బాలానగర్ మండల కేంద్రంలోని స్థానిక రైల్వే స్టేషన్ కు వెళ్లే దారిలో ఉన్న శ్రీ దత్త హాస్పిటల్ ప్రథమ వార్షికోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వహకురాలు.. డాక్టర్ మౌనిక (ఎండి) మాట్లాడుతూ.. ఈనెల ఏడో తేదీ వరకు ఓపి, ల్యాబ్ టెస్టులకు 30 శాతం ఫీజు తగ్గింపు ఉంటుందని అన్నారు. మండలంలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తక్కువ ఫీజులతోనే మండలంలోని రోగులకు ఆపరేషన్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందమోని దత్తాత్రేయ, మాజీ సర్పంచ్ సాటి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కుర్వ శ్రీను, డాక్టర్ మారుతి, ప్రసన్నకుమార్, సచిన్, భాస్కర్ రెడ్డి, శ్రీకాంత్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ శ్రీధర్ బాబు కి పాలభిషేకం చేసిన గ్రామ ప్రజలు,నాయకులు
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు పర్శ ఓదెలు ఆధ్వర్యంలో ఖమ్మంపల్లి సమ్మక్క-సారక్క మినీ మేడారం అభివృద్ధి కొరకు నాలుగు లక్షలరూపాయలను ఇచ్చినందుకుగాను మన ప్రాంత అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కి,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుచొప్పరి సదానందం కి పాలాభిషేకం చేయడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షులు అల్లం కుమారస్వామి ,గ్రామ శాఖ అధ్యక్షులు పర్శ ఓదెలు,వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జాగరి సమ్మయ్య,గ్రామ యువజన అధ్యక్షులు వార్డుమెంబెర్స్ దొమ్మటి రాజేందర్,అల్లం శేఖర్ లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం దేవస్థానల అభివృద్ధికి నిధులు విడుదల చెయ్యడం గొప్ప వరం లాంటిదని నాయకులు కొనియాడారు మరియు మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు కి టి పి సి సి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు కి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు,రైతులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం కు చెందిన కాంగ్రెస్ పార్టీ టి.పిసిసి ప్రధాన కార్యదర్శి ఎస్. వినోద్ కుమార్ ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ అబ్జర్వర్ గా రెండవసారి బుధవారం నియామకమయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తిగా చాలా సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఓ నిజమైన నాయకుడిగా ఆయన ఎన్నో పదవులు పొందినారు .ఖైరతాబాద్ నుంచి మరోసారి కాంగ్రెస్ పార్టీ తరఫున అబ్జర్వ్ గా ఆయనను నియమించడం జరిగింది.ఈ మేరకు టి.పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంకితభావంతో పని చేసినందుకు తనకు కాంగ్రెస్ పార్టీ రెండవసారి ఖైరతాబాద్ అబ్జర్వర్ గా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరుపేదల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అన్నారు.
బీఆర్‌ఎస్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటిమెంట్ రగిల్చి బీఆర్ఎస్ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒక ప్రాంతానికి చెందిన వారు కాదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) అన్నారు. నగరంలోని రవీంద్ర భారతిలో ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 4వ వర్ధంతి సభలో మహేష్ గౌడ్ పాల్గొని ప్రసంగించారు. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో పెడితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. సెంటిమెంట్ రగల్చి బీఆర్ఎస్ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దేవుళ్ల విషయంలో సీఎం ఒక సామెతగా చెప్పారని.. దాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. బీఆర్ఎస్ కోసమే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపించారు.
