భూపాలపల్లిలో బిజెపి నాయకులకు ఘన సన్మానం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-26T161743.003.wav?_=1

నూతనంగా ఎన్నికైన బిజెపి నాయకులకు ఘనంగా సన్మానం

భూపాలపల్లి నేటిధాత్రి

రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని దొంగల రాజేందర్ అన్నారు
స్థానిక బిఎంఎస్ కార్యాలయంలో బిజెపి జిల్లా నూతన పదవులు వచ్చిన సందర్భంగా సన్మాన కార్యక్రమం స్థానిక బిజెపి నాయకులు ఏర్పాటు చేయడం జరిగింది
నూతనంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన దొంగల రాజేందర్ బిజెపి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఊరటి మునిందర్ రూరల్ మండల అధ్యక్షుడు పులి గుజ్జరాజు కి భూపాలపల్లి స్థానిక బిజెపి నాయకులు బిఎంఎస్ కార్యాలయంలో ఘనంగా పూల పుష్పం ఇచ్చి శాలువాలతో సన్మానించడం జరిగింది అనంతరం స్వీట్స్ పంపిణీ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భట్టు రవి కంబాల రాజయ్య కంచం నరసింహమూర్తి అజ్మీర రాజు నాయక్ జంజాల సురేష్ తుమ్మేటి దామోదర్ బాణాల మధు ఆవుల సంతోష్ తాండ్ర హరీష్ తోట్ల స్వామి సిలోజు సాగర చారి తదితరులు పాల్గొన్నారు

రైతన్నల పక్షపాతి బిఆర్ఎస్ పార్టీ

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-82-1.wav?_=2

రైతన్నల పక్షపాతి బిఆర్ఎస్ పార్టీ

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే యూరియా కొరత

ఎద్దు ఏడ్చిన ఏవుసం, రైతు ఏడ్చిన రాజ్యం చరిత్రలో లేదు

మళ్లీ సారె కావాలి, మళ్లీ కారు ఏ కావాలి అంటున్న రైతన్నలు

యూరియా కోసం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

మరిపెడ నేటిధాత్రి

 

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడం లేదని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ని ఆర్ అండ్ బీ అతిధి గృహం ముందు వరంగల్, ఖమ్మం హైవే పై రైతన్నలు రోడ్డెక్కారు. మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపుడి నవీన్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొని రైతులతో కలిసి మాజీ మంత్రి, డోర్నకల్ మాజీ శాసనసభ్యులు డిస్ రెడ్యానాయక్ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా కోసం రైతులతో కలిసి వర్షంన్ని సైతo లెక్క చేయకుండా ధర్నాకు దిగారు, సకాలంలో రైతులకు యూరియా అందడం లేదని ఫైర్ అయ్యారు.యూరియా కొరత ఉందని పడిగాపులు గాసినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ నికి చలనం లేదు అన్నారు, ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం చరిత్రలో ఎక్కడ లేదు అన్నారు, సకాలంలో పంటలకు యూరియా లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి అని, ఐన కూడా రాష్ట్ర ప్రభుత్వo నిర్లక్ష్య వైఖరినీ అవలంభిస్తున్నది అన్నారు, పంట నష్టపోయిన ప్రతి రైతాంగన్ని ఆదుకొని, ప్రతి రైతు కు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు,ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే యూరియా కొరత ఏర్పడింది అన్నారు, స్థానిక ఎమ్మెల్యే తక్షణమే మరిపెడ మండలానికి 5 వేల టన్నుల యూరియాను సరఫరా చేయాలన్నారు,యూరియాను సరఫరా చేయడంలో రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలం అయ్యిందని మండిపడ్డారు,కేసీఆర్ హయాంలో కూడా యూరియా ఇవ్వడానికి కేంద్రం సహకరించలేదనీ, ఐన ముందు చూపుతో నా తెలంగాణ రైతన్న లు యూరియ కోసం,ఎరువుల కోసం తిప్పలు పడవద్దు అని, రైతన్నలు అప్పుల పాలు కావద్దు అని ఏ సీజన్ కు ఆ సీజన్ లోనే రైతు బంధు డబ్బులు ఇచ్చే వారు అన్నారు, ఇది ముందే గ్రహించిన కేసీఆర్ రెండు నెలల ముందే యూరియా బస్తాలను తీసుకువచ్చి గోడౌన్లలో నిలువ చేశారన్నారు,తెలంగాణను దోచుకోవడానికే వచ్చిన పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ అన్నారు, ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. రైతులకు ఎరువుల బస్తాలు అందించలేని చేతకాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ మండి పడ్డారు. ప్రజా పాలన తెచ్చిన మార్పు ఇదేనా అన్నారు, ప్రజలు మార్పు మార్పు అంటే రైతన్న ను అగం చేసే మార్పు వస్తాది అనుకోలేదు అన్నారు, మళ్లీ సారే కావాలి, కారు ఏ రావాలి అంటున్న రైతన్న లు,కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి చేసిన తప్పు ని ప్రజలు మరోసారి పునరావృతం కావద్దు అని,కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి తగిన గుణపాఠం చెప్పుతరు అన్నారు,బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి పై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లు అసోసియేషన్ అధ్యక్షుడు రవిచంద్ర,బీఆర్ఎస్ మండల నాయకులు రాంబాబు, రవీందర్, కాలు నాయక్,మాజీ ఎంపిపి గడ్డం వెంకన్న,మాజీ డీసీఎంఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డి, చిన్న గూడూరు మండల పార్టీ అధ్యక్షులు రామ్ సింగ్, మాజీ కౌన్సిలర్లు,మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్, మండల నాయకులు తాళ్ళపల్లి శ్రీనివాస్,ప్రవీణ్ రెడ్డి,లతీఫ్, తాళ్లపల్లి రఘురాం,కొమ్ము చంద్రశేఖర్,కొమ్ము నరేష్,అజ్మీర రెడ్డి, దుస్సా నర్సయ్య,గంధసిరి కృష్ణ, బాలాజి,రెండు మండల ల మాజీ సర్పంచ్ లు,మాజీ ఎంపీటీసీలు,గ్రామ పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు,రైతులు, యువకులు పాల్గొన్నారు.

