కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ కోహీర్ మండల అధ్యక్షులు శ్రీ పట్లోళ్ల రాంలింగా రెడ్డి ఆధ్వర్యంలో కోహీర్ మండలం దిగ్వాల్ గ్రామంలో స్వయం సహాయక సంఘం మహిళలకు ‘పుట్టింటి సారై’ మాదిరిగా ఆత్మగౌరవంతో కూడిన నాణ్యమైన ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ, మాజీ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
జహీరాబాదులో జరిగిన ఇందిరమ్మ మహిళ శక్తి కార్యక్రమంలో ప్రధాన అతిథిగా పాల్గొన్న జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శేట్కార్ , అలాగే సంక్షేమ కార్యక్రమాల అమలులో ముందుండే సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గారు పాల్గొనడం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబన, ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై అవగాహన ఈ కార్యక్రమం ద్వారా మరింత బలంగా ప్రజలకు చేరువైంది. స్థానిక మహిళలతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు, వారి అవసరాలు తెలుసుకోవడంలో నేతల పాల్గొనడం అభినందనీయం.మన జహీరాబాద్ అభివృద్ధి మహిళల అభివృద్ధి నుంచే ప్రారంభమవుతుంది. ఇదే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న అడుగులు ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయి,
జహీరాబాద్ నియోజకవర్గం ఇటుక బట్టీలకు దందాగా మారింది. ఆంధ్ర ఒడిస్సా, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కార్మికులను తీసుకొచ్చి ఇటుక బట్టీలను తయారు చేస్తున్నారు. సంబంధిత పంచాయతీకి రావలసిన ఆదాయానికి వ్యాపారులు గండి కొడుతున్నారు. అంతేకాకుండా నిబంధనలు కాలరాస్తూ.. కొనుగోళ్లు చేస్తూ రూ.కోట్లకు దండుకుంటున్నా రు. ఈ వ్యవహారంపై వ్యవహారం సంబంధిత శాఖ అధికారుల దృష్టి సారించకపోవడం తో దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. ఇంతా దందా సాగుతున్న అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ : రెండు రాష్ట్రాలకు అడ్డాగా మారిన ఖేడ్ ఇటుక బట్టీల దందా కొనసాగిస్తు న్నారు. సంత్ పూర్ నుంచి వచ్చి మూడు సంవ త్సరాల నుంచి ఇటుక బట్టులను తయారు చేస్తూ… ఒడిస్సా, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కార్మికులను తీసుకొచ్చి ఇటుక బట్టీలను తయారు చేస్తున్నారు. రూ. కోట్లల్లో దందా జరు గుతుంది. కూలీలకు డబ్బులు ఇవ్వకపోతే కొట్టిన సంఘటనలను అనేకం ఉన్నాయి. పని చేయిం చుకున్న తర్వాత పోయేముందు కార్మికులకు డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి కేసులు నమోదైన సంఘటనలు ఉన్నాయి. ప్రభుత్వ భూముల్లో ఇటుక బట్టీల వ్యాపారం చేస్తూ.. ఎలాంటి నిబంధనలు పాటించని అక్రమార్కులకు ఎంకరేజ్ చేస్తున్నా రు. ఇటుక బట్టీల వ్యాపారులతో ప్రత్యేక ఒ ప్పందం పెట్టుకుంటున్నారు. సంబంధిత పంచా యతీకి రావలసిన ఆదాయానికి గండి కొడుతు న్నారు. అంతేకాకుండా నిబంధనలు కాలరాస్తూ కొనుగోళ్లు చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. అక్రమాలకు పుట్టగా ఇటుక బట్టీలు తయారవు తున్నాయి. ఇటుక బట్టీ ఏర్పాటు చేయాలంటే ముందుగా గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ తో పాటు, మైనింగ్, రెవెన్యూ, పరిశ్రమ శాఖ. కాలుష్య, కార్మిక శాఖ, ఇరిగేషన్, విద్యుత్ శాఖ, రవాణా శాఖ, నియంత్రణ మండలి రవాణా శాఖ అనుమతులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అవేమి కనిపించవు. ఈ వ్యవహా రంపై సం బంధిత శాఖ అధి కారుల దృష్టి సారించక పోవడంతో వ్యాపారులు దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగు తుంది. ఇటుక బట్టీల సీజన్ లో అధికారులకు సైతం నెల నెలకు మా మూలు అందుతున్నాయన్న ఆరోప ణలు ఉన్నాయి. దీంతో ఆయా గ్రామా ల్లోని ప్రభుత్వ భూములను నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలు దందా కొనసాగుతున్నప్పటికీ ఏమీ బాధ్యత లేని అన్నట్లు ఆయా విభా గాల అధికారులు వ్యవహ రిస్తున్నారు. ఇటుక బట్టీల వ్యాపా రం యథేచ్చగా సాగుతున్న అధికారులు అటు వైపు కన్నెత్తి చూడ కపోవడంతో పలు అనుమానా లు తవిస్తోంది. జిల్లాలోనే జహీరాబాద్ నియోజకవర్గంలో ఇటుక బట్టీల అక్రమ దందాపై జిల్లా కలెక్టర్, ఉన్నతా అధికారులు వెంటనే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
పంట పొలాల్లో తయారీ..
