ఆరోగ్యలక్ష్మి కమిటీ సమావేశంలో పాల్గొన్న సర్పంచి ఉప సర్పంచ్.

ఆరోగ్యలక్ష్మి కమిటీ సమావేశంలో పాల్గొన్న సర్పంచి ఉప సర్పంచ్.

చిట్యాల, నేటిదాత్రి :

 

చిట్యాల మండలం కేంద్రంలో ని నాలుగవ ,ఐదవ కేంద్రం అంగన్వాడీ టీచర్స్ భాగ్యలక్ష్మి, జ్యోతి ఏర్పాటు చేసిన ఆరోగ్యలక్ష్మి కమిటీ సమావేశమునకు ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ తౌటం లక్ష్మీ , ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్ హాజరైనారు. ముందుగా ప్రజా ప్రతినిధులను శాల్వాలతో ఘనంగా సన్మానించుకోవడం జరిగింది.ఈ సమావేశం యొక్క ఉద్దేశాన్ని జయప్రద సూపర్వైజర్ హాజరై కేంద్రాలలో జరుగు కార్యక్రమాల గూర్చి వివరించారు. మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలకు ఆట,పాట, కథ ద్వారా క్రమశిక్షణతో కూడిన ఎల్కేజీ, యూకేజీ నర్సరీ సంబంధించిన విద్యను బోధించి ప్రైమరీ స్కూల్ కు సంసిద్ధులుగా తయారు చేయడం, రుచిగా, వేడిగా, క్వాలిటీ, క్వాంటిటీ ప్రకారం తల్లులకు, పిల్లలకు భోజనం పెట్టడం పిల్లల బరువులు తీయడం, లోప పోషణ గుర్తించడం బాలమృతం, ఎగ్స్ పంపిణీ చేయడం, కిశోర బాలికలకు, పల్లి పట్టీలు ఇవ్వడం, బాల్యవివాహాలు, అక్రమ రవాణా, దత్తత, అనాధ బాలబాలికలను గుర్తించి హాస్టల్లో చేర్పించడం జరుగుతుందని వివరించారు. హై స్కూల్, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదగాలంటే ప్రైవేట్ స్కూల్స్ కు పంపకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని అప్పుడే పిల్లలందరూ అన్ని రంగాలలో ముందంజలో ఉంటారని వివరించారు. సర్పంచ్ ఉప సర్పంచ్ మాట్లాడుతూ కేంద్రాలలో ఎటువంటి సమస్యలు ఉన్న, అవసరాలు ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని తెలిపినారు. వారి చేతుల మీదుగా ముగ్గురు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి పల్లి పట్టీలు, బాలమృతం పంపిణీ చేయనైనది. వార్డు మెంబర్స్ తౌటమ్ నవీన్ మైదం శ్రావ్య ఏఎన్ఎం సుమలత , ఆశ వర్కర్ అధిక సంఖ్యలో మహిళలు కిశోర బాలికలు హాజరైనారు.

 

బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం…

బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం.

చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్
గుర్రం తిరుపతి.

చిట్యాల, నేటిదాత్రి :

 

భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి సూచన మేరకు
చిట్యాల మండలంలోని చల్లగరిగా ప్రభుత్వ పాఠశాలలో డీసీపీయూ,చైల్డ్ హెల్ప్ లైన్, డి హెచ్ ఈ డబ్ల్యూ మరియు తెలంగాణ సాంస్కృతిక సారథి విభాగాల సమన్వయంతో అవగాహన కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగిందని తిరుపతి తెలిపారు.అలాగే బాల్యవివాహాల నిషేధ చట్టం 2006 గూర్చి ప్రతి విద్యార్థికి అవగాహన ఉండాలని, బాల్యవివాహాలు ఎవరైనా జరిపినట్లైతే చట్టపరమైన చర్యలు తప్పవని తెలుపుతూ ప్రభుత్వం కల్పించిన టోల్ ఫ్రీ నెంబర్లు 1098,181,1930 పైన అవగాహన కల్పించడం జరిగింది.నేటి బాలలే రేపటి పౌరులుగా నవ సమాజ నిర్మాణానికి నాంది కావాలని బాల్యంలో చదువుకోవాల్సిన విద్యార్థులు పనులకు గాని పెళ్లిళ్లకు గాని ఆసక్తి చూపకూడదని తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో డి సి పి యు సోషల్ కుమార్, డి హెచ్ ఈ డబ్ల్యూ మమత,తెలంగాణ సాంస్కృతిక సారథి ఎర్రన్న బృందం మరియు సహాయఎన్జీవో,ప్రభులత, కోమల,పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఝాన్సీ, శ్రీనివాస్ ఉపాధ్యాయ ఉపాధ్యాయులు,పాల్గొన్నారు.