హద్నూర్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-26T133713.630-1.wav?_=3

హద్నూర్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్కల్ మండలంలోని హద్నూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులు ఆసక్తిగా పాల్గొంటున్నారని అధికారులు తెలిపారు. గ్రామానికి మంజూరైన 58 ఇండ్లలో ఇప్పటివరకు 46 మంది లబ్దిదారులు బేస్మెంట్ స్థాయిని పూర్తి చేశారు. ఈ దశలో పనులు పూర్తి చేసిన ప్రతి లబ్దిదారుడికి ఒక్కొక్కరికి రూ.1,00,000 చొప్పున వారి ఖాతాలలో జమ చేసినట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి ధనరాజ్ వివరించారుసోమవారం ఆయన నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు నరేష్, రమేష్, శుకూర్ మియా తదితరులు పాల్గొన్నారు.

యూరియా కుంభకోణానికి పాల్పడుతున్న రేవంత్ ప్రభుత్వం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-26T155155.515-1.wav?_=4

యూరియా కుంభకోణానికి పాల్పడుతున్న రేవంత్ ప్రభుత్వం..

రైతుల సమస్యలు విస్మరించి.. కాంగ్రెస్ రాజకీయ యాత్రలు..

కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ రాష్ట్ర సివిల్ సప్లై మాజీ చైర్మన్,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సరిపడా యూరియా అందించని రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూరియా కుంభకోణానికి పాల్పడుతున్నదని రాష్ట్ర సివిల్ సప్లైస్ మాజీ చైర్మన్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే,బిఆర్ఎస్
రాష్ట్ర నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.యూరియా కొరత వనల రైతులు పడుతున్న ఇబ్బందుల వల్ల స్పందించిన పెద్ది సుదర్శన్ రెడ్డి అండగా ఉంటున్నారు.నిత్యం ప్రజలు,రైతుల కోసం మరోసారి పోరాటం చేయకతప్పలేదు.నర్సంపేట డివిజన్ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై జరుగుతున్న రైతు పోరాటాల్లో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొని అధికారులను,కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ యూరియా కొరత సృష్టించి మార్కెట్ ధర కంటే అధిక ధరకు నానో యూరియా అమ్ముతూ రైతులను ఆర్థికంగా దోచుకుంటున్న ప్రభుత్వాలపై పెద్ది మండిపడ్డారు.పంటలు పాడవుతున్నాయని యూరియా కోసం ఆడిగిన రైతులపైన పిడిగుద్దులతో కాంగ్రెస్ పార్టీ దండయాత్ర చేస్తున్నదని విమర్శించారు.సన్నరకం వడ్లు కొనుగోలు చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకు రూ.1267 కోట్లా బోనస్ కాగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో రూ. 262 కోట్లు బోనస్ ఎగవేసిందని,రైతులు కష్టాల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ అంగు ఆర్భాటాలతో కాంగ్రెస్ ప్రభుత్వం బోగస్ యాత్రలు చేస్తున్నదని ఎద్దేవా చేశారు.వరంగల్ డిక్లరేషన్ లో చెప్పిన కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ కౌలు రైతులు ,రైతు కూలీలకు ఇచ్చిన హామీలు,ఎగబెట్టిన రైతూ భరోసాపై ఎందుకు ప్రస్తావించడం లేదని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు.యూరియా కొరత పైన కాంగ్రెస్, బిజెపి పార్టీల మధ్య ఉన్న లాలూచీ ఒప్పందం ఏంటని.. 52 సార్లు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా రైతుల కోసం కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని పత్రికా సమావేశంలో ఎందుకు అడగడంలేదని సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శించారు.యూరియా జాతీయ సమస్య ఐతే పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదన్నారు.
యూరియా కోసం క్యూలైన్లలో నిలబడే వేలమంది రైతులు బిఆర్ఎస్ పార్టీ రైతులే అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పార్టీకి డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు.యూరియా కొరత అనేది కాంగ్రెస్ పార్టీ సృష్టించిన కృత్తిమ కొరతే అని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టును చేపట్టి పూర్తిచేయలేదని,సాగునీరు అందివ్వని ఆసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి యాత్రలు చేసే అర్హతలేదని ఆరోపించారు.ఆరు గ్యారెంటీలు 420 హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పదానికి సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర సివిల్ సప్లై మాజీ చైర్మన్,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు.

అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగాలి

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-79-3.wav?_=5

 

అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగాలి

యూరియా కోసం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

నర్సంపేట,నేటిధాత్రి:

అధికారంలోకి వచ్చిన నుండి రైతులకు యూరియా అందించని అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగాలని వరంగల్ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్,దుగ్గొండి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సుకినే రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతాంగానికి సకాలంలో పంటలకు యూరియా అందించని అసమర్ధ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాన్ని పరిపాలించే హక్కులేదని టిఆర్ఎస్ విమర్శించారు. సోమవారం మండలంలోని గిర్నిబావి సెంటర్లో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు యూరియా అందించాలని ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు.గత బారాస ప్రభుత్వంలో రైతులకు సరిపడా ఎరువులను అందించామని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను వంచించి యూరియా కొసం రైతులు ఇబ్బందులను గురి చేస్తుందని పేర్కొన్నారు.నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గ వ్యవసాయశాఖపై సమీక్ష సమావేశాలు నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు. రైతులకు సరిపడా యూరి అందించే వరకు బారాస పార్టీ రైతులకు అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కట్ల కొమల భద్రయ్య, క్లస్టర్ ఇంచార్జిలు కంచరకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, శంకేసి కమలాకర్, గుండెకారి రంగారావు, కామిశెట్టి ప్రశాంత్, తోటకూరి రాజు, భూంపల్లి రజనీకర్ రెడ్డి, మాజీ సర్పంచులు అజ్మీర రవీందర్, ఒడేటి తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీటీసీలు పిండి కుమారస్వామి, సంగతి రాజన్న, వివిధ గ్రామాల గ్రామ పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-26T153720.610-1.wav?_=6

అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగాలి

యూరియా కోసం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

నర్సంపేట,నేటిధాత్రి:

