మేడ్చల్‌లో గర్భిణీ భార్యను దారుణంగా హత్య చేశారు.

 గర్భవతని చూడకుండా.. రంపంతో ముక్కలు ముక్కలుగా నరికి.. మేడిపల్లిలో భర్త దారుణం..

 

నువ్వే నా ప్రాణం.. సర్వస్వమని మాయమాటలు పెళ్లి చేసుకున్న అతడు.. కొన్నేళ్లకే అసలు రూపం బయటపెట్టుకున్నాడు. గర్భిణీ అని కూడా చూడకుండా భార్యను అతి కిరాతకంగా రంపంతో ముక్కలు ముక్కలుగా నరికి చంపాడు. మేడ్చల్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన అందరి హృదయాలనూ కలచి వేస్తోంది.

మేడ్చల్ జిల్లా, మేడిపల్లి: మేడ్చల్ జిల్లా జరిగిన అమానవీయ ఘటన అంతటా కలకలం రేపుతోంది. మేడిపల్లి పరిధిలోని బాలాజీహిల్స్ కాలనీలో నివసిస్తున్న ఓ వ్యక్తి గర్భిణీ అయిన భార్యను అతి క్రూరంగా హతమార్చిన ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది. రంపంతో భార్యను ముక్కలు ముక్కలుగా కోసి శరీర భాగాలను మూసీ నదిలో పడేశాడు. ఇరువురి మధ్య కొన్నాళ్లుగా చెలరేగుతున్న కలహాలే హత్య దారి తీశాయని పోలీసులు అనుమానిస్తున్నారు. వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడకు చెందిన ఈ దంపతులు కొన్నాళ్ల కిందటే హైదరాబాద్‌లోని బోడుప్పల్ ప్రాంతానికి వలస వచ్చారు.

వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి (వయస్సు 25), మహేందర్ రెడ్డి ఇరువురూ ప్రేమించి వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌ వచ్చి నెల కూడా అవలేదు. మహేందర్ ర్యాపిడో నడుపుతుంటాడు. అయితే, కొంతకాలంగా దంపతులు ఇరువురూ తరచూ గొడవపడుతున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల క్రితం (ఆగస్ట్ 22) మధ్యాహ్న సమయంలో ఐదు నెలల గర్భవతిగా స్వాతిని ఆమె భర్త మహేందర్ రెడ్డి అత్యంత దారుణంగా హతమార్చినట్టు పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని ముక్కలుగా నరికి కవర్లలో పెట్టి వాటిని మూసీ నదిలో పడేసే ప్రయత్నం చేశాడు. తల, చేతులు, కాళ్లు వేరు చేసి విభిన్న ప్రాంతాల్లో వదిలిపెట్టినట్లు అతడు అంగీకరించినట్టు తెలుస్తోంది. మొండాన్ని మాత్రం ఇంట్లోనే ఉంచడంతో దుర్వాసన వచ్చి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కవర్లను పరిశీలించగా మహేందర్ ఇంట్లో స్వాతి మొండెం కనిపించింది. దీంతో నిందితుడు మహేందర్ రెడ్డి పోలీసులు వెంటనే అరెస్టు చేశారు.

స్వాతి తల్లి మీడియాతో మాట్లాడుతూ, తమ కూతురు డిగ్రీ చదువుతున్న సమయంలో మాయమాటలతో ఆకర్షించి మహేందర్ ఇంట్లోంచి తీసుకెళ్లి ప్రేమ వివాహం చేసుకున్నాడని తెలిపింది. మాట వినకుండా పెళ్లి చేసుకున్నప్పటికీ కొన్నాళ్ల తర్వాత బంగారం కూడా ఇచ్చామంది. కానీ పెళ్లి తర్వాత మహేందర్ పూర్తిగా మారిపోయాడని.. నా కూతుర్ని చిత్రహింసలు పెట్టేవాడని.. కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడనిచ్చేవాడు కాదంటూ కన్నీటిపర్యంతమైంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. కాగా, ఈ హత్య పూర్తిగా ప్రణాళికాబద్ధంగానే జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. మిగిలిన శరీర భాగాల కోసం మూసీ నదిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ఘటనతో ప్రేమ వివాహాలు, గృహహింస, మహిళల భద్రత అంశాలపై మళ్లీ చర్చ మొదలైంది. ప్రేమ పేరుతో జరిగే పెళ్లిళ్లు, అనంతరం వెలుగు చూస్తున్న హింసాత్మక సంఘటనలు సమాజాన్ని ఆలోచనలో పడేస్తున్నాయి. 

అనుచితంగా ప్రవర్తించి.. హతమయ్యాడు..

అనుచితంగా ప్రవర్తించి.. హతమయ్యాడు

 

 

తన భార్యతో అనుచితంగా ప్రవర్తిస్తున్నందుకే మెకానిక్‌ ధనుంజయను వరుసకు సోదరుడైన శివయ్య హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. పట్టణంలోని ఎల్‌పీ సర్కిల్‌లో ఈ నెల 21వ తేదీ రాత్రి జరిగిన మెకానిక్‌ పాళ్యం ధనుంజయ హత్య జరిగింది.

ధర్మవరం(అనంతపురం): తన భార్యతో అనుచితంగా ప్రవర్తిస్తున్నందుకే మెకానిక్‌ ధనుంజయ(Dhananjaya)ను వరుసకు సోదరుడైన శివయ్య హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. పట్టణంలోని ఎల్‌పీ సర్కిల్‌లో ఈ నెల 21వ తేదీ రాత్రి జరిగిన మెకానిక్‌ పాళ్యం ధనుంజయ హత్య జరిగింది. ఈ కేసులో నిందితుడు శివయ్యను అరెస్టు చేశామని డీఎస్పీ హేమంత్‌కుమార్‌ తెలిపారు. వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో శనివారం రాత్రి విలేకరుల సమావేశం నిర్వహించి, వివరాలు తెలిపారు.

 

 

కేతిరెడ్డి కాలనీ ఎల్‌-2లో పాళ్యం శివయ్య, ఎల్‌-3లో అతని పిన్ని కుమారుడు పాళ్యం ధనుంజయ నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ స్నేహంగా ఉంటూ మద్యం సేవించేవారు. శివయ్య భార్యతో ధనుంజయ చెడుగా ప్రవర్తించేవాడు. దీంతో శివయ్య(Shivayya) మందలించాడు. అయినా అతనిలో మార్పురాలేదు.

దీంతో శివయ్య కక్ష పెంచుకుని పథకం ప్రకారం ఈ నెల 21వతేదీ అర్ధరాత్రి ఎల్‌పీ సర్కిల్‌లో బ్రిడ్జి కింద ధనుంజయను సిమెంట్‌ ఇటుకతో బాది చంపేశాడు. నిందితుడిని సీఐ నాగేంద్రప్రసాద్‌, ఎస్‌ఐ కేతన్న, హెడ్‌ కానిస్టేబుళ్లు అప్పస్వామి, శివశంకర్‌, కానిస్టేబుళ్లు రాజప్ప, షాకీర్‌, బయన్న, సుధీర్‌కుమార్‌, రాజన్న శనివారం అరెస్టు చేశారని డీఎస్పీ తెలిపారు.

జహీరాబాద్ లో యువకుడి హత్య..

జహీరాబాద్ లో యువకుడి హత్య..

◆:- మొదట మిస్సింగ్.. అనంతరం హత్య.

◆:- శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణ పరిధిలోని ఫైజ్ నగర్కు చెందిన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. హ త్యకు గురైన వ్యక్తి మొహమ్మద్ తాజో ద్దీన్ (22)గా గురించారు. పట్టణ పరిధి అల్లానా రోడ్డులో గల రహమత్ నగర్ ప్రాంతంలో ఆయన మృతదేహం లభిం చింది. నిన్న నమాజ్ కోసం వెళ్తున్నట్లు
ఇంట్లో చెప్పి బయలుదేరిన యువకుడు రాత్రి వరకు రాలేదు. జామ మసీదు వద్ద ఆయన బైక్ ను రికవరీ చేశారు. ఇవాళ ఓ పాడు బావిలో మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అక్కడకు చేరుకొని పరిశీలించగా మృత దేహం మీద గాయాలున్నందున కసితీరా పొడిచి హత్య చేసి అక్కడి నుంచి పరారై నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా హత్య ఎవరు, ఎందుకు చేశారనేది తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీవాణిది ప్రభుత్వ హత్యే

శ్రీవాణిది ప్రభుత్వ హత్యే

సంతాపసభలో పాల్గొన్న డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్,మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

పరకాల నేటిధాత్రి
వరంగల్ ఉమ్మడి జిల్లా స్వేరోస్ వారి ఆధ్వర్యంలో పట్టణంలోని స్వర్ణ గార్డెన్స్ లో స్వేరో పలకరింపు,సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది.మండలంలోని మల్లక్కపేట గ్రామ శివారులోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఆత్మహత్య చేసుకొని బలవన్మరణం చెందిన ఏకు శ్రీవాణి స్మరణ సభలో

 

బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్,పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు.అనంతరం బస్టాండ్ కూడలి నుండి ర్యాలీతో ఏకు శ్రీవాణి నివాసానికి వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు.అనంతరం శ్రీవాణి మృతి ప్రభుత్వ హత్యే అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబేద్కర్ సెంటర్ చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సభా ప్రాంగణానికి చేరుకుని మహనీయుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించి తదుపరి శ్రీవాణి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపసభను కొనసాగించారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్వేరోస్ నాయకులు,నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,యూత్ నాయకులు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

హత్యకు దారితీసిన అనుమానం.. రాత్రంతా భర్త శవంతో..

హత్యకు దారితీసిన అనుమానం.. రాత్రంతా భర్త శవంతో..

 

 

 

 

 

మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను హతమార్చిన భార్య రాత్రంతా భర్త శవంతో గడిపిన సంఘటన కడలూరు జిల్లా నైవేలిపట్టణంలో చోటుచేసుకుంది.

– భర్తను చంపి తెల్లారేవరకు శవంతోనే ఉన్న భార్య

చెన్నై: మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను హతమార్చిన భార్య రాత్రంతా భర్త శవంతో గడిపిన సంఘటన కడలూరు(Kadaluru) జిల్లా నైవేలిపట్టణంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు నైవేలి పంచాయతీ బీ2-బ్లాక్‌లో ఎన్‌ఎల్‌సీ నుంచి పదవీవిరమణ పొందిన కొలంజియప్పన్‌ (63) నివశిస్తున్నారు.

 

ఆయన భార్య మరణించడంతో భర్తకు దూరమైన పద్మావతి (55) అనే మహిళను 20ఏళ్ళ కిత్రం వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ నేపథ్యంలో, మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ కొలంజియప్పన్‌పై పద్మావతి నెల రోజుల క్రితం నైవేలి పోలీస్‏స్టేషన్‌(Nyveli Police Station)లో ఫిర్యాదు చేసింది. దీంతో భార్యాభర్తలు తరచూ గొడవలు పడుతుండేవారని తెలిసింది.

 

ఈ నేపథ్యంలో మంగళవారం అర్థరాత్రి గాఢనిద్రలోవున్న కొలంజియప్పన్‌ గొంతును పద్మావతి కత్తితో కోయడంతో అతడు మృతిచెందినట్లు తెలిసింది. భర్త శవం వద్ద పద్మావతి ఉదయం వరకు ఉన్నట్టు పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో తెలిపింది. ఆమెను అరెస్టు చేసి బుధవారం ఉదయం కోర్టు ఉత్తర్వుల మేరకు రిమాండ్‌కు తరలించారు.

హత్య చేసిన నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులు.

హత్య చేసిన నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

ఆన్ లైన్ బెట్టింగ్ ఆడేందుకు న్యాల్కల్ మండలం రుక్మాపూర్ లో రాణేమ్మ అనే మహిళను ప్రశాంత్ (21) హత్య చేసినట్లు జహీరాబాద్ డిఎస్పీ సైదా తెలిపారు. పోలీస్ స్టేషన్ లో శనివారం వివరాలను వెల్లడించారు. ఈనెల 26వ తేదీన రాణెమ్మ (48) హత్య చేసి ఆభరణాలు నగదుతో ప్రశాంత్ పరారైనట్లు చెప్పారు. నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు.

ధనాసిరి గ్రామంలో దారుణ హత్య.

ధనాసిరి గ్రామంలో దారుణ హత్య.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

సంగారెడ్డి: మొగుడంపల్లి మండలంలోని ధనాసిరి గ్రామంలో ఓవ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. గ్రామానికి చెందిన సత్తార్మియా కుమారుడు అబ్బాస్ (25) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. తన మిత్రులతో డైరీఫామ్ వద్ద దావత్ చేసుకుంటుండగా మరో ఇద్దరు వ్యక్తులు అక్కడికి చేరుకొని మారణాయుధాలతో ఆకస్మికంగా దాడిచేసి హత్య చేశారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రాజలింగమూర్తి హత్య కేసులో ప్రధాన నిందితుడు.!

రాజలింగమూర్తి హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిబాబు సహా మరో ఇద్దరు అరెస్ట్

భూపాలపల్లి నేటిధాత్రి:

గత నెల భూపాలపల్లి పట్టణంలో జరిగిన నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో ప్రధాన నిందితుడైన కొత్త హరిబాబు ఖాసింపల్లి , భూపాలపల్లి అను అతనిని భూపాలపల్లి పోలీసులు అరెస్టు చేశారు. హరిబాబు పారిపోవడానికి సహకరించిన ములుగు జిల్లాకి చెందిన వట్టే రమణయ్య రమ అనే ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినారు. ఈ అరెస్ట్ నిమిత్తమై మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఢిల్లీ, జైపూర్ ,ఆగ్రా తదితర ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించి చివరికి నిందితుని ఆచూకీ తెలుసుకొని పోలీసులు అరెస్టు చేశారు.
ఇప్పటికే అరెస్టు అయిన నిందితులను మరల పోలీస్ కస్టడీ తీసుకొని పూర్తిస్థాయిలో విచారించి తదుపరి చర్య తీసుకోబడునని భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్ ఎస్సై సాంబమూర్తి తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version