నలుగురిని అదుపులోకి తీసుకొని, కోర్టులో హాజరు పరిచిన పోలీసులు.
మీడియా సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించిన “కాజీపేట ఏసిపి ప్రశాంత్ రెడ్డి”…
నేటిధాత్రి, హాసన్ పర్తి. హనుమకొండ.
నగరంలో సంచలనం సృష్టించిన మహిళా డాక్టర్ ఆత్మహత్య కేసు విచారణ చేపట్టిన పోలీసులు 24 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకుని, వైద్య పరీక్షలు జరిపించి, కోర్టులు హాజరు పరిచిన హసన్పర్తి పోలీసులు. నిందితుల వివరాలను, ఆత్మహత్య కు గల కారణాలు, జరిగిన ఉదంతంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించిన కాజీపేట ఏసిపి ప్రశాంత్ రెడ్డి. ప్రత్యూష భర్త డాక్టర్ సృజన్ తన ప్రియురాలితో కలిసి వేధించడం వల్లనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో డాక్టర్ అల్లాడి సృజన్, ఆయన పేరెంట్స్, ప్రేయసి శ్రుతి ఉన్నారు.
అసలేం జరిగింది…?
నిండు ప్రాణం బలిగొన్న బుట్టబొమ్మ?
రీల్స్ అమ్మాయి వల్ల నిండు ప్రాణం పోయిన తీరు.. రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి..
రీల్స్ మోజులో భార్యకు చిత్రహింసలు. ప్రముఖ వైద్యుడు సృజన్ సహా నలుగురి రిమాండ్.
యువ డాక్టర్ల మధ్య చిచ్చు పెట్టిన రీల్స్ అమ్మాయి.
బుట్టబొమ్మ అనే ఐడితో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే అమ్మాయి.
మెడికవర్ హాస్పిటల్ ప్రమోషన్ కోసం వచ్చిన అమ్మాయి, డాక్టర్ సృజన్ తో ప్రేమాయణం.. ఇద్దరి మధ్య రీల్స్ కలిపిన ప్రేమ.
అమ్మాయి ప్రేమలో మునిగిపోయిన యువ డాక్టర్.. పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం..
రిసార్ట్స్ లో చెట్టాపట్టాల్.. వీరిద్దరి రహస్య సంబంధం ఇంట్లో తెలిసి గొడవలు..
ఆదివారం సాయంత్రం బార్య (డాక్టర్) ప్రత్యూష హాసన్పర్తి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య.
రీల్స్ అమ్మాయి వల్ల నిండు ప్రాణం పోయిన తీరు.. రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి..
రీల్స్ పేరిట బాగానే సంపాదించినట్లు వినికిడి.. మంచి హోదాలో ఉండి ఇలాంటి పనులు చేయడం వైద్య వృత్తికే కళంకితం అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్న తీరు..
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సరైన యువతితో వివాహేతర బంధం పెట్టుకున్న భర్త తనను నిత్యం చిత్రహింసలకు గురిచేస్తున్నాడని వైద్యురాలైన భార్య బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా హసన్‌పర్తిలో జరిగింది. హసన్‌పర్తి పోలీసు స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాజీపేట ఏసీపి ప్రశాంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా కమలాపూర్ మండలం మంగపేటకు చెందిన డాక్టర్ అల్లాడి సృజన్ కేఎంసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితోపాటు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోనూ కార్డియో సర్జన్‌గా పని చేస్తున్నారు. ఆయనకు వరంగల్ నగరానికి చెందిన దంత వైద్యురాలైన ప్రత్యూష (36)తో 2017లో వివాహమైంది. వివాహ సమయంలో 30 లక్షల రూపాయలు కట్నం, కారు, 30 తులాల బంగారం ఇచ్చారు అని, వీరికి ఇద్దరు కుమార్తెలు. హసన్‌పర్తి మండల కేంద్రంలో నివసిస్తున్నారు. ఏడాదిన్నర కిందట ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ కార్యక్రమానికి ప్రచారం కల్పించడానికి వచ్చిన హనుమకొండ రెవెన్యూ కాలనీకి చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సరైన యువతి శ్రుతి తో సృజన్‌కు పరిచయమైంది. అది కాస్త వివాహేతర బంధానికి దారి తీసింది. అప్పటి నుంచి కుటుంబాన్ని పట్టించుకోని సృజన్ భార్యను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. అత్తామామలు మధుసూదన్ – పుణ్యవతి సైతం కుమారుడికి వత్తాసు పలుకుతూ కోడలును వేధించారు. సృజన్ చేయి చేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రత్యూష ఆదివారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకుంది. గమనించిన భర్త ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సోమవారం ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో హసన్‌పర్తి పోలీసులు సృజన్, ఆయన తల్లిదండ్రులతో పాటు యువతిపై కేసు నమోదు చేశారు. ప్రత్యూష శరీరంపై పలుచోట్ల గాయాలున్నాయని ఆమెది ఆత్మహత్య కాదని భర్త, అత్తామామ, మరో యువతి చిత్రహింసలకు గురిచేసి చంపారని తల్లిదండ్రులు ఆరోపించారు. విచారణ జరిపిన పోలీసులు 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.
నీ రీల్స్ తగలెయ్య…
ఎంత పనిచేశావ్ బుట్టబొమ్మ అంటూ చీదరిస్తున్న నెటిజన్లు
500, వెయ్యి రూపాయలకు ప్రమోషన్ రీల్స్ చేసుకునే అమ్మాయి, పెళ్లి అయిన వ్యక్తితో ప్రేమ దోమా అంటూ, చివరికి ఒక మహిళ చావుకు కారణం అయ్యావు అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వైరల్ అవుతున్నాయి. నీ వల్ల నిండు ప్రాణం బలి అయిపోయే.. సంతోషంగా ఉన్న మూడు కుటుంబాలు రోడ్డు మీదకు వచ్చిన తీరు.. ఇద్దరు ఆడ పిల్లలు తల్లి లేకుండా అయ్యారు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సదరు రీల్స్ అమ్మాయిని దుమ్మెత్తి పోస్తున్నారు. సదరు డాక్టర్ ఏమైనా తక్కువ అంటే కాదు, సదివింది డాక్టర్ చదువు.. ఉన్నతమైన ప్రొఫెషన్.. మంచి కుటుంబం.. సొసైటీ లో మంచి పేరు, రీల్స్ చేసుకునే అమ్మాయితో ప్రేమ కథలు పడితివి… తీరా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి.. తోటి డాక్టర్లు కూడా ఎవరు సపోర్ట్ చేయొద్దు అని నెటిజన్లు కోరుతున్నారు. ఇలాంటి వాళ్లకు తగిన శిక్షలు పడితేనే మిగతా వాళ్ళు మారుతారు అని నెటిజన్ల అభిప్రాయం. ఏది ఏమైనా సృజన్, శృతిల ప్రేమాయణం కారణంగా ఒక మహిళ ప్రాణం బలిగొన్న ఘటన, నగరంలో విషాదకరంగా మారింది.