అధికారంలోకి వచ్చిన నుండి రైతులకు యూరియా అందించని అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగాలని వరంగల్ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్,దుగ్గొండి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సుకినే రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతాంగానికి సకాలంలో పంటలకు యూరియా అందించని అసమర్ధ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాన్ని పరిపాలించే హక్కులేదని టిఆర్ఎస్ విమర్శించారు. సోమవారం మండలంలోని గిర్నిబావి సెంటర్లో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు యూరియా అందించాలని ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు.గత బారాస ప్రభుత్వంలో రైతులకు సరిపడా ఎరువులను అందించామని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను వంచించి యూరియా కొసం రైతులు ఇబ్బందులను గురి చేస్తుందని పేర్కొన్నారు.నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గ వ్యవసాయశాఖపై సమీక్ష సమావేశాలు నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు. రైతులకు సరిపడా యూరి అందించే వరకు బారాస పార్టీ రైతులకు అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కట్ల కొమల భద్రయ్య, క్లస్టర్ ఇంచార్జిలు కంచరకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, శంకేసి కమలాకర్, గుండెకారి రంగారావు, కామిశెట్టి ప్రశాంత్, తోటకూరి రాజు, భూంపల్లి రజనీకర్ రెడ్డి, మాజీ సర్పంచులు అజ్మీర రవీందర్, ఒడేటి తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీటీసీలు పిండి కుమారస్వామి, సంగతి రాజన్న, వివిధ గ్రామాల గ్రామ పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా సర్వే

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-78-3.wav?_=7

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా సర్వే

నర్సంపేట,నేటిధాత్రి:

దుగ్గొండి మండలంలోని నాచినపల్లి గ్రామ ప్రజా సమస్యలపై ఆ గ్రామ సిపిఎం పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటా సర్వే నిర్వహించారు.ఈ సర్వేలో ప్రజలు ఇందిరమ్మ ఇండ్లు.వృద్ధాప్య పింఛన్స్, కరెంట్ బిల్లు,రేషన్ కార్డు,గ్యాస్ బిల్లు, జాబ్ కార్డు,డ్రైనేజీ,తాగునీటి సమస్యల పట్ల గ్రామస్తులు సిపిఎం నాయకులకు విన్నవించుకున్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య,మండల కార్యదర్శి బోళ్ల సాంబయ్య,మండల నాయకులు పుచ్చకాయల నరసింహారెడ్డి, కృష్ణారెడ్డి, భాస్కర్ రెడ్డి, డివైఎఫ్ఐ మండల అధ్యక్షుడు పొన్నం రాజు, గ్రామ నాయకులు మహేందర్ రెడ్డి, మాదాసి శీను,శ్రీకాంత్,రమేష్, బత్తిని స్వామి, కొండబత్తుల నరసింహరాములు తదితరులు పాల్గొన్నారు.

యజూర్ పబ్లిక్ స్కూల్ అంతర్జాతీయ కరాటే చాంపియన్..

యజూర్ పబ్లిక్ స్కూల్ అంతర్జాతీయ కరాటే చాంపియన్..

https://youtu.be/1w_Z9GZ39NA

అంతర్జాతీయ కరాటే టోర్నమెంట్ లో రోలింగ్ షీల్డ్ సాధించిన యజుర్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు.. హైదరాబాద్ లో ఆదివారం జరిగిన ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్, కరాటే కుంగ్ ఫూ , టైక్వాండో ఛాంపియన్షిప్ 2025 పోటీలలో వివిధ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.. హనుమకొండ జిల్లా నుండి వివిధ స్కూల్ విద్యార్థులు కూడా ఇందులో పాల్గొనగా యజూర్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి వివిధ విభాగాలలో పథకాలను సాధించారు. తమ కృషి శిక్షణ మరియు ప్రతిభతో మెరిసిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించింది. వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి రోలింగ్ షీల్డ్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న ఏకైక పాఠశాలగా ప్రత్యేక గుర్తింపు సాధించింది.

ఈ ఛాంపియన్షిప్ పోటీలలో యజుర్ పబ్లిక్ స్కూల్ నుండి మొత్తం 39 మంది విద్యార్థులు పాల్గొనగా ఇందులో 26 మంది స్వర్ణ పథకాలు, 10మంది రజత పథకాలు, ముగ్గురు కాంస్య పథకాలు సాధించి తమ ప్రతిభను నిరూపించుకున్నారు..ఈ విజయంతో యజూర్ పబ్లిక్ స్కూల్ మరో అంతర్జాతీయ స్థాయిలో కీర్తి పొందిందని ఈ గొప్ప విజయంలో విద్యార్థులకు శిక్షణ అందించిన కోచ్ క్రాంతి కుమార్ ను పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జలీల్ అహ్మద్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అంతా అభినందించారు..

యూరియా కోసం బిఆర్ఎస్ ధర్నా – కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు.

అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగాలి

యూరియా కోసం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

నర్సంపేట,నేటిధాత్రి:

అధికారంలోకి వచ్చిన నుండి రైతులకు యూరియా అందించని అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగాలని వరంగల్ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్,దుగ్గొండి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సుకినే రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతాంగానికి సకాలంలో పంటలకు యూరియా అందించని అసమర్ధ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాన్ని పరిపాలించే హక్కులేదని టిఆర్ఎస్ విమర్శించారు. సోమవారం మండలంలోని గిర్నిబావి సెంటర్లో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు యూరియా అందించాలని ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు.గత బారాస ప్రభుత్వంలో రైతులకు సరిపడా ఎరువులను అందించామని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను వంచించి యూరియా కొసం రైతులు ఇబ్బందులను గురి చేస్తుందని పేర్కొన్నారు.నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గ వ్యవసాయశాఖపై సమీక్ష సమావేశాలు నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు. రైతులకు సరిపడా యూరి అందించే వరకు బారాస పార్టీ రైతులకు అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కట్ల కొమల భద్రయ్య, క్లస్టర్ ఇంచార్జిలు కంచరకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, శంకేసి కమలాకర్, గుండెకారి రంగారావు, కామిశెట్టి ప్రశాంత్, తోటకూరి రాజు, భూంపల్లి రజనీకర్ రెడ్డి, మాజీ సర్పంచులు అజ్మీర రవీందర్, ఒడేటి తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీటీసీలు పిండి కుమారస్వామి, సంగతి రాజన్న, వివిధ గ్రామాల గ్రామ పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సుధాకర్ రెడ్డికి నివాళులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-89.wav?_=8