హిల్ట్ పాలసీ ద్వారా హైదరాబాద్‌లో సామాన్యులకు భూముల ధరలు అందుబాటులో వస్తాయని వెల్లడించారు మహేష్ గౌడ్. కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్ మారుతుందని తెలిపారు. అవినీతికి అలవాటు పడ్డ కేసీఆర్ కుటుంబం.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా అవినీతి అని ఆరోపణలు చేయడం అలవాటుగా మారిందని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ విమర్శించారు.కాగా.. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 4వ వర్ధంతి సభను రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ దయానంద్, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, జగ్గారెడ్డి, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోశయ్య చిత్రపటానికి నేతలు నివాళులర్పించారు. రోశయ్య వర్ధంతి సందర్భంగా వి.హనుమంతరావును రోశయ్య మెమోరియల్ ట్రస్ట్ సత్కరించింది. అలాగే రోశయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన పేద విద్యార్థులకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ స్కాలర్ షిప్‌లు అందజేశారు.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లోని గ్రామ పంచాయతీల కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు… తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క వారి ఆదేశాల మేరకు అధికారికంగా నియామకం చేసినట్లు కొత్తగూడ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య తెలిపారు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల వారి పేర్లు మరియు గ్రామపంచాయతీ పేర్లు జాబితా .. ! కుంజ బిక్షపతి కోనాపురం గ్రామపంచాయతీ ఆలూరి కిరణ్ సాధిరెడ్డిపల్లి,వాసం నరసమ్మ ఎంచగూడ, వంక రామయ్య మొండ్రాయి గూడెం,గట్టి కొమ్మక్క గుండం,గట్టి రాములు ఓటాయి, మాలోత్ మంజుల రేనియా తండా,గొంది సోనీ జంగవానిగూడెం,దనసరి ముత్తయ్య ఎదుల్లపల్లి, వజ్జ శైలజ దుర్గారం, బానోతు దేవేందర్ ముష్మి, తేజావత్ పార్వతి రామన్నగూడెం,ఇర్ప రనిత గోవిందాపురం ఈక శ్రీనివాస్ పెగడపల్లి నునావత్ వీరన్న పోగుళ్లపల్లి, వజ్జ అక్షయ్ వర్మ వేలుబెల్లి,నూనావత్ స్వామి చెరువు ముందు తండా, ఈసం పుష్పలత,బత్తులపల్లి వట్టం శ్రీనుబాబు, గోపాలపురం, తాటి వసంత, తాటి వారి వేంపల్లి, సుంచ సిరివెన్నెలకార్లయి, తొలేం అనంతరావుగుంజేడు, మల్లెల భాగ్యమ్మ కొత్తగూడ త
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న
◆:- తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
టీపీసీసీ అధ్యక్షులు & ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్,తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్,తెలంగాణ ఇంచార్జ్ విశ్వనాథన్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విజయ సన్నాహక సమావేశం.ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రులు,ప్రభుత్వ సలహాదారులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,కార్పొరేషన్ చైర్మన్‌లు ఈ కార్యక్రమంలో జహీరాబాద్ నియోజకవర్గ తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు.
మొగిలి పార్థివదేహానికి నివాళులు అర్పించిన మాజీ టిపిసీసీ ఉపాధ్యక్షులు దొమ్మటి
పరకాల,నేటిధాత్రి
Vaibhavalaxmi Shopping Mall
మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డుకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ మడికొండ మొగిలి గుండెపోటుతో అకాల మరణం చెందగా టీపీసీసీ మాజీ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య గురువారం మడికొండ మొగిలి పార్దివదేహాన్ని సందర్శించి పూలమాలలువేసి నివాళులు అర్పించారు.ఈ పరామర్శలో పిఎసిఎస్ మాజీ ఛైర్మెన్ బొజ్జం రమేష్,టీపీసీసీ ఎస్సిసెల్ కమిటీ వైస్ చైర్మన్ డాక్టర్.మడికొండ శ్రీను, కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు బొచ్చు చందర్,సమన్వయ కమిటీ సభ్యులు చిన్నాల గోనాథ్,మడికొండ సంపత్ కుమార్,బిసి సంఘం నాయకుడు అముదాలపల్లి మల్లేశం గౌడ్,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పుల్యాల గాంధీ,మండల ఎస్సిసెల్ అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి,పట్టణ నాయకులు పాడి వివేక్ రెడ్డి,బొచ్చు భాస్కర్,బొచ్చు జితేందర్,బొచ్చు రవి,ఒంటెరు వరుణ్,బొచ్చు అనంత్,బొచ్చు రవి కుమార్,లాదేళ్ల బిక్షపతి,మడికొండ రాజు తదితరులు ఉన్నారు.
