చలివేంద్రం ప్రారంభించిన సీఐ రంజిత్ రావు

చలివేంద్రం ప్రారంభించిన సీఐ రంజిత్ రావు

శాయంపేట నేటిధాత్రి;

శాయంపేట మండలకేంద్రం లోని కూడలి వద్ద కీర్తిశేషులు బాసని కైలాసం, కనకలక్ష్మి, రమాదేవి జ్ఞాపకార్థం మాజీ ఎంపీపీ తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ బోర్డు మెం బర్ బాసని చంద్రప్రకాష్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ రంజిత్ రావు ఎస్సై జక్కుల పరమేశ్వర్ తో కలిసి ప్రారం భించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ బాసని చంద్రప్రకాష్ వారి తల్లిదండ్రుల, భార్య జ్ఞాపకా ర్ధంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నా రు.మండల కేంద్రానికి పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు చలి వేంద్రం దాహర్తి తీర్చడానికి తోడ్పడుతుందని అన్నారు. ప్రజలు చలివేంద్రాన్ని ఉపయో గించుకుని దాహం తీర్చుకో వాలి కోరారు. ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మం డలంలోని ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరారు.ఈ కార్యక్రమంలో బాసని లక్ష్మీనారాయణ, సదాశివుడు, వెంకటపతి, చంద్రమౌళి, సామల రవీందర్, బాసని వెంకటేశ్వర్లు, గడ్డం బాబు పాల్గొన్నారు.

ఆర్యవైశ్య కుటుంబానికి అండగా…ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ – ఉప్పల వెంకటేష్.

ఆర్యవైశ్య కుటుంబానికి అండగా…ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ – ఉప్పల వెంకటేష్.

కల్వకుర్తి నియోజకవర్గంలోని కల్వకుర్తి మున్సిపాలిటీకి,సుభాష్ నగర్ చెందిన ఆర్యవైశ్య కారుపాకుల వరుణ్ తేజ్ అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయాన్ని ఆర్య వైశ్య సంఘం నాయకుల ద్వారా శనివారం తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం 5000/-అందించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఛైర్మన్ రాచోటి శ్రీశైలం,ఆర్య వైశ్య సంఘం కల్వకుర్తి మండలం అధ్యక్షులు గంధం ప్రసాద్, ఆర్య వైశ్య సంఘం జిల్లా నాయకుడు దాచపల్లి శ్రీనివాసులు, ఉప్పల వెంకటేష్ అన్న సైన్యం దారమోని గణేష్ ,BRS పార్టీ మాజీ కౌన్సిలర్ సాదిక్,కనుక సత్యనారాయణ,షకీల్, ఆర్య వైశ్య సంఘం నాయకులు తిరుపతయ్య, శ్రీనివాస్ గుప్తా, పోల నరేష్, ఆకారం శివ,నరేష్ తదితరులు పాల్గొన్నారు.

నెక్కొండ మాంటిస్సోరి హై స్కూల్‌లో ఫుడ్ ఫెస్టివల్…

నెక్కొండ మాంటిస్సోరి హై స్కూల్‌లో ఫుడ్ ఫెస్టివల్

ఆహార అలవాట్లు ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన:
కరస్పాండెంట్ అంజన్ రెడ్డి

#నెక్కొండ, నేటి ధాత్రి:

నెక్కొండ మండల కేంద్రంలోని మాంటిస్సోరి హై స్కూల్‌లో శనివారం ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నర్సరీ నుంచి 6వ తరగతి వరకు విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని, పాఠశాల ఆవరణలో వివిధ రకాల ఆహార పదార్థాలను ప్రదర్శించారు. చిన్నారులు తమ ఇళ్ల నుంచి తెచ్చిన వంటకాలను పరస్పరం పంచుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పంచుకునే భావన, మంచి అలవాట్లు మరియు ఆరోగ్యకరమైన ఆహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమ అధ్యక్షులు ప్రిన్సిపాల్ కొత్త మధుకర్ రెడ్డి మాట్లాడుతూ ఫుడ్ ఫెస్టివల్‌ల ద్వారా విద్యార్థుల్లో సామాజిక విలువలు, సహకార భావం పెంపొందుతాయని అన్నారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న పాఠశాల కరస్పాండెంట్ తాటిపర్తి అంజన్ రెడ్డి విద్యార్థులకు పరిశుభ్రతపై దిశా నిర్దేశం చేశారు. ఆహారం తయారు చేసే ముందు, తినే ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని, శుభ్రమైన పాత్రలు ఉపయోగించాలని, ఆహారాన్ని కప్పి ఉంచాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తను చెత్త బుట్టలో వేయాలని సూచించారు. ట్రెజరర్ డాక్టర్ ఆర్ ఆనందరావు మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే పుష్టికరమైన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవాలి పౌ…

గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవాలి పౌ

కొంపల్లి సర్పంచ్ సడల శ్రీకాంత్,ఐసిడిఎస్
సూపర్వైజర్ సునీత

భూపాలపల్లి నేటిధాత్రి

గర్భిణీ స్త్రీలు బాలింతలు ఆరోగ్యవంతమైన శిశువు ఎదుగుదలకు తోడ్పడే అధిక పౌష్టిక ఆహారాలు కలిగిన ఆకుకూరలు గుడ్లు వంటి మొదలైన సమతుల్య ఆహారం తీసుకోవాలని కొంపెల్లి గ్రామ సర్పంచ్ శ్రీకాంత్,ఐసిడిఎస్ సూపర్వైజర్ సునీత తెలిపారు.శనివారం భుపాలపల్లి మండలంలోని కొంపల్లి గ్రామంలో పోషణ్ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ సునీత,సర్పంచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలకు వెయ్యి రోజుల ప్రాముఖ్యత కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలన్నారు.గర్భిణీ స్త్రీలు,కిశోర బాలికలకు ఎదుగుదలకు పాలు,ఆకుకూరలు,గుడ్లు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలు బాలింతలు అంగన్వాడి టీచర్స్ పద్మా, సునీత,స్వరూప,రజిత తదితరులు పాల్గొన్నారు.

టెక్-అథాన్ 2026 విజయవంతం…

టెక్-అథాన్ 2026 విజయవంతం

* విజేతలకు నగదు బహుమతులు అందజేసిన విశ్వవిద్యాలయ ఫౌండర్ చాన్సలర్ డాక్టర్ సి.హెచ్. వి. పురుషోత్తం రెడ్డి

నేటిధాత్రి, చేవెళ్ల :

మొయినాబాద్ మండలం హిమాయత్ నగర్‌లోని చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన 24 గంటల హ్యాకథాన్ టెక్-అథాన్ 2026 విజయవంతంగా ముగిసింది. ఈ హ్యాకథాన్ మార్చి 30 మధ్యాహ్నం 2 గంటల నుంచి మార్చి 31 మధ్యాహ్నం 2 గంటల వరకు నిరంతరంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో సిఎస్ఈ, ఏఐ, ఎంఎల్, ఈసీఈ, బిసిఏ, బి.ఎస్‌సి కంప్యూటర్ సైన్స్ విభాగాలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం నమోదు చేసుకున్న 52 జట్లలో నుంచి ప్రతిభావంతమైన 15 జట్లను ఎంపిక చేసి, వాటికి ఏఐ, హెల్త్‌కేర్, వ్యవసాయం, విద్య, ఫోరెన్సిక్స్, ఐఓటీ వంటి విభిన్న రంగాల్లో వినూత్న ప్రోటోటైప్‌లను అభివృద్ధి చేసే అవకాశం కల్పించారు. ఈ హ్యాకథాన్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన మూడు జట్లను విజేతలుగా ఎంపిక చేసి, వారికి శనివారం నగదు బహుమతులను విశ్వవిద్యాలయ ఫౌండర్ చాన్సలర్ డాక్టర్ సి.హెచ్. వి. పురుషోత్తం రెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ ఈ హ్యాకథాన్ ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచన, బృంద సహకారం, ప్రాయోగిక సమస్యల పరిష్కార నైపుణ్యాలు సమర్థవంతంగా అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ డైరెక్టర్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ సి.హెచ్. సాత్విక రెడ్డి , వైస్ ఛాన్సలర్ ఆచార్య జి. శంకర్ లింగం, రిజిస్ట్రార్ ఆచార్య ఎం. రవీందర్, డీన్ ఫాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆచార్య ఎం. జగదీశ్వర్ , కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఈ. అరవింద్ , అసిస్టెంట్ రిజిస్ట్రార్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గాదె రాంబాబు రెడ్డి , అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

దిగ్విజయంగా 180వ వారం అన్నదాన కార్యక్రమం.పాల్గొన్న హోప్ ఫౌండేషన్ సభ్యులు అన్నె అపర్ణ

దిగ్విజయంగా 180వ వారం అన్నదాన కార్యక్రమం.పాల్గొన్న హోప్ ఫౌండేషన్ సభ్యులు అన్నె అపర్ణ

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

సమాజం పట్ల బాధ్యతతో, మానవతా దృక్పథంతో హోప్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు ఎంతో గొప్పవని స్థానిక ప్రజలు కొనియాడారు. హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో గత 180 వారాలుగా కొనసాగుతున్న ఉచిత అన్నదాన కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించబడింది.
​ఈ వారం అన్నదాన కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ సభ్యులు అన్నె అపర్ణ పాల్గొని భక్తులకు, పేదలకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి వారం క్రమం తప్పకుండా అన్నదానం నిర్వహించడం సామాన్యమైన విషయం కాదని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా హోప్ సభ్యులు తీసుకుంటున్న జాగ్రత్తలు అభినందనీయమని అన్నారు.
​అత్యధిక సంఖ్యలో ప్రజలు విచ్చేసినప్పటికీ, క్రమశిక్షణతో అందరికీ భోజన వసతి కల్పించడం ఫౌండేషన్ యొక్క అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. పేద ప్రజల ఆకలి తీర్చడమే పరమావధిగా చైర్మన్ కొండా విజయ్ కుమార్ చేపడుతున్న అనేక ఇతర సేవా కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా స్థానికులు గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, సభ్యులు మరియు స్థానికులు పాల్గొన్నారు.

