ధర స్థిరత్వం కేంద్ర బ్యాంకు బాధ్యత..

ధర స్థిరత్వం కేంద్ర బ్యాంకు బాధ్యత
గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆతిథ్య ఉపన్యాసంలో
ఆర్బీఐ పూర్వ గవర్నర్ డాక్టర్ దువ్వూరి

నేటి ధాత్రి, పఠాన్ చేరు:

 

ధర స్థిరత్వం ప్రధానంగా కేంద్ర బ్యాంకుల బాధ్యత (మనదేశంలో ఆర్బీఐ) అని ప్రముఖ ఆర్థికవేత్త, రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు స్పష్టీకరించారు. గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాదులో ఆయన ‘కేంద్ర బ్యాంకుల ఆర్థిక విధి’, ‘సమస్యలను పరిష్కరించడం: కేంద్ర బ్యాంకింగ్ భవిష్యత్తు’ అనే రెండు అంశాలపై మంగళవారం ఆతిథ్య ఉపన్యాసం చేశారు. ధర స్థిరత్వం కేంద్ర బ్యాంకు బాధ్యత అయినప్పటికీ, సరఫరాలో లోపాలు తలెత్తినప్పుడు పన్ను సర్దుబాట్లు లేదా సబ్సిడీలు వంటి ప్రభుత్వ ఆర్థిక జోక్యం అవసరమన్నారు. ఎన్నికైన ప్రభుత్వాలు స్వల్పకాలిక లక్ష్యాలతో, తిరిగి ప్రజామోదం పొందే లక్ష్యంతో పనిచేస్తాయి కాబట్టి, స్వతంత్ర కేంద్ర బ్యాంకు అవసరమని ఆయన స్పష్టీకరించారు.ధర స్థిరత్వం, వృద్ధి, ఉపాధికి మద్దతు ఇవ్వడం, ఆర్థిక

స్థిరత్వాన్ని నిర్ధారించడం అనేవి ఆర్బీఐ ప్రధాన లక్ష్యాలని డాక్టర్ దువ్వూరి చెప్పారు. ధర స్థిరత్వాన్ని తక్కువ, స్థిరమైన ద్రవ్యోల్బణంగా నిర్వచించడం ద్వారా, ద్రవ్య విధానం, రెపో రేటు ద్రవ్యోల్బణం, వినియోగం, పెట్టుబడి, మొత్తం ఆర్థిక కార్యకలాపాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఆయన వివరించారు. ద్రవ్యోల్బణం పేదలపై అతి పెద్ద పన్ను’గా డాక్టర్ సుబ్బారావు అభివర్థిస్తూ, డబ్బుల (కరెన్సీ)పై విశ్వాసాన్ని కొనసాగించడం యొక్క ప్రాముఖ్యతను డాక్టర్ దువ్వూరి వివరించారు. అధిక ద్రవ్యోల్బణం, ప్రతి ద్రవ్యోల్బణం.. రెండూ ఆర్థిక పనితీరును తీవ్రంగా దెబ్బతీస్తాయని పేర్కొంటూ, వడ్డీ రేట్లు, ఓపెన్ మార్కెట్ కార్యకలాపాల ద్వారా ఆర్బీఐ ద్రవ్యతను ఎలా నిర్వహిస్తుందో విశదీకరించారు. ద్రవ్యోల్బణ అంచనాలు స్వీయ-సంతృప్తిగా మారగలవు కాబట్టి, కేంద్ర బ్యాంకులు వాటిని చాలా జాగ్రత్తగానిర్వహించాలన్నారు.ఆర్బీఐ కీలక విధులను డాక్టర్ సుబ్బారావు ఏకరువు పెట్టారు. కరెన్సీని ముద్రించి-పంపిణీ చేయడం, ద్రవ విధానాన్ని రూపొందించడం, (విదేశీ) మారకపు రేట్లను నిర్వహించడం, ఆర్థిక సంస్థలు, మార్కెట్లను నియంత్రించడం, చెల్లింపు-పరిష్కార వ్యవస్థలను పర్యవేక్షించడం, ప్రభుత్వాలు, బ్యాంకులకు బ్యాంకర్ గా పనిచేయడం, ఆర్థిక అభివృద్ధి ప్రోత్సహించడం, ఆర్థికాభివృద్ధి అందరి దరికి చేర్చడమని ఆయన తెలియజేశారు.2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని గుర్తుచేసుకుంటూ, డాక్టర్ రావు ఆర్బీఐ గవర్నర్ గా తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. అల్లకల్లోల సమయాలలో విశ్వసనీయత, ప్రశాంతమైన నాయకత్వం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఆర్థిక వ్యవస్థ యొక్క పరస్పర అనుసంధాన స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని, బ్యాంకింగ్, బ్యాంకింగేతర సంస్థలను నియంత్రించడం ద్వారా ఆర్బీఐ రూపాయి క్రమబద్ధమైన కదలికను ఎలా నిర్ధారిస్తుందో, ఆర్థిక స్థిరత్వాన్ని ఎలా నిర్వహిస్తుందో డాక్టర్ దువ్వూరి విశదీకరించారు. విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలిస్తూ, విస్తృతంగా పుస్తకాధ్యయనం చేయమని వారిని ప్రోత్సహించారు.

