పాలస్తీనా ఇరాన్లపై యుద్దదాడులు అమెరికా కుట్రలో భాగమే.

పాలస్తీనా ఇరాన్లపై యుద్దదాడులు అమెరికా కుట్రలో భాగమే

ప్రజా సమస్యలపై పోరాటాలను ఉదృతం చేయాలి

యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి

నర్సంపేట నేటిధాత్రి:

యుద్దోన్మాదంతో సామాన్య ప్రజలను బలికొంటూ ఆర్థిక వ్యవస్థను చిన్నబిన్నం చేస్తు ప్రపంచ దేశాలపై పెత్తనం చెలాయించాలని చూస్తున్న అమెరికా తగిన మూల్యం చెల్లించక తప్పదని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అన్నారు. అమెరికా ట్రంప్ విధానాలకు వత్తాసు పలికే బిజెపి మోడీ పద్ధతులను మార్చుకోవాలని లేకపోతే ప్రజా వ్యతిరేకతను చెవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
యంసిపిఐ(యు) వరంగల్ జిల్లా కార్యదర్శి వర్గ సమావేశం నర్సంపేట పార్టీ ఆఫీస్ లో కామ్రేడ్ కుసుంబ బాబురావుఅధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన గాదగోని రవి మాట్లాడుతూ నేడు ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్యవాదం – పెట్టుబడి దారీ విధానం సంక్షోభం లో చిక్కు కొని ఆ విధానం అనుసరిస్తున్న అమెరికా అనేక ఆర్థిక సమస్యలతో అంతరంగిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న కారణంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేక దేశాల పై ఆర్థిక సుంకాలు, ట్యాక్సీలు విధిస్తూ అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆంతరంగిక సమస్యలను ఎగదోసి, సరిహద్దు దేశాలతో సమస్యలను ఎగదోసి సామ్రాజ్య వాద, పెట్టుబడి దారీ దేశాలు యుద్ధ వాతావరణం కల్పించి యుద్దాలు చేస్తున్న
తీరు భారత దేశం – పాకిస్తాన్ సమస్య, ఉక్రెయిన్ – రష్యా యుద్ధం
ఇజ్రాయిల్ – పాలస్తీనా గాజా యుద్ధ సమస్య, నేడు ఇజ్రాయెల్ ఇరాన్ పై సాగిస్తున్న యుద్ధ దాడులు యావత్ సామ్రాజ్య వాద, పెట్టుబడి దారీ దేశాలు పేద, వర్తమాన అభివృద్ధి చెందుతున్న దేశాలలో దోపిడీ ని పెంచి పోషిస్తున్న తీరు అంతర్గత సమస్యలను పోషించి నేడు పతనం చెందుతున్న తీరు తో యుద్ధాలను ఎగదోయటం జరుగుతుంది అని ఆ క్రమంలోనే నేడు ప్రపంచంలో వివిధ దేశాల్లో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు దెబ్బ తింటున్న సామ్రాజ్యవాదం – పెట్టుబడి దారీ వ్యవస్థ ను తేటతెల్లం చేస్తుంది అని దీనికి ప్రత్యామ్నాయం సోషలిస్టు వ్యవస్తె తప్ప ఈ పెట్టుబడి దారీ, సామ్రాజ్య వాద వ్యవస్థ కాదని అందుకు అనుగుణంగా ప్రపంచ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి అని, ప్రజలు ప్రజా ఉద్యమాల ద్వారా ఈ దోపిడీ పెట్టుబడి దారీ వ్యవస్థ ను కూల్చాలని పిలుపు నిచ్చారు.దేశంలో బిజెపి గత పదకొండు సంవత్సరాల పాలనలో దేశాభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పని చేయకుండా విద్వేష రాజకీయాలను, మతోన్మాద రాజకీయాలను చేస్తున్న తీరు తో ప్రపంచం ముందు తలవంపుల పాలు కావడం జరుగుతుంది అని దీనికి వ్యతిరేకంగా పీడిత ప్రజా ఉద్యమాలను ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు.పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ యంసిపిఐ(యు) వ్యవస్థాపక నేత అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవాలలో బాగంగా జూన్ 20 నుంచి జిల్లా వ్యాప్తంగా పౌరహక్కుల పరిరక్షణ – ఓంకార్ పాత్ర అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశంలు నిర్వహించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలపై అనుసరిస్తున్న సాచివేత విధానాలకు వ్యతిరేకంగా గ్రామ, వార్డు స్తాయి లో ప్రజా ఉద్యమాలను నిర్మాణం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కన్నం వెంకన్న, వంగల రాగసుధ, కనకం సంధ్య తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పై కపట ప్రేమతో పుట్ట కొత్త కుట్ర.