ధనార్జననే ధ్యేయంగా కొందరు అక్రమార్కులు పంటలు పండించాల్సిన భూముల్లో ఇటుక బట్టిలను బిజినెస్ సాగిస్తున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని శివారులో ఆంధ్రకు చెందిన జహీరాబాద్ లో ఉంటూ పరిచయం పెంచుకుంటూ మొగుడంపల్లి జహీరాబాద్ న్యాల్కల్ మండల శివారులోని రూట్లో భూమిని లీజుకు తీసుకొని పెద్ద ఎత్తున ఇటుక బట్టీలను తయారు చేసి హైదరాబాద్, కర్ణాటక మహారాష్ట్ర తరలిస్తున్నారు. అదేవిధంగా జహీరాబాద్ మండలం , శాఖాపూర్ రోడ్డు చిన్న హైదరాబాద్ శాఖాపూర్ కొత్తూరు ఇప్పేపల్లి గ్రామలో ఇటుక బట్టీ ఏర్పాటు చేశారు.
50 కు పైగానే ఇటుక బట్టీలు
నియోజకవర్గంలో సుమారు 50 పైగా ఇటుక బట్టీలు అక్రమంగా కొనసాగిస్తున్నట్లు సమా చారం. వీటిలో అన్ని ఇటుక బట్టీలు అనుమ తులు లేకుండానే కొనసాగిస్తుండడంతో ప్రభు త్వం ఆదాయం కోల్పోతుంది. లక్ష ఇటుకలు తయారు చేస్తున్న బట్టీ నిర్వహణకు గనుల శాఖ అనుమతి కోసం రూ.16 వేలు చెల్లించాలి. మట్టికి ఒక క్యూబిక్ మీటర్ కు సీనరేజీతో కలు పుకొని రూ. 40చొప్పున కట్టివ్వాలి. అవేమీ చెల్లించకుండానే వందల ట్రిప్పుల మట్టిని తవ్వు కుపోవుతున్నారు. పొగ వస్తున్న కాలుష్యం ని యంత్రణ బండలి అధికారులు పట్టించుకోవడం లేదు. మట్టిని తరలిస్తున్న రెవెన్యూ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని, ఆరో పణలు వెల్లువెత్తుతున్నాయి.
`పిల్లలు సైతం ‘‘దేక్‌లేంగే’’ అని పాటలు పాడుతున్నారు
`’’కేటీఆర్’’ అంకుల్ నమస్తే అంటూ స్వాగతిస్తున్నారు
హైదరాబాద్, నేటిధాత్రి: తులం బంగారం ఇయ్యరు. వృద్దులకు ఇస్తామని చెప్పిన నాలుగు వేల పించన్లు ఇయ్యరు. మహిళలకు ఇస్తామన్న రెండు వేల ఐదు వందలు ఇయ్యరు. విద్యార్దినులకు ఇస్తామన్న స్కూటీల జాడ లేదు. రైతులకు ఇచ్చే రైతు బంధుకు రాం..రాం..అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు కేటిఆర్ పంచ్ డైలాగులు కొడుతుంటే జూబ్లీహిల్స్ జనం కేరింతలు కొడుతున్నారు. కేటిఆర్ చెబుతున్నప్పుడు వంత పాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నారు. అలవి కాని హమీలన్నీ ఇచ్చి ఇప్పుడు మాట మారుస్తున్న కాంగ్రెస్ పార్టీని జూబ్లీహిల్స్ ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిరచాలంటూ చేస్తున్న వ్యాఖ్యలకు ప్రజలు చప్పట్లు కొడుతున్నారు. కారు గుర్తుకే మన ఓటు అంటూ కేటిఆర్ అంటుంటే రోడ్‌షోలకు హజరైన జనం మన ఓటు అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అంటున్నారు. ఇదీ కేటిఆర్ క్రేజ్ అంటూ బి ఆర్‌ఎస్ శ్రేణులు సంబరపడుతున్నాయి. చాలా కాలం తర్వాత ప్రజలు బిఆర్‌ఎస్ పార్టీ ప్రచారంలో, స్ట్రీట్ కార్నర్ సభల్లో, కేటిఆర్ రోడ్‌షోలకు విపరీతంగా హజరౌతున్నారు. స్వచ్చంధంగా వచ్చి కేటిఆర్ చెప్పే మాటలు వింటున్నారు. కేటిఆర్ వేస్తున్న పంచ్ డైలాగులకు జనం ఊడిపోతున్నారు. ఇంతటి క్రేజ్ ఈ మధ్య మరే నాయకుడికి లేదు. సహజంగా బిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్‌ను చూసేందుకు జనం ఇలా ఎగబడుతుంటారు. సభలకు హజరౌతుంటారు. ఆయన మాటలు వినడానికి లైవ్ కార్యక్రమాలు చూస్తుంటారు. ఇప్పుడు సరిగ్గా ఆ క్రెడిట్‌ను కేటిఆర్ సొంతం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు కేటిఆర్ సెంటఆర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. కేటిఆర్ సభలకు విచ్చినంత జనం ఇతర పార్టీలకు రావడం లేదు. కాంగ్రెస్ పార్టీ తరుపున అసలైన స్టార్ క్యాంపెయిన్ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సైతం ఇంత మంది రావడం లేదు. ఆయన సభలు చాలా సప్పగా సాగుతున్నాయి. గత వారం రోజుల నుంచి సిఎం. రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడుతున్నారు. ప్రచారంలో