తాలూకా వీరశైవ లింగాయత్ అధ్యక్షులుగా ఆగూర్ శివరాజ్…

తాలూకా వీరశైవ లింగాయత్ అధ్యక్షులుగా ఆగూర్ శివరాజ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్,నియోజకవర్గం వీర శైవ లింగాయత్ సమాజ్ అధ్యక్షులుగా ఆగూర్ శివరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక బసవేశ్వర ఫంక్షన్ హాల్ లో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలు జిల్లా వీరశైవ లింగాయత్ సమాజ్ అధ్యక్ష కార్యవర్గం, జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు అరుణా కౌలాస్, కార్యదర్శి పద్మజ, స్థానిక లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో జరిగాయి. ఇందులో జిల్లా నుండి అధ్యక్షులు ఇప్పేపల్లి నరసింహు లు, ప్రధాన కార్యదర్శి కొంక రాజేశ్వర్, కోశాధి కారి పోలీస్ సంతోష్ పటేల్, యువజన ప్రధాన కార్యదర్శి రామోజీ నవీన్, స్థానిక లింగాయత్ సమాజ్ అధ్యక్షులు రాజశేఖర్ శెట్కర్, ప్రధాన కార్యదర్శి ఆర్ సుభాష్ సమక్షంలో జరిగిన ఎన్నికలలో జహీరాబాద్ నియోజకవర్గం మండలాల వారీగా కూడా ఎన్నికలు నిర్వహించారు. ఇందులో భాగంగా జహీరాబాద్ నియోజకవర్గ వీరశైవ లింగాయత్ సమాజ్ అధ్యక్షులుగా ఆగూర్ శివరాజ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే కోహీర్ మండలం నుండి బిల్లాపాటి విజయకుమార్, మండల అధ్యక్షునిగా ఎన్నుకోగా మొగడంపల్లి మండల అధ్యక్షులుగా ఎం రా%శీ% శెట్టి, ప్రధాన కార్యదర్శిగా ఎల్ విజయ్ కుమార్ ఝరా సంగం మండల అధ్యక్షునిగా పట్లోళ్ల రవి పటేల్, ప్రధాన కార్యదర్శిగా పొట్లోళ్ల పరమేశ్వర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మిగిలిన కార్యవర్గానికి అధ్యక్షులు త్వరలో ప్రకటిస్తారని సమావేశం ప్రకటించింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఆగూర్ శివరాజ్ మాట్లాడుతూ తనమీద ఉన్న నమ్మకంతో జిల్లా, స్థానిక అధ్యక్ష కార్యవర్గానికి, మండల సభ్యులందరికీ తన ధన్యవాదాలు తెలిపారు.

స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనపై తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం

“నేటిధాత్రి”, హైదరాబాద్‌:
స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లలు నిబంధనపై తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు పిల్లల నిబంధన తొలగించాలని మంత్రి వర్గం నిర్ణయించింది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. కేబినెట్‌ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వివరించారు. పలు రంగాలకు భూ కేటాయింపులు జరిపేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు బోనస్‌ కూడా ఇస్తామన్నారు.

‘‘రాష్ట్రంలో కొత్తగా 3 వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. నల్సార్‌లో స్థానిక విద్యార్థులకు 50శాతం సీట్లు ఇవ్వాలని కేబినెట్‌ తీర్మానించింది. నల్సార్‌ వర్సిటీకి గతంలో ఇచ్చిన దానికంటే అదనంగా 7 ఎకరాలు ఇస్తాం. రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని నిర్ణయించాం. కేంద్రం కొనుగోలు చేసినా.. చేయకపోయినా మా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ప్రజాపాలనకు రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తాం. దీనికి సంబంధించి కేబినెట్‌ సబ్‌ కమిటీ వేశాం. హైదరాబాద్‌ మెట్రోకు సంబంధించి కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించాం. మెట్రో రెండో దశను క్షుణ్ణంగా పరిశీలించేందుకు సీఎస్‌ ఛైర్మన్‌గా కమిటీ ఏర్పాటు’’ అని మంత్రి పొంగులేటి తెలిపారు

గుట్టుగా గుట్కా తయారీ.. “ఫ్యాక్టరీ సీజ్​”చేసిన పోలీసులు

“నేటిధాత్రి”..”బిగ్ ఎఫెక్ట్

“నేటిధాత్రి” వరుస కథనాలతో, స్పందించిన పోలీస్ కమిషనర్ “సాయి చైతన్య”

“గుట్కా కింగ్ హీరోలాల్ ఎవరు!?..అనే “నేటిధాత్రి” కథనానికి స్పందించిన నిజామాబాద్ “పోలీస్ అధికారులు”.

గుట్కా స్థావరాలపై పోలీసులు మెరుపు దాడి

“నేటిధాత్రి”నిజామాబాద్ జిల్లా ప్రతినిధి,:

“నేటిధాత్రి”లోవార్త వచ్చిన నేపథ్యంలో, నిజామాబాద్ పోలీస్ “కమిషనర్ సాయి చైతన్య”, ఆధ్వర్యంలో స్పెషల్ టీం, గుట్కా సప్లై కేంద్రాలను గుర్తించి, వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

నిజామాబాద్​ నగర శివారులో కొందరు అక్రమంగా గుట్కా తయారు చేస్తున్నారు.విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు సదరు ఫ్యాక్టరీపై దాడులు చేశారు.నగర శివారులో అక్రమంగా తయారు చేస్తున్న గుట్కాను “సీసీఎస్​ పోలీసులు” పట్టుకున్నారు. జన్నెపల్లి రోడ్డు గల ఓ ఫ్యాక్టరీలో సీసీఎస్​ ఏసీపీ “నాగేంద్ర చారి” ఆధ్వర్యంలో పోలీసులు సోదాలు చేశారు.
అక్కడ గుట్కా తయారు చేస్తున్నట్లు గుర్తించారు. గుట్కా తయారీకి సంబంధించిన సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. అసాన్​, అమీర్ అనే నిందితు​లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. సదరు ఫ్యాక్టరీలో పాన్​ మసాలా ముసుగులో గుట్కా తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అటు లుకలుకలు..ఇటు చిటపటలు!

