సీఎం సహాయ నిధి చెక్కును అందించిన ఎంపీ షెట్కర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
శంకరం పేట్ (A) మండలం మూసాపేట్ గ్రామానికి చెందిన గోసాయిపల్లి సాయమ్మ, భర్త సంగయ్యకు అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి నుండి మంజూరు అయిన 2.5 లక్షల రూపాయల ఎల్ ఓ సి చెక్కును జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ రెండవసారి బాధితుడికి అందించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం సహాయ నిధి ద్వారా ప్రభుత్వం వైద్య ఖర్చులు చెల్లిస్తూ ఆర్థికంగా ఆదుకుంటుందని బుధవారం ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఆత్మ చైర్మన్ జైహింద్ రెడ్డి, అశోక్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.