సూరుడు సుధాకర్ రెడ్డి కి జోహార్లు

కొండు బానేష్ సి పి ఐ తాండూరు మండల కార్యదర్శి *

మంచిర్యాల ఆగస్ట్ 25 నేటిదాత్రి

మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలోని భగత్ సింగ్ భవన్ లో కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కమ్యూనిస్టు దిగ్గజం భారత విప్లవోద్యమానికి తీరని నష్టం సిపిఐ అగ్ర నేత. మాజీ సిపిఐ ప్రధాన కార్యదర్శి. మాజీ పార్లమెంట్ సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి మరణం భారత విప్లవోద్యమానికి తీరని నష్టదాయకమని కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గొప్ప కమ్యూనిస్టు అని జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులను సవాళ్లను 20 సంవత్సరాల ముందే వాటి ప్రమాదాలు పర్య వస నాలను పసిగట్టి పార్టీ శ్రేణులను సమరశీల పోరాటాల వైపు నడుపుతూ భారత విప్లవోద్యమానికి ఉరకలు పెట్టించారని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం పరిధిలోని సురవరం సుధాకర్ రెడ్డి అమ్మమ్మ గ్రామమైనకొండ్రావు పల్లిలో జన్మించాడని. అలంపూర్ తాలూకా పరిధిలోని కంచుపాడు స్వగ్రామంలో బాల్యం విద్య కర్నూలు జిల్లాలో విద్యను కొనసాగిస్తూ అఖిలభారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) లో చేరి విద్యా రంగ సమస్యలపై అలుపెరుగని పోరాటం కొనసాగించిన సురవరం సుధాకర్ రెడ్డి అంచలంచలుగా ఎదుగుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శిగా.
అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శిగా విద్య వైద్య ఉపాధి హక్కులకై ఉద్యమించి భారత విద్యార్థి యువతను ఏకం చేశా డని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారత కమ్యూనిస్టు పార్టీ రథసారథిగా సిపిఐ నిర్మాణాన్ని పటిష్ట పరుస్తూ పాలకుల విధానాలపై సమర శంఖం పూరించాడని 1971లో సిపిఐ జాతీయ సమితి సభ్యులుగా పని చేశారని 1985. 1989. 1994. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారని 2004 లో పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసి ఎంపీగా గెలుపొందారని. కార్మిక శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా పని చేయడంతో పాటు అనేక పార్లమెంటరీ కమిటీలకు చైర్మన్ గా పని చేశారని సిపిఐ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ. 2012 మార్చి 31న పాట్నాలో జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మహాసభలలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై మూడు పర్యాయాలు 2019 వరకు విశేష సేవలు అందించాలని రాజేశ్వరరావు తర్వాత సిపిఐ జాతీయ పగ్గాలు చేపట్టిన తెలుగు నేత సురవరం సుధాకర్ రెడ్డి అనేక ప్రపంచ దేశాలు పర్యటిస్తూ విప్లవ సిద్ధాంతాలను అంశాలను శోధించి కమ్యూనిస్టు మహానేతగా ఎదిగాడని సురవరం సుధాకర్ రెడ్డి వామపక్ష ఐక్యత కోసం పరితపిస్తూ మామపక్ష ఐక్య ఉద్యమాన్ని నిర్మించారని సురవరం సుధాకర్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని. జిల్లాలో కరువు సమస్య ప్రాజెక్టుల సాధన. జల వివాదాల పరిష్కారం లాంటి అనేక సున్నిత అంశాలను కూడా సాధించి పెట్టారని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సురవరం పాత్ర మరువలేనిదని ఆయన మృతి యావత్ భారత కమ్యూనిస్టు ఉద్యమానికి సామాజిక లౌకిక ప్రజాస్వామ్య శక్తులకు తీరని నష్టమని సురవరం సుధాకర్ రెడ్డి గారి ఆశయ సాధన కోసం పార్టీ శ్రేణులు కంకణా బద్దులు కావాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో
భయ్యా మొగిలి గోలేటి బ్రాంచి ఏఐటియుసి ఉపాధ్యక్షులు.
వాసాల నాగరాజు సిపిఐ తాండూర్ మండల ఆర్గనైజరీ సెక్రటరీ.
పట్టి శంకర్ సిపిఐ తాండూరు మండల కోశాధికారి.
కొండు సాయికుమార్ సిపిఐ చంద్ర పల్లి గ్రామ కార్యదర్శి.
కుర్సింగ తిరుపతి సిపిఐ 3 ఇంక్లైన్ గ్రామ కార్యదర్శి.
కంబాల చందు. కంబాల రాజయ్య. ఇందారపు పోషం. ముత్తె శంకర్. కొండు రాజేశం. గో గర్ల దుర్గయ్య. రాగుల రామ్ సాయి. నసిరుద్దీన్. తదితరులు పాల్గొన్నారు

ములుగు మండల సమస్యలపై బిజెపి నేతల వినతి పత్రం.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T154148.715-1.wav?_=9

 

ములుగు మండల సమస్యలపై తహశీల్దార్ కు బిజెపి నాయకుల వినతి పత్రం

ములుగు టౌన్ నేటి ధాత్రి

 