కాంగ్రెస్ పై కపట ప్రేమతో పుట్ట కొత్త కుట్ర.

బానిసలు కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ తోనే ఈ స్థాయి.

ఉనికి కోసమే పుట్ట మధుకర్ కొత్త నాటకం, తాను అధికారంలో ఉన్నప్పుడు భార్యకు చైర్మన్ పదవి.

తన కొడుకు పబ్లిక్ సిటీ చెల్లలేదు, శీను బాబు పై అనుచిత వ్యాఖ్యలు.

మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పై విరుచుకుపడ్డ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోటి రాజబాబు.

మహాదేవపూర్ నేటి ధాత్రి:

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పై కపట ప్రేమ చూపెట్టి కొత్త కుట్రను తెరలిపి తందుకు పుట్ట మధుకర్ ప్రయత్నిస్తున్నాడని, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు తన ప్రకటనలో పేర్కొన్నారు. మంథని కేంద్రంగా పుట్ట మధుకర్ చేసిన కామెంట్లపై కోట రాజబాబు తీవ్రంగా ఖండిస్తూ పత్రిక ప్రకటన జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బానిసలు కాదని కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు గుర్తింపు విలువలు ఇస్తూ పదవులను ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాదరావు గారిదని, పుట్ట మధుకర్ గుర్తుంచుకోవాలని అన్నారు, మంథని నియోజకవర్గంలో పుట్ట మధుకర్ ప్రజల్లో ఉనికిని కోల్పోవడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పై కపట ప్రేమ చూపెడుతూ కొత్త నాటకానికి తీరలేపడం జరిగిందని అన్నారు. నాకు కాంగ్రెస్ పార్టీ 84 లోనే సమితి కోఆప్షన్ సభ్యుడిగా, జిల్లా కార్యవర్గ సభ్యునిగా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కాంగ్రెస్ పార్టీ మహదేవ్పూర్ నుండి రెండు మార్లు సర్పంచ్ గా అవకాశం కల్పించడం జరిగిందని అంతేకాకుండా కాలేశ్వరం దేవస్థానం చైర్మన్ పదవితో పాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా కూడా కాంగ్రెస్ పార్టీ తనకు అవకాశం ఇచ్చిందని, ఒకటి రెండు కాదు అనేక అత్యున్నత స్థానాలు కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ శ్రీపదరావు తో పాటు మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తనకు అందించడం జరిగిందని రాజబాబు అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగిందని అసత్యపు అర్థం లేని మాటలతో ఒక కొత్త నాటకాన్ని తెరలిపి ప్రయత్నం నియోజకవర్గ ప్రజల వద్ద చల్లదన్న విషయం పుట్ట మధుకర్ గుర్తుంచుకోవాలని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం గౌరవం ఇచ్చిందన్న విషయం పుట్ట మధుకర్ గుర్తుంచుకోవాలని, సాధారణ వ్యక్తిగా ఉన్న పుట్ట మధుకర్ కు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ జడ్పిటిసి స్థానాలు కల్పించిన విషయం మర్చిపోయి కార్యకర్తలను బానిసగా అభివర్ణించడం సిగ్గుచేటని అన్నారు. పుట్ట మధుకర్ ఎమ్మెల్యే పదవిలో ఉన్నప్పుడు వారి సతీమణి శైలజాకు మంథని మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పించడం జరిగిందని, కానీ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఇక్కడ న్యాయం చేశారు అని రాజబాబు ప్రశ్నించారు. అలాగే పుట్ట మధుకర్ కొడుకు నియోజకవర్గంలో తిరిగినప్పటికీ కూడా పుట్ట మధుకర్ కు ఎమ్మెల్యే ఎన్నికల్లో కొడుకు పబ్లిసిటీ లో ఫీల్ కావడం జరిగిందని, కోపంతో మంత్రి సోదరు శీను బాబు పై ఆరోపణలు చేస్తున్నాడని, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో శీను బాబు కు ప్రధాన కార్యదర్శి నియమించడం పార్టీ అంతర్గత విషయం అని కొడుకు పబ్లిసిటీ ఫెయిల్ అయితే సంవత్సరాల కాలంగా పెద్దపల్లి మంథని నియోజక వర్గాల్లో పార్టీ కోసం ఒక కార్యకర్తల పనిచేస్తున్న శీను బాబుకు గౌరవం దక్కిందన్న విషయం పుట్ట మధుకర్ జీర్ణించుకోలేకపోతున్నాడని కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయంపై మాట్లాడే నైతిక హక్కు పుట్ట మధుకర్ కు లేదన్న విషయం గుర్తుంచుకోవాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు తన ప్రకటనలో పేర్కొన్నారు.