ఉప్పరి సాయి కృష్ణను అభినందించిన మాజీ టీపీసీసీ అధ్యక్షులు దొమ్మటి
పరకాల నేటిధాత్రి
హనుమకొండ జిల్లా పరకాల మండల పరిధిలోని మలకపేట గ్రామానికి చెందిన ఉప్పరి రవీందర్ మమత దంపతుల కుమారుడు ఉప్పరి సాయికృష్ణ ఎంబిబిఎస్ ప్రతిమ వైద్య కళాశాలలో సీటు వచ్చిన సందర్భంగా గురువారం రోజున ఉప్పరి సాయికృష్ణను మాజీ టీపీసీసీ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా దొమ్మటి సాంబయ్య మాట్లాడుతూ ఒక పేద కుటుంబంలో పుట్టి ఉన్నంత చదువు చదివి సీటు సంపాదించదం అభినందనియామని గ్రామ యవత చదువులో ముందుండి మిగతా గ్రామాల యువతకు ఆదర్శవంతంగా ఉండాలని తల్లిదండ్రుల పేరును మరియు గ్రామ పేరును నిలబెట్టే విధంగా యువత తయారు అవ్వాలని,ఎంబిబిఎస్ సీటు సాధించిన సాయి కృష్ణ మరింత మంది యువతకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మల్లక్కపేట గ్రామస్తులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టిపిసిసి సభ్యులు రఘునాథ్ రెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
ఓటు హక్కు కోల్పోవడం అంటే సర్వం కోల్పోయినట్లే అని రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టిపిసిసి సభ్యులు రఘునాథ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు అబ్దుల్ అజీజ్ లు అన్నారు. గురువారం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అమ్మ గార్డెన్ ఏరియాలో ఓటు చోరీ పేరిట కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు.
ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ల పిలుపుమేరకు ఓటు చోరీ పై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఓటు చోరీ ఆపాలని కేంద్రానికి సంతకం చేసి తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని ప్రజలను కోరారు. ఓటు చోరీపై బూత్ స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికి వెళ్లి సంతకాలు సేకరించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఓట్ల చోరీకి పాల్పడిందని దీనిపై రాహుల్ గాంధీ అలుపెరగని పోరాటం చేస్తున్నారని అన్నారు. బిజెపి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను అణచివేయాలని చూస్తుందని విమర్శించారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చేలా ఓటు చోరీ జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, మాజీ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ పనాస రాజు, నాయకులు గోపు రాజం, గోపతి భానేష్, భీమ మల్లేశ్, బొద్దుల ప్రేమ సాగర్,రామ్ సాయి, మహిళా నాయకురాలు పుష్ప తదితరులు పాల్గొన్నారు.
టీపీసీసీ లీగల్ సెల్ కోరుట్ల నియోజకవర్గ కన్వీనర్ గా ఎం.డి.రజాక్ మెట్ పల్లి సెప్టెంబర్ 23 నేటి దాత్రి
మెట్ పల్లి పట్టణం: పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా నియమితులైన కోరుట్ల అసెంబ్లీ నియిజకవర్గ లీగల్ సెల్ కమిటీ సభ్యులకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు నియామక ఉత్తర్వులను అందించారు. కన్వీనర్ గా సీనియర్ న్యాయవాది ఎం.డి.రజాక్, కో కన్వీనర్లుగా కస్తూరి రమేష్, మన్నే గంగాధర్, జాయింట్ కన్వీనర్లుగా వంగవేణు, నేరెళ్ల శ్రీధర్, జనరల్ సెక్రటరీ గా నల్ల రాజేందర్, జాయింట్ సెక్రెటరీలుగా గజ్జి గంగారాం, మద్దుల రోజా లకు నియామక ఉత్తర్వులు అందించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నర్సింగరావు మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, కొమిరెడ్డి కరం ల సూచన మేరకు టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ నియామక ఉత్తర్వులు పంపినట్లు టీపీసీసీ లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్, సీనియర్ న్యాయవాది కోటగిరి వెంకటస్వామి తెలిపారు. ఈ సందర్బంగా నియామక ఉత్తర్వులు అందుకున్న న్యాయవాదులు వారి నియామకానికి సహకరించిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది, ఏజిపి అబ్దుల్ హఫీజ్, టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెట్టి లింగం, కార్యదర్శి రాంప్రసాద్, న్యాయవాదులు తెడ్డు ఆనంద్, సురక్ష, కోటగిరి చైతన్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రామాయంపేట అభివృద్ధి పథంలో “జనహృదయనేత” సుప్రభాత్ రావు పాత్ర..