`మహాఘట్‌ బంధన్‌లో కుంపట్లు.

`బిహార్‌లో నిగ్గు లేతకపోతున్న సర్ధుబాట్లు!

`ఎన్డీయే కూటమి సీట్ల ప్రకటన దాదాపు ఖరారైంది.

`ఇండియా కూటమిలోనే లుకలుకలు కొనసాగుతున్నాయి. 

`కాంగ్రెస్‌ గతంలో 71 సీట్లు పోటీ చేసింది.

`17 సీట్లు మాత్రమే గెల్చుకున్నది.

`ఈసారి 75 సీట్లు కావాలని కాంగ్రెస్‌ మెలిక పెట్టింది.

`అవసరమైతే ఒంటరిగా పోటీ చేస్తామని తేజస్వీ ప్రకటించారు.

`ఇండియా కూటమిలో కలకలం రేగింది.

`లాలూ కుటుంబం మీద కేసులు తెరమీదకు వచ్చాయి.

`ఆర్జేడీ దారికొచ్చింది..కూటమి బంధం గుర్తుకొచ్చింది.

`కాంగ్రెస్‌కు 60 సీట్లిస్తామంటోంది.

`ఆర్జేడీ 135 సీట్లలో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

`మిగతా సీట్లు కమ్యూనిస్టులకు కేటాయించే అవకాశం వుంది.

`తాజాగా ప్రశాంత్‌ కిషోర్‌ పార్టీ పోటీ చేయడం లేదని ప్రకటించారు.

`రాజకీయం ఎటు మారుతుందనేది సస్పెన్స్‌గా మారింది.

`ఓడిపోయి పరువు పోగొట్టుకోవడం పికేకు ఇష్టం లేదు.

`రసవత్తరంగా మారనున్న బిహార్‌ పోరు.

 

హైదరాబాద్‌, నేటిధాత్రి: 

