకుడు చిట్నేని రఘు అన్నారు .మెట్పల్లి పట్టణంలోని బిజెపి కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూరాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పడకేసిందని, వర్షాకాలం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో దోమల బెడదతో పాటు ఇతర సమస్యలతో ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని అన్నారు. రానున్న రోజుల్లో సర్పంచ్,ఎంపీటీసి ఎన్నికలు నిర్వహిస్తే గ్రామీణ ప్రాంతాల్లో బిజెపికి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఉండడంతో పోటీ చేసిన ప్రతి వద్ద గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు, అధికార పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ సంవత్సర కాలంలోనే వ్యతిరేకత వచ్చిందని అందుకు ఉదాహరణ గాని రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన అన్నారు దీంతో పాటు గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఇప్పుడు కాంగ్రెస్ బిజెపి మధ్యనే పోటీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు ప్రజలు గమనిస్తున్నారని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత ఎంతో ముందు చూపుతో బిజెపి ఎన్నికలలో గెలిపిస్తారని అన్నారు స్థాయి నాయకులు భాజపా పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారని, నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఆధ్వర్యంలో పసుపు బోర్డు రావడం రైతుల్లో ఆనందం వెల్లులిసిందని రానున్న రోజుల్లో ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా అటు ప్రజలకు రైతులకు అందిస్తామని ఆయన అన్నారు అత్యధిక మెజార్టీలతో అత్యధిక స్థానాలు భాజపాటి స్వాధీనం చేసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బిజెపి నాయకులు సుఖేందర్ గౌడ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి సత్తా చాటాలి…

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి సత్తా చాటాలి…

భారతీయ జనతా పార్టీ మద్దూర్ మండలం, అధ్యక్షులు మోకు ఉదయ్ రెడ్డి

మద్దూరు నేటిధాత్రి

జనగామ నియోజకవర్గం మద్దూరు మండలం లో నిర్వహించిన “స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల” లో ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉడుగుల రమేష్, బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. బొంగోని సురేష్ గౌడ్ . పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి మద్దూరు మండల అధ్యక్షుడు మోకు ఉదయ రెడ్డి అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బిజెపి జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలి. అని బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొంగోని సురేష్ గౌడ్ అన్నారు గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి మాత్రమే కాదు, గ్రామీణ ప్రాంత ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తోంది. అన్నారు బిజెపి ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి. అని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు సభ్యుల, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ నుండి, జిల్లా పరిషత్ చైర్మన్ వరకు బిజెపి కైవసం చేసుకోవాలి అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాపాక బుచ్చిరెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబెర్ కూరెళ్ల కిరణ్ గౌడ్, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు కొండా నాగమణి, ప్రధాన కార్యదర్శులు బొంగోని బాలు, బియ్య రమేష్,సోగాలా మనోజ్,కృష్ణా రెడ్డి, మేక సుదర్మ, చింతల రాజు, చందు, శ్రీకాంత్, బాలకృష్ణ, రాజు మరియు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి సత్తా చాటి చెబుతాం…

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి సత్తా చాటి చెబుతాం… కాషాయ జెండా ఎగరవేస్తాం – బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి

కరీంనగర్, నేటిధాత్రి:

కాంగ్రెస్ పార్టీ లోగడ ఎన్నికల సందర్భంగా అధికారంలోకి రావడం కోసం ఆరు గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిందని, నేడు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసం మళ్లీ కొత్త రాజకీయ డ్రామాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదలుపెట్టిందని బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. బిజెపి రామడుగు మండలశాఖ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల కార్యాశాల సమావేశం రామడుగు మండలం షానగర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ గార్డెన్ నందు జరిగింది. ఈసమావేశానికి ముఖ్య అతిథిగా బిజెపి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆరు గ్యారంటీలతో, 420 హామీలతో ప్రజలను ఆదుకుంటామని కాంగ్రెస్ మాయమాటలు, అబద్ధాలు చెప్పి ప్రజానీకాన్ని మోసం చేసిందన్నారు. పథకాల అమలు కోసం దాదాపు రెండేళ్ల కాలంగా కాంగ్రెస్ సర్కార్ ప్రజా పాలన పేరిట ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి చేతులు దులుపుకోవడం తప్ప ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదన్నారు. అరకోరపథకాలను అమలు చేస్తూ, ఇష్యూ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒక్కటి సక్రమంగా అమలైంది తప్ప, మిగతా ఏఒక్కటీ అమలు కాలేదని ఆయన ఆరోపించారు. రైతు రుణమాఫీ అరకోర చేసిందని, పింఛన్లు అందించడం లేదని, నిరుద్యోగ భృతిని అటకెక్కించిందని, ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ చెప్పిన లెక్కలేనన్ని హామీలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీవన్నీ ఉద్దెర ముచ్చట్లనే విషయం ప్రజలందరికీ అర్థమైందని, మాటల గారడితో ప్రజలను మోసగించడం కాంగ్రెస్కే చెల్లిందన్నారు. కాంగ్రెస్ చేస్తున్న మోసానికి ప్రతిఫలం లభించిందని , అందుకే లోగోడ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆప్రభుత్వానికి ఉద్యోగులు, పట్టభద్రులు తగిన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. ప్రస్తుతం త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం మళ్లీ కాంగ్రెస్ సర్కార్ లబ్ధి పొందడానికి కుటిలప్రయత్నాలు, రాజకీయాలు మొదలుపెట్టిందన్నారు. బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ అంశంతో రాజకీయ నాటకాలు మొదలుపెట్టిందని ఆయన విమర్శించారు. పది శాతం రిజర్వేషన్లు ముస్లింలకు వర్తించే విధంగా బీసీ రిజర్వేషన్ ను చేపట్టిందన్నారు. దీనివల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. జరగబోయే జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు దిమ్మదిరిగే ఫలితాలు అందిస్తారని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన ప్రజలను మభ్య పెట్టాలని ప్రయత్నించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి జరగబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం లభిస్తుందన్నారు. ప్రజలంతా బిజెపి మోదీ కేంద్ర ప్రభుత్వ పనితీరుపై విశ్వాసంతో ఉన్నారన్నారు. గ్రామాల్లో మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతుందనే విషయం ప్రజలకు అర్థమైందన్నారు. అందుకే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి సత్తా చాటేలా తగిన కార్యాచరణలతో ముందుకు కొనసాగడం జరుగుతుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్, మండలశాఖ అధ్యక్షులు మోడీ రవీందర్, జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ జిన్నారం విద్యాసాగర్, మాజీ మండల శాఖ అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి, ఎన్నికల ప్రభరి జాడి బాల్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పు శ్రీనివాస్ పటేల్, బండ తిరుపతి రెడ్డి,వివిధ మోర్చాల అధ్యక్షులు, నాయకులు, శక్తి కేంద్రం ఇంఛార్జిలు, బూత్ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు హాజరయ్యారు.

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీ ఆర్ ఎస్ సత్తా చూపి.

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీ ఆర్ ఎస్ సత్తా చూపి

మాజీ సిఎం కె.సి.ఆర్ కు అండగా ఉండాలి

మాజీమంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి నెటిదాత్రి :

 

ఘనపూర్ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు
బి.ఆర్.ఎస్ ఘనపూర్ మండల ముఖ్య నాయకుల సమావేశంలో పార్టీ అధ్యక్షులు రాళ్ళ.కృష్ణయ్య నివాసంలో నిర్వహించారు
ఈ సమావేశం లోముఖ్య అతిథిగా నిరంజన్ రెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశరు ఈ సందర్భంగా.మాజీ మంత్రి మాట్లాడుతూ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పి టిసి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలతో టాచ్ లో ఉండాలని సూచించారు మండల బీ ఆర్ ఎస్ నాయకులు గ్రామాలలో పర్యటించి ప్రజలతో కలవాలని 19నెలల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ప్రజల మన్ననలను పొందిన నాయకులను గుర్తించి వారికి అవకాశం ఇవ్వాలని అన్నారుపార్టీ పట్ల నిబద్ధత,నాయకుని పట్ల విశ్వాసం ఉన్న నాయకులకు బీ ఆర్ ఎస్ పార్టీ అవకాశం ఇస్తుందని అన్నారుపార్టీలో ఉంటూ ఇతర పార్టీలకు సహకరించే నమ్మకద్రోహుల పట్ల పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చా రు ప్రజలు స్థిర నిర్ణయానికి వచ్చినారని మాజీ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ హయాములో రాష్ట్ర అభివృద్ధి జెరిగింద ని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఎట్లా నిర్వీర్యం అయినాయో స్పష్టమైన అవగాహనతో ప్రజల కు తెలుసు నాని అన్నారు ఎప్పటికప్పుడు గ్రామాలలో ప్రజల సమస్యల పట్ల స్పందిస్తూ వారికి అండగా నిలవాలని నిరంజన్ రెడ్డి ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,మాజీ ఎం.పి.పి కృష్ణా నాయక్,మాజీ మార్కెట్ ఛైర్మెన్ లక్ష్మారెడ్డి,మాజీ జేడీపీ టి సి సామ్యా నాయక్ మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ బాలేశ్వర్ రెడ్డి, ఎస్.టి సెల్ జిల్లా నాయకులు జాతృ నాయక్,మాజీ ప్రజాప్రతినిధులు,వివిధ గ్రామాల అధ్యక్షులు ,ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

క్రీడలతో మానసిక ఉల్లాసం శారీరక ద్రుఢత్వం లభిస్తుంది.