రామాయంపేట, సెప్టెంబర్16 నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట అభివృద్ధి, ప్రజా సంక్షేమం దిశగా గత పదేళ్లుగా నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిగా టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత్ రావు పేరు రామాయంపేట ప్రజల్లో విశేష గుర్తింపు పొందింది. రాజకీయాల్లో సాధారణంగా పదవులు, వర్గ పరమైన లాభాల కోసం కృషి చేసే నాయకులు ఉన్నారనే అభిప్రాయం ప్రజలలో బలపడుతున్న తరుణంలో, అన్ని వర్గాలను కలుపుకుంటూ ప్రజల కోసం అహర్నిశలు శ్రమించే నేతగా సుప్రభాత్ రావు ప్రత్యేక స్థానం సంపాదించారు.
Development
రామాయంపేటకు పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల మంజూరులో ఆయన పాత్ర ప్రధానమని స్థానికులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రామాయంపేట అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ని ఒప్పించి కోట్ల రూపాయల నిధులు విడుదల కావడంలో ఆయన కృషి కీలకమైందని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరోగ్యశ్రీ పథకంను రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రామాయంపేటలో ప్రారంభించడంలో సుప్రభాత్ రావు పట్టుదల నిర్ణయాత్మకమైంది . అంతేకాకుండా రామాయంపేటలో రెవెన్యూ డివిజన్ స్థాపన కోసం ఆయన చేపట్టిన నిరాహార దీక్ష తర్వాతే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటన చేయడం గమనార్హం. రామాయంపేట అభివృద్ధి దిశగా ఆయన సమన్వయంతోనే మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ప్రస్తుత ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు లు నిధుల మంజూరులో ముందడుగు వేసినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రోహిత్ రావు గెలుపులో సుప్రభాత్ రావు పోషించిన పాత్రను కాంగ్రెస్ వర్గాలు ప్రత్యేకంగా గుర్తిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఆయన చేసిన శ్రమ ఆ విజయంలో కీలకమైందని చెబుతున్నారు.
Development
రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలను ముందు ఉంచే నాయకుడిగా, *“జనహృదయనేత”*గా సుప్రభాత్ రావు పేరు రామాయంపేట ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది. అభివృద్ధి మార్గంలో రామాయంపేటను తీసుకెళ్లడమే తన లక్ష్యమని ఆయన తరచూ చెప్పడం, ప్రజలు ఆయనను ఆశాకిరణంగా భావించడానికి ప్రధాన కారణమవుతోంది. అంతే కాకుండా రామాయంపేట పట్టణ ప్రజలు కలలో కూడా ఊహించని భారీ వరదలు వినాయక చవితి పండుగ రోజున అర్ధరాత్రి పట్టణాన్ని చుట్టుముడితే ప్రజలందరూ గాఢనిద్రలో ఉన్నప్పుడు అధికారులను అప్రమత్తం చేసి తనే స్వయంగా ముందుకు వచ్చి అధికారులకు ధైర్యాన్నిస్టు , ఎమ్మెల్యే కి, ఉన్నతాధికారులకు, ఎప్పటికి అప్పుడు సమాచారం అందిస్తూ ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా.300మంది గిరిజన డిగ్రీ కళాశాల పిల్లలను కాపాడటం పట్ల పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
రవాణా శాఖ మంత్రి పొన్నంకు వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే దొంతి
#నెక్కొండ, నేటి ధాత్రి:
నెక్కొండ మండల కేంద్రంలోని బస్టాండ్ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి హైదరాబాదులోని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. వెంటనే సానుకూలంగా స్పందించిన మంత్రి పోన్నం ప్రభాకర్ అతి తొందరలో బస్టాండ్ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు బొంపల్లి దేవేందర్ రావు, బానోత్ సింగ్ లాల్, నెక్కొండ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రావుల మైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వ్యాపారులు..