ములుగు మండలంలోని పలు సమస్యలపై బిజెపి నాయకులు తహశీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించారు. ఈ రోజు మండల అధ్యక్షులు రాయంచు నాగరాజు గారి ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వగా, ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
మండలంలోని గ్రామాల్లో ఎక్కడా వీధి దీపాలు వెలగడం లేదని
డ్రైనేజీ సక్రమంగా లేకపోవడం వలన నీరు నిలిచి, పారిశుద్ధ్యం లోపించి, డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు వ్యాపిస్తున్నాయని
గ్రామాలలో తాగునీరు, విద్యుత్ సమస్యలు, గుంతల రహదారులు కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని
ములుగు పట్టణంలోని 200 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సిబ్బంది, సౌకర్యాలు లేకపోవడం వలన రోగులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు
అదేవిధంగా, పట్టణంలోని పలు వీధుల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు లేకపోవడం వలన రవాణా కష్టాలు ఏర్పడుతున్నాయని, ములుగు పట్టణానికి వచ్చే ప్రజలకు విశ్రాంతి కోసం పబ్లిక్ గార్డెన్ ఏర్పాటు చేయాలని సూచించారు
తద్వారా ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు రాజీవ్ యువ వికాస్ కింద లోన్లు,
గృహలక్ష్మి పథకం కింద ప్రతి గృహిణికి ₹2500,
ఆరు గ్యారెంటీలు, 420 హామీలు —
తప్పనిసరిగా అమలు చేయాలని, లేకుంటే బిజెపి మండల & జిల్లా ఆధ్వర్యంలో భారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతలపూడి భాస్కర్ రెడ్డి, రాష్ట్ర ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, రాష్ట్ర ప్రతినిధి స్వరూప, జిల్లా ప్రధాన కార్యదర్శి శీలమంతుల రవీంద్రాచారి, ఉపాధ్యక్షులు జినుకల కృష్ణారావు, జిల్లా ప్రతినిధి సూర్యదేవర విశ్వనాథ్, కోశాధికారి గంగిశెట్టి రాజ్ కుమార్, కార్యాలయ కార్యదర్శి దొంతి రవి రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఇమ్మడి రాకేష్ యాదవ్, జిల్లా నాయకులు లవన్ కుమార్, నగరపు రమేష్, ఎలుకతుర్తి శ్రీహరి, యాద సంపత్, ప్రమోద్, మండల ప్రధాన కార్యదర్శులు లకావత్ రాజ్ కుమార్, కుక్కల పవన్, ఉపాధ్యక్షుడు ఏరువ పాపిరెడ్డి, నాయకులు ఒజ్జల కిరణ్, ఆకుల రాజేందర్, బండి రవీందర్ తదితరులు పాల్గొన్నారు

రైతులకు షరతులు లేకుండా యూరియా – బీఆర్ఎస్ డిమాండ్..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-79-1.wav?_=10

షరతులు లేకుండా రైతులకు యూరియా అందించాలి

రైతుల పక్షాన నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులు

వ్యవసాయ ఆధికారికి వినతి పత్రం అందజేత

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.నేటిధాత్రి…

రైతులు పండించే పంటలకు షరతులు లేకుండా యూరియా అందించాలని బిఆర్ఎస్ పార్టీ
పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య అన్నారు సోమవారం
మండల కేంద్రంలో రైతులతో కలిసి ప్రధాన రహదారి పై నిరసన తెలిపారు.ఈ సందర్భంగా విలేకరుల సమావేశంతో రావుల సోమయ్య మాట్లాడుతూ.తప్పుడు హామీలతో గద్దినెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచిన రైతులను పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదం వ్యక్తం చేశారు.రైతులు పండించే పంటలకు సకాలంలో యూరియా కూడా సరఫరా చేయలేని దినస్థితిలో ఈ ప్రభుత్వం కళ్ల మూచుకొనీ ఉందన్నారు.అనంతరం రైతుల సమస్యలను పరిష్కరించి,సకాలంలో ఎరువులు అందించాలని రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు వ్యవసాయ అధికారికి వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

చర్లలో యూరియా కొరతపై ధర్నా…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-76.wav?_=11

చర్ల మండల రైతాంగానికి యూరియా అందించండి

బిఆర్ఎస్ చర్ల మండల కన్వీనర్ దొడ్డి తాతారావు డిమాండ్

నేటిదాత్రి చర్ల

బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు చర్ల మండల కేంద్రంలోని అగ్రికల్చర్ కార్యాలయం ముందు పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు ఆధ్వర్యంలో యూరియా కొరతపై ధర్నా నిర్వహించి అనంతరం అగ్రికల్చర్ ఏఓ లావణ్య కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా దొడ్డి తాతారావు మాట్లాడుతూ రైతుల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెసు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని
రైతులకు మోసపూరిత హమీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెసు ప్రభుత్వం నట్టేట ముంచుతుంది ప్రభుత్వ ముందు చూపు లేకపోవడం వలన యూరియా సరఫరా సక్రమంగా జరగక పోవడంతో రైతులు రోడ్డుపైకి రావలసిన పరిస్థితి ఏర్పడింది
పంటలు పండక పండిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల్లో కూరుకుపోయిన రైతులకు కనీసం యూరియా కూడా ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రైతుల పట్ల కాంగ్రెసు ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది
రైతు రుణ మాఫీ రైతులందకి చేయలేదు
రైతు బంధు పూర్తిగా ఇవ్వలేదు
రైతు బీమా లేదు
నీళ్ళు లేవు కరెంటు లేదు అనేక సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు
కెసిఆర్ 9 సంవత్సరాల పరిపాలనలో ఏనాడు యూరియా ఇబ్బందులు లేవు ఇప్పటికైన ప్రభుత్వం రైతులకు సరిపడే యూరియా అందించాలని లేని ఎడల రేపు రాబోయే ఎన్నికల్లో రైతులు ఓటు ద్వారా బుద్ది చెబుతారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ అజీజ్ పంజా రాజు తడికల బుల్లబ్బాయి డివిజన్ యూత్ నాయకులు కాకి అనిల్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొంబత్తిని రాము బీసీ సెల్ అధ్యక్షులు గోరింట్ల వెంకటేశ్వరరావు ఎస్టీ సెల్ అధ్యక్షులు యూత్ అధ్యక్షులు అంబోజీ సతీష్ కారం కన్నారావు సాదిక్ కట్టం కన్నారావు రత్నాల శ్రీరామ్మూర్తి బట్ట కొమరయ్య తడికల చంద్రశేఖర్ సంతపూరి సతీష్ ఎడ్ల రామదాస్ గాదం శెట్టి కిషోర్ కుక్క డపు సాయి గుమ్మల నరేంద్ర తదితరులు పాల్గొన్నారు

చంద్రబాబు కుప్పానికి కృష్ణా జలాలు చేరవేసారు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-44-4.wav?_=12

*అపర భగీరథుడు ఏపీ సీఎం చంద్రబాబు.