విసృతంగా పాల్గొంటున్నాడు. అటు మంత్రులు, ఇటు కాంగ్రెస్ అభ్యర్ధిని వెంట పెట్టుకొని సిఎం. రేవంత్ రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. దానికి తోడు రహమత్ నగర్‌లో సిఎం. రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో ఆగ్రహాన్ని తెప్పించాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ గెలిస్తే ఇటీవల ఇచ్చిన 25వేల రేషన్‌కార్డులు కట్ అవుతాయని హెచ్చరించారు. ఉచిత కరంట్ బంద్ అవుతుందన్నారు. సన్న బియ్యం ఆపేస్తామన్నారు. సబ్సిడీ సిలిండర్ ఇవ్వమన్నారు. ఇదిలా వుంటే తాజాగా కొత్తగా నియామకమైన మరో మంత్రి అజహరుద్దీన్ కాంగ్రెస్‌ను గెలిపించకపోతే జూబ్లీహిల్స్ రాను అంటూ వ్యాఖ్యానించారు. ఇది కేటిఆర్‌కు ఆయుధాలుగా మారాయి. మామూలుగానే కేటిఆర్ లాంటి వాగ్ధాటి వున్న నాయకులకు చిన్న అవకాశం దొరికినా రచ్చ రచ్చ చేస్తారు. అలాంటిది సాక్ష్యాత్తు సిఎం. రేవంత్‌రెడ్డి బియ్యం ఆపేస్తాం. రేషన్ కార్డులు కట్ చేస్తామంటూ ప్రజలను బెదిరించేలా వ్యాఖ్యలు చేస్తే ఊరుకుంటారా? వీటిపై కేటిఆర్ ప్రభుత్వాన్ని తూర్పారపడుతున్నారు. దుమ్ము దుమారం రేపుతున్నారు. ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ప్రజలను బెదిరిస్తే ఓట్లు పడతాయని రేవంత్ అనుకుంటున్నారు. అలాంటి నియంతకు తగిన బుద్దిచెప్పాలంటూ కేటిఆర్ ప్రజలకు సూచిస్తుంటే జనం చప్పట్లు కొడుతున్నారు. సహజంగా రోడ్ షోలలో కార్నర్ మీటింగ్‌లు పది నిమిషాలు, పావు గంట సాగితేనే ఎక్కువ. కాని కేటిఆర్ కార్నర్ సభలు గంటకు పైగా సాగుతున్నాయి. జోరు వానలో కేటిఆర్ మాట్లాడుతుంటే జనం కదలడం లేదు. పైగా వానలో కూడా డ్యాన్సులు చేస్తూ కేటిఆర్‌కే ఉత్సాహాన్ని నింపుతున్నారు. దాంతో కాంగ్రెస్, బిజేపి నాయకులకు దక్కని క్రేజ్ కేటిఆర్‌కు సొంతమౌతోంది. ఇక బిజేపి నుంచి స్టార్ క్యాంపెయినర్లు ఎంత మంది వున్నా, రోడ్‌షోలకు, సభలకు, ప్రచారానికి పెద్దగా స్పందన లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆది నుంచి అన్ని రకాల బాధ్యతలు కేటిఆర్ నిర్వహిస్తూ వస్తున్నారు. అన్ని రకాల ప్రచార బాద్యతలు ఆయన భుజాన వేసుకున్నారు. మాగంటి గోపీనాధ్ చనిపోయిన నుంచి జూబ్లీహిల్స్‌లో అనేక రకాల పార్టీ సభలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఎన్నికల సమయంలో పార్టీ నాయకులకు అప్పగించే బాధ్యతలు అప్పగించినా, అందిరికన్నా ఎక్కువ కష్టపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద కౌంటర్ల కోసం ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని తూర్పారపడుతున్నారు. పైగా ఓట్ చోరి అంశంలో జూబ్లీహిల్స్‌లో దొంగ ఓట్ల నమోదుపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్నికల కమీషన్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఉప ఎన్నికల వేళ పార్టీలోకి పెద్దఎత్తున చేరికలు జరుగుతున్నాయి. అటు కాంగ్రెస్, ఇటు ఎంఐఎం, బిజేపిలనుంచి బిఆర్‌ఎస్‌లోకి డివిజన్ల వారిగా చేరికలు జరుగుతూనే వున్నాయి. వాటన్నింటికీ హజరౌతూ, వారితో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ గెలుపుకోసం కృషి చేస్తున్నారు. పార్టీలోకి చేరుతున్న వారికి స్వయంగా కేటిఆర్ కండువాలు కప్పి ఆహ్వానిస్తున్నారు. వారిలో ఉత్సాహం నింపుతున్నారు. ఇక ఇటీవల ప్రభుత్వం వల్ల నష్టపోయిన హైడ్రా బాదితులు, మూసీ బాధితులను స్వయంగా కలుస్తున్నారు. వారు తెలంగాణ భవన్‌కు వస్తామంటే రమ్మంటున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఆ కుటుంబాలు పడిన భాధనలు, వేధనలు వింటున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా హైడ్రా బాదితులతో ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశం చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం వణికిపోయిందనే చెప్పాలి. అందుకే వెంటనే స్పందించిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంటు జగ్గారెడ్డి హైడ్రా వల్ల తమ పార్టీకి నష్టం జరుగుతోందని అన్నారు. అంటేనే హైడ్రా పేదల జీవితాలను ఎలా తలకిందులు చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణ భవన్‌కు వచ్చిన చిన్న పిల్లలు తమ అనుభవాలను చెబుతూ కన్నీటి పర్యంతమౌతుంటే కేటిఆర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రజలను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇలా అన్ని వర్గాల ప్రజలనుంచి కేటిఆర్ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక ఎన్నికల ముందు కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన హమీలు, ప్రజలకు ప్రభుత్వం వున్న బాకీలను గుర్తు చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు. బాకీ కార్డులను ప్రజలకు అందజేస్తూ, ప్రచారానికి వస్తున్న కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం వల్ల నష్టపోయిన వారికి హైడ్రా బాధితులకు తప్పకుండా పార్టీ అండగా వుంటుందని భరోసా కల్పిస్తున్నారు. పొరపాటున జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను నమ్మితే, ఇక్కడికి కూడా బుల్డోజర్ వస్తుందని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇలా ఎక్కడిక్కడ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ క్షణం తీరుకలేకుండా ప్రచారంలో పాల్గొంటున్నారు. బిఆర్‌ఎస్ అభ్యర్ది సునీతను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. గతం కన్నా వినూత్నమైన రీతిలో కేటిఆర్ ప్రచారం సాగిస్తున్నారు. ఎల్‌ఈడీ స్క్రీన్‌లలో ప్రభుత్వం ఇచ్చిన హమీలు, చేసిన మోసాలు చూపిస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. దాంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన మోసాలను గుర్తు చేస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు. సిఎం. రేవంత్‌రెడ్డి సభలకు, రోడ్‌షోలకు వస్తున్న జనాలకంటే రెట్టింపు జనాలు కేటిఆర్ సభలకు ప్రజలు హజరౌతున్నారు. కేటిఆర్ రోడ్‌షోలకు జనం ప్రభంజనంలా వస్తున్నారు. 2015 జిహెచ్‌ఎంసి ఎన్నికల సమయంలో కేటిఆర్ రోడ్‌షోలకు జనం తండోపతండాలుగా వచ్చే వారు. కేటిఆర్ ఎక్కడికెళ్లినా జనం పెద్దఎత్తున సమూహమయ్యేవారు. ఇక రోడ్‌షోలలో కేటిఆర్ వెహికిల్ కదిలేది కాదు. అంత జనం వచ్చే వారు. ఇప్పుడు సరిగ్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలోనూ కేటిఆర్ సభలకు ప్రజలు వస్తున్నారు. కేటిఆర్‌కు హైదరాబాద్ ప్రజల్లో ఎంత ఆదరణ వుందో, క్రేజ్ వుందో ఈ రోడ్‌షోల ద్వారా మరోసారి రుజవౌతోంది. తెలంగాణ ప్యూచర్ లీడర్ కేటిఆరే అనేది తేలిపోతోంది. అందుకే కేటిఆర్‌ను చూస్తూ జనం కేరింతలు కొడుతున్నారు. ఈలలు, చప్పట్లతో ఆయన మాటలకు ఫిదా అవుతున్నారు.
సీసీఐ పత్తి కొనుగోళ్లను ప్రారంభించిన, గండ్ర సత్యనారాయణ రావు
శాయంపేట నేటిధాత్రి:
రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటను సీసీఐ కేంద్రాల్లో అమ్ముకొని మద్దతు ధర పొందాలని గండ్ర సత్యనారా యణరావు సూచించారు. పరకాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు లో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన పత్తి కొనుగో లు కేంద్రాన్ని ఎమ్మెల్యే లిద్దరు రిబ్బన్ కట్ చేసి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా వేరు వేరుగా మాట్లాడుతూ సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని రైతు లు సద్వినియోగం చేసుకొని, మద్దతు ధరను పొందాలని అన్నారు.