రామాయంపేట సెప్టెంబర్ 13 నేటి ధాత్రి (మెదక్)
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు ఆదేశాల మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్లో ఆనందాన్ని నింపుతున్నారు. రామాయంపేట పట్టణంలో కూరగాయల మార్కెట్ టై బజార్ వసూల్ వేలం ను రద్దు చేసిన నిర్ణయంపై రైతులు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రోహిత్‌రావు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
ఇక పట్టణ సుందరీకరణలో భాగంగా — సంగారెడ్డి నుంచి వెలుకతుర్తి వెళ్లే 765 డీజి ప్రధాన రహదారిపై, అలాగే సిద్దిపేట వెళ్లే రహదారి డివైడర్ మధ్యన బటర్‌ఫ్లై లైట్ల ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. దాదాపు ఒక కోటి యాభై లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ పనులకు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత్రావు అధ్యక్షత వహించారు.
పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రామాయంపేటలో జరుగుతున్న సుందరీకరణ పనులు పూర్తయితే పట్టణం మరింత అందంగా మారనుందని రామాయంపేట పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సరాపు యాదగిరి.రమేష్ రెడ్డి. విప్లవ కుమార్. పిట్ల ప్రకాష్.మాజీ కౌన్సిలర్లు సుందర్ సింగ్. దానికి స్వామి. చింతల స్వామి. తదితర కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
TPCC ఉపాధ్యక్షుడు నమ్మిండ్ల శ్రీను అన్నకు జన్మదిన శుభాకాంక్షలు *బర్ల సహాదేవ్ అడ్వకేట్ వర్దన్నపేట నియోజకవర్గ అధికార ప్రతినిధి
https://youtu.be/mgl8GBmGx0A?si=17Xm63Mz8snnwWrL
వర్దన్నపేట (నేటిధాత్రి):
యువతకు మార్గదర్శి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అన్న అని అంటే కష్ట కాలంలో నేనున్నా అని భరోసా ఇచ్చే నాయకుడు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు నమ్మిండ్ల శ్రీను అన్న గారు జన్మదిన శుభాకాంక్షలు ప్రజలతో కలసి మమేకమై ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతూ, ఎప్పుడూ అందరికి అందుబాటులో ఉంటూ, నిజాయితీతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా నిలుస్తూ, సామాజిక న్యాయానికి అండగా నిలుస్తూ ప్రజా హృదయాలలో స్థానం సంపాదించుకున్నారు. నమ్మిండ్ల శ్రీను అన్న గారు కేవలం ఒక నాయకుడు మాత్రమే కాకుండా ప్రజల ఆపదలో అండగా నిలిచే సహృదయుడు, యువతకు మార్గదర్శి. ఆయన సేవా తపన, దూరదృష్టి, కష్టసుఖాలలో అందరితో కలసి నిలబడే ధైర్యసాహసాలు ఈనాటి రాజకీయాల్లో అరుదైన లక్షణాలు. ఆయన పాదయాత్రలు, ప్రజల సమస్యలపై పోరాటం, బడుగు బలహీన వర్గాల కోసం చేసే కృషి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. ఆయనలాంటి నాయకుడు మన వర్ధన్నపేట నియోజకవర్గానికి దక్కడం గర్వకారణం.ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయురారోగ్యాలతో ప్రజా సేవలో ఎల్లప్పుడూ ముందుండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను
టిపిసిసి సభ్యులు రఘునాథరెడ్డి, పట్టణ అధ్యక్షులు పల్లె రాజు
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
దేశంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి పేదల అభ్యున్నతికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారని టిపిసిసి సభ్యులు పి రఘునాథ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు లు అన్నారు. భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా బుధవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ చౌరస్తాలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. అనంతరం వారు మాట్లాడారు.
దేశంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి పేదల అభ్యున్నతికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారని అన్నారు.రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి పేద ప్రజల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని చెప్పారు. రాజీవ్ గాంధీ ఆశయాల సాధన నేడు తెలంగాణలో ప్రజాపాలన సాగుతుందని పేర్కొన్నారు.దేశం డిజిటల్ రంగంలో నేడు ముందుకు వెళ్లడానికి కారణం నాడు రాజీవ్ గాంధీ కమ్యూనికేషన్ రంగాన్ని పరిచయం చేసి అభివృద్ధి చేయడమే అన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం వాణిజ్య వ్యాపార రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, మాజీ వైస్ చైర్ పర్సన్ జంగం కళ, దీకొండ శ్యామ్ గౌడ్, గోపురాజం,పుల్లూరి కళ్యాణ్, కట్ల రమేష్,బత్తుల వేణు,శ్రీనివాస్, ప్రేమ్ సాగర్, మహిళా నాయకురాళ్ళు,కార్యకర్తలు పాల్గొన్నారు.
తొర్రూరు పట్టణంలో శ్రద్ధాంజలి, పరామర్శ కార్యక్రమాలు నిర్వహించిన టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు.
తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి
తొర్రూరు పట్టణంలోని 16వ వార్డుకు చెందిన గుర్రాల మధుకర్ రెడ్డి కుమారుడు సాయి నవనీత్ రెడ్డి ఇటీవల మృతిచెందగా, ఈరోజు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
తదనంతరం, పట్టణంలోని 2వ వార్డులో సీతమ్మగారు ఇటీవల మృతిచెందిన నేపథ్యంలో, వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు, వారికి తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు.
Condolence Meet in Torrur
ఈ కార్యక్రమాల్లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సోమరాజ శేఖర్, సీనియర్ నాయకులు పెద్దగాని సోమన్న, తునం శ్రావణ్, బసనా బోయిన రాజేష్ యాదవ్, చెవిటి సుధాకర్, అలాగే పట్టణ, మండల కాంగ్రెస్ నాయకులు, యువజన నాయకులు పాల్గొన్నారు
రామాయంపేటలో కోటి రూపాయల సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన..
రామాయంపేట, నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట మండల కేంద్రంలోని మూడవ మరియు నాలుగవ వార్డుల్లో రోడ్ల అభివృద్ధి పనులకు రూ. 1 కోటి వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్ల పనులను గురువారం నాడు ప్రారంభించారు.ఈ పనులు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆదేశాల మేరకు, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.వార్డుల్లో రోడ్ల పరిస్థితి గత కొంతకాలంగా తీవ్రంగా దెబ్బతినిన నేపథ్యంలో ఈ అభివృద్ధి పనులు ప్రజల్లో హర్షాతిరేకాలు నింపాయి.ఈ సందర్భంగా చౌదరి సుప్రభాత రావు మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడమే మా ప్రాధాన్యం.రోడ్డుపనుల ద్వారా ట్రాఫిక్ సౌకర్యం మెరుగవుతుంది.ఇది రామాయంపేట అభివృద్ధిలో మరో ముందడుగు అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్
నేటి ధాత్రి చర్ల
వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల మనసుల్లో నిలిచిపోయేలా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు ముఖ్యంగా ఆరొగ్యశ్రీ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇందిరమ్మ ఇళ్ల పథకం ఉచిత విద్యుత్ సరఫరా రైతు బంధు వంటి పథకాల ద్వారా పేదలకు జీవితంలో వెలుగు చూపించిన గొప్ప నాయకుడని కొనియాడారు వైఎస్సార్ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ గుర్తుంచుకొని ప్రజల కోసం పనిచేస్తుందని ఆయన తెలిపారు
టిపిసిసి ఉపాధ్యక్షులు శ్రీనివాస్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు.
