హరిహర వీరమల్లు గర్జించేది అప్పుడే…

హరిహర వీరమల్లు గర్జించేది అప్పుడే అభిమానులకు పండగే.

 

నేటి ధాత్రి:

 

 

 

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం  ‘హరి హర వీరమల్లు'(hari hara Veera mallu) . 

ఈ సంవత్సరం విడుదల కానున్న భారీ భారతీయ చిత్రాలలో ఇదొకటి. 

భారీ అంచనాలు ఉన్న ఏ చిత్రం కోసం అభిమానులు ప్రేక్షకులు ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నారు.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం  ‘హరి హర వీరమల్లు'(hari hara Veera mallu) . 
ఈ సంవత్సరం విడుదల కానున్న భారీ భారతీయ చిత్రాలలో ఇదొకటి. 
భారీ అంచనాలు ఉన్న ఏ చిత్రం కోసం అభిమానులు ప్రేక్షకులు ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, రెండు పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మూడవ పాటను ట్రైలర్‌తో పాటు ఆవిష్కరించడానికి చిత్ర బృందం సిద్ధమవుతోంది. ‘హరి హర వీరమల్లు’ చిత్రం షూటింగ్ తుదిదశకు చేరుకుంది. నిర్మాణాంతర కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. వీఎఫ్ఎక్స్, సౌండ్ డిజైన్, డబ్బింగ్ పనులతో మెరుపు వేగంతో తుది మెరుగులు దిద్దుకుంటోంది. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ  చిత్రం, జూన్ 12న బాక్సాఫీస్ దగ్గర గర్జించనుంది.  ఈ మేరకు మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేశారు.  జూన్ 12న సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్న ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు భాగమయ్యారు. మొఘల్ చక్రవర్తిగా బాబీ డియోల్ నటిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. (Harihara veeramallu Release Date)

ఆలస్యాల మధ్య పగ్గాలు చేపట్టిన దర్శకుడు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, కొద్ది నెలలుగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ప్రతి విభాగాన్ని పర్యవేక్షిస్తూ, వెండితెరపై మునుపెన్నడూ చూడని అద్భుతమైన అనుభూతిని ప్రేక్షకులకు అందించడానికి కృషి చేస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘మాట వినాలి’, ‘కొల్లగొట్టినాదిరో’ గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకి, లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్ లను రూపొందించారు. చిత్ర బృందం ఎక్కడా రాజీ పడకుండా, ప్రపంచం మెచ్చే గొప్ప చిత్రంగా మలచడానికి కృషి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో భారీ ఎత్తున విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా.. ప్రేక్షకుల హృదయాలను, బాక్సాఫీస్‌ను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version