విద్యార్థులకు మొక్కల పంపిణీ
• నిర్మాణాలు త్వరగా పూర్తి చెయ్యాలి.
• ఎంపీడీవో రాజీరెడ్డి.
నిజాంపేట: నేటి ధాత్రి
తల్లి పేరు మీద ఒక మొక్క అనే కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి పాఠశాల విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ మేరకు నిజాంపేట మండలం నగరం తాండ గ్రామంలో గ్రామ కార్యదర్శి ఆరిఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీవో రాజీరెడ్డి హాజరయ్యారు. పాఠశాల విద్యార్థులకు ఒక్కొకరికి ఒక్కో మొక్కను ప్రధానం చేశారు. గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి త్వరితగతిన ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ సంధ్య, ప్రధానోపాధ్యాయులు ఉమారాణి, ఉపాధ్యాయులు వెంకటేష్, కల్పన, స్రవంతి విద్యార్థులు, గ్రామస్తులు ఉన్నారు.