ఇంటర్మీడియట్ లో ప్రతిభ చూపిన…

ఇంటర్మీడియట్ లో ప్రతిభ చూపిన

విద్యార్థినిలను సన్మానించిన మాజీమంత్రి నిరంజన్ రెడ్డి

తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి

 

వనపర్తి నేటిదాత్రి .

 

ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాల మైనార్టీ విద్యార్థినిలు ఇంటర్ లో మార్కులు సాధించ డము తో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వారిని శాలువతో సన్మానించారు ఎం.పి.సి మొదటి సంవత్సరంలో అఫ్సా ఖైరన్ 470మార్కులకు 459మార్కులు సాధించింది. ఎం.పి.సి రెండవ సంవత్సరంలో సాయిదా అతియా మహమూది 1000మార్కులకు 916 మార్కులు సాధించింది.సి.ఈ.సి రెండవ సంవత్సరంలో 1000మార్కులకు గాను843 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా మాజీమంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని అన్నారు చదువులోనే కాకుండా విద్యార్థులు పరిసరాలు,సమాజం ,కుటుంబం పట్ల అవగాహన కల్పించుకొని సమాజ అభివృద్ధికి తోడుపడుతూ పుట్టిన ఊరికి,తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారువిద్యార్థినులకు నిరంజన్ రెడ్డి స్వీట్స్ పంచి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమములో అధ్యాపక బృందం నాజియా బేగం,అబ్దుల్ రెహ్మాన్
నాయకులు గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్,నందిమల్ల.అశోక్,కె.మాణిక్యం,బండారు.కృష్ణ,జోహెబ్ హుస్సేన్,సయ్యద్.జమీల్, స్టార్.రహీమ్,అస్లాం,మాధవ్ రెడ్డి, వెంకట్ సాగర్,మహేశ్వర్ రెడ్డి,చిట్యాల.రాము,అలీమ్,తోట.శ్రీను తదితరులు ఉన్నారు.

ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న మోడీ ప్రభుత్వం…

ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న మోడీ ప్రభుత్వం

33 శాతం మహిళా రిజర్వేషన్లు బేషరతుగా అమలు చేయాలి

వరంగల్‌లో ఎంసిపిఐ(యు) నిరసన ర్యాలీ

నర్సంపేట/వరంగల్,నేటిధాత్రి :

దేశ సమైక్యత, సమగ్రతకు భంగం కలిగించే విధంగా రాజ్యాంగ సవరణలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేపడుతోందని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి ఆందోళన వ్యక్తం చేశారు. 2023లో తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లును బేషరతుగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కమిటీ పిలుపుతో పార్టీ కార్యాలయం నుంచి ప్రధాన తపాలా కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. 33 శాతం మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమం జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన గాదగోని రవి మాట్లాడుతూ, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారత రాజ్యాంగాన్ని బలహీనపరచే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. అశాస్త్రీయ పద్ధతుల్లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు రాజ్యాంగ సవరణలకు కేంద్రం తెరలేపిందని ఆరోపించారు.మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయకుండా, దాన్ని నియోజకవర్గాల పునర్విభజనతో అనుసంధానం చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. దక్షిణ భారత రాష్ట్రాలకు నష్టం కలిగించే విధంగా తీసుకొస్తున్న విధానాలపై ప్రశ్నించారు.కేంద్ర ప్రభుత్వం మహిళల పట్ల గౌరవం ఉంటే ఎలాంటి షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజల భావోద్వేగాలకు అనుగుణంగా విధానాలు రూపొందించాలని, లేకపోతే ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గోనె కుమారస్వామి, ఎన్ రెడ్డి హంసారెడ్డి, నర్ర ప్రతాప్, మాలోత్ సాగర్, కర్ర రాజిరెడ్డి, ముక్కెర రామస్వామి, చుంచు జగదీశ్వర్, మహమ్మద్ మహబూబ్ పాషా, ఎగ్గని మల్లికార్జున్, చీపురు ఓదెలు, మాలి ప్రభాకర్, అప్పనపురి నరసయ్య, బాబు రామస్వామి, జట్టి రాజు, అడపా యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం…

మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

గేటువాల్వ్ ఏర్పాటు చేసిన కౌన్సిలర్ వెంకటస్వామి

పరకాల,నేటిధాత్రి

పట్టణంలోని హనుమాన్ ఆలయం వెనుక,వారాలవాడ, సాకలి వాడ,ముస్లిం గల్లీలలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న మంచినీటి సమస్యకు పరిష్కారం లభించింది.శనివారం 1వ వార్డు కౌన్సిలర్ దుబాసి వెంకటస్వామి చొరవతో మిషన్ భగీరథ గేటువాల్వ్ ఏర్పాటు చేశారు.గత పది సంవత్సరాలుగా నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ ఏర్పాటుతో శాశ్వత ఉపశమనం లభిస్తుందని అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ వెంకటస్వామి మాట్లాడుతూ వార్డు ప్రజల క్షేమమే తన లక్ష్యమని పేర్కొన్నారు.మున్సిపల్ కమిషనర్,ఏఈ సహకారం అందించగా,వారికి వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మంచినీటి సరఫరా సిబ్బంది సంతోష్,మున్సిపాలిటీ జవాన్ మంద మహేష్,స్థానికులు రవి,సురేష్,గాఫ్ఫర్,రమేశ్,వార్డు నాయకులు బొచ్చు సతీష్ తదితరులు పాల్గొన్నారు.