క్రీడలతో మానసిక ఉల్లాసం శారీరక ద్రుఢత్వం లభిస్తుంది

ప్రతి మండలానికి ఒక క్రీడా మైదానం ఏర్పాటుకు కృషి

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

చందుర్తి నేటిధాత్రి:

క్రీడలతో మానసిక ఉల్లాసం,శారీరక ద్రుఢత్వం లభిస్తుందనీ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు..శుక్రవారం చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో నిర్వహించిన మూడపల్లి ప్రీమియం లీగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా విలేజ్ టూ విలేజ్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మొదటి విజేత తంగళ్ళపల్లి రెండో విజేత మూడ పల్లి గ్రామ క్రీడాకారులకు బహుమతులు అందజేశారు…

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఆటలు ఆడటం వల్ల శారీరక దృఢత్వం లభిస్తుందనీ తెలిపారు…మన ప్రాంతంలో అనేక మంది క్రీడాకారులకు నిలయంగా మారిందన్నారు..గతంలో విద్యార్థి దశలో ఉన్న
సమయంలో కోర్టు లైన్ పోసే వాడినని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు..

ఎల్లపుడూ క్రీడాకారులకు తన వంతు సహాయ సహారాలు ఉంటాయని అన్నారు.. రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయి వాలీబాల్, కబడ్డి పోటీలు జిల్లా పరిదిలో తన వంతు ప్రోత్సాహకం ఉంటుందన్నారు… రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడాలకు పెద్ద పీట వేస్తన్నరని అందులో భాగంగా రాష్ట్రంలో క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు…

క్రీడాకారులు జీవితంలో ఏమైనా సమస్యలు ఎదురైతే వాటిని ఎదుర్కొనే ధైర్యం ఎక్కువగా ఉంటుందన్నారు.. సిరిసిల్ల ప్రాంతంలో మంత్రుల చేతుల మీదుగా అనేక అభివ్రుద్ది కార్యక్రమాలు నిర్వహించడం జరిగిoదన్నారు..

మన ప్రాంతంలో కోరుట్ల, సిరిసిల్ల,వేములవాడ ప్రాంతాల్లో క్రీడాకారులకు నూతన స్టేడియం లను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.. ఇప్పటికే సిరిసిల్ల పట్టణంలో బతుకమ్మ తెప్ప వద్ద క్రీడా ప్రాంగణాన్ని చూడటం జరిగిందనీ తెలిపారు..గ్రామీణ ప్రాంతాల్లోనీ క్రీడాకారులను వేలికి తీయడానికి సీఎం కప్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతపoటి రామస్వామి, మాజీ జెడ్పిటిసి నాగం కుమార్, సింగిల్ విండో వైస్ చైర్మన్ పుల్కం మోహన్, నాయకులు. బద్దం తిరుమలరెడ్డి, ప్రసాద్, బాణాల రవీందర్ పుల్కల్ లచ్చయ్య, మేకల గణేష్ క్రీడాకారులు పాల్గొన్నారు.

పటిష్టతకు పని చేసేవారిని నూతన అధ్యక్షుడిగా అవకాశం.

కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు పని చేసేవారిని నూతన అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలి

◆ సీనియారిటీకి ప్రాధాన్యత ఇచ్చి పార్టీ విధేయులకు ప్రాధాన్యత ఇవ్వలి

◆ అన్ని వర్గాలను కలుపుకొని పోయే నాయకుడిని పెద్దపీట వెయ్యాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్,అల్ ఇండియా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ శాసనసభ పరిది ఝారసంగం మండలంలోని మచ్నూర్ గ్రామంలో సోమవారం ఝారసంగం మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశమై పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా మండలంలో బలమైన కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మాణంలో భాగంగా పార్టీ చేపట్టబోయే నూతన గ్రామ, మండల అధ్యక్షుల ఎంపికను అందరూ ఏకతాటిపై నిలిచి నూతన అధ్యక్షుడి ఎంపికను పూర్తి చేసి జహీరాబాద్ నియోజకవర్గంలోనే ఝారసంగం మండల కాంగ్రెస్ పార్టీని పటిష్టం చెయ్యాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తూ..

నూతన నాయకత్వాన్ని అందరి అభిప్రాయంతో ఎంచుకోవలని తెలిపారు.