కాకాణి అరెస్ట్ కూటమి కుట్ర !

కాకాణి అరెస్ట్ కూటమి కుట్ర !

తిరుపతి ఎంపి గురుమూర్తి

తిరుపతి(నేటి ధాత్రి)మే 26:

 

 

మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టు పూర్తిగా అక్రమమని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఖండించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం కుట్రలకు తెరలేపిందన్నా
రు,ఆ క్రమంలోనే కాకాణి గోవర్ధన్ రెడ్డి పై అక్రమ కేసులు నమోదు చేశారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి, తమ రాజకీయ ప్రయోజనాల కోసం రెడ్ బుక్” రాజ్యాంగాన్ని అమలు చేస్తోందన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే చర్యగా ఆయన అభివర్ణించారు. ప్రజల హక్కులను హరిస్తూ కూటమి ప్రభుత్వం సాగిస్తున్న దుర్మార్గ పాలన రాష్ట్రానికి పెనువిపత్తని తెలిపారు.
కూటమి అక్రమాలపై ప్రశ్నించే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల గొంతు నొక్కేందుకు అధికార దుర్వినియోగం ద్వారా ప్రభుత్వం అక్రమ కేసులను నమోదు చేస్తోందని, ఇది పూర్తిగా అప్రజాస్వామికమన్నారు. మాకు, మా పార్టీకి న్యాయవ్యవస్థపై గౌరవం ఉందని అన్నారు. న్యాయస్థానాలలోనే ఈ కుట్రలపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు.

కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర.

కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర

-చదువు అన్నారెడ్డి
మొగులపల్లి నేటి ధాత్రి

 

కాలేశ్వరం కమిషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పై కుట్రలకు తెరలేపిందని సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాడని దుయ్యబట్టారు. కాలేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణను కేసీఆర్ సస్యశ్యామలం చేశాడని, రైతుల సాగునీటి ఘోష తీర్చేందుకు భగీరథుడిలా కంకణం కట్టుకున్నారన్నారు. తెలంగాణను ధాన్యకారంగా మార్చిన ఘనత కేసీఆర్ దేనని కొనియాడారు. కేసీఆర్ తెలంగాణకు ఏం అన్యాయం చేశాడని నోటీసులు ఇస్తారని ప్రశ్నించారు. వీటిని ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష సాధింపు నోటీసులుగానే పరిగణిస్తామని తెలిపారు. విచారణ పేరుతో కేసీఆర్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తే..తెలంగాణ మరోసారి మర్ల పడుతుందని హెచ్చరించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా..ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ ను ఇబ్బందులు పెడితే..నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పై తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

ఆదివాసీల అంతం కోసమే కేంద్ర ప్రభుత్వం.!

ఆదివాసీల అంతం కోసమే కేంద్ర ప్రభుత్వ కుట్ర ఆపరేషన్ కగార్ ను నిలిపి వేయాలి.

తుడుందెబ్బ డిమాండ్.

