ముత్తారం పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసీపీ ఎం. రమేష్

ముత్తారం పోలీస్‌ స్టేషన్ తనిఖీ చేసిన ఏసీపీ ఎం. రమేష్

ముత్తారం :- నేటి ధాత్రి

 

రామగుండం పోలీస్‌ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ ముత్తారం పోలీస్‌ స్టేషన్ ను గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ తనిఖీ చేశారు. తనిఖీ లో భాగంగా ముందుగా పోలీస్ స్టేషన్ రికార్డ్స్ పరిశీలించారు, కే డి, డీ సి, సస్పెక్ట్ షీట్ లు పరిశీలించారు వారి ప్రస్తుత చర్యల గురించి తెలుసుకున్నారు, స్టేషన్ వెర్టికల్స్, ఎఫ్ ఐ ఆర్ ఇండెక్స్ మొదలైన రికార్డ్స్ తనిఖీ చేశారు, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండ చూసుకోవాలని సూచించారు. నిరంతం పోలీసులు పెట్రొలింగ్‌ నిర్వహించాలని పోలీస్ స్టేషన్‌ అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమం లో
మంథని సీఐ బి. రాజు ముత్తారం ఎస్ ఐ రవి కుమార్ పోలీస్ సిబ్బంది ఉన్నారు

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు…

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

ముత్తారం :- నేటి ధాత్రి

 

ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన మండల రాజమల్లు ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ మరియు కాంగ్రెస్ నాయకులు పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియచేసారు ఈ కార్యక్రమం లో తాండ్ర మల్లేష్ లక్కం ప్రభాకర్ మండల రవీందర్ మూగ రవీందర్. తోడేటి శశి కుమార్ దామ మదన్ నాంసాని సదయ్య ఆకోజ్ అశోక్ బందెల మల్లయ్య చొప్పరి రాజాలు చొప్పరి రోషాలు మారుపాక మధుకర్ బొజ్జ మహేష్ తుమ్మల శ్రీనివాస్ దొంగల కుమార్ మరియు యూత్ నాయకులు సాదా స్వామి తదితరులు పాల్గొన్నారు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ వాణిశ్రీ…

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ వాణిశ్రీ

ముత్తారం :- నేటి ధాత్రి

 

ముత్తారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రo ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ సందర్శించడం జరిగింది దీనిలో భాగంగా వైద్య సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగినది. సిబ్బంది ఇప్పుడు హైపటైటిస్ వైరస్ నుండి ఇబ్బంది కలగకుండా ఉండడానికి హెపటైటిస్ బి వ్యాక్సిన్ మేడం ఇనాగ్రేషన్ చేసి ఇవ్వడం జరిగినది మరియు హాస్పటల్ సిబ్బందికి మరియు సిబ్బందికి రివ్యూ మీటింగ్ తీసుకోవడంతో పాటు పలు సూచనలు చేయడం జరిగినది. రివ్యూ లో భాగంగా ముఖ్యంగా టీవీ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏఎంసీ రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ డెలివరీ మీద పలు సూచనలు సలహాలు సూచించారు అందరు సక్రమంగా విధులు నిర్వహించాలని తెలిపినారు ఇన్ పేషెంట్స్ ఓపి ఎంత వస్తుంది అని చూడడంతో పాటు ఇన్ పేషెంట్స్ ఆల్ రిజిస్టర్స్ ను వెరిఫికేషన్ చేశారు ఈ కార్యక్రమం లో జిల్లా టీవీ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ సార్ జిల్లా ఇమినేషన్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ కుమార్ మరియు హాస్పటల్ సిబ్బంది  పాల్గొన్నారు