*హంద్రీ-నీవా జిలాలతో కుప్పం సస్యశ్యామలం

*30న కుప్పంలో కృష్ణా జలాలకు హారతినివ్వనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు..

*ఎన్నికల హామీని నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం..

*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..

చిత్తూరు,ఢిల్లీ(
నేటి ధాత్రి) ఆగస్టు 21:

రాయలసీమ ప్రాంతంలోని ప్రతి ఆయికట్టుకు నీరందించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి.., అన్నదాతలను ఆదుకోవడమే లక్ష్యంగా
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అపర భగీరథుడిలా అహర్నిశలు శ్రమిస్తున్నారని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు కొనియాడారు. కుప్పం నియోజకవర్గాన్ని హంద్రీ-నీవా జిలాలతో సస్యశ్యామలం చేయడమే తన సంకల్పంగా భావించి, ముందుకు సాగుతుండడం ఏపీ సీఎం చంద్రబాబు చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు.
పార్లమెంట్ సమావేశాలకు హాజరై దేశరాజధాని ఢిల్లీలో ఉన్న చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు ఈ నెల 30న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో కృష్ణా జలాలకు హారతి పట్టనున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు కృషిని.., పాలనా దక్షతను శుక్రవారం ఓ ప్రకటనలో కొనియాడారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చిత్తూరు పార్లమెంటు పరిధిలోని కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు చేరుకోవడం పై హర్షం వ్యక్తం చేశారు. దీనికి కారణమైన
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ. ఆయన నిత్య శ్రామికుడనీ. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గొప్ప పరిపాలనాదక్షుడంటూ ప్రశంసించారు. అంతేకాకుండా
ఇటు అధికారులు.
అటు కూటమి నాయకులు, కార్యకర్తలకు సీఎం స్పూర్తిగా నిలవడం అభినందనీయమన్నారు.
వైసిపి ప్రభుత్వం హయాంలో ఆగిపోయిన హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరుగులు తీయించిందన్నారు. సీఎం చంద్రబాబు, జల వనరుల శాఖ మంత్రి రామానాయుడు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ నిర్ణీత గడువులోగా హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులను పూర్తి చేశారని తెలిపారు. 530 కోట్ల వ్యయంతో 265 కిలోమీటర్ల కాల్వ విస్తరణ, అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేసి, కృష్ణా జలాలు కుప్పానికి చేరుకునేందుకు శ్రమించిన అధికారులను ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు అభినందించారు.

సింగరేణి కార్మికులను మోసం చేస్తున్న గుర్తింపు సంఘాలు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-43-3.wav?_=13

సింగరేణి కార్మికులను మోసం చేస్తున్న గుర్తింపు సంఘం నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి పట్టణంలోని బాతాల రాజు భవన్ తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయం లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశాన్ని ఉద్దేశించి టి ఎస్ యు ఎస్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య మాట్లాడుతూ
సింగరేణిలో ఎన్నికల జరిగి 19, నెలలు గడుస్తుంది ఇంకోక్క 5, నెలలో ఎన్నికల గడువు ముగియనుంది
గుర్తింపు సంఘంగా కొనసాగుతున్న ఏఐటియుసి డైరెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తు కాలం వెళ్లతీస్తుంది
సర్కార్ సంఘమైన ఐ ఎన్ టు యు సి సంఘం గనుల పైన నల్ల బ్యాడ్జీలతో జిఎం కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాలు చేపడుతుంది వీరు చేసే కృత్తిమ ఉద్యమాలను కార్మిక వర్గం నమ్మే పరిస్థితిలలో లేరు
ఎన్నికలకు ముందు పెద్ద పెద్ద మేనిఫెస్టాలతో కార్మిక వర్గం ముందుకు వచ్చి కార్మిక ఓట్లతో గెలిచిన అనంతరం వారి ఆర్థిక రాజకీయ సభవాల కోసమే పనిచేస్తున్నారు
ఎన్నికలకు ముందు కార్మికులకు ఇచ్చిన హామీలు
మెడికల్ బోర్డును (విఆర్ఎస్ )పాత పద్ధతిలో కొనసాగించి దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికున్ని అన్ఫిట్ చేసి వారి వారసులకు ఎలాంటి ఆర్థిక దోపిడీ లేకుండా
ఉద్యోగాలు కల్పిస్తామని
సింగరేణి కార్మికుల మారు పేర్ల సమస్యను పరిష్కరిస్తామని వారి వారసులకు ఉద్యోగాలు ఇపిస్తామని హామీ ఇచ్చారు
సింగరేణి కార్మికుల చిరకాల కోరిక 300 గజాలఇంటి స్థలం తో పాటు ఇంటి నిర్మాణం కోసం 20 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇప్పిస్తామన్న హామీ
సింగరేణిలో నూతన భూగర్భ గనులు తవ్వి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని
సింగరేణి ప్రాంతంలో బొగ్గు ఆదరిత పరిశ్రమలు సింగరేణి కారిడర్ ఏర్పాటు చేస్తామన్నారు
సింగరేణిలో దాదాపు 28 వేల మంది కాంటాక్ట్ కార్మికులను పెర్మనెంట్ చేపిస్తామని వారికి తగిన పనికి తగిన వేతనాలు ఇప్పిస్తామన్నరు
సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఖాళీలు క్లారికల్ ఎంవి డ్రైవర్స్ సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ సింగరేణి సెక్యూరిటీ పోస్టుల తో పాటు ఇతర కాలిలను బర్తి చేయుట కొరకు
సింగరేణిలో ఉన్న హాస్పిటల్ లను కార్పొరేటర్ హాస్పటల్గాగా మారిచి పూర్తిస్థాయిలో డాక్టర్లను నియమిస్తామన్నారు
డిస్మిస్ కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న హామీ
కూడా ఇప్పటివరకు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరింపబడలేదు
మళ్లీ సింగరేణిలో ఎన్నికల రాబోతున్నాయి సింగరేణి కార్మికులకు మాయమాటలు చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్న ఈ రెండు సంఘాలనుగనుల పైన కార్మిక వర్గం నిలదీయాలని గట్టయ్య మాట్లాడారు
ఈ సమావేశంలో పాల్గొన్నవారు
టీఎస్ యూఎస్ కార్మిక సంఘం నాయకులు
దాసరి జనార్ధన్
కాసర్ల ప్రసాదరెడ్డి
నామాల శ్రీనివాస్
రాళ్ల బండి బాబు
జయశంకర్
నరసింహారెడ్డి
ఎస్.కె సాజిత్
ఎస్ కె సలీం
ఓదెలు
సిహెచ్ లక్ష్మీనారాయణ
తదితరులు పాల్గొన్నారు