8 నుండి 12 శాతం వరకు తేమ శాతం ఉండడం వలన రైతులు నష్టపోతున్నా రని 20 శాతం తేమ ఉండే విధంగా కొనుగోలు చేయాల న్నారు. ప్రతి ఎకరాకి 7 క్వింటాళ్లు కొనుగోలు చేయా లనే నిబంధన కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసి, 12 క్వింటాలు కొను గోలు చేసేలా రైతులకు సహక రించాలన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపో యిన ప్రతి ఒక్కరికి పరిహారం అందించేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుం దని, అధికారులు వెంటనే సర్వే చేసి ప్రభుత్వానికి నివే దిక అందించేలా సహకరిం చాలన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు స్లాట్ బుకింగ్ చేసుకుని పత్తిని తీసుకురావాలని సూచించా రు. అంతకుముందు వివిధ పంటలకు సంబంధించిన కనీస మద్దతు ధర పోస్టర్ ను ఎమ్మెల్యేలు, అధికారులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాయంపేట మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అద్వాన పరిస్థితులపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు గూండాలుగా వ్యవహరించి భౌతికరిదారులకు దిగటం ఎంతవరకు సరైనదని గుండాల మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెల్లం భాస్కర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు రేగ కాంతారావు డిజిటల్ మీడియా ద్వారా రహదారుల పరిస్థితి పై ప్రశ్నిస్తే భౌతిక దాడులకు దిగుతూ మణుగూరు పార్టీ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ గుండాలు దాడి చేసి కాలబెట్టడం ఎంతవరకు సరైంది అని అన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేక అడిగే వారి పైన వారి పార్టీ కార్యాలయాల పైన దాడులకు దిగితే పార్టీ నాయకులు కార్యకర్తలు భయపడతారు అనుకోవడం వారి అవివేకమని అన్నారు. అభివృద్ధి చేతకాక అడిగే వారిపై దాడులు చేయడమే మీ సంస్కృతి ఇదే మీ ప్రజా పాలన అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయకలేక ప్రజలను మభ్య పెట్టేందుకు కొత్త రకం నాటకం తెరలేపిందని అన్నారు . ఈ దారిలో పాల్గొన్న కాంగ్రెస్ గుండాలపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పై దృష్టి సారించి ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని లేని పక్షంలో మరింతగా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా ముందుకు కదులుతాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు భౌతిక దాడులకు దిగటం మానుకోవాలని లేని పక్షంలో చట్టపరంగా వెళ్లి వారికి శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి టి రాము, యువజన విభాగమ అధ్యక్షుడు సయ్యద్ అజ్జు,బీసీ సెల్ అధ్యక్షులు గడ్డం రమేష్, ఎస్టీ సెల్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ఎస్సీ సెల్ అధ్యక్షులు రాములు,పార్టీ నాయకులు గడ్డం వీరన్న, కటికం నాగేశ్వరరావు, జాడి ప్రభాకర్, గోగ్గల రాంబాబు,పొంబోయిన సుధాకర్, బొమ్మెర్ల శ్రీను, బొమ్మెర్ల పద్మారావు, బొమ్మెర సతీష్, గంగాధరి ప్రమోద్, జనగం లాలయ్య, భూక్య శ్రీను, ఆగయ్య, గంగాధరి నాగన్న, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కుటుంబానికి పరామర్శించిన యువ నాయకులు షేక్ సోహెల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు కుటుంబానికి పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి నివాళులర్పించిన ఝరాసంగం మండలం తుమ్మన్ పల్లి గ్రామ యువ నాయకులు షేక్ సోహెల్ గారు.గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు రావు చిత్ర పటానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి వెళ్లి తన సానుభూతిని వ్యక్తం చేస్తూ దేవుడు వారి కుటుంబానికి ధైర్యం నింపాలని కోరినారు, షైక్ సోహైల్ మరియు శశివర్ధన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు,
సోమవారం నాడు హైద్రాబాదు లో మాజీ మంత్రి,సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు,తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులు కాగా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని పరకాల బిఆర్ఎస్ యువనాయకులు వీరేష్ రావు సత్యనారాయణ రావు చిత్రపటానికి నివాళులు అర్పించారు
గ్రామాల్లో ప్రజలకు అందుతున్న మిషన్ భగీరథ నీటిపై క్వాలిటీ కంట్రోల్ ఏఈ సుధాకర్, మిషన్ భగీరథ ఏఈ బిక్షపతి పర్యవేక్షించారు. మండలంలోని నగరం తండా గ్రామంలో సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో గల మిషన్ భగీరథ నీటికి సంబంధించిన రికార్డులను ఆయన పరిశీలించారు. వాటర్ ట్యాంకులు, ఇండ్లలోకి సరఫరా అయ్యే నీటిని పరిశీలించి వాటి నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ ఆరిఫ్, మిషన్ భగీరథ హెల్పర్ పరశురాములు, బలిజ భాస్కర్, తదితరులు ఉన్నారు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాతకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా,సోమవారం ఝరాసంగం మండలం పరిధిలో కక్కర్ వాడ గ్రామ లో తాటిపల్లి నాగమణి మహిపాల్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్య అతిథులు గా పాల్గొన్నారు.ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సకాలంలో ఇల్లు పూర్తి చేసుకొని ఇలాంటి మంచి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం తరపున కోరుకుంటున్నాము అన్నారు.
ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మన ప్రజా ప్రభుత్వం మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహింస్తోంది. ప్రజలు అందరూ సద్వినియగం చేసుకోవాలని కోరుకుంటున్నాము అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ హన్మంత్ రావు పాటిల్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్ నాయకులు మారుతి రావు సంగ్రామ్ పాటిల్ డప్పురు సంగన్న రాజ్ కుమార్ స్వామి గ్రామ యువ నాయకులు శ్రీకాంత్ రెడ్డి గోపాల్ రెడ్డి మాజీ ఎం పి టిసి నర్సిములు.అడ్వకేట్ షకీల్ సర్ శ్రీనివాసరెడ్డి రాంరెడ్డి పెన్ గన్ ఎడిటర్ రాయికోటి నర్సింలు.యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చింతలగట్టు శివరాజ్ మండల సోషల్ మీడియా ఇంచార్జి నవీన్ సుభాష్,మాణయ్య ఇస్మాయిల్ తధీతరులు పాల్గోని మహిపాల్రెడ్డికి శుభకాంక్షలు తెలియజేసారు
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప-ఎన్నికల ప్రచారంలో డాక్టర్.మడికొండ శ్రీను
పరకాల,నేటిధాత్రి
హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప-ఎన్నిక సందర్బంగా కాంగ్రెస్ పార్టీ బలపరచిన ఎంమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుకోరుతూ టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కమిటీ పక్షాన ఎన్నికల ప్రచారం ఎర్రగడ్డ, అమీర్ పేట,సోమాజిగూడ, యూసుఫ్ గూడ డివిజన్ ఏరియాలలో ఏఐసీసీ ఎస్సీ సెల్ కో-ఆర్డినేటర్,టీపీసీసీ ఎస్సి సెల్ చైర్మన్ మరియు తెలంగాణ రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం నాయకత్వంలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల పోస్టర్స్, కరపత్రం చూపుతూ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్లు డబ్బేట రమేష్,నత్తి కౌర్నెల్,అర్షంఅశోక్,జమ్మికుంటవిజయ్,రాజశేఖర్,శివశంకర్,కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్ గూడ డివిజన్ లో లక్ష్మీనరసింహ నగర్ (L.N )డోర్ టు డోర్ ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి మరియు మహబూబ్ నగర్ జిల్లా మూడ చైర్మన్ & పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ పాల్గొని ప్రజలకు ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి ఓటు వేసి గెలిపించాలని ఓట్లరను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సంజయ్ గౌడ్, మహబూబ్ నగర్ జిల్లా మైనారిటీ ప్రెసిడెంట్ ఫయాజ్, టీం పట్వారీ శశిధర్, బి. రాజేష్ యాదవ్, ప్రేమ్, కలముద్దీన్, వెంకటమ్మ, పద్మమ్మ, రాజేష్, చిన్ను, హానీబ్, హనీఫ్, అతిఫ్, మన్సూర్, నద్దు మరియు బూత్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు
సదరు ఉత్సవాలలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు
◆:- డా౹౹సిద్దం.ఉజ్వల్‌రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదరు ఉత్సవాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్‌రెడ్డి పాల్గొన్నారు. వారికి యాదవ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఉజ్వల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది జహీరాబాద్ పట్టణంలో యాదవ సోదరులు సదరు ఉత్సవాలు నిర్వహించడం ఆనందదాయకమన్నారు. సదర్ ఉత్సవాలు మన సాంస్కృతిక వైభవానికి, ప్రజల ఐక్యతకు ప్రతీక అన్నారు.ఈ ఉత్సవాలు మన సంప్రదాయాలను, సాంస్కృతిక విలువలను తరతరాలకు చేరుస్తాయన్నారు.అనంతరం దున్నపోతుల ప్రదర్శనను వీక్షించి,నిర్వాహకులను అభినందించారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పి.నర్సింహారెడ్డి,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పి.నాగిరెడ్డి,యూత్ కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ నథానెయల్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్‌కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు శ్రీకాంత్‌రెడ్డి,ఇమామ్ పటేల్, అరుణ్‌కుమార్, పాండు యాదవ్, సాయి యాదవ్, పవన్ యాదవ్ మరియు యాదవ సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న షేక్ ఫరీద్ మరియు షేక్ సోహెల్ నాయకులు
మాగంటి సునీత గోపీనాథ్ ని అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గ నాయకులు ఇంటింటి ప్రచారంలో పాల్గొని బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు ఓట్లు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఓట్లను కోరారు. బిఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ మైనార్టీ సీనియర్ నాయకులు షేక్ ఫరీద్ తో కలిసి ఝరాసంగం మండల తుమ్మన్ పల్లి గ్రామ మైనారిటీ సీనియర్ నాయకులు షేక్ సోహెల్ బీఆర్ఎస్ దే విజయం ఖాయమని జూబ్లీహిల్స్ – ఉపఎన్నికలో గులాబీకే 100% విజయావకాశాలు..కారుతో పోటీపడి గెలవడం కాంగ్రెస్ కు అసాధ్యం..45 రోజుల సర్వే లో 55.2శాతం ప్రజా మద్దతు బెదిరింపు రాజకీయాలకు భయపడే లేదు – మీ నకిలీ వాగ్దానాలు,దబాయింపులకు జూబ్లిహిల్స్ ఓటమితో ముగింపు..2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? : టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించి, అభివృద్ధిలో పాలి భాగస్తులు కావాలని ఓటర్లను కోరారు. వారితోపాటు శశివర్ధన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు
శాయంపేట మండల కేంద్రం లోని కొప్పుల గ్రామంలో అంగరంగ వైభవంగా చాకలి ఐలమ్మ విగ్రహా ఆవిష్కరణ మహోత్సవం జరిగింది. విగ్రహ దాత వైనాల రాజు వారి స్నేహి తుల ఆధ్వర్యంలో మహోత్స వాలు ఘనంగా నిర్వహించారు భూమికోసం ముక్తి కోసం ఉద్య మం చేసిన వీర వనితను స్మరించుకుంటూ సేవలను గుర్తు చేసుకున్నారు.