పెరటి కోళ్ల పెంపకం పై అవగాహనా…c

పెరటి కోళ్ల పెంపకం పై అవగాహనా

ముత్తారం :- నేటి ధాత్రి

కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం రామగిరి ఖిల్లా వారు పెద్దపెల్లి లోని వివిధ మండలాలలోని గ్రామాలలో పోషకాహార భద్రత మరియు మహిళల్లో స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి పెరటి కోళ్ల పెంపకం మీద అవగాహన మరియు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు ఇందులో భాగంగా ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామమును కృషి విజ్ఞాన కేంద్రం మూడు సంవత్సరాల పాటు దత్తత తీసుకొని గ్రామం యొక్క సమగ్ర అభివృద్ధికి వివిధ కార్యక్రమాలను చేపడుతుంది. అడవి శ్రీరాంపూర్ గ్రామంలోని రైతులు మరియు మహిళల్లో పోషకాహార భద్రతను పెంపొందించడానికి మరియు మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి పెరటి కోళ్ల పెంపకం మీద శిక్షణ మరియు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్బంగా పిడి డిఆర్డిఏ కాళిందిని మాట్లాడుతూ మహిళలకి అందిస్తున్న వివిధ స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాల గురించి వివరించారు అలాగే కృషి విజ్ఞాన కేంద్రం వారు పోషకాహార భద్రత లో భాగంగా షెడ్యూల్డ్ కులాల ఉపరి ప్రణాళిక కింద పెరిటి కోళ్ల పంపిణీ ని సద్వినియోగం చేసుకొని వీటిని గ్రామంలోని మహిళలు ఒక ఎంటర్ప్రైస్ గా తీర్చిదిద్దాలని మండలంలో అడివి శ్రీరాంపూర్ ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కోరారు. డాక్టర్ అమాగంటి శ్రీనివాస్, పుధాన శాస్త్రవేత్త మరియు అధిపతి ,కృషి విజ్ఞాన కేంద్రం, రామగిరి జిల్లా వారు మాట్లాడుతూ కృషి విజ్ఞాన కేంద్రం గ్రామాల్లో చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి రైతులకు వివరించారు. షెడ్యూల్డ్ ఉప ప్రణాళిక కింద కృషి విజ్ఞాన కేంద్రం వారు పంపిణీ చేస్తున్న అసిల్ జాతి మేలైన పెరటి కోళ్ల పెంపకం ను గ్రామంలోని రైతులు చేపడుతూ దీనిని ఒక ఉపాధి మార్గంగా పాటించాలని అలాగే గ్రామంలోని రైతులకి వ్యవసాయ ఆధారిత సమస్యలు ఏవైనా ఉంటే కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలను సంప్రదించి వారి నుండి వ్యవసాయ అభివృద్ధికి సలహాలను తీసుకోవాలని సూచించారు. ఈ అసిల్ జాతి కోళ్ళు సంవత్సరానికి 120 నుండి 140 వరకు గుడ్లను పెడుతుందని అలాగే మూడు నెలల్లో రెండున్నర కేజీల బరువు వస్తుందని దీని మాంసం కూడా మంచి రుచి కలిగి మార్కెట్లో అధిక డిమాండ్ కలిగి ఉంటుందని రైతులకు వివరించారు. ఈ అసిల్ జాతి కోళ్లకు గుడ్లను పొదిగే గుణము ఉండదు. గ్రామంలో మహిళలు ముందుకు వచ్చినట్లయితే వారికి కృషి విజ్ఞాన కేంద్రం తరఫున 100 నుండి 200 గుడ్లు కెపాసిటీ గల చిన్న హేచరీ యూనిట్ని కూడా ఇవ్వగలమని తెలియజేశారు కావున రైతులు ఈ అవకాశం ఉపయోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందగలరని కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ ఏ ఎమ్ సి వైస్ చైర్మన్ మద్దెల రాజయ్య కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ భాస్కర రావు డాక్టర్ వినోద్ కుమార్ గ్రామ పంచాయతీ సెక్రెటరీ మల్లీశ్వరి తో పాటు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు

నూతన వధూవరులను ఆశీర్వదించిన..

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్

ముత్తారం :- నేటి ధాత్రి

ముత్తారం మండలం రామకృష్ణాపూర్ గ్రామంలో సంతోష్ – రచన వివాహం ఇటీవల జరుగగా నూతన వధూవరులను మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ జక్కుల ముత్తయ్య బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version