ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను కలిసిన.!

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను కలిసిన బీఆర్ఎస్వి మండల అధ్యక్షులు

నడికూడ,నేటిధాత్రి:

హైదరాబాద్ లో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ని మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్వి నడికూడ మండల అధ్యక్షులు దురిశెట్టి వెంకటేష్
అనంతరం కవిత పలు విషయాలపై చర్చించారు.

ఏపీ బీజేపీ కొత్త బాస్ మాజీ ఎమ్మెల్సీ మాధవ్.

ఏపీ బీజేపీ కొత్త బాస్ మాజీ ఎమ్మెల్సీ మాధవ్…

 

AP BJP Chief: ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడి పేరు ఖరారైందని ఎమ్మెల్సీ సోమువీర్రాజు తెలిపారు. కార్యకర్తలు, నాయకుల అభీష్టం మేరకు పేరు ఖరారైందన్నారు.

విజయవాడ, జూన్ 30: ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా (AP BJP New Chief) మాజీ ఎమ్మెల్సీ మాధవ్ (Former MLC Madhav) పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. అందరి అభిప్రాయాల మేరకు మాధవ్ పేరు ఖరారు చేసినట్లు సమాచారం. అయితే అధికారికంగా వెల్లడించే వరకు పేరు చెప్పవద్దని కమలం పార్టీ నాయకులకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ బీజేపీ చీఫ్‌ ఎంపిక నేపథ్యంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ కొత్త బాస్‌పై మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నేడు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయ్యిందన్నారు.రాష్ట్ర రాజకీయ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అధ్యక్ష పదవికి పేరు నిర్ణయం జరిగిపోయిందని చెప్పారు. కార్యకర్తలు, నాయకుల అభీష్టం మేరకు పేరు ఖరారైందన్నారు. అధికారికంగా అధ్యక్షుడి పేరు ప్రకటించడమే మిగిలి ఉందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు.బీజేపీ ఎన్నికల నియమావళికి అనుగుణంగా అధ్యక్ష ఎంపిక జరుగుతుందని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు నామినేషన్లు వేయడం, సాయంత్రం ఉపసంహరణ జరుగుతుందన్నారు. రేపు అధికారికంగా అధ్యక్షుని పేరు ప్రకటిస్తారన్నారు. రెండేళ్ల పదవీ కాలం ముగియడంతో ఈ ఎన్నిక జరుగుతోందని చెప్పారు. అధిష్టానం నిర్ణయాలను అందరూ గౌరవిస్తారని..స్వాగతిస్తారని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ వెల్లడించారు.

గాంధీభవన్లో ఈరోజు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన వివరణ లేఖ.

బ్రేకింగ్ న్యూస్

నేటిధాత్రి, హైదరాబాద్.._

కొండా మురళీ పిర్యాదు లేఖ..

హైదరాబాదులోని గాంధీభవన్లో ఈరోజు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన వివరణ లేఖ.

హైదరాబాద్ నేటిధాత్రి:

2007లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను వరంగల్ జిల్లాకు సంబంధించిన వ్యవహారాన్ని నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాకు అప్పగించారు.

నాటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గాదె వెంకట్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంకు సంబంధించి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేపట్టగా వరంగల్ వ్యవహారాలు మొత్తం నేనే పర్యవేక్షించడం జరిగింది.

వరంగల్ జిల్లా నుంచి ఎక్కువ మంది దళితులు, గిరిజనులకు అవకాశం దక్కాలని, ఈ జిల్లాలో ఎక్కువ మందికి పునర్విభజనలో ఆయా వర్గాలకే నేను సీట్లు కేటాయించాను. ఎందుకంటే, అట్టడుగువర్గాలకే న్యాయం జరగాలన్నది నా సిద్ధాంతం. నేను నా రాజకీయ పంథాను ప్రారంభించిందే నిమ్న వర్గాలకు న్యాయం చేయాలని.

వరంగల్ జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్ స్థానాలు నిమ్నవర్గాలకు కేటాయించడంలో నాడు నాదే కీలక పాత్ర.

వరంగల్ పార్లమెంట్, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లోని ఒక దాన్ని ఎస్సీ, మరొక దాన్ని ఎస్టీ చేసి దళిత, గిరిజనులకు ప్రత్యేక అవకాశం కల్పించేలా చేసిన.