 బిహార్‌ రాష్ట్రంలో ఎన్నికల పొత్తులు ఎంత వరకు వచ్చాయని ప్రశ్నిస్తే సరైన సమాదానం ఎవరి వద్దా లేదు. ముఖ్యంగా ఇండియా కూటమిలో పొత్తులు పొడిచినా, సీట్ల సర్ధుబాటులో లుకలుకలు, చిటపటలు కనిపిస్తున్నాయి. ఓ వైపు బిజేపి, జేడీయూల పొత్తులు, సీట్ల పంపకాలు జరిగిపోయాయి. నామినేషన్లు కూడా వేస్తున్నారు. కాని ఇండియా కూటమిలో మాత్రం కుంపట్లు రేగుతున్నాయి. సీట్ల సర్ధుబాట్లు ఓ కొలిక్కి రాలేకపోతున్నాయి. యూపిఏ హాయాంలో ప్రతిపక్షం ఎప్పటిప్పుడు ఎంతో బలంగా వుంటూ వుండేది. కాని ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార బిజేపి వేసే ఎత్తులకు ప్రతిపక్షాలు చిక్కుల్లో పడుతున్నాయి. సహజంగా ప్రతిపక్షాలు వేసే ఉచ్చులోఅదికార పార్టీ పడుతుంటాయి. ఓడిపోతుంటాయి. కాని ఇక్కడ గత పన్నెండు సంవత్సరాల కాలంగా ప్రతిసారి ప్రతిపక్షాలు పదే పదే బోల్తాపడుతున్నాయి. అయినా వాటి నుంచి తేరుకోవాలని ప్రతిపక్షాలు అనుకోవడం లేదు. ఐక్యత ప్రదర్శించడం లేదు. కలిసి సాగుదామన్న భరోసా వాటిలో కనిపించడం లేదు. ఎప్పటికప్పుడు లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ఇండియా కూటమి ఐక్యతకు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఇండియూ కూటమి పార్టీలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఆ పార్టీల కోసం కూడా పొత్తు ధర్మంలో అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఆ పార్టీలకు అండగా నిలుస్తున్నారు. రాష్ట్రాలలో ఆ పార్టీలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. అయినా ఆ పార్టీలు రాహుల్‌ గాంధీని నమ్మడం లేదు. అందుకే ఎప్పటికప్పుడు ఇండియా కూటమిలో లుకలుకలు వెగులోకి వస్తునే వున్నాయి. సమస్యలు పొడసూపుతూనే వున్నాయి. ఐక్యతకు బీటలు వారుతూనే వున్నాయి. అయినా ఎంత దిగినా ఫరావాలేదు. బిజేపిని ఓడిరచాలన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనాయకుడు, రాహుల్‌ గాంధీ చేస్తున్న కష్టం, కూటమి పార్టీలు బూడిదలో పోసిన పన్నీరు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు లుకలుకలు తెరమీదకు తెస్తూనేవున్నారు. రాహుల్‌ గాంధీ మూలంగానే ఇండియా కూటమికి మరింత బలం ఏర్పడిరది. ప్రాంతీయ పార్టీల బలం పెరుగుతూ వస్తోంది. అయినా ఎన్నికల సమయంలో రాహుల్‌ గాంధీకి హాండ్‌ ఇవ్వడం అలవాటు చేసుకుంటున్నారు. ఇది బిహార్‌లోనూ జరుగుతుందా? అన్న అనుమానం ఏర్పడుతోంది. ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటన చేసింది. నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. కాని బిహార్‌లోని ఇండియా కూటమిలో సీట్ల సర్ధుబాటు పూర్తి కాలేదు. ఏ నియోజకవర్గంలో కాంగ్రెస్‌, ఆర్జేడీ పోటీ చేస్తాయన్నది తేలలేదు. ఇంకా సీట్ల నెంబర్లే తేల్చుకోలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ 75 సీట్లకు పోటీ చేసింది. కాని కేవలం 17 సీట్లు మాత్రమే గెలిచింది. ఇప్పుడు కూడా అదే నెంబర్‌ కావాలని కోరుతోంది. కాని ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌ ససేమిరా అంటున్నారు. ఈ విషయంలో ఆ మధ్య తేడాలొస్తే పూర్తి స్దానాలలో పోటీ చేసేందుకు తాము సిద్దమంటూ కూడా తేజస్వీ యాదవ్‌ అన్నారు. అయితే ఇక్కడ రాహుల్‌ గాందీ ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. దేశంలోని రాష్ట్రాలలో వున్న ప్రాంతీయ ప్రతిపక్షాలన బలోపేతం చేయడం తన భుజాల మీద వేసుకుంటున్నాడు. నిజానికి ఆ పని రాహుల్‌ గాందీ చేయకూడదు. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. కాంగ్రెస్‌ను మరింత ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేయాలి. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో రాహుల్‌ గాందీ ఎన్ని సార్లు ఎన్నికల ప్రచారానికి వచ్చారు? అదే బిహార్‌లో ఎన్నికల ప్రచారానికి ఎన్నిసార్లు వెళ్లారనేది లెక్కతీస్తే అసలు విషయం అర్దమౌతుంది. అదే కర్నాకటలో కూడా అంతే. సొంత పార్టీ బలంగా వున్న రాష్ట్రాలలో పార్టీని అదికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. బలంగా లేని రాష్ట్రాలలో సొంత పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలి. కాని ఆయన ప్రతిపక్షాల ఐక్యత కోసం పాటు పడుతున్నారు. ప్రతిపక్షాలను బలోపేతం చేసే పనిని ఎంచుకున్నారు. ఇది కూడా కాంగ్రెస్‌ పార్టీ తన బలహీనతను తెలియజేస్తున్నట్లే కనిపిస్తోంది. ఇన్ని సార్లు కాంగ్రెస్‌కు అవమానాలు ఎదురౌతున్నా కాంగ్రెస్‌లో మార్పు కనిపిండచం లేదు. దేశమంతా రాహుల్‌ గాందీ వెంట నడుస్తోంది. ఆయన మాత్రం ప్రతిఫక్షాల వెంట నడుస్తున్నారన్న అభిప్రాయం వక్తమౌతోంది. ఇండియా కూటమిలోనే ఇన్ని లుకలుకలు అని అనుకుంటే కాంగ్రెస్‌ గతంలో ఎప్పుడూ లేనంతగా ఓటమి పాలు కావడం. 2014లో కనీసం 40 సీట్లు గెలవలేకపోవడం. దేశాన్ని అత్యధిక సార్లు పాలించిన, కాంగ్రెస్‌ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోకపోవడం అనేది ఆ పార్టీకి మైనస్‌గా మారింది. మూడోసారి 2024లో 100 సీట్లు సాదించి ప్రతిపక్ష హోదా సాదించుకున్నది. అయినా ఆ పార్టీని ఇతర ప్రాంతీయ పార్టీలు లెక్క చేయడం లేదు. కనీసం వారి పార్టీల కోసం కాంగ్రెస్‌ను ఆసరా చేసుకొని గెలుద్దామన్న భావన వారిలోనూ లేదు. సమయం వస్తే కాంగ్రెస్‌ను దూరం పెట్టెందుకు సైతం ప్రాంతీయ పార్టీలు ఆలోచించడం లేదు. ఆ మధ్య జరిగిన డిల్లీ, పంజాబ్‌, హార్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ప్రాంతీయ పార్టీలు ఇదే అనుసరించాయి. కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాయి. ముఖ్యంగా హర్యానాలో కాంగ్రెస్‌పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే పరిస్దితి మరో రకంగా వుండేదన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమైంది. ముందు కలిసి సాగాలని అనుకున్నారు. ఎన్నికల సమయం దాకా కలిసి ప్రచారం చేసుకున్నారు. కాని తీరా ఎన్నికల వేల పొత్తులు కుదరక విడిపోయారు. దాంతో కాంగ్రెస్‌ను చిక్కుల్లోకి నెట్టేశారు? ఫలితంగా హార్యానాలో కూడా ముచ్చటగా మూడోసారి బిజేపి కూటమి విజయం సాదించింది. మహరాష్ట్రలోనూ అదే జరిగింది. కాంగ్రెస్‌పార్టీ ఏ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటుందనేది కూడా ఎంతో ముఖ్యం. తాత్కాలిక పొత్తులు ఎప్పుడూ పుట్టి ముంచేస్తాయని కాంగ్రెస్‌ తెలుసుకోవాలి. నిజం చెప్పాలంటే మహారాష్ట్రలో కాంగ్రెస్‌ పార్టీ ఒంటరి పోరు చేస్తే అనేక సీట్లు గెలిచే అవకాశం వుండేది. కాని స్దానిక రాజకీయాలకు తనను తానే బలి చేసుకుంటోంది. పొత్తు ధర్మంతో తనను తాను తగ్గించుకుంటోంది. ఇది కాంగ్రెస్‌కుతీరని అన్యాయమైపోతోంది. ఇప్పుడు బిహార్‌లోనూ అదే జరుగుతోంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌ ఇచ్చే సీట్ల మీద ఆదారపడడం అనేది కాంగ్రెస్‌కు ఆశని పాతంగా మారనున్నది. ఓట్‌ చోరీ అనే అంశాన్ని పెద్దఎత్తున ప్రజల్లోకి తీసుకొచ్చి, ఎన్నికల సంఘం మీద రాహుల్‌ గాందీ యుద్దం చేస్తున్నారు. ప్రజలను చైతన్యం చేయడం కోసం పాదయాత్రలు చేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలకు జవసత్వాలు కల్పిస్తున్నారు. ఫలితంగా ఆ పార్టీలకు ఊపిరిపోస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఓటమి పాలైన ఆర్జేడీ ఈసారి గెలిచేందుకు రాహుల్‌ గాంధీ రూపంలో ఆపార్టీకి ఎంతో బలం వచ్చింది. అయినా సరే కాంగ్రెస్‌ అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు ఆర్జేడీ ససేమిరా అంటోంది. ఇదిలా వుంటే బిహార్‌లో రాజకీయపార్టీని పెట్టి, ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ప్రకటించారు. కారణం ఆయన పార్టీకి ప్రజల నుంచి స్పందన రావడం లేదని స్పష్టమైంది. ఒక వేళ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవకపోయినా, తాను ఓడిపోయినా తనకు తీరని నష్టమని తెలుసుకున్నారు. పార్టీ పోటీ చేయడం లేదని ప్రకటించారు. కాని తాను ఇండియా కూటమికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించలేదు. ఇప్పుడు ప్రశాంత్‌ కిషోర్‌ మాద్దతు ఎవరికి అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇలా ఇండియా కూమిటికి సరిగ్గా ఎన్నికల సమయంలో పడుతున్న దెబ్బలు కోలుకోకుండా చేస్తున్నాయి. అయితే బిహార్‌ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే మాత్రం కాంగ్రెస్‌కు ఒక రకంగా సంజీవని అవుతుందని చెప్పడంలో మాత్రం సందేహం లేదు. కాంగ్రెస్‌కు మంచి రోజులు రానున్నాయనే వాటికి సంకేతాలు అని చెప్పక తప్పదు.

