ఎమ్మెల్యేను కలిసిన పంచాయతీ పాలకవర్గ సభ్యులు…

ఎమ్మెల్యేను కలిసిన పంచాయతీ పాలకవర్గ సభ్యులు

 

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని కంఠాత్మకూర్ గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా సర్పంచ్ గా ఎన్నికైన గ్రామ సర్పంచ్ కొంగంటి తిరుపతి, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ని కలిసి పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపారు.
నూతనంగా ఎన్నికైనా గ్రామ సర్పంచ్,ఉపసర్పంచ్,వార్డు సభ్యులకు ఎమ్మెల్యే ఆశీస్సులు అందించి అభినందనలు తెలిపారు. గ్రామపంచాయతీ పాలకవర్గం కలిసికట్టుగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించిచారు. ఎమ్మెల్యేను కలిసినవారిలో సర్పంచ్‌ కొంగంటి తిరుపతి,ఉపసర్పంచ్‌ కంఠాత్మకూర్ కుమారస్వామి, వార్డుసభ్యులు బుస్సా భాగ్య,గూడూరు నాగరాజు,తడుక రగుపతి,బాయి సంధ్య,కుమ్మరి మౌనిక,బుస్స తిరుపతి,ఆకుల వనిత,ఎడ్ల కిరణ్,గూడూరు జాన్సీ రాణి.
ఈ కార్యక్రమం లో నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్,మండల సమన్వయ కమిటీ సభ్యులు పాడి ప్రతాప్ రెడ్డి,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భైరపాక భద్రయ్య, ఉపాధ్యక్షులు పరమండ్ల మహేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం మహేందర్, కార్యదర్శి బొమ్మకంటి విజేందర్, గూడూరు మధుకర్,బాయి సుమన్,సీనియర్ నాయకులు కంఠాత్మకూర్ కొమురయ్య, కొత్తూరు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా దొమ్మటి శ్రీను రక్తదానం..

ఎమ్మెల్యే జన్మదిన సందర్బంగా రక్తదానం చేసిన దొమ్మటి శ్రీను

పరకాల నేటిధాత్రి
పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి జన్మదిన సందర్బంగా పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరంలో మల్లక్కపేట గ్రామానికి చెందిన దొమ్మటి శ్రీనివాస్ తనవంతుగా రక్తదానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ దావాఖానా సూపరిండెంట్ గౌతమ్ చౌహన్, ఆర్ఎంఓ బాలకృష్ణ,గ్రామ అధ్యక్షులు మామూనూరి రాజు,మాజీ సర్పంచ్ అల్లం రఘు నారాయణ,దొమ్మటి మల్లయ్య,బయ్యా మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version