ప్రత్యేక అతిథిగా విమలక్క మాట్లాడు తూ తెలంగాణ రైతాంగసాయు ధ పోరాట ఉద్యమ స్ఫూర్తితో అమరనా మంగా నిలిచిన మహిళ నాయకురాలు మహి ళా శక్తిని చాటిన జన జాగృతి ధీరవనిత ఉత్పత్తి కులాలకు ఊపిరి ఊదిన పీడిత ప్రజల విముక్తికై పిడికిలి ఎత్తిన నిప్పు కనిక వీర నారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు.
వంగాల నారా యణరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తెగువను పోరాట పటిమను ప్రపంచానికి చాకలి ఐలమ్మ స్పందించు కుందాం వారు చూపిన బాటలో యువ త నడవాలి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం, చాకలి ఐలమ్మ అంద రికీ స్ఫూర్తి అని కొనియాడారు ఈ కార్యక్ర మంలో ముఖ్యఅ తిథిగా యాదగిరి తెలంగాణ విశ్వవి ద్యాలయం, ప్రత్యేక అతిధి విమలక్క అరుణోదయ సాంస్కృతిక మండలి, మల్లేశం రవికుమార్ సీతారాములు వంగాల రామ- నారాయణరెడ్డి అలువాల రాజేందర్ ,శ్రీధర్, వైనాల రాజేందర్ (రాజు), పసునూటి రాజయ్య,కుల పెద్దలు అలువాలయాదగిరి, కొమురయ్య, కుమారస్వామి, శంకర్, రజక సంఘం అధ్య క్షులు మునుకుంట్ల రవి, కృష్ణమూర్తి,రజక యువసేన పైండ్ల మహేష్ కొమురాజు శ్రీకాంత్, బాసని సీతారాము లు, మామిడి అశోక్ , బగ్గి రమేష్, మంద నరేష్ ,అన్ని పార్టీల నాయ కులు, అన్ని కులాల సంఘ నాయకులు, మహిళా సంఘాలు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు
రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి: బీజేపీ మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈసందర్భంగా మండల అధ్యక్షులు మోడీ రవీందర్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధుర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, ఒక బాధ్యత గల పదవిలో ఉండి కేంద్ర బలగాలను అవమానించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటో తెలపాలన్నారు. ప్రపంచ దేశాలు మెచ్చుకుంటే, ఐక్య రాజ్య సమితిలో పాకిస్థాన్ బతిలాడుకుంటే ఆపరేషన్ సింధుర్ కేంద్రంలోని నరేంద్రమోదీ అపారని, అటువంటి విధానాలను, కేంద్ర బలగాలను అవమానించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద దేశద్రోహం కేసు నమోదు చేయాలని కోరారు. అర్మీ బలగాలకు, కేంద్ర ప్రభుత్వానికి, దేశ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శిలు పోచంపెల్లి నరేష్, పురేళ్ళ శ్రీకాంత్ గౌడ్, యువ మోర్చా మండల అధ్యక్షులు దురుశెట్టి రమేష్, దళిత మోర్చా మండల అధ్యక్షులు సంటి జితేందర్, మహిళ మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు మామిడిపెళ్లి చైతన్య, యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి లక్ష్మణ్, యువ మోర్చా మండల ఉపాధ్యక్షులు బండారి శ్రీనివాస్, ఐటి సెల్ మండల కన్వీనర్ మాడిశెట్టి జయంత్, సీనియర్ నాయకులు కట్ట రవీందర్, బద్ధం లక్ష్మారెడ్డి, మాదం శివ, బొజ్జ తిరుపతి, శేవెళ్ల అక్షయ్, సూదగోని మహేష్ గౌడ్, మామిడిపెళ్లి రమేష్, మండల ఐటి సెల్ కోకన్వీనర్ మూల వంశీ, చేనేత సెల్ కన్వీనర్ వేముల రమేష్, బూత్ కమిటీ అధ్యక్షులు ఉత్తేం కనుకరాజు, దైవల తిరుపతి గౌడ్, బుర్ర శ్రీధర్, మడికంటి శేఖర్, భూస మధు, ఉత్తేం సాయి తదితరులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశిస్తూ ఓటర్ల ను బెదిరించే విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని,భారత దేశ సైన్యం పట్ల అగౌరవంగా మాట్లాడడం వారి ధైర్య సాహసాలను కించ పరిచే విధంగా నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బీజేపీ పరకాల పట్టణ ప్రధాన కార్యదర్శి పాలకుర్తి తిరుపతి డిమాండ్ చేశారు.ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దాలను 100 రోజుల్లో పూర్తి చేస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్న అమలు చేయకుండా ప్రజల విశ్వాసం కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందని తెలిపారు.బిజెపి పార్టీ అభ్యర్థికి ప్రజాదరణ మెండుగా ఉన్నందున జీర్ణించుకోలేక పోతున్నారని ఆపరేషన్ సింధూర్ పై బిజెపి పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించే విధంగా మాట్లాడడం సరికాదన్నారు.భారత జవాన్ల పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి అధిక మొత్తంలో కేంద్ర నిధులు
– 15వేల మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లు
– అంగన్వాడీ టీచర్లకు ఉచితంగా ట్యాబ్స్
– కేంద్ర పథకాల నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించవద్దు
– ప్రభుత్వాసుపత్రుల్లో మందులకు నిధులు ఇస్తాం
– పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు
– మంజూరైన పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి
– కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, దిశ కమిటీ చైర్మన్ బండి సంజయ్ కుమార్
సిరిసిల్ల, నేటిధాత్రి:
పార్టీలకు అతీతంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, రాష్ట్రంలో అత్యధికంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి కేంద్ర నిధులు తీసుకువచ్చామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, జిల్లా అభివృద్ధి, కోఆర్డినేషన్& మానిటరింగ్ కమిటీ (దిశ) చైర్మన్ బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అభివృద్ధి, కోఆర్డినేషన్&మానిటరింగ్ కమిటీ (దిశ)సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధికి ఎన్నో నిధులు మంజూరు చేయించి పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఏ పార్టీకి చెందిన వారైనా నియోజకవర్గ అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వవచ్చని తెలిపారు. రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులే కారణమని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని వెల్లడించారు. 851 కోట్ల రూపాయల ఎంపీ నిధులను కరీంనగర్ అభివృద్ధికి కేటాయించామని అన్నారు. ప్రభుత్వాసుపత్రిలో ఆధునిక సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో హుజురాబాద్ హుస్నాబాద్ జమ్మికుంట సిరిసిల్ల ఆసుపత్రులకు అవసరమైన పరికరాలు ఏర్పాటు చేయిస్తున్నామని, అందుకు తగిన విధంగా సిబ్బందిని వైద్యులను నియమించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు 15వేల సైకిళ్లు ఉచితంగా అందజేశామని మరో 5 వేల సైకిల్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ తగ్గాయని అన్నారు. పీఎం శ్రీ నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్ళిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులను హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్, మౌలిక సదుపాయాలు అవసరమైతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎంపీ నిధుల ద్వారా మంజూరైన పనులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు. గన్నేరువరం బ్రిడ్జి, కేంద్రం సేతు బంధన్ పథకం ద్వారా మంజూరు చేసిన కరీంనగర్ ఆర్ఓబి నిర్మాణం తదితర పనులన్నీ వేగవంతం చేయాలని ఆదేశించారు.
Karimnagar Collectorate
ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. రానున్న నాలుగు సంవత్సరాల కాలానికి సరిపడా మందుల ఇండెంట్ తనకు సమర్పించాలని, నిధులు సమకూరుస్తానని వెల్లడించారు. ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్లు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలోని అంగన్వాడీ టీచర్లకు రోజువారి నివేదికల సమర్పించేందుకు ఉచితంగా ట్యాబ్ అందజేస్తామని తెలిపారు. సోలార్ పవర్ వినియోగం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాలను గురించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య మాట్లాడుతూ పాఠశాలల్లో మరుగుదొడ్లు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. తన క్షేత్రస్థాయి పర్యటనలో అనేక పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవని వెల్లడించారు. కస్తూరిబా పాఠశాలల్లో సిబ్బంది వేతనాలు పెంచాలని, మోడల్ స్కూల్ సిబ్బందికి ప్రతినెలా క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలని సూచించారు. మధ్యలో చదువు ఆపేసిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వారిని తిరిగి పాఠశాలలో చేర్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. విద్య, వైద్యం తదితర రంగాల్లో కేంద్రం అనేక నిధులు వెచ్చించి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. ప్రజలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకునేలా వారికి గ్రామస్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారుల్లో ఉందని అన్నారు.
ఈ సమావేశంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సిరిసిల్ల ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగర్వాల్, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన- జిల్లా గ్రంథాలయ చైర్మన్
మహదేవపూర్, నేటిధాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం మెట్ పల్లి గ్రామంలో వివాహానికి హాజరై నూతన వధూవరులను బుధవారం రోజున జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు ఆశీర్వదించారు. మండలంలోని మెట్ పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ ముల్కల శోభ రవీందర్ యొక్క అన్న కూతురు వివాహానికి హాజరై నూతన వధూ వరులైన ప్రవళిక రెడ్డి విష్ణువర్ధన్ దంపతులను ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కటకం అశోక్, మాజీ ఎంపిటిసి ఆకుతోట సుధాకర్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కోట సమ్మయ్య తోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ రేవతి, సింగాలగుంట వాసులు..
తిరుపతి,నేటిధాత్రి:
సింగా లగుంట 38 వా వార్డు నందు పునరావాస కేంద్రానికి వెళ్లి అక్కడ వాళ్లతో వసతుల గురించి చర్చించి వారికి బెస్షీట్లు మరియు బ్రెడ్లు ఏపీజీ&బిసి చైర్మన్, తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, తిరుపతి మాజీ మ్మెల్యే మన్నూరు సుగుణమ్మ , 38వ వార్డు ముఖ్య నాయకురాలు సింగాలగుంట రేవతి పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలోసంతోష్ ,విశ్వనాధం , ఆముదాల తులసి మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.