ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన ఎంపిడిఓ ఆంజనేయులు
త్వరగతిన పూర్తి చేసి గృహప్రవేశాలు చేయాలని సూచన
పరకాల,నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణపనులు శాసనసభ్యులు చొరవతో మండలంలో ముమ్మరంగా సాగుతోందని మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు అన్నారు.అనంతరం మండల పరిధిలోని వెల్లంపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇండ్లను పరిశీలించి నిర్మాణం పూర్తి చేసిన వరకు డబ్బులు ఖాతాలో జమ అయునవా లేదా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.ఇసుక,ఇటుక,కంకర మొదలగు సామాగ్రి విషయంలో ఏదైనా ఇబ్బంది ఉంటే తమకు తెలుపాలని
ఈ నెల చివరి వరకు సాదరమైనంత ఎక్కువ మొత్తం గృహ ప్రవేశాలు చేయాలని సూచించారు.
మండలంలోని 10 గ్రామాలలో శాసనసభ్యులు 285 కెటాయించగా ఇప్పటి వరకు వివిద దశలలో పనులు పూర్తి చేసిన 169 లబ్ధిదారులకు వారి ఖాతాల్లో డబ్బులు జమ అయినట్లు తెలిపారు.పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు.