పేదలకు ఇచ్చిన ప్రభుత్వ ఇళ్ల స్థలాలు కబ్జా

పేదలకు ఇచ్చిన ప్రభుత్వ ఇళ్ల స్థలాలు కబ్జా

* అప్పరెడ్డిగూడ సర్వే నెం.394,395,396,397,398లో
* ఎల్కగూడ సర్వే నెం. 581 లో
* ప్రభుత్వం కొనుగోలు చేసిచ్చిన పేదలకు ఇళ్ల స్థలాలు కబ్జా
• రికార్డుల్లో ప్రభుత్వ భూమి..ధరణిలో పాసుబుక్కులు
* అధికారుల నిర్లక్ష్యంతోనే ఇళ్ల స్థలాల్లో ముదిరిన వివాదం
• తమకు న్యాయం చేయాలంటూ చేవెళ్ల ఆర్డిఓను కలిసిన బాధితులు

నేటిధాత్రి, చేవెళ్ల :

1976,1987 లోని దేశంలో అధికారంలో ఉన్న ఇందిరా గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఇదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులకు ఇళ్ల పట్టాల పంపిణి జరిగింది. ఆ సమయంలో రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలంలో కొన్ని గ్రామాలు బాకారం, ఎనికేపల్లి, చిలుకూరు, ఎల్కగూడ, శ్రీరాంనగర్, కేతిరెడ్డిపల్లి, అప్పరెడ్డిగూడా, తోలుకట్ట, కనకమామిడి, గ్రామాలలో ప్రభుత్వ భూములు లేని గ్రామాలలో ప్రభుత్వమే పట్టాదారులనుండి కొంత భూమిని కొనుగోలు చేసి 121 గజాల స్థలం పేదలకు ఇళ్లపట్టాలు ఇచ్చింది. ఇది ఇలా ఉండగా ధరణి పోర్టల్ వచ్చాక రెవెన్యూ రికార్డుల్లో అధికారుల నిర్లక్ష్యంతో పట్టదారుల పేర్లు రావటం, పట్టా పాసుబుక్కులు మంజూరు కావడంతో దళితుల ఇళ్ల స్థలాలపై కన్నేసి ఈ భూమి తమదే అంటూ కబ్జాలకు పాల్పడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలలను ఇప్పుడు కొందరు వ్యక్తులు కబ్జా చేసారని తమకు న్యాయం చెయ్యాలని అప్పరెడ్డిగూడా, ఎల్కగూడ గ్రామాల బాధితులు శనివారం చేవెళ్ళ ఆర్థివోను కలిసి వినతిపత్రం అందజేశారు.

* రికార్డుల్లో ప్రభుత్వ భూమి… ధరణిలో పట్టా బుక్కులు

అప్పరెడ్డిగూడ గ్రామ సర్వేనేంబర్ 394, 395,397,397, 398 లలో ప్రభుత్వం కొనుగోలు చేసి ఇచ్చిన ఇళ్ల స్థలాలు ప్రభుత్వ భూమిగా రికార్డుకేక్కిందని, కాని ధరణిలో మాత్రం పట్టాదారుల పేర్లు రావటం, పట్టా పాస్ బుక్కులు మాంజూరు కావటంతో వారు రికార్డుల్లో మా పేర్లు వచ్చాయి కనుక ఈ భూమి మాది అంటూ దౌర్జన్యంగా దళితులను బెదిరించి( సిమెంట్ కడీలు )హద్దురాళ్లు వేసుకున్నారని బాధితులు తెలిపారు. ఈ స్థలం మాది అన్నవారిపై బెదిరింపులు, దాడులకు దిగుతున్నారని బాధితులు ఆరోపించారు. ఇది ఇలా ఉండగా మొయినాబాద్ మండలం ఎల్కగూడ గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 581లో 1987లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాదారుల నుండి భూమి కొనుగోలు చేసి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది. ధరణి వచ్చిన తర్వాత రెవెన్యూ అధికారుల తప్పిదంతో పట్టాదారుల పేర్లు మళ్ళీ రికార్డులో రావడంతో ఈ భూమి మాది అంటూ కొందరు వ్యక్తులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేశారని ఎల్కగూడా గ్రామస్తులు ఆర్డీవోను కలిసి వినతిపత్రం అందజేశారు. బాధితులు మాట్లాడుతూ..ధరణి పోర్టల్ వచ్చాక అధికారుల నిర్లక్ష్యం వల్ల భూ రికార్డుల్లో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ తప్పిదం వల్లే ఈ సమస్య వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొనుగోలు చేసి దళితులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను గ్రామకంఠం భూమిగా గుర్తించి, కబ్జాలకు పాల్పడ్డ వారి పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు ఆర్డీవో పార్టసింహారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాధితులు గునుగుర్తి జంగయ్య, తోలికట్ట యాదయ్య, ఆలూరి అనిల్,గుడిపల్లి సుధాకర్ అప్పరెడ్డి గూడా గ్రామస్థులు తదితరులు ఉన్నారు.a

