కొండపర్తిలో విషాదం – గోడ కూలి మహిళ మృతి….

కొండపర్తిలో విషాదం – గోడ కూలి మహిళ మృతి

హనుమకొండ జిల్లా, ఐనవోలు, నేటిధాత్రి.

ఐనవోలు మండలంలోని కొండపర్తి గ్రామంలో బుధవారం జరిగిన దుర్ఘటన స్థానికులను విషాదంలో ముంచింది. నిన్న ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో రాత్రి సమయంలో ఓ ఇంటి గోడ కూలి, ఆ ఇంట్లో నిద్రిస్తున్న గద్దల సూరమ్మ (58) అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఐనవోలు తహసీల్దార్ విక్రమ్ కుమార్ మరియు రెవెన్యూ అధికారులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన ఇళ్లను గుర్తించి వారిని అప్రమత్తం చేస్తున్నారు. అలాగే ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చి పురాతన ఇండ్లు కూలిపోయే ప్రమాదం ఉందని ప్రజల అప్రమత్తంగా ఉండాలని తహసిల్దార్ సూచించారు.

ఇంటి గోడ కూలి మహిళ మృతి…

ఇంటి గోడ కూలి మహిళ మృతి
* పది వేలు ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు

మహాదేవపూర్ సెప్టెంబర్ 26 (నేటి ధాత్రి)

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపురం మండలం బెగుళూరు గ్రామంలో ఇంటి గోడ కూలి మహిళ మృతి చెందిన సంఘటన శుక్రవారం రోజున చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఇంటి గోడ పూర్తిగా నానడం తో గోడ కూలి మంద లక్ష్మి అనే మహిళ పై పడడంతో అక్కడికక్కడే మృతి చెందగా మహిళ భర్త మంద దుర్గయ్య కు గాయాలయ్యాయి అని గ్రామస్థులు తెలిపారు. విషయం తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అశోక్ ఈ సంఘటనను మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కు తెలుపగా వెంటనే స్పందించి బాదిత కుటుంబానికి మంత్రి ఆదేశాల మేరకు మహిళా భర్తకు నగదు గా పదివేల రూపాయలు ఇస్తూ దశ దిన కర్మ అనంతరం మంద దుర్గయ్య ఆరోగ్యా నిమిత్తం మెరుగైన వైద్యం ఇప్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, ప్రజలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version