నెక్కొండ ఆర్టీసీ బస్టాండ్‌పై బీజేపీ నిరసన.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-42-3.wav?_=14

ఆర్టీసీ బస్టాండ్ పట్ల బీజేపీ నాయకుల నిరసన

ధర్నాలొ పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షులు నాయిని అనూష అశోక్,

నెక్కొండ, నేటి ధాత్రి:

నెక్కొండ మండలకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ పరిస్థితిపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి మండల పార్టీ అధ్యక్షులు నాయిని అనుష అశోక్, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నాయిని అనూష అశోక్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బస్టాండ్ ప్రాంగణం పూర్తిగా బురదమయంగా మారి, ప్రయాణికులకు ముఖ్యంగా మహిళలు వృద్ధులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు లేకపోవడం, బస్సులు నిలవడానికి కూడా అనుకూలంగా లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారని వర్షపు నీరు నిలిచిపోయి, బురదతో నిండిన బస్టాండ్‌లో ప్రయాణించడం ప్రజలకు కష్టంగా మారిందని, ఇది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. అధికారులు ఈ సమస్యను పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బస్ స్టేషన్ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే, తమ పార్టీ ఆధ్వర్యంలో నిరసనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు,ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు దామచర్ల రామారావు, శ్రీరంగం సంపత్, సుదానపు సారయ్య ,ప్రధాన కార్యదర్శి రాంపల్లి రాజగోపాల్, కార్యదర్శి మల్లంమల్లేష్ పద్మ ,సీనియర్ నాయకులు తాళ్లూరి లక్ష్మయ్య, మాజీ మండల అధ్యక్షులు సింగారపు సురేష్, నీలం ఎలేందర్ , నాయకులు కుడికాల సుధీర్, తదితరులు పాల్గొన్నారు.

పంటలను పరిశీలించిన ఏడీఏ దామోదర్ రెడ్డి..

పంటలను పరిశీలించిన ఏడీఏ దామోదర్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

దుగ్గొండి మండలంలోని తొగర్రాయి గ్రామంలో పసుపు మొక్కజొన్న బంతి పంటలను నర్సంపేట వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు దామోదర్ రెడ్డి, మండల వ్యవసాయ శాఖ అధికారి మాధవి తో కలిసి సందర్శించారు. ఆయా పంటలు వేసిన నల్ల వెంకట్ రెడ్డి, చెన్నూరు అచ్చిరెడ్డి, యార ప్రతాప్ రెడ్డి రైతుల పంటల క్షేత్రాలలో క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడిఏ మాట్లాడుతూ పంటల్లో వ్యవసాయ శాఖ సూచనల మేరకు మోతాదును మించకుండా మందులు పిచికారి చేయాలని తెలిపారు.పలుసూచనలు సలహాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ వి.విజయ్ నాయక్ పాల్గొన్నారు.

తెలంగాణ సైన్స్ కాంగ్రెస్లో గుడి తిరుపతి ప్రేరణాత్మక ప్రసంగం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-60-3.wav?_=15

తెలంగాణ సైన్స్ కాంగ్రెస్లో – గుడి తిరుపతి ప్రసంగం

హనుమకొండ నేటి ధాత్రి:

జిల్లా శ్రీరాములపల్లికి చెందిన గుడి తిరుపతి, కాకతీయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ – 2025 లో పాల్గొని ప్రత్యేక ప్రసంగం చేశారు. సరిగ్గా 24 సంవత్సరాల క్రితం గుడి తిరుపతి అదే విశ్వవిద్యాలయం గణిత విభాగంలో విద్యార్థి. ఆర్థిక ఇబ్బందులు, అనేక వడదడుగులు ఎదుర్కొంటూ “పేదరికం విద్యకు అడ్డంకి కాదని” తన కృషితో నిరూపించారు. ఇంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా విద్యకు దూరమయ్యానేమో అన్న భయంతో, నిరంతరం కష్టపడి జాతీయస్థాయి పరీక్షల్లో విజయాలు సాధిస్తూ, కాకతీయ విశ్వవిద్యాలయం మాస్టర్స్లో మొదటి ర్యాంకు పొందారు. తండ్రి లక్ష్మారెడ్డి, తల్లి లక్ష్మమ్మ దంపతుల కుమారుడైన ఆయన, 2001లో పీజీ పూర్తి చేసి, అనంతరం ఐఐటి బాంబేలో న్యూమరికల్ ఎనాలసిస్‌లో పిహెచ్డి చేశారు. అమెరికా, జర్మనీలో రెండు పోస్ట్‌డాక్టరల్ పరిశోధనలు పూర్తి చేసి, ప్రస్తుతం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ), బెంగళూరులో ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో గౌరవనీయ స్థానాన్ని సంపాదించిన గుడి తిరుపతి, ప్రపంచంలో నంబర్ వన్ జర్నల్ ఆఫ్ న్యూమరికల్ ఎనాలసిస్‌కి ఎడిటర్‌గా కొనసాగుతున్నారు. అలాగే ఆయన ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, బెంగళూరు మరియు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ప్రయాగ్‌రాజ్ ఫెలోగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మార్గదర్శకత్వంలో 8 మంది పిహెచ్.డి పరిశోధకులు మరియు 6 మంది పోస్ట్‌డాక్టరల్ ఫెలోస్ (పిడిఎఫ్) పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన గుడి తిరుపతి, గణితంపై ఆసక్తి పెంపొందించుకోవాలని, ప్రాథమిక అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సూచించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేక సంస్థలు విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం గణితంపై పరిశోధన, శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని, వాటిలో పాల్గొనడం ద్వారా ఆధునిక జ్ఞానం పొందవచ్చని ప్రోత్సహించారు. కార్యక్రమంలో గణిత విభాగాధిపతి డాక్టర్ భారవి శర్మ, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్ సౌజన్య, ప్రొఫెసర్ మల్లారెడ్డి, డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ తిరుమలాదేవి, రిటైర్డ్ ఆచార్యులు శ్రీహరి, డాక్టర్ సోమయ్య, డాక్టర్ నాగయ్య, డాక్టర్ చందులాల్, డాక్టర్ శ్రీనివాస్, రుద్రాణి, విభాగ పరిశోధకులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.