భూపాలపల్లి బాల్యవివాహాల అవగాహన కార్యక్రమం

బాల్యవివాహాల నిర్మూలనకై అవగాహన

భూపాలపల్లి నేటిధాత్రి

 

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మల్లేశ్వరి సూచనల మేరకు భూపాలపల్లి మండలం ఆజాంనగర్లో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఆర్ రాజేశ్వరి అధ్యక్షతన బాల్యవివాహాల పైన అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి రాజేశ్వరి మాట్లాడుతూ బాల్యవివాహాల నిర్మూలనపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని, బాల్యంలో చదువుకోవాల్సిన పిల్లలకి పెళ్లిళ్లు చేస్తే బాల్యవివాహాల నిషేధ చట్ట ప్రకారం వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోబడునని తెలపడం జరిగింది అలాగే నేటి బాలలే రేపటి పౌరులుగా, నవ సమాజ నిర్మాణానికి నాంది కావాలని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ గుర్రం తిరుపతి, జెండర్ స్పెషలిస్ట్ అనూష, సఖి కౌన్సిలర్ మాధవి, కమ్యూనిటీ ఎడ్యుకేటర్ ప్రసాద్ అంగన్వాడీ టీచర్లు, బాలింతలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు అని రాజేశ్వరి తెలిపారు

అంగన్వాడి టీచర్లు ఆయాలు సమయపాలన పాటించాలి…

అంగన్వాడి టీచర్లు ఆయాలు సమయపాలన పాటించాలి.

జిల్లా ఇన్చార్జి డి డబ్ల్యు ఓ మల్లేశ్వరి.

చిట్యాల, నేటిదాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని నైన్ పాక సెక్టార్ మీటింగ్ ఒడితల లక్ష్మి టీచర్ కేంద్రంలో జయప్రద సూపర్వైజరు సమక్షంలో జరుపుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్చార్జి బీడబ్ల్యుఓ మల్లేశ్వరి హాజరై అంగన్వాడి కేంద్రాలలో జరుగు కార్యక్రమాల గూర్చి వివరించారు. టీచర్ ,ఆయా సమయపాలన కచ్చితంగా పాటించాలి. ప్రీస్కూల్ కార్యక్రమాలన్నీ ఆట ,పాట ,కథ ద్వారా నేర్పించాలి. మెనూ ప్రకారం పిల్లలకు, తల్లులకు వేడిగా రుచిగా భోజనం పెట్టాలి. ఆన్లైన్ వర్క్ ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో చేయాలి. కొత్తగా లబ్ధిదారులు వచ్చిన వెంటనే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ , ఫేస్ క్యాప్చర్ అయిన తర్వాతనే ఫుడ్ ఇవ్వాలని సూచించారు తదుపరి ఇద్దరు పిల్లలకు అన్నప్రాసన చేయడం జరిగింది. లక్ష్మి, ఉమాదేవి, సుజాత మిగతా 25 మంది టీచర్స్ హాజరైనారు.

పేదల కలల్ని సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోంది….

పేదల కలల్ని సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోంది

#పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా ఇంటి కలను సాకారం చేస్తాం.

#అర్హులైన ప్రతి పేదవారికి విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం.

#వెంకటాపూర్ గ్రామములో ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశానికి హాజరై ప్రారంభించిన ….

#రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.

ములుగు జిల్లా, నేటిధాత్రి:

 

పేదల కలల్ని సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని
రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
గురువారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలోని బీసీ కాలనీ కి చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు బయ్యా ప్రమీల ఇందిరమ్మ ఇల్లును రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల జీవనోపాధికి చిహ్నంగా నిలిచిందని మంత్రి సీతక్క అన్నారు.
పేదల బాగోగుల పట్ల శ్రద్ధచూపడం అందులో భాగమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు అంటేనే ప్రజా ప్రభుత్వం గుర్తుకు వస్తోందని, పేద ప్రజల కలల ఇళ్ల రూపంలో ప్రతిబింబించడానికి ఈ పథకం దోహదపడిందని మంత్రి వివరించారు.
ప్రజా ప్రభుత్వమే నిజమైన రైతు–కూలీలకు అండగా నిలుస్తోందని అన్నారు. రైతును “రాజు”గా చూడాలనే సంకల్పంతోనే సన్నవరి వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. తొమ్మిది నెలల వ్యవధిలోనే రూ.21 వేల కోట్లతో రెండు లక్షల లోపు ఉన్న రైతుల రుణమాఫీ చేయడం, రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం, మూడు విడతల్లో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇండ్లు కట్టించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. అలాగే, 7 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం, 17 లక్షల పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల పేర్లు నమోదు చేయడం వంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజా ప్రభుత్వమే విజయవంతంగా అమలు చేసిందని మంత్రి అన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ జోడెద్దుల్లా సమపాళ్లలో ముందుకు వెళ్తున్నాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కేవలం కమిషన్‌ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టుపైనే దృష్టి పెట్టిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. పేదల గౌరవప్రదమైన జీవనానికి ప్రతీకగా నిలిచే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్గా విశాలాక్షి…

నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్గా విశాలాక్షి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్గా విశాలాక్షి విధుల్లో చేరారు. హైదరాబాద్ మహిళా శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్న విశాలాక్షిని ఇక్కడకు బదిలీ చేశారు. నూతన డిప్యూటీ కలెక్టరు కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు. విశాలాక్షి మాట్లాడుతూ.. నిమ్జ్ రైతుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version