చంద్రుగొండ ఆటో యూనియన్ అధ్యక్షుడిగా పొదిల సురేష్

చంద్రుగొండ ఆటో యూనియన్ అధ్యక్షులుగా పొదిల సురేష్

#నెక్కొండ, నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

నెక్కొండ మండల కేంద్రంలోని చంద్రుగొండ, బంజరపల్లి, మూడు తండా, గొల్లపల్లి, వాగ్య నాయక్ తండ, లకు సంబంధించి ఆటో యూనియన్ ఏర్పరచుకొని 30 సంవత్సరాలుగా అవుతున్న తరుణంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి జరిగే ఆటో యూనియన్ ఎన్నికలను నెక్కొండ నవత ఆటో యూనియన్ అధ్యక్షుడు మోడం సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్నికలలో చంద్రుగొండ ఆటో యూనియన్ అధ్యక్షుడిగా పొదిల సురేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోగా ఉపాధ్యక్షుడిగా మహమ్మద్ రఫీ ని, కార్యదర్శిగా చిలువేరు కొమ్మాలను, కోశాధికారి జితేందర్ , కమిటీ మెంబర్ గా కాజా పాషను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చంద్రుగొండ బంజరుపల్లి ఆటో యూనియన్ నూతన అధ్యక్షుడు పొదిల సురేష్ తెలిపారు. అనంతరం సురేష్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల అభ్యున్నతి కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా నెక్కొండ నవత యూనియన్ అధ్యక్షుడు మోడెం సురేష్ చంద్రుగొండ బంజరుపల్లి ఆటో యూనియన్ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు.

టీఆర్పీ పార్టీ లో ప్రజా సేన పార్టీ విలనం.

టీఆర్పీ పార్టీ లో ప్రజా సేన పార్టీ విలనం.

◆:- కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

టీఆర్పీ పార్టీ లో ప్రజా సేన పార్టీ విలీన కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్ హైదరాబాద్ లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రజా సేన పార్టీ అధ్యక్షులు ఆవుల హన్మన్లు టీఆర్పీ పార్టీ లో విలీనం చేయడం జరిగింది.ఈ సందర్భంగా, ప్రజా సేన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్పీ పార్టీ లో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్పీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజా సేన పార్టీ నాయకులు, మహిళలు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ వాణిశ్రీ…

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ వాణిశ్రీ

ముత్తారం :- నేటి ధాత్రి

 

ముత్తారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రo ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ సందర్శించడం జరిగింది దీనిలో భాగంగా వైద్య సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగినది. సిబ్బంది ఇప్పుడు హైపటైటిస్ వైరస్ నుండి ఇబ్బంది కలగకుండా ఉండడానికి హెపటైటిస్ బి వ్యాక్సిన్ మేడం ఇనాగ్రేషన్ చేసి ఇవ్వడం జరిగినది మరియు హాస్పటల్ సిబ్బందికి మరియు సిబ్బందికి రివ్యూ మీటింగ్ తీసుకోవడంతో పాటు పలు సూచనలు చేయడం జరిగినది. రివ్యూ లో భాగంగా ముఖ్యంగా టీవీ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏఎంసీ రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ డెలివరీ మీద పలు సూచనలు సలహాలు సూచించారు అందరు సక్రమంగా విధులు నిర్వహించాలని తెలిపినారు ఇన్ పేషెంట్స్ ఓపి ఎంత వస్తుంది అని చూడడంతో పాటు ఇన్ పేషెంట్స్ ఆల్ రిజిస్టర్స్ ను వెరిఫికేషన్ చేశారు ఈ కార్యక్రమం లో జిల్లా టీవీ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ సార్ జిల్లా ఇమినేషన్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ కుమార్ మరియు హాస్పటల్ సిబ్బంది  పాల్గొన్నారు

తంగళ్ళపల్లిలో గర్భిణీ స్త్రీలకు పోషక ఆహార అవగాహన

పోషక ఆహారాలపై గర్భిణీ స్త్రీలకు అవగాహన కార్యక్రమం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