మంత్రి సీతక్క ను కలిసిన సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం

మంత్రి సీతక్క ను కలిసిన సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం

సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ

జైపూర్,నేటి ధాత్రి:

 

మంత్రి సీతక్క ను కలిసిన సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం సెంట్రల్ కమిటీ అధ్యక్షులు దారావత్ పంతుల,జనరల్ సెక్రెటరీ భూక్యా నాగేశ్వరరావు గురువారం దనుసరి సీతక్క పంచాయతీరాజ్ రూరల్ గవర్నమెంట్,ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ ని, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ని ప్రజా భవన్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఉద్యోగుల సమస్యలను వివరించారు.ఆగస్ట్ 10న జరిగిన కేంద్ర కమిటీ ఎన్నికల్లో ఎన్నుకున్న నూతన కమిటీ సభ్యుల వివరాల ప్రక్రియను వివరించారు.అలాగే సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం కి మినిస్టర్ సీతక్కని గౌరవ అధ్యక్షులుగా ఉండాలని సెంట్రల్ కమిటీ సభ్యులు కోరారు.ఈ సందర్బంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ సింగరేణిలో గిరిజన ఉద్యోగస్తుల సమస్యలు ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయని, అధికారుల ప్రమోషన్లలో క్లస్టర్,ఇంటర్ క్లస్టర్ ప్రమోషన్లలో తీవ్రంగా అన్యాయం జరుగుతుందని,రోస్టర్ రిజిస్టర్ వెరిఫికేషన్ లో కూడా ప్రమోషన్ పాలసీకి సంబంధించిన విషయాలు కొన్ని పెండింగ్లో ఉన్నాయని తెలియజేశారు.అలాగే ఈ సమస్యలను పరిష్కరించే విధంగా చూడాలని
సెంట్రల్ కమిటీ సభ్యులు వారిని కోరారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ముందుగా నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులుగా ఉండటానికి సానుకూలంగా స్పందిస్తూ గిరిజన ఉద్యోగస్తుల సమస్యలు ఇంకా ఏమైనా ఉంటే డాక్యుమెంటరీ రూపంలో తమ దృష్టికి తీసుకొస్తే అన్ని సమస్యలను పరిష్కరించడానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేయిస్తామని అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా గిరిజనులకు అండగా ఉంటుందని వారు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో చీఫ్ లైజాన్ ఆఫీసర్ వీసం కృష్ణయ్య ,వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోత్ దశరథ్ ,సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎం.తిరుమల్ రావు,జిఎం సివిల్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

అభివృద్ధి–సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సురేఖ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-56-3.wav?_=16

అభివృద్ధి–సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యం : మంత్రి కొండా సురేఖ

వరంగల్, నేటిధాత్రి.

అభివృద్ధి, సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మొత్తం రూ. 5.87 కోట్లు వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆమె గురువారం శంకుస్థాపన చేశారు. జిడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో 15వ ఆర్థిక సంఘ నిధులు, జనరల్ ఫండ్ మరియు ఎస్ఎఫ్సి పథకాల కింద రూ. 4.87 కోట్ల విలువైన పలు పనులను ప్రారంభించారు. వీటిలో బస్తీ దవాఖాన, బీఆర్ నగర్లో సీసీ రోడ్లు, ఎన్ఎన్ నగర్, జ్యోతినగర్లో సీసీ రోడ్లు, అంబేడ్కర్ భవన్ కమ్యూనిటీ హాల్, బీరన్నకుంట కమ్యూనిటీ హాల్ నిర్మాణం, బట్టలబజార్ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో కిచెన్ షెడ్, రంగశాయిపేటలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణం ఉన్నాయి. అదనంగా ఆర్అండ్బి శాఖ కింద రూ.

Minister Konda Surekha

కోటి వ్యయం తో మషూఖ్ రబ్బానీ దర్గాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అదనంగా, బీరన్నకుంట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మంత్రి, మేయర్, జిల్లా కలెక్టర్, జిడబ్ల్యూఎంసీ కమిషనర్తో కలసి మధ్యాహ్న భోజనం వడ్డించారు. తరువాత కరీమాబాద్ పరపతి సంఘ భవనంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. తూర్పు నియోజకవర్గంలో 2690 కొత్త కార్డులను జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 6815 రేషన్ కార్డులు మంజూరు, వాటిలో 26766 కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసినట్లు వివరించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ….

Minister Konda Surekha

ప్రతి నిరుపేద కుటుంబానికి ఆహార భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను అందజేస్తోందని, గతంలో ఇచ్చిన దొడ్డు బియ్యం స్థానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలకు సన్న బియ్యం అందిస్తున్నారని,
లబ్ధిదారులకు అన్ని సంక్షేమ పథకాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. అదనంగా, జిల్లాలోని విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించేందుకు రామకృష్ణ మిషన్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో 123 ప్రభుత్వ పాఠశాలల్లో కార్యక్రమం ప్రారంభించామన్నారు.

Minister Konda Surekha

మొదటి విడతలో కరీమాబాద్ సహా 55 పాఠశాలల్లో అమలు చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్ నగరాన్ని హైదరాబాద్ తరహాలో సమగ్ర అభివృద్ధి చేయడానికి మామునూరు విమానాశ్రయం, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పనులు వేగవంతం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే ముంపు నివారణకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని చెప్పారు.నియోజకవర్గంలో అర్హులైన పేదల కోసం 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్టు, మరో 3500 ఇళ్లు ఈ సంవత్సరం కేటాయించనున్నట్టు వెల్లడించారు. దేవాదాయ శాఖ ద్వారా జిల్లాలోని అన్ని దేవాలయాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహాత్ బాజ్ పాయి, కార్పొరేటర్లు, రెవెన్యూ అధికారులు, బల్దియా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Minister Konda Surekha
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version