తొలుత, జీఎస్ బీ డైరెక్టర్ డాక్టర్ దివ్య కీర్తి గుప్తా, పీజీ విభాగాధిపతి ప్రొఫెసర్ రనజీ అతిథిని స్వాగతించి, సత్కరించారు. ప్రొఫెసర్ అజయ్ కుమార్ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. విద్యార్థులు ఎస్.శాండిల్య అతిథిని పరిచయం చేయగా, ఆర్.ఎస్.మీనాక్షి, జి.అన్సికలు వందన సమర్పణ చేశారు.

సీసీఐ పత్తి కొనుగోళ్ళలో వ్యాపారుల అక్రమాలను అరికట్టాలి

సీసీఐ పత్తి కొనుగోళ్ళలో వ్యాపారుల అక్రమాలను అరికట్టాలి

పత్తి రైతుల రాష్ట్ర కన్వీనర్ పుచ్చకాయల కృష్ణారెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

కేంద్ర ప్రభుత్వం సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ కొనుగోళ్లలో వ్యాపారుల అక్రమాలను అరికట్టాలని పత్తి రైతుల రాష్ట్ర కన్వీనర్ పుచ్చకాయల కృష్ణారెడ్డి ఆరోపించారు.పత్తి రైతుల సమావేశంలో కృష్ణారెడ్డి మాట్లాడుతూ అన్ని ఒడిదొడుకులను ఎదుర్కొని పండించి పత్తికి కనీసం మద్దతు ధర పలకపోవడంపోవడంతో రైతు నష్టపోతున్నారని వెంటనే సీసీఐ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.క్వింటాల్ 10. వేల రూచొప్పున ధర అమలు చేయాలని కోరారు.పత్తి వ్యాపారస్తులు ధరలు తగ్గించి రైతుల వద్ద నుండి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పత్తి దిగుబడులు చాలా తగ్గాయని వరంగల్ మార్కెట్లో 7000 ధర నిర్ణయించి తేమ పేరుతో పేరుతో 6000 కూడా కొనడంలేదని అవేదన వ్యక్తం చేశారు.రైతులు పత్తి విత్తనాలు ఎరువులు,పురుగు మందులు వ్యవసాయ కూలీ ధరలు అన్ని పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని తట్టుకొని మార్కెట్కు పత్తి తీసుకుంటే తీసుకుని వస్తే రైతులకు సరైన ధర లభించడం లేదని రైతులకు అండగా ఉండవలసిన కేంద్ర ప్రభుత్వం 7700 ధర ప్రకటించినప్పటికీ వ్యాపారస్తులు అమలు చేయడంలేదని ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడంలేదని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొరబోయిన కుమారస్వామి, జిల్లా నాయకులు కటుకూరి శ్రీనివాసరెడ్డి,కోడం రమేష్, కొంగర నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు.

రైతులు పత్తి పంట నష్టంపై ఆవేదన…

రైతులు పత్తి పంట నష్టంపై ఆవేదన

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేంద్రంతో పాటు మండల పరిధిలోని జీర్లపల్లి ఈదులపల్లి దేవరంపల్లి ఎల్గోయి తుమనపల్లి గ్రామాల్లో రైతులు తమ పత్తి పంట నష్టం చెందినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు రైతుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, తక్షణ సహాయం అందజేయాలని వారు కోరుతున్నారు. పంట నష్టానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, రైతులకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, రైతులకు అండగా నిలవాలని పలువురు కోరుతున్నారు.

