జహీరాబాద్ లో శాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జనం
◆:- మీ సేవలకు శతకోటి దండాలు!
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో
గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది గత 11 రోజులుగా నిత్యం పూజలు అందుకున్న వినాయకుని శనివారం రాత్రి ఘనంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ప్రజలు భక్తులు పోలీస్ సిబ్బంది రెవెన్యూ మున్సిపల్ పంచాయతీరాజ్ వివిధ శాఖలకు చెందిన అధికారులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.రాత్రి నిమజ్జనోత్సవంలో అంబరాన్ని అంటిన సంబరాలు మిగిల్చిన గుర్తులు. పట్టణ వీధుల గుండా గణపయ్యలను ఊరేగిస్తూ భక్తులు చల్లిన పూలు. నిమజ్జనం అనంతరం ఇళ్లకు వెళ్లిన యువత కునుకుతీసింది. సుఖమెరుగని ఈ కష్టజీవులు రాత్రనకా.. పగలనకా.. చెమటోడ్చి చెత్తను అంతా ఎత్తిపోశారు. పారిశుద్ధ్య కార్మికులూ మీ సేవలకు శతకోటి దండాలు!