131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం ప్రజాస్వామ్య విజయమే

131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం ప్రజాస్వామ్య విజయమే

మహిళల హక్కుల పేరుతో రాజకీయ ఎత్తుగడలు విఫలం

ఏఐఎఫ్బిడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల రాగసుధ వ్యాఖ్యలు

నర్సంపేట,నేటిధాత్రి:

131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడాన్ని స్వాగతిస్తూ, దీనిని ప్రజాస్వామ్య శక్తుల విజయంగా అభివర్ణించవచ్చని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల రాగసుధ అన్నారు.నర్సంపేట పట్టణంలోని మార్క్స్ కాలనీలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా కమిటీ సభ్యురాలు జన్ను విజయ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వంగల రాగసుధ మాట్లాడుతూ, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లు వాస్తవానికి మహిళల సాధికారత కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం రూపొందించబడిందని విమర్శించారు.ముఖ్యంగా ఈ బిల్లును నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో అనుసంధానం చేయడం ద్వారా మహిళల హక్కుల అమలులో అనవసరమైన ఆలస్యం సృష్టించబడిందని పేర్కొన్నారు. బిల్లు వీగిపోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరి, మహిళల పేరుతో చేస్తున్న రాజకీయ ఎత్తుగడలు బహిర్గతమయ్యాయని అన్నారు.
దేశంలో మహిళలు ఎదుర్కొంటున్న హింస, అసమానతలు, ఆర్థిక సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయని, ఇలాంటి సమయంలో మహిళలకు తక్షణ రాజకీయ ప్రతినిధిత్వం అవసరమని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం వాగ్దానాలు చేస్తూ వాటిని అమలు చేయడంలో విఫలమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్‌ను ఎటువంటి షరతులు లేకుండా తక్షణమే అమలు చేయాలని, నియోజకవర్గాల పునర్విభజన వంటి ప్రక్రియలతో మహిళా హక్కులను అనుసంధానం చేయకూడదని, మహిళల సాధికారతకు స్పష్టమైన కాలపరిమితి గల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని డిమాండ్ చేశారు.మహిళల పేరుతో రాజకీయ లాభాలు పొందే ప్రయత్నాలను దేశ మహిళలు తిరస్కరిస్తారని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం నిజంగా మహిళల పక్షాన ఉందని నిరూపించాలంటే తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలను సమీకరించి ఆందోళనలు, పోరాటాలు చేపడతామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యురాలు మైదం పద్మ, గణిపాక బిందు, బెజ్జంకి పుష్ప, కాకి కోమల, పిట్టల పద్మ, లక్ష్మి, శారద తదితరులు పాల్గొన్నారు.

మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శించిన బిఆర్ఎస్ నేతలు

మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శించిన బిఆర్ఎస్ నేతలు

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని మేడిగడ్డ కాలేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఎక్కడలేని విధంగా అద్భుతంగా కాలేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేయించిన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బాహుబలి మోటర్లు పెట్టి నీళ్లను పైకి లిఫ్ట్ చేసి కాలేశ్వరం నుండి మల్లన్న సాగర్ హైదరాబాదు ప్రజల తాగునీరు కోసం రైతులకు వ్యవసాయానికి నీరు అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్ రైతుల కోసం ఆలోచించే వ్యక్తిగా దేశంలోని నిలిచిపోయారు రైతులకు రైతుబంధు రైతు చనిపోతే రైతు కుటుంబానికి రైతు భీమా కింద ఐదు లక్షల రూపాయల ఇచ్చిన ఘనత కెసిఆర్ ది కానీ ఇప్పుడు గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదు సకాలంలో రైతులకు రైతు భరోసా నిధులను ఇవ్వడం లేదు మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగి క్రాకులు ఇచ్చినాయి మూడు సంవత్సరాలు కావస్తున్న ఇప్పటివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టును నిర్వీర్యం చేసి కేసీఆర్ పేరు లేకుండా చేయాలని ఆలోచించారు కావున ఇకనైనా రేవంత్ రెడ్డి కెసిఆర్ కు క్షమాపణ చెప్పి కాలేశ్వరం ప్రాజెక్టు రిపేర్లు చేయించి రైతులకు వ్యవసాయానికి నీరు అందించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రైతుల కల్పతరువు కాళేశ్వరం ప్రాజెక్ట్ ని సందర్శించిన ఉమ్మడి వరంగల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ నేతలు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణా రెడ్డి,తాటికొండ రాజయ్య, దాస్యం వినయ్ భాస్కర్, శంకర్ నాయక్, పుట్ట మధుకర్ బిఆర్ఎస్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, మాజీ ఎంపీ మాలోతు కవిత, దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి, భూపాలపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణి నాయకులు కార్యకర్తలు తదితరులు.