Vaibhavalaxmi Shopping Mall

తంగళ్ళపల్లి మండలంలో. పోషణ మాసం కార్యక్రమం పురస్కరించుకొని. సరైన పోషణ ఆహారంతో. ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా. తీర్చిదిద్దాలని నినాదంతో.C.D.P.O. ఉమారాణి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు. బాలింతలకు 0….6. పిల్ల తల్లులకు. పోషణ ఆహారంపై. అవగాహన చేస్తూ. ఉమారాణి మాట్లాడుతూ ఆరోగ్యం మనది కొనుక్కునేది కాదు అని. సంపాదించుకునేదని. ఆరోగ్యం అనేది అన్ని రకాల పోషకాలతో కూడిన ఆహారమని. పోషకరమైన ఆహారాలు తీసుకున్నప్పుడు. ఆరోగ్యం బాగుంటుందని. అంగన్వాడి కేంద్రం నుంచి వచ్చే. ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని. అలాగే ఫ్రీ స్కూల్ లోకి అంగన్వాడి కేంద్రాలకు పిల్లలను పంపించాలని. ఆట పాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యను. అందిస్తారని. వీటిని ప్రతి ఒక్కరు నిర్వహించుకోవాలని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో.C.D.P.O. ఉమారాణి. సూపర్వైజర్ అంజలి. అంగన్వాడీ టీచర్స్.B. సత్యవతి. P. శోభ.R. లతా. G. పుష్పలత.N. పద్మ.S. శారదా. గర్భిణీలు స్త్రీలు బాలింతలు.పిల్లలు తదితరులు పాల్గొన్నారు

నాణ్యత ప్రమాణాలతో పనులను త్వరగా పూర్తి చేయాలి…

నాణ్యత ప్రమాణాలతో పనులను త్వరగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

విద్య వ్యవస్థ అభివృద్ధి చర్యలలో భాగంగా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం జిల్లాలోని చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేపట్టిన అదనపు గదుల నిర్మాణ పనులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి మోహన్ తో కలిసి పరిశీలించారు.పనుల నిర్వహణలో శ్రేష్టమైన సిమెంట్,ఇసుకను వినియోగించాలని,పనులలో నాణ్యత పాటించాలని తెలిపారు.తెలంగాణ సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల,సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించి కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని చెన్నూర్ మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ,మండల పరిషత్ అభివృద్ధి అధికారి మోహన్ లతో కలిసి పరిశీలించారు.అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని,ఇందులో భాగంగా పాఠశాలలో చేపట్టిన విద్యుత్ వ్యవస్థ,మూత్రశాలలు, భోజనశాల ఇతర అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ప్రజలకు త్రాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం అమృత్ 2.0 పథకం ద్వారా నీటి ట్యాంకులు నిర్మించి త్రాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటుందని,ఈ నేపథ్యంలో పనులను త్వరగా పూర్తిచేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.చెన్నూరు పట్టణంలోని భవిత కేంద్రాన్ని సందర్శించి ప్రత్యేక అవసరాలు గల పిల్లల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.స్థానిక ప్రజలకు వేగవంతమైన,మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని,అధికారులు పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ త్వరగా పూర్తి చేసే విధంగా గుత్తేదారు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు

42% రిజర్వేషన్ల కోసం బీసీ బంద్‌కు సగర సంఘం మద్దతు

బిసి బంద్ కు సగర సంఘం మద్దతు

42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలకు పోతే సహించేది లేదు

సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ సగర

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

Vaibhavalaxmi Shopping Mall

తెలంగాణ రాష్ట్రంలో బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18 వ తేదీన తెలంగాణ బిసి జేఏసీ ఇచ్చిన బంద్ కు తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ స్పష్టం చేసింది. గురువారం గచ్చిబౌలి లోని సగర సంఘం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర నాయకులు మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఈ బంద్ ద్వారా బిసి ల చైతన్యం ప్రదర్శించాలని పిలునిచ్చారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే సహించేది లేదని అన్నారు. రాజ్యాంగ సవరణ చేసి చట్ట పరంగా నే రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ, విద్య, ఉద్యోగాలలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సగరులు బంద్ లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సగర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మోడల ఆంజనేయులు సగర, చిలుక శ్రీనివాస్ సగర, దిండి శేఖర్ సగర, సంయుక్త కార్యదర్శి సంగిశెట్టి గంగాధర్ సగర, కార్యనిర్వాక కార్యదర్శి బంగారి ఆంజనేయులు సగర, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మోడల ఆంజనేయులు సగర, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మోడల రవి సగర, సగర సంఘం నాయకులు కేపీ వెంకటేష్ సగర, ఖాజా సగర, రాజు సగర, కృష్ణ సగర తదితరులు పాల్గొన్నారు.

మైసూర్ లో వెస్టీజ్ కంపెనీ మైండ్ సెట్ శిక్షణ ఏర్పాటు…

మైసూర్ లో వెస్టీజ్ కంపెనీ మైండ్ సెట్ శిక్షణ ఏర్పాటు

విజయవంతం చేసిన మంచిర్యాల టీం

హైదరాబాద్,నేటి ధాత్రి:

 

 

మైసూర్ లో వెస్టీజ్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీ మైండ్ సెట్ శిక్షణ క్లాసులు మంగళవారం,బుధవారం రెండు రోజులుగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి వి.ఎం.సి.ఎం సుబ్బయ్య శెట్టి ముఖ్య అతిథిగా పాల్గొని వి.ఎం.సి.ఎం ఎం.ఎస్.ఆర్ తో కలసి మైండ్ సెట్ శిక్షణ క్లాసులు 300 మందికి పైగా మైసూర్ ప్రెసిడెంట్ హోటల్ లో ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వి.ఎం.సి.ఎం సుబ్బయ్య శెట్టి మాట్లాడుతూ.. మైండ్ సెట్ క్లాస్ అంటే ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించడానికి మనస్తత్వాన్ని ఎలా మార్చుకోవాలి అనే దానిపై శిక్షణ,విధివిధానాలు తెలిపారు.సుబ్బయ్య శెట్టి మాటలు విన్న చాలా మంది నిరు పేదలు వారి మైండ్ సెట్ మార్చుకొని వెస్టీజ్ కంపెనీలో నిలబడి పనిచేస్తూ వాళ్ళ జీవితాలను మార్చుకొని గొప్పగా జీవిస్తూ వారి ఆశయాలను సాధిస్తున్నారని అన్నారు.

