బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
మహాదేవపూర్ అక్టోబర్ 8 (నేటి ధాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం బెగులూర్ గ్రామానికి చెందిన మంద లక్ష్మి కుటుంబాన్ని బుధవారం రోజున కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పరామర్శించారు. బెగులూర్ గ్రామానికి చెందిన మంద లక్ష్మి ఇటీవల భారీ వర్షాలకు గోడకూలి మృతి చెందగా వారి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పరామర్శించి వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గుడాల అరుణ శ్రీనివాస్, పార్టీ సీనియర్ నాయకులు కటకం అశోక్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బుర్రి శివరాజ్, ములకల పోచమల్లు, ఆకుల రాజయ్య, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.