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

* 22,00,352 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముభారక్ చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే

నేటిధాత్రి, చేవెళ్ల :

https://youtu.be/mcDL0nNP5s0?si=v0NCLlrD99MLD5Tk

 

 

 

 

చేవెళ్ల మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కాలే యాదయ్య కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్న పేద కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం పెద్ద ఉపశమనంగా నిలస్తుందన్నారు. చేవెళ్ల మున్సిపాలిటీపరిధికి చెందిన మొత్తం 22 మంది లబ్ధిదారులకు రూ.22,00,352 లక్షల విలువైన చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. ఆర్థిక భారాన్ని మోయలేక ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఉపయోగకరంగా మారుతుందని అన్నారు. పేద కుటుంబాల పెళ్లి అవసరాలకు ప్రభుత్వం సహాయం అందించడం ద్వారా అనేక కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజల సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బి. కృష్ణయ్య, చేవెళ్ల మున్సిపల్ చైర్ పర్సన్ దేవర సమతా వెంకట్ రెడ్డి, చేవెళ్ల మాజీ సర్పంచ్ 15వ వార్డు కౌన్సిలర్ బండారి శైలజా ఆగిరెడ్డి, మాజీ డిసీసీ ఉపాధ్యక్షులు బండారి ఆగిరెడ్డి, చేవెళ్ల, ముడిమ్యాల్ పి. ఏ. సి. ఎస్ చెర్మన్లు దేవర వెంకట్ రెడ్డి, గోనె ప్రతాప్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆలంపల్లి వీరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, వైస్ చైర్మన్ రాములు, కౌన్సిలర్లు యాదిరెడ్డి, క్రిష్ణ నాయక్, పార్టీ సీనియర్ నాయకులు, రాంరెడ్డి, శంకర్, ప్రభాకర్, టేకులపల్లి శ్రీనివాస్, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ నెల 20 నుండి మార్కెట్ లో కొనుగోళ్ళు పున ప్రారంభం

ఈ నెల 20 నుండి మార్కెట్ లో కొనుగోళ్ళు పున ప్రారంభం

మక్కజొన్నల కొనుగోలుకు కొత్త నిబంధనలు..గేట్ ఎంట్రీ తప్పనిసరి

సమయ పరిమితులు విధింపు:

నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్

నర్సంపేట, నేటిధాత్రి:

ఈ నెల 20 నుండి మార్కెట్ లో కొనుగోళ్ళు పున ప్రారంభం కానున్నట్లు నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ తెలిపారు.ఈ నేపధ్యంలో
నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20వ తేదీ నుండి మక్కజొన్నలు సహా ఇతర వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ యార్డులోకి అనుమతించే విధానంలో మార్పులు చేస్తున్నట్లు కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ ప్రకటించించారు.ఇకపై రైతులు, వ్యాపారస్తులు తమ ఉత్పత్తులను మార్కెట్ యార్డుకు తీసుకురాగానే గేటు వద్ద ఉన్న గేట్ ఎంట్రీ రిజిస్టర్‌లో నమోదు చేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు.నమోదు చేసిన తరువాత మాత్రమే యార్డులోకి ప్రవేశం కల్పించబడుతుందని తేల్చిచెప్పారు.అలాగే, మక్కజొన్నలు మరియు ఇతర వ్యవసాయ ఉత్పత్తులను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే అనుమతించనున్నట్లు స్పష్టం చేశారు.ఈ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ మార్కెట్ కమిటీకి సహకరించాలని రైతులు, వ్యాపారస్తులను కమిటీ చైర్మన్ పాలయి శ్రీనివాస్ కోరారు.

ఎమ్మెల్యేను సన్మానించిన రాధాబంగ్లావాసులు..

*ఎమ్మెల్యేను సన్మానించిన రాధాబంగ్లావాసులు..

పలమనేరు(నేటిధాత్రి:

పలమనేరు మున్సిపల్ పరిధిలోని రాధాబంగ్లా వాసులు శనివారం పలమనేరు శాసనసభ్యులు అమరనాథరెడ్డిని కలసి ఘనంగా సన్మానించారు. గత నెలలో రాధా బంగ్లా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరైన ఎమ్మెల్యేను ఆలయ నిర్మాణానికి స్థలం కావాలని స్థానికులు విన్నవించుకున్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఆ ప్రాంతంలోని ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి స్థానికులకు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. దీంతో రెండు సెంట్లు స్థలాన్ని ఆలయ నిర్మాణం కోసం అధికారులు కేటాయిస్తూ చర్యలు తీసుకున్నారు. దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ రాధా బంగ్లా వాసులు ఎమ్మెల్యేను కలిసి సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆ ప్రాంతవాసులు జగదీష్ నాయుడు, రామ్మూర్తి నాయుడు,రాఘవ తదితరులు పాల్గొన్నారు..