పార్టీ నూతన మండల ఎంపిక కోసం సంస్థాగత ఎన్నికల ఇంచార్జ్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పార్టీ అధిష్టానం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ,ఓసి జనరల్ వారి నుంచి అనగా 2017 కంటే ముందు పార్టీలో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఉదాహరణకు ఝారసంగం మండల అధ్యక్షుడిగా ఒకే వ్యక్తి మూడు దశబ్దాలకుపై, న్యాల్కల్ మండల అధ్యక్షుడు నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో ఉన్నప్పటి నుంచి 2009 లో నియోజకవర్గల పునర్విభజనలో జహీరాబాద్ లో విలీనం అయిన నాటి నుంచి ఇప్పటివరకు అన్నగా రెండు దశాబ్దాలకు పైగా ఉండగా, 2009 నుండి
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండటం, మిగిలిన మండలాల వారు 2018 సంవత్సరం నుంచి ఉండటంపై పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నారు.

మూడు రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ఇచ్చిన పాసులను ఇష్టానుసారంగా ఇచ్చుకొని జిల్లా, నియోజకవర్గ, మండల నాయకులకు,మాజీ జడ్పిటిసిలు,మాజీ ఎంపిపిలు, మాజీ ఎంపిటిసిలు, మాజీ సర్పంచ్ లకు ఇవ్వకపోవడంతో కార్యకర్యాల ఆగ్రహానికి కారణం అయింది.

ఏది ఏమైనప్పటికి పార్టీ అధిష్టానం మండల అధ్యక్షుడిని మార్చి పార్టీ శ్రేయస్సు కోసం పనిచేసే వారిని అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానంతో కోరారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ అసెంబ్లీ ఓటమి చెందడానికి పలు కారణాల్లో అధ్యక్షులను మార్చకపోవడం కూడా ఒకటని సమావేశంలో చెప్పుకోవడం విశేషం..

ఇప్పటికైనా పార్టీ అధిష్టానం స్పందించి 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించాలంటే నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో నూతన అధ్యక్షుల నియామకం చేపట్టి వారికి అవకాశం కల్పిస్తే వారు ఐకమత్యంగా ఉంటూ పార్టీ విజయం కోసం కష్టపడే అవకాశం ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పిసిసి ప్రచార కార్యదర్శి మహేందర్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎండి.

ముల్తానీ, ఝారసంగం మండల మాజీ ఎంపిటిసి ఫోరం అధ్యక్షుడు శంకర్ పాటిల్, మాజీ జడ్పిటిసి వినిల నరేష్, మాజీ ఎంపిపి దేవదాస్, మాజీ సర్పంచులు నవాజ్ రెడ్డి, రామిరెడ్డి, ఇస్మాయిల్ సాబ్, రాజుస్వామి, శంషోద్దీన్, నందప్ప పాటిల్, మహరుధ్ రావు, సుధాకర్, మాణిక్యం, మాజీ ఎంపిటిసిలు మొహమ్మద్ హాఫిజ్, రవి, మాజీ ఉప సర్పంచ్ సంగన్న, యువజన కాంగ్రేన్ అధ్యక్షుడు రాఘవేంద్ర, అభిలాశ్ రెడ్డి, యువ నాయకులు, సుధాకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రాజు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఐకమత్యం మహా బలం.

ఐకమత్యం మహా బలం.

 

“నేటిధాత్రి” వరంగల్.

వరంగల్ నగరంలోని దేశాయ్ పేట్ రోడ్ కళ్యాణి నగర్ కాలనీ వాసులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు తమ కాలనీ లోని కుటుంబ సభ్యులంతా ఆరెపల్లి సమీపంలో ఏ ఎన్ ఆర్ గార్డెన్స్ లో కలుసుకొని అట పాటలతో సందడి చేసారు…

Spiritual gathering

ఈ సందర్బంగా కళ్యాణి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గోలి చెన్నారెడ్డి మాట్లాడుతూ ఐకమత్యం తో ఉండడం వాళ్ళ అందరు సంతోషంగా ఉంటారని కాలనీ లో ఆహ్లాదా వాతావరణం ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమం లో పాల్గొన్నా కుటుంబ సభ్యులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమం లో కళ్యాణి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గోలి చెన్న రెడ్డి కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి కోశాధికారి మధు సుధన్..

Spiritual gathering

గౌరవ అధ్యక్షులు హరినాథ్ సలహాదారులు చిర్ల మల్ల రెడ్డి కాలనీ వాసులు కొండల్ రావు సంతోష్. తిరుపతి రెడ్డి వెంకట్ రెడ్డి.రామ సుబ్బారెడ్డి .వెంకట్ గౌడ్.రాంరెడ్డి రాజేందర్ రెడ్డి తుమ్మ ప్రభాకర్ రెడ్డి .సూరం ప్రతాప్ రెడ్డి. శివ కుమార్.వసంత్ కుమార్.చంద్ర శేఖర్ జయ పాల్ రెడ్డి పల్లం కుమారస్వామి తుమ్మ శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version