“మా పొట్ట కొట్టొద్దు… సారు…

“మా పొట్ట కొట్టొద్దు… సారు “

“ఆర్ఆర్ఆర్ రోడ్డు నిర్మిస్తే.. చచ్చిపోతాం”

 

బాలానగర్ /నేటి ధాత్రి

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని గుండేడు, వనమోని గూడ, గౌతాపూర్, చిన్న రేవల్లి, పెద్ద రేవల్లి గ్రామాల మీదుగా.. ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి అధికారులు ఇటీవలే ప్రతిపాదనలు పంపారు. ఈనెల 15 రైతుల అభిప్రాయాలను అధికారులు సేకరించేందుకు గడువు పెట్టారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల భూ నిర్వాసితులు తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితులు మాట్లాడుతూ.. వ్యవసాయం చేసుకొని జీవిస్తున్న తమకు.. పిడుగు లాంటి వార్త మా జీవితాల్లో నాశనం చేస్తుందని కన్నీటి పర్యంతమయ్యారు. ఉన్న పొలం రోడ్డుకు పోతే తాము జీవనోపాధి కోల్పోతామన్నారు. ఒకవేళ రోడ్డును నిర్మిస్తే క్రిమిసంహారిక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. ఉన్నతాధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ ప్రతిపాదనలు ఉపసంహరించుకుని, తమకు న్యాయం చేయాలని కోరారు.

భూములు కోల్పోతే.. మా బతుకులు ఆగం.. ఆగం….

భూములు కోల్పోతే.. మా బతుకులు ఆగం.. ఆగం

“ఆర్ఆర్ఆర్ కు.. మేము భూములు ఇవ్వం”

బాలానగర్ /నేటి ధాత్రి

 

 

 

బాలానగర్ మండలంలోని చిన్న రేవల్లి, పెద్ద రేవల్లి, గౌతాపూర్, వనమోనిగూడ, పెద్దాయపల్లి తదితర గ్రామాల మీదుగా ఆర్ఆర్ఆర్ రోడ్డు నిర్మాణానికి అధికారులు ఇటీవలే సర్వే నిర్వహించారు. రోడ్డు నిర్మాణానికి ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేయడంతో భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం బాలానగర్ తాహాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తూ.. తహాసిల్దార్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అంతకుముందు మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో ప్రజావాణిలో భూములు ఇవ్వబోమని, తమకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. తాము సన్న కారు రైతులమని, తమ జీవనాధారం వ్యవసాయ పొలమేనని, భూములను కోల్పోతే తాము ఉపాధిని కోల్పోతామన్నారు. నిరక్షరాసులైన తాము వ్యవసాయం తప్ప మరో పని చేయలేమన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్పందించి మరో ప్రాంతం నుంచి ఆర్ఆర్ఆర్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళికలు రచించాలన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త జీవోను వెంటనే రద్దు చేయాలి…

ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త జీవోను వెంటనే రద్దు చేయాలి…

తంగళ్ళపల్లి మండలంలో. గురుకుల పాఠశాల ల.కాంట్రాక్టర్లు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలంలో పలు గురుకుల.పాఠశాలకు సంబంధించిన కాంట్రాక్టర్లు మాట్లాడుతూ. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన 17 జీవోను వెంటనే రద్దుచేసి. పిల్లలకు సంబంధించి పాత కాంట్రాక్టు పద్ధతిని. కొన సాగించాలని. ఈ సందర్భంగా మాట్లాడుతూ. పాత పద్ధతిలోనే. కాంట్రాక్టు . విధానం. కొనసాగించాలని. గురుకుల పాఠశాలకు సంబంధించి. వంట చేసే బాధ్యతను కొనసాగించాలని. వారికి కిరణ్o. స్టోర్. బిల్లు గాని. సంబంధిత. కోడిగుడ్లు. కూరగాయలు గాని వెంటనే పాత పద్ధతి.కాంటాక్ట్ కొనసాగిస్తూ. పిల్లలకు ఎలాంటి అనారోగ్యం లేకుండా చూడాలని. వారు కూడా మా పిల్ల లెక్కనే కదా అని. అనవసరంగా. బాత్రూంలు.కలిగే వారి చేత ఇతర పనులు చేసేవారి చేత. వంటలు చేయిస్తూ. వారి ఆరోగ్యాలతో . చెలగాటం ఆడుతున్నారని.ఈ సందర్భంగా తెలియజేస్తూ. ఎలాంటి అనారోగ్యాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత. మనదని. ఈ సందర్భంగా తెలియజేశారు.. లేనియెడల పెద్ద ఎత్తున మా కాంట్రాక్టులు అందరం కలిసి ధర్నాలు చేయడానికి ముందుకు రావడానికి. వెనుకాడబోమని. అలాగే. మాకు కాంట్రాక్టర్లకు. కొన్ని రోజులుగా డబ్బులు ఇవ్వకపోగా. వేరే వారితో పని చేయించుకుంటున్నారు. ఇందులో ప్రభుత్వం జోక్యం చేసుకొని. మాకు రావాల్సిన బకాయిలు ఇప్పించి. స్కూల్ విద్యార్థుల ప్రాణాలతో చిలగాటం.తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లాకు. సంబంధించిన. గురుకుల పాఠశాల ఫుడ్ కాంట్రాక్టు. కాంట్రాక్టర్లు . కంసాని. మల్లేశం శంకర్.తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version