కాంగ్రెస్ పట్టణ అధ్యక్ష పదవికి చంద్రమౌళి కి ఇవ్వాలి

కాంగ్రెస్ పట్టణ అధ్యక్ష పదవికి చంద్రమౌళి కి ఇవ్వాలి

మేకల దేవరాజ్

పరకాల,నేటిధాత్రి

పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్ష పదవి నియామకంపై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో, బొమ్మకంటి చంద్రమౌళి పేరును ప్రతిపాదిస్తూ మేకల దేవరాజ్ వినతి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రమౌళి గత 27 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే ఎన్‌ఎస్‌యూఐ,యూత్ కాంగ్రెస్,ఇందిరా కాంగ్రెస్ వంటి విభాగాల్లో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి సేవలందించినట్లు తెలిపారు.అనేక ప్రజా సమస్యలపై ధర్నాలు,రాస్తారోకోలు నిర్వహించడంతో పాటు, ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా పార్టీ తరఫున చురుకుగా స్పందించిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందినట్లు పేర్కొన్నారు.ఎన్నికల సమయంలో బూత్ స్థాయిలో పనిచేస్తూ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసినట్లు తెలిపారు.పార్టీ మారేందుకు వచ్చినఅవకాశాలు,ప్రలోభాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి కొనసాగుతున్నారని,సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో కూడా చురుకైన పాత్ర పోషించినట్లు ఆయన వివరించారు.ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ,సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారని,పార్టీ కోసం పనిచేసిన చంద్రమౌళికి పట్టణ అధ్యక్ష పదవి కేటాయిస్తే తగిన గుర్తింపు లభిస్తుందని, అధిష్టానం ఈ విషయాన్ని పరిశీలించాలని మేకల దేవరాజ్ కోరారు.

*మీరు సక్రమంగా పనులు చేయగలరా.. చేయలేరా…

*మీరు సక్రమంగా పనులు చేయగలరా.. చేయలేరా…

*అభివృద్ధి పనుల్లో పురోగతి ఏది..

*మాటలతో కాలాన్ని వృధా చేయడం తగదు…

*నెల రోజుల్లోపే అభివృద్ధి పనులు మొదలవ్వాలి.. లేకుంటే చర్యలు తప్పవు…

*అధికారుల సమీక్షలో ఎమ్మెల్యే ఆగ్రహం…

పలమనేరు(నేటిధాత్రి:

 

 

 

పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులను అధికారులు సమన్వయంతో మీరు కలసి సక్రమంగా పని చేయగలరా
చేయలేరా అంటూ స్థానిక ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేయించినప్పటికీ అధికారుల అలసత్వంతో పనులు ప్రారంభానికి నోచుకోకపోవడంతో ఆయన శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా పట్టణంలోని మురుగునీరును శుద్ధి చేసే ఎస్టిపి ప్లాంట్ అంశంపై రోజులు గడుస్తున్న సమస్య కొలిక్కి రావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విషయంలో మున్సిపల్, రెవిన్యూ అధికారులు ప్రత్యేక చొరవ చూపడం లేదని కాలయాపన చేయడం తప్పితే అడుగైన ముందుకు పడడం లేదని అసహనానికి గురయ్యారు. దాంతోపాటు సుమారు మూడు కోట్ల రూపాయల నిధులు ఉన్నప్పటికీ మున్సిపల్ పరిధిలో రోడ్లు, డ్రైన్లు ఏర్పాటు చేయడంలో ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారని నిలదీశారు. అభివృద్ధిలో ఏమాత్రం పురోగతి కనిపించడం లేదని సమయాన్ని వృధా చేయడం తప్పా ఏమాత్రం పనులు జరగడం లేదన్నారు. నెల రోజుల్లోపు అభివృద్ధి పనులన్ని ప్రారంభమయ్యేలా చూడాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరిష్కార మార్గాల వెంటనే పూర్తి చేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు.ఇక కొన్ని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి పోలీసులు సహకరించి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన అధికారులకు సూచించారు.ఈ సమీక్షలో ఆర్డీవో భవాని,తహసిల్దార్ ఇన్భనాధన్, కమిషనర్ ఎన్వి రమణారెడ్డి, డి.ఎస్.పి డేగల ప్రభాకర్, గంగవరం రూరల్ సిఐ పరశురాముడు, టి.పి.ఎస్ ఇందిరా, మున్సిపల్ డిఈ మరియు ఏఈలు పాల్గొన్నారు…

మహిళా విరోధి కాంగ్రెస్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి.

మహిళా విరోధి కాంగ్రెస్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి.

బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు గుర్రపు నాగరాజు

భూపాలపల్లి నేటిధాత్రి

 

చట్టసభల్లో నియోజకవర్గాల పెంపు మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన 131 వ రాజ్యాంగ సవరణ బిల్లును అడ్డుకుని కుటిల బుద్ధి చూపెట్టిన కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా ఆ పార్టీ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ నేతలు, ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ
చట్టసభల్లో సీట్ల పెంపు పెంచిన సీట్లలో మహిళా రిజర్వేషన్ అమలుకి సంబంధించిన 131 వ రాజ్యాంగ సవరణ బిల్లును అడ్డుకుని కాంగ్రెస్ మహిళా విరోధి బుద్ది మరోసారి చూపెట్టుకుంది, ఈ బిల్లు పాస్ అయి అమలు జరిగితే లోకసభలో దాదాపు 300 మంది మహిళలకు ప్రాతినిధ్యం దక్కేది అందులో సుమారు 70 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు ప్రాతినిధ్యం దక్కేది దేశ వ్యాప్తంగా వేల సంఖ్యలో చట్ట సభల్లో మహిళలకు ప్రాతినిధ్యం దక్కేది, ఇలాంటి బిల్లును అడ్డుకుని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్లు చెప్పే మహిళా సాధికారత మహిళలను మోసం చేయడం అని నిరూపించుకుంది.

గతంలో కూడా ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లును కాంగ్రెస్ అడ్డుకుంది, దేశ ప్రయోజనాలకు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు, సిఎఏ జిఎస్టి అమలు బిల్లులను అడ్డుకున్న నీచ చరిత్ర కాంగ్రెస్ ది, రామ మందిర్ నిర్మాణాన్ని, పాకిస్థాన్ పై చర్యలను వ్యతిరేకించిన దౌర్భాగ్య చరిత్ర కాంగ్రెస్ ది. కాంగ్రెస్ మద్దతుతో అవసరం లేకుండానే ఎన్నో ముఖ్యమైన బిల్లులను ఆమోదించి అమలు చేస్తున్న ప్రభుత్వం మాది, మోదీ నాయకత్వంలో చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ కూడా త్వరలో అమలు చేసి తీరుతాం. బిల్లును అడ్డుకుని మహిళా విరోధి బుద్ధి చూపెట్టిన కాంగ్రెస్ ని మహిళా లోకం ముందు దోషిగా నిలబెడతామని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ని మహిళలు రాజకీయంగా సమాధి చేయడం ఖాయం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గుర్రపు నాగరాజు గౌడ్ మాజీ మండల అధ్యక్షుడు దేశెట్టి గోపాల్ జిల్లా నాయకుడు కూర సురేందర్ రెడ్డి మాజీ బీజేవై మండల అధ్యక్షుడు పంజాల కుమార్ గౌడ్ మండల ప్రధాన కార్యదర్శి బండారి సమ్మయ్య బూతు అధ్యక్షులు సుబ్బక్క పల్లె సర్పంచ్ బొడ్డు రాజేందర్ కనిగంటి వెంకటేష్ శ్రీను రమేష్ దేశెట్టి రవీందర్ తదితరు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు

రక్త దానం చేద్దాం ప్రాణాలను కాపాడుదాం.

రక్త దానం చేద్దాం ప్రాణాలను కాపాడుదాం.

#రక్తదాతల సేవ స్ఫూర్తి అభినందనీయం.

#జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మన్ దివాకర టి.ఎస్.

ములుగు జిల్లా, నేటిధాత్రి:

రక్తదానం చేయడం ద్వారా నిండు ప్రాణాలను కాపాడవచ్చని, రక్తదాతల సేవ స్ఫూర్తి ప్రశంసా నియమని జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. అన్నారు.
శనివారం ములుగు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ -టి జి ఓ అసోసియేషన్, టీఎన్జీవో యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో ములుగు గట్టమ్మ దేవాలయ సమీపంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ దివాకర
టి.ఎస్.సందర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మనం ఇచ్చే ప్రతి రక్తపు బొట్టు ఒక నిండు ప్రాణాన్ని నిలబెడుతుందని, రక్తదానం అనేది కేవలం ఒక కార్యక్రమంగా చూడకూడదని, అది ఒక గొప్ప సామాజిక సంస్కృతిగా మారాలని ఉద్ఘాటించారు. జీవితాలను కాపాడే మహత్తర సేవలో భాగంగా ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తం అందుబాటులో ఉండడం అత్యవసర చికిత్స లలో ఎంతో కీలకమని, ముఖ్యంగా ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, అత్యవసర వైద్య సేవల సమయంలో రక్తదానం ప్రాణదాతగా నిలుస్తుందని అన్నారు.
జిల్లాలోని ప్రజలు,ఉద్యోగులు, ఉపాధ్యాయులు,యువత, పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేశారు.
అదనపు కలెక్టర్లు సి హెచ్ మహేందర్ జి, సంపత్ రావులు రక్తదానం చేసి ఉద్యోగులకు, దాతలకు స్ఫూర్తిగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సి హెచ్ మహేందర్ జి, సంపత్ రావు, డి ఆర్ డి ఓ చంద్రశేఖర్, అడిషనల్ డిఆర్డిఓ శ్రీనివాస్, ఉద్యోగ సంఘ ప్రతినిధులు, యువత, వైద్య బృందం, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కవిత కొత్త పార్టీపై రైతులకు అవగాహన కార్యక్రమం

కవిత కొత్త పార్టీపై రైతులకు అవగాహన కార్యక్రమం

25న ఆవిర్భావ సభకు హాజరు కావాలని పిలుపు

పరకాల,నేటిధాత్రి

కల్వకుంట్ల కవిత స్థాపించనున్న కొత్త రాజకీయ పార్టీపై పరకాల పట్టణంలో గల రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ ఆవిర్భావ సభ ఈ నెల 25న జరగనున్న నేపథ్యంలో రైతులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జీ బొచ్చు రాజు మాట్లాడుతూ,రైతుల సమస్యలకు ప్రాధాన్యతనిచ్చే విధంగా కొత్త పార్టీ కార్యాచరణ ఉంటుందని తెలిపారు.ఆవిర్భావ సభకు ప్రతి రైతు తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కొడపాక సచిన్,ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version