నేటి ధాత్రి:
ఇటీవల నూతనంగా టిపిసిసి ఉపాధ్యక్షులుగా నియమితులైన నమిండ్ల శ్రీనివాస్ ను 14 డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ సోషల్ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్ అడుప మహేష్ ఆధ్వర్యంలో వారి నివాసం వద్ద కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది. రానున్న రోజుల్లో అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ హనుమకొండ వర్కింగ్ ప్రెసిడెంట్ పులిచేరి రాధాకృష్ణ. ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు పస్తం శంకర్ ఏనుమాముల గ్రామ పార్టీ అధ్యక్షులు సౌరం చిన్ని. సుందరయ్య నగర్ గ్రామ పార్టీ అధ్యక్షులు. త్రికోవెల శీను. బాలాజీ నగర్ గ్రామ అధ్యక్షుడు కడెం కుమార్ ఎస్సార్ నగర్ యూత్ అధ్యక్షుడు పల్లకొండ చందు. సౌరం ప్రభాకర్ సౌరం అభిలాష్. కోగిల సుధాకర్. ఖల్నాయక్ కాశెట్టి కమలాకర్. సౌరం మాణిక్యం ఇందిరమ్మ కమిటీ మెంబర్ ఏకాబ్రాచారి. తిరుపతి.ఎండి సంధాని. ఎండి యూసుఫ్ సంగారబోయిన రాజు. ఎండి ఖాజా రేహాన్ ఖాన్. వివిధ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీగా పాల్గొన్నారు.
మత్స్యకారుల జీవనోపాధి కోసం వారిని పాకాల సరస్సులో చేపలు పట్టుకునేందుకు అవకాశాలు కల్పించాలని కోరుతూ టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ మత్స్యకార్మికులతో కలిసి జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ మాట్లాడుతూ గత 70 సంవత్సరాలుగా ఖానాపూర్ మండలానికి చెందిన పాకాల సరస్సులో 12 గ్రామాలకు సంబంధించిన దాదాపు 200 మత్స్యకారుల కుటుంబాలు తమ కులవృత్తిగా చేపలను పట్టుకొని జీవన ఉపాధి పొందుతున్నారని అన్నారు.గత 10 రోజుల క్రితం పాకాల సరస్సులో చేపలను పడుతున్న మత్స్యకారుల వలలను జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ ఆదేశాల మేరకు వలలను స్థానిక ఫారెస్ట్ అధికారులు పట్టుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు మత్స్యకారులకు కుటుంబాల సమస్యలు పరిష్కారం కోసం డిఎఫ్ఓ వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. అనాది కాలం నుంచి చేపలను పట్టే వలలను పట్టుకపోవడం వలన మత్స్యకారులు వారి ఉపాధిని కోల్పోవడం జరుగుతున్నదని కాగా విషయాన్ని వివరించడం జరిగిందన్నారు. గతంలో వారికి కేటాయించిన హద్దుల ప్రకారం వలలు వేసి చేపలు పట్టుకొని అవకాశాన్ని కల్పించాలని కోరగా సానుకూలంగా స్పందించిన డీఎఫ్ఓ గతంలాగే చేపలను పట్టుకొనే అవకాశాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు పెండెం రామానంద్ తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీను, ఎస్.అల్లోరు, లక్ష్మినారాయణ,జి. రమేష్, రాజేందర్,పి. వెంకన్న,రమేష్, ఎస్.రాజు, యాకన్న,రవి, మల్సుర్,జి. శ్యాంరాజ్, శేఖర్,వెంకటేష్, జితేందర్, వెంకన్న, రాజయ్య,కార్తీక్,బిక్షపతి, సారంగం,సారంగం,కుమార్, తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.