మన జీవనశైలి విధానంలో మార్పు రావాలి

ప్రతి ఒక్క వ్యక్తి తన జీవన విధానంలో అనేక మార్పులు చోటు చేసుకున్న వారి ఆర్థిక ఇబ్బందులను,సమస్యలను నిలుదొక్కుకొని వేస్టేజ్ సిస్టం ను ఫాలో అవ్వడం వల్ల వారి లక్ష్యాన్ని చేరుకుంటారని అన్నారు.

ప్రతి పనిలో పట్టుదలతో పనిచేయాలి

మానవ జీవన విధానంలో ఏ పని చేసిన పట్టుదలతో,ఒక సంకల్పం లాగా పని చేసినప్పుడే విజయాలు చేకూర్తాయని అన్నారు.అలాగే నీతి,నిజాయితీ,ఏకాగ్రత,నిబంధనతో పనిచేస్తూ తోటి వారికి సహాయం చేస్తూ ప్రేమగా,ఆప్యాయంగా ఉంటూ విజయాలను సాధించాలని తెలిపారు.

పదివేల అప్పుకు.. ఓ నిండు ప్రాణం బలి..

పదివేల అప్పుకు.. ఓ నిండు ప్రాణం బలి..

#మరొకరి పరిస్థితి విషమం.

#సొంత అన్న వదినపై దాడికి పాల్పడిన మరిది.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

పదివేల అప్పు కోసం అన్న వదినలపై మరిది దాడికి పాల్పడి వదిన ప్రాణాలు కోల్పోగా అన్న ప్రాణాలతో కొట్టు మి ట్టాడుతున్న సంఘటన గురువారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కొండాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన మేరగుర్తి మల్లయ్య-సమ్మక్క దంపతులకు రమేష్, సురేష్ ఇద్దరు కుమారులు ఉండగా పెద్ద కొడుకు రమేష్ కు పెళ్లి కాగా ఇద్దరు పిల్లలు జన్మించారు తర్వాత 8 సంవత్సరాల క్రితం రమేష్ భార్య చనిపోగా. మరల గీసుకొండ మండలం మచ్చ పురం గ్రామానికి చెందిన స్వరూప (35) తో గ్రామంలోనే సహజీవనం చేస్తున్నాడు. స్వరూప భర్త చనిపోయాడని ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. వీరిద్దరు కలిసి గత పది ఏళ్ల కిందట బతుకుదెరువు కోసం కొండాపురం గ్రామానికి వలస వెళ్లి జీవనం కొనసాగిస్తున్నారు. అదే క్రమంలో రమేష్ తల్లిదండ్రులు, తమ్ముడు సురేష్ ఆ గ్రామంలోని ఉంటూ బ్రెడ్డు అమ్ముకుంటూ బతుకుతున్నారు. నాలుగు నెలల కిందట అన్న రమేష్ కు సురేష్ 10 వేలు అప్పుగా ఇచ్చాడు.

అప్పు తీర్చమని అడిగితే ఇవ్వడం లేదంటూ పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ సైతం ఇటీవల నిర్వహించినట్లు తెలుస్తుంది. తన బంధువులు చనిపోవడంతో రమేష్ అతని భార్య చావుకు వెళ్లి బుధవారం రాత్రి ఇంటికి చేరుకున్నారు. స్నానం చేసే క్రమంలో వేడి నీళ్లు ఎందుకు పెట్టలేదని తల్లితో రమేష్ గొడవ పెట్టుకోగా ఈ క్రమంలో మద్యం మత్తులో ఇంటికి వచ్చిన సురేష్ తన అన్నను తన డబ్బులు ఇవ్వాలంటూ గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటా మాట పెరిగింది ఈ నేపథ్యంలో కత్తితో అన్నపై దాడి చేయగా గాయాలు కాగా పక్కనే ఉన్న స్వరూప ఆపడానికి ప్రయత్నించగా సురేష్ ఆమె పైన కూడా దాడి చేసి పొత్తికడుపు చాతి భాగంలో కత్తితో పొడిచి అక్కడ నుండి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. హుటాహుటిన స్థానికుల సహాయంతో నర్సంపేట ఏరియా ఆసుపత్రికి గాయాల పాలన ఇద్దరిని తరలించారు. చికిత్స పొందుతూ స్వరూప మృతి చెందగా తీవ్ర గాయాల పాలైన రమేష్ ను మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. రమేష్ పరిస్థితి కూడా విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. ఈ మేరకు స్వరూప కొడుకు శివ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వి గోవర్ధన్ తెలిపారు.

మరణించిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులకు సహాయం…

మరణించిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులకు సహాయం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

గురువారం, ఇటీవల మరణించిన నలుగురు పిఆర్టియు ఉపాధ్యాయుల కుటుంబాలకు సంక్షేమ సంస్థ తరపున జిల్లా అధ్యక్షుడు మణయ్య లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. దిగ్వాల్- విజయలక్ష్మి, చింతల్ చెరు- నీరజ, చాప్ట(కే ) – శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్- సుజాత కుటుంబ సభ్యులకు ఈ సహాయం అందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

బెగుళూరు గ్రామంలో భవనాలకు ఎంజీఎన్ఆర్జిఇఎస్ నిధుల భూమి పూజ

ఎంజీఎన్ఆర్జిఈఎస్ నిధులతో పలు భవనాల భూమి పూజ
* నిధులను సాంక్షన్ చేయించిన మంత్రివర్యులు
* ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన గ్రామ ప్రజలు