కొత్తగూడ, నేటిధాత్రి:

ఆదివాసీ ల భూభాగం లోని అడవి బిడ్డల కాళ్ళ కింద ఉండబడిన వనరులను,విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచి పెట్టేందుకు,సిద్దపడి బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం ఆదివాసుల ఆవాస నివాస ప్రాంతం లోకి మిల్టరీ,సి ఆర్ పి యఫ్,కొబ్రా,బ్లాక్ కామోండో బాలగాలను దించి ఆదివాసీల స్వేచ్ఛకు భంగం వాటిల్లే విధంగా,ఇష్టా రాజ్యాంగ ఆదివాసీల పై ఉచ్చకోత కోస్తుందని, పౌర హక్కుల ను కాలరాస్తూ, అల్లకల్లోలం సృష్టిస్తూ ఆదివాసీలని అంతం చేయాలనే కుయుక్తులు పన్నుతుందని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ దమణ కాండను ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తీవ్రంగా ఖండిస్తుందని, ఆదివాసుల పై వనరుల దోపిడీ కోసం జరుగుతున్న దుచర్యలను యావత్ పౌర సమాజం ముక్తాఖంఠం తో వ్యతిరేకించి ఆపరేష్ కగార్ ను నిల్పివేసే వరకు తమ నిరసన ను తెలిపాలని కర్రే గుట్టలనుండి సాయుధ బలగాలను వెంటనే వెనుకకు రప్పించెందు కు హక్కుల సంఘాలు,బిజేపేతర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం పై పోరాటాలు చేయాలని ఈ రోజు కొత్తగూడ గ్రామ పంచాయితీ ఆవరణములో మండల అధ్యక్షులు ఈక విజయ్ అధ్యక్షతన జరిగిన కగార్ వ్యతిక సమావేశం లో జిల్లా అధ్యక్షలు కుంజ నర్సింగరావు డిమాండ్ చేశారు సమావేశం లో పూనెం సురేందర్,ఈక సాంబయ్య,సిద్దబోయిన లక్ష్మీ నారాయణ,బంగారు సారంగా పాణి,భూపతి రమేష్ లు పాల్గొన్నారు.

అఖండ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర :

అఖండ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర :

కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి కి నిరసనగా న్యాయవాదుల ర్యాలీకి మద్దతు.

కేంద్ర ప్రభుత్వం , సైన్యం తీసుకునే ఏ నిర్ణయానికైనా మనం అండగా ఉందాం.

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.

మహబూబ్ నగర్/నేటి ధాత్రి

 

 

అఖండ భారతదేశాన్ని విచ్చిన్నం చేయడానికి పాకిస్థాన్ ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో న్యాయవాదులు చేపట్టిన ర్యాలీ కి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భారతదేశంలో కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి సోదర భావంతో జీవిస్తున్నామని, పాకిస్థాన్ ఉగ్రవాదులు, భారతదేశంలో కులమతాల మధ్యన చిచ్చు పెట్టి దేశంలో అల్లర్లు సృష్టించేందుకు పన్నాగం పన్నారన్నారు. భారత ప్రభుత్వం, దేశ సైనికులు ఏ నిర్ణయం తీసుకున్నా దేశం మొత్తం రాజకీయాలకు అతీతంగా, పార్టీ భావ జాలాలకు అతీతంగా ఏకతాటి మీద ఉండి, అండగా ఉండాల్సిన సమయం అని ఆయన చెప్పారు. ఇప్పుడిప్పుడే కాశ్మీర్ లో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతూ కళకళలాడుతూ.. ఉందని, టూరిస్టులు పెరగడంతో కాశ్మీర్ ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని, అక్కడ వారి జీవన ప్రమాణాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయని, పాఠశాలలు కూడా అభివృద్ధి చేసుకుంటూ కులమతాలకు అతీతంగా వారు సంతోషంగా మంచి జీవనాన్ని సాగిస్తున్నారన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు పాక్ ఉగ్రవాదులు పన్నాగం పన్నారని ఆయన అన్నారు. ఈ దేశం నాది, ఈ దేశం మనది అనే భావన మనకందరికి ఉండాలని, ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టి.పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్.పి వెంకటేష్, గుండా మనోహర్, వీరబ్రహ్మచారి, రమాకాంత్ గౌడ్, మురళి కృష్ణ, లక్ష్మయ్య, కృష్ణయ్య, అనంతచారి, శ్రీపాదరావు, విక్రం గౌడ్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version