ఏరియా హాస్పిటల్ లో రెగ్యులర్ ఉద్యోగుల మౌన ప్రదర్శన…

ఏరియా హాస్పిటల్ లో రెగ్యులర్ ఉద్యోగుల మౌన ప్రదర్శన

పరకాల నేటిధాత్రి

శుక్రవారంనాడు టివివిపి ఉద్యోగులు పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు ట్రెజరరీ ద్వారా గీట్రెజరరీ ద్వారా జీతాలు ఇవ్వాలని ప్లకార్డులతో మౌన ప్రదర్శన చేపట్టారు.ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ ప్రతి నెల ఎప్పుడూ జీతం పడుతుందో తెలియని పరిస్తితి ఉందని,ఈ నెల ఇంకా జీతం రాలేదని దసరా పండుగ రోజు కూడా డబ్బులు లేక ఉపవాసం ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం స్పందించి తమకు జీతాలు వేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ ప్రదర్శన లో డాక్టర్ బాలకృష్ణ,డాక్టర్ మౌనిక,నర్సెస్,పారామెడికల్,నాల్గవ తరగతి సిబ్బంది పాల్గొన్నారు.

ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా దొమ్మటి శ్రీను రక్తదానం..

ఎమ్మెల్యే జన్మదిన సందర్బంగా రక్తదానం చేసిన దొమ్మటి శ్రీను

పరకాల నేటిధాత్రి
పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి జన్మదిన సందర్బంగా పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరంలో మల్లక్కపేట గ్రామానికి చెందిన దొమ్మటి శ్రీనివాస్ తనవంతుగా రక్తదానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ దావాఖానా సూపరిండెంట్ గౌతమ్ చౌహన్, ఆర్ఎంఓ బాలకృష్ణ,గ్రామ అధ్యక్షులు మామూనూరి రాజు,మాజీ సర్పంచ్ అల్లం రఘు నారాయణ,దొమ్మటి మల్లయ్య,బయ్యా మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

చిన్నారుల ఆరోగ్యం.. నులిపురుగుల నివారణ తప్పనిసరి: మాక్సుద్

చిన్నారుల ఆరోగ్యం.. నులిపురుగుల నివారణ తప్పనిసరి: మాక్సుద్

జహీరాబాద్ నేటి ధాత్రి:

మొగుడంపల్లి మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహమ్మద్ మాక్సుద్ మాట్లాడుతూ, చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడాలంటే నులిపురుగులను నివారించడం తప్పనిసరి అని, ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం వీటిని ఉచితంగా పంపిణీ చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి సింఫోనియా, వైస్ ప్రిన్సిపల్, వైద్య సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

వైద్య సిబ్బందికి ఘన సన్మానం.

వైద్య సిబ్బందికి ఘన సన్మానం

రామడుగు, నేటిధాత్రి:

 

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం భారత రాష్ట్ర సమితి యూత్ రామడుగు మండల ఉపాధ్యక్షులు బుదారపు కార్తీక్ ఆధ్వర్యంలో గోపాలరావుపేట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య రంగ నిపుణులకు ఘన సన్మానం చేయడం జరిగింది. ఈసందర్భంగా బుదారపు కార్తీక్ మాట్లాడుతూ ప్రజలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, క్రమం తప్పకుండా వ్యాయామ వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుద్ధత పాటించాలని డాక్టర్ల సూచనలేని అనవసరమైన మందులను ఎట్టి పరిస్థితుల్లో వాడ రాదని తమ ఆరోగ్యాల పట్ల ఎవరికి వారు శ్రద్ధ వహించాలని కోరారు. ఈసందర్భంగా ప్రజల కోసం నిరంతరం పాటుపడుతున్న వైద్య సిబ్బందిని సన్మానిస్తూ అభినందనలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో వైద్యాధికారి వెంకట గ్రీష్మన్య, వెంకటేశ్వర్లు, కొలిపాక కమలాకర్, స్వామి, పురాణం రమేష్, తిరుపతి, నరేందర్, శ్రీధర్, కొమురయ్య, శివశంకర్, నాగరాజు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version