కాగా, ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనే ఏ జిల్లాలో లేని విధంగా ఒక జిల్లాలో రెండు స్థానాలు రిజర్వు కావడం కేవలం వరంగల్ లో మాత్రమే సాధ్యం అయింది. అందు కోసం నేను తీవ్రంగా కృషి చేశాను.

సామాజిక న్యాయం చేయాలన్న నా ప్రయత్నంలో భాగంగా… ఈ ప్రక్రియతో తాను సీటును కోల్పోయానని… అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత రామసహాయం సురేందర్ రెడ్డి…. అందుకు నేనే(కొండా మురళీయే) కారణమని చెబుతూ రాజకీయాల్లోంచి బయటికి వెళ్ళిన పరిస్థితి ఉన్నది.

అయితే, నేడు ఆయన అల్లుడు అయిన మంత్రి పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి, వరంగల్ జిల్లా ఇంఛార్జీ మంత్రిగా ఉండి నా సతీమణి శ్రీమతి కొండా సురేఖ మీద కక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. అదే కోపంతో ఆయన ఉన్నట్టు తాజా పరిణామాలు చూస్తుంటే నిశితంగా అర్థం అవుతున్నది.

వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, లోకల్ ఎమ్మెల్సీ బస్వారాజు సారయ్యను వెంట పెట్టుకొని మా వరంగల్ ఈస్టు నియోజకవర్గంలో తిరుగుతున్నారు. అయినా, మేము వారికి ఎక్కడా ఇబ్బందులు చేయలేదు.

ఇదే బస్వరాజు సారయ్య, మా వరంగల్ ఈస్టు నియోజకవర్గంలో నా సతీమణి కొండా సురేఖ మీద 2014లో 40 వేల ఓట్లతో ఓడిపోయారు.

ఎమ్మెల్సీ బస్వారాజు సారయ్య, రామసహాయం సురేందర్ రెడ్డి గారికి ప్రధాన శిష్యుడు అనే విషయం అందరికీ తెలిసిందే.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాస్ లీడర్ గా ఉన్న మేము దాదాపు ప్రతి ఎన్నికల్లో గెలిచి నిలుచున్నాము.

ఇక ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి మహబూబాబాద్ కు చెందిన నాయకులు. ఆయన గతంలో కొండా సురేఖ మీద పోటీ చేస్తే, ఆ ఎన్నికల్లో కొండా సురేఖకు ఘనమైన మెజారిటీ వచ్చింది. కానీ, నరేందర్ రెడ్డికి కేవలం 2 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఇక డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఈరోజు వరకు ఒక్క ఎలక్షన్ కూడా గెలవలేదు. ఆమె మా వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి మేము(నేను నా సతీమణి) వచ్చేటప్పుడు 26 మంది కార్పొరేటర్లు వచ్చారు. ఇదీ వరంగల్ లో కొండా మురళి, కొండా సురేఖ దంపతుల పవర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పుడు నేను రాజీనామా చేసి వచ్చిన. అది నా నిబద్ధత. కొంతమంది లీడర్ల మాదిరి పార్టీ మారినా… పదవిలో కొనసాగలేదు. భారతదేశంలోనే ఏకగ్రీవంగా గెల్సిన ఏకైక ఎమ్మెల్సీని. ఈ విషయం అందరికీ తెలిసిందే.

ఇక నన్ను ఎవరు పిలిచి ఈ విషయాలు చెప్పమని అడగలేదు. మన పీసీసీ ప్రెసిడెంట్, బీసీ బిడ్డ మహేష్ కుమార్ గారి మీద అభిమానంతో నేనే వచ్చి పార్టీకి వివరించాలని అనుకున్నాను. అందుకే, స్వయంగా వచ్చి తెలియజేయడం జరిగింది.

వర్ధన్నపేట – కేఆర్ నాగరాజు

ఈ నియోజకవర్గంలో మా ప్రభావం స్పష్టంగా ఉంటుంది.

ఈ నియోజకవర్గంలో మాకు రాజకీయంగా, వ్యక్తిగతంగా చాలా మంది అభిమానులు ఉన్నారు.

వాస్తవానికి ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కాక మునుపు… ఎర్రబెల్లి దయాకర్ రావు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండేవారు.

ఎర్రబెల్లి దయాకర్ రావు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ చేస్తున్న అరాచకాలకు అడ్డు నిలిచి పోరాడినందుకు మాకు ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది.

