నాగుర్ల ను సన్మానించిన ఫర్టిలైజర్ అసోసియేషన్ నాయకులు…

నాగుర్ల ను సన్మానించిన ఫర్టిలైజర్ అసోసియేషన్ నాయకులు

నడికూడ,నేటిధాత్రి:

 

తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన నాగూర్ల వెంకటేశ్వర్లు ను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించిన
నడికూడ మండల ఫర్టిలైజర్ పేస్టి సైడ్స్ అండ్ సీడ్స్ మండల నాయకులు అశోక్ గౌడ్,విక్రమ్ రెడ్డి,ప్రభాకర్ రావు,నారగాని కుమారస్వామి,రాజు, రవీందర్,వెంకటేశ్వర్లు,నమస్తే తెలంగాణ రిపోర్టర్ పంచనేని భాస్కర్ రావు తదితరులు ఉన్నారు.

నివాళులు అర్పించిన నాగుర్ల..

నివాళులు అర్పించిన నాగుర్ల

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని నర్సక్కపల్లి గ్రామానికి చెందిన నాగూర్ల బాపూరావు ఇటీవల మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు నర్సక్కపల్లి గ్రామానికి చేరుకుని, స్వర్గీయ నాగూర్ల బాపూరావు పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నాగూర్ల బాపూరావు మృతి కుటుంబానికి తీరని లోటు అని పేర్కొన్నారు.వారి కుటుంబానికి పార్టీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్,ఉప సర్పంచ్,వార్డు సభ్యులు,బీఆర్‌ఎస్ నాయకులు,రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన నాగుర్ల.

నూతన వధూవరులను ఆశీర్వదించిన నాగుర్ల

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని నర్సక్కపల్లె గ్రామానికి చెందిన కేశిరెడ్డి సాంబరెడ్డి సరిత దంపతుల కుమార్తె నిధిరెడ్డి చిరంజీవి ఓం ప్రకాష్ రెడ్డి వారి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు వీరి వెంట ఈ కార్యక్రమంలో బీ ఆర్ఎస్ నాయకులు నాగుర్ల సంతోష్ రావు,బొంపల్లి నేతాజీ మోహన్ రావు, శివాజీ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version