మహాదేవపూర్ అక్టోబర్16 నేటి ధాత్రి *

Vaibhavalaxmi Shopping Mall

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం బెగుళూరు గ్రామపంచాయతీలో మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలతో ఎంజిఎన్ఆర్జిఇఎస్ నిధులతో గురువారం రోజున పలు భవనాలకు భూమి పూజ నిర్వహించారు. గ్రామపంచాయతీ అభివృద్ధిలో భాగంగా ఐటి భారీ పరిశ్రమల శాఖ మరియు శాసనసభ వ్యవహార శాఖ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు చొరవ తీసుకొని గ్రామపంచాయతీ భవనముకు 20 లక్షల రూపాయలు మరియు అంగన్వాడి రెండు భవనాల నిర్మాణానికి 16 లక్షల రూపాయలు ఎన్ఆర్ఈజీఎస్ నిధులను బదిలీ చేయడంతో గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రమోద్ మరియు పలువురు అధికారుల సమక్షంలో ఈరోజు ముగ్గుపోసి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాట్లాడుతూ బెగుళూరు గ్రామానికి 20 లక్షలునిధులు సాంక్షన్ చేసినందుకు ఐటి మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ గ్రామ సర్పంచ్ ఆకుల సమ్మక్క మాజీ ఎంపిటిసి చల్ల పద్మ ఓదెలు పంచాయతీరాజ్ ఏఈ సతీష్ టెక్నికల్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాంమ్మూర్తి అంగన్వాడీ టీచర్లు సుజాత సరస్వతి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కటకం అశోక్ ములకల పోచమ్మలు ఆకుల రాజయ్య బుర్రి శివరాజ్ కాంట్రాక్టర్ పోటు మల్లారెడ్డి అంకిరెడ్డి మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

పేదల కలల్ని సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోంది….

పేదల కలల్ని సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోంది

#పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా ఇంటి కలను సాకారం చేస్తాం.

#అర్హులైన ప్రతి పేదవారికి విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం.

#వెంకటాపూర్ గ్రామములో ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశానికి హాజరై ప్రారంభించిన ….

#రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.

ములుగు జిల్లా, నేటిధాత్రి:

 

పేదల కలల్ని సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని
రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
గురువారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలోని బీసీ కాలనీ కి చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు బయ్యా ప్రమీల ఇందిరమ్మ ఇల్లును రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల జీవనోపాధికి చిహ్నంగా నిలిచిందని మంత్రి సీతక్క అన్నారు.
పేదల బాగోగుల పట్ల శ్రద్ధచూపడం అందులో భాగమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు అంటేనే ప్రజా ప్రభుత్వం గుర్తుకు వస్తోందని, పేద ప్రజల కలల ఇళ్ల రూపంలో ప్రతిబింబించడానికి ఈ పథకం దోహదపడిందని మంత్రి వివరించారు.
ప్రజా ప్రభుత్వమే నిజమైన రైతు–కూలీలకు అండగా నిలుస్తోందని అన్నారు. రైతును “రాజు”గా చూడాలనే సంకల్పంతోనే సన్నవరి వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. తొమ్మిది నెలల వ్యవధిలోనే రూ.21 వేల కోట్లతో రెండు లక్షల లోపు ఉన్న రైతుల రుణమాఫీ చేయడం, రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం, మూడు విడతల్లో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇండ్లు కట్టించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. అలాగే, 7 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం, 17 లక్షల పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల పేర్లు నమోదు చేయడం వంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజా ప్రభుత్వమే విజయవంతంగా అమలు చేసిందని మంత్రి అన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ జోడెద్దుల్లా సమపాళ్లలో ముందుకు వెళ్తున్నాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కేవలం కమిషన్‌ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టుపైనే దృష్టి పెట్టిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. పేదల గౌరవప్రదమైన జీవనానికి ప్రతీకగా నిలిచే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

గంగాధరలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

సీఎంఆర్ఎఫ్ తో భరోసా

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

గంగాధర, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

ప్రమాదాల్లో గాయపడి, అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేద, మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం భరోసానిస్తుందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పురుమల్ల మనోహర్ అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నూట ఎనభై మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నలబై ఆరు లక్షల అరవై మూడు వేల రూ.ల ఆర్థిక సహాయం మంజూర అయింది. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు గురువారం గంగాధర మండలం మధురానగర్ లోని ప్రజా కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. సీఎంఆర్ఎఫ్ తో తమను ఆదుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చయ్య, రామిడి రాజిరెడ్డి, సత్తు కనుకయ్య, రోమాల రమేష్, కర్ర విద్యా సాగర్ రెడ్డి, గుజ్జుల బాపురెడ్డి, తోట కరుణాకర్, వేముల భాస్కర్, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, జాగిరపు శ్రీనివాస్ రెడ్డి, వేముల అంజి, గరిగంటి కరుణాకర్, ముచ్చ శంకరయ్య, శ్రీనివాస్, మంత్రి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

బీసీ 42% రిజర్వేషన్ల కోసం రాష్ట్ర బంద్ పిలుపు

బిసి 42 శాతం అమలు చేయాలని రాష్ట్ర బంద్ కు పిలుపు

ఎం సి పి ఐ యు, ఏ ఐ టి యు సి జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న పిలుపు

కేసముద్రం/ నేటి ధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో రాష్ట్ర బీసీ సంఘాలు 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని ఈనెల 18వ తేదీన రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చినందున విజయవంతం చేయాలని కోరుతూ గ్రామంలో ఎం సి పి ఐ యు -ఏఐసీటియు ల ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంసీపీఐయు పార్టీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న మాట్లాడుతూ బీసీలకు సామాజిక న్యాయం, ఆర్థిక, రాజకీయ రంగాలలో అభివృద్ధి జరగాలంటే 42% రిజర్వేషన్స్ ను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన తదుపరి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆయన అన్నారు.బీసీల పట్ల తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని, ఆ దిశగా జరుగుతున్న పోరాటాలలో భాగంగా ఈనెల 18 తేదీన జరిగే రాష్ట్ర బంద్ ను ఎం సిపిఐ యు పార్టీ మద్దతు తెలియజేస్తుందని ఆయన తెలియజేశారు.ఇట్టి బందులో ఎం సిపిఐ యు-ఏఐసిటియు కార్మిక సంఘం ప్రత్యక్ష పోరాటాలలో పాల్గొనడం జరుగుతుందని ఆయన తెలియజేశారు.ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: పలుస సంపత్, కంకల శ్రీనివాస్ ,అంకిరెడ్డి వీరన్న, తండ శ్రీనివాస్, అంకిరెడ్డి రాంబాబు, ఎండి రహీం, కాకి సంతోష్, వాంకుడోత్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

పిడిఎస్ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ట్రైబల్స్ లో సేవా కార్యక్రమాలు….

పిడిఎస్ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ట్రైబల్స్ లో సేవా కార్యక్రమాలు.

మన్యం నిరుపేద ప్రజలకు విద్యార్థులకు, బట్టలు టీషర్ట్స్ పెన్నులు బుక్స్ పంపిణీ…

బనిశెట్టి విజయ వెంకటేష్ లను,అభినందించిన పెద్దాడ యోహాను…

కేసముద్రం/ నేటి ధాత్రి

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం మండలంలో పిడిఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో,( మన్యంలో మహా ఘనుడు,) ప్రోగ్రామ్ ద్వారా మన్యం నిరుపేద ప్రజలకు విద్యార్థిని విద్యార్థులకు, బుధవారం, చీరెలు, యవ్వనస్తులకు ,షర్ట్స్,పాయింట్స్,పంజాబీ డ్రెస్సెస్,చిన్నపిల్లలకు టీ షర్ట్స్,పెన్నులు, పెన్సిల్లు,నోట్ బుక్స్, బియ్యం, స్వీట్స్,పలు గ్రామాల్లో పంచి పెట్టడం జరిగింది, ట్రైబల్స్( మన్యం )ప్రాంతంలో ప్రజలు చాలా దిన స్థితిలో సమాజానికి దూరంగా జీవిస్తున్నారని వారిని ఆదరించి మేమున్నాము అంటూ బలపరిచి రావడం నాకు చాలా ఆనందంగా ఉందని ఆ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు బనిశెట్టి విజయ వెంకటేష్ లు, చిన్న జ్వరం వచ్చిన 30 నుంచి 50 కిలోమీటర్ల దూరం వెళ్లాలని,, పెద్ద అనారోగ్య సమస్య వస్తే 50 నుంచి 100 కిలోమీటర్ల వరకు వెళ్లాలని, కనీసం రోడ్డు సౌకర్యం కూడా సరిగా లేదని వారన్నారు, దేవుడే వారికి తోడై ఉండాలని వారన్నారు, రాబోయే రోజుల్లో దేవుని దయతో ప్రపంచమంతా సేవా కార్యక్రమాలు చేయాలని ఆశ కలిగి ఉన్నామని అందుకు దేవుని దీవెనలు ప్రజల దయ మాపై ఉండాలని వారు అన్నారు, నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తూ గత మూడు సంవత్సరాలుగా ఆదరణ కలిగిస్తున్న వెంకటేష్ , విజయ్ లను అభినందిస్తూ అనేకులు ఇంకా సేవా కార్యక్రమాలకు ముందుకు రావాలని, మనం తిన్నది మట్టి పాలు ఇతరులకు పెట్టింది మనకు, కావున సేవా గుణం కలిగి ఉండాలని,మన్నెంలో
మహా ఘనుడు, ప్రోగ్రాం అధ్యక్షులు పెద్దద యోహన్ తెలిపారు , సందర్శించిన గ్రామాలు,గంగవరం మండలం లోని గొల్ల కొండ,మర్రిపాలెం,చెప్పరి పాలెం,బర్రి మామిడి,కొండ కారం వారి వీధి,కరకపాడు, నీలవరం,మాకు మామిడి,గ్రామాల్లో సందర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో శైలేష్,పీటర్, మాదాసు ససారంగం, కొర్నేలి, భీమ శేఖర్,మణికుమార్, సమియేల్ ,చంద్రశేఖర్,మణికుమార్, జ్యోతి, దెబోర,దుర్గాప్రసాద్, మనోహర్ లు పాల్గొన్నారు,

ఆర్టీసీ డ్రైవర్ మొగిలికి దొమ్మటి సాంబయ్య నివాళులు

మొగిలి పార్థివదేహానికి నివాళులు అర్పించిన మాజీ టిపిసీసీ ఉపాధ్యక్షులు దొమ్మటి

 

పరకాల,నేటిధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డుకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ మడికొండ మొగిలి గుండెపోటుతో అకాల మరణం చెందగా టీపీసీసీ మాజీ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య గురువారం మడికొండ మొగిలి పార్దివదేహాన్ని సందర్శించి పూలమాలలువేసి నివాళులు అర్పించారు.ఈ పరామర్శలో పిఎసిఎస్ మాజీ ఛైర్మెన్ బొజ్జం రమేష్,టీపీసీసీ ఎస్సిసెల్ కమిటీ వైస్ చైర్మన్ డాక్టర్.మడికొండ శ్రీను, కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు బొచ్చు చందర్,సమన్వయ కమిటీ సభ్యులు చిన్నాల గోనాథ్,మడికొండ సంపత్ కుమార్,బిసి సంఘం నాయకుడు అముదాలపల్లి మల్లేశం గౌడ్,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పుల్యాల గాంధీ,మండల ఎస్సిసెల్ అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి,పట్టణ నాయకులు పాడి వివేక్ రెడ్డి,బొచ్చు భాస్కర్,బొచ్చు జితేందర్,బొచ్చు రవి,ఒంటెరు వరుణ్,బొచ్చు అనంత్,బొచ్చు రవి కుమార్,లాదేళ్ల బిక్షపతి,మడికొండ రాజు తదితరులు ఉన్నారు.

error: Content is protected !!
Exit mobile version