అయితే, ప్రస్తుత ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఎవరు ఎటు రమ్మంటే అటు వెళ్తారు. ఆయనకు ప్రత్యేకంగా వర్గాలు అంటూ ఏమీ లేవు. రేపు మేము ఏదైనా ప్రోగ్రాంకు రమ్మని పిలిచినా వచ్చి వెళతారు.
మాతో కూడా ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి.

భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ

ఒకానొక సందర్భంలో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి నన్ను (కొండా మురళీ) నిలుచోవాలని అక్కడి ప్రజల నుంచే విజ్ఞప్తులు పెద్ద ఎత్తున వచ్చాయి.

కానీ, ఎన్నికల సమయంలో అప్పటికే నా సతీమణి కొండా సురేఖ వరంగల్ ఈస్టు నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో మా కుటుంబం నుంచే రెండో నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఇష్టం లేక చేయలేదు.

ఈ నియోజకవర్గంతో నాకు (కొండా మురళికి) చాలా మంచి పట్టు ఉన్నదని సర్వత్రా తెలిసిందే.

గతంలో మదుసూదనాచారి గెలుపు కోసం తీవ్రంగా నేను కృషి చేశాను.

వాస్తవానికి గండ్ర సత్యనారాయణ గతంలో టీడీపీ నుంచి వచ్చారు. అయినా నేను సపోర్టు చేసినం. ఆ సమయంలో మా సపోర్టును ఆయన అడిగారు. మేము కూడా పార్టీ గెలుపు కోసం మనస్ఫూర్తిగా పని చేశాము.

అయితే, ఈయన ప్రస్తుతం మా మీదకు వ్యతిరేకంగా ఇతర నాయకులతో కలవడం శోచనీయం.

అయితే, ఈయనతో కూడా మాకు మంచి సంబంధాలే ఉన్నాయి.

ములుగు సీతక్క

మంత్రి సీతక్క గారితో మాకు ఎప్పుడూ ఎటువంటి ఇబ్బంది లేదు. ఆమె పని ఆమె చేసుకుంటూ పోతున్నారు. అయితే, కడియం శ్రీహరి పార్టీలోకి వచ్చినప్పటి నుంచి మంత్రి కొండా సురేఖకు…. మంత్రి సీతక్క కు గ్యాప్ వచ్చిందని, కావాలని కొన్ని పేపర్లలో వార్తలు రాయిస్తున్నారు. సోషల్ మీడియాలో పెయిడ్ ప్రచారం చేస్తున్నారు.

పరకాల రేవూరి ప్రకాశ్ రెడ్డి

ఈ నియోజకవర్గం పూర్తిగా మాదే (కొండా సురేఖ, కొండా మురళి దంపతులదే). గతంలో ఇదే నియోజకవర్గం నుంచి నా భార్య కొండా సురేఖ మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. మంత్రిగా కొనసాగిన విషయంలో అందరికీ తెలిసిందే.

ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామం, ప్రతి మండలంలో కొండా మురళి, కొండా సురేఖకు ఎంతోమంది అభిమానులు, కార్యకర్తలున్నారు. ఇది జగమెరిగిన సత్యం.

ఎన్నికల సమయంలో కూడా రేవూరి ప్రకాశ్ రెడ్డి మా మద్దతు అడిగారు. మేము నిస్వార్ధంగా ఆయనకు సపోర్టు చేసినం. మా మద్దతుతోనే గెలిచారు.

ఈరోజు ఆయన కూడా మాకు వ్యతిరేకంగా గుడుపుఠాణి కట్టి రాజకీయాలు చేస్తున్నారు. ఇది చాలా దారుణం.

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి సంబంధించిన క్రషర్స్ లో అక్రమాలు జరుగుతున్నాయని మేము చెప్పి ఆపిస్తే… వాళ్ళు వేరే బ్రోకర్స్ ద్వారా వచ్చి రేవూరి ప్రకాశ్ రెడ్డికి కొంత ముట్టజెప్పి వాటిని ఓపెన్ చేయిస్తున్నారు. వీటి ద్వారానే బీఆర్ఎస్ నేతలకు… ఇతర నియోజకవర్గంలోనే నేతలకు పెద్ద ఎత్తున నిధులు అందుతున్నాయి. దీనివల్ల బీఆర్ఎస్ ఆర్థికంగా బలపడుతున్నది. ఇది కాంగ్రెస్ కి నష్టం. ఇది జిల్లాలో అందరికి తెలిసిందే. అయినా ఎవరు నోరు మెదపరు.

ఇక పరకాలలో నా ఊరు ఉన్నది. గతంలో అక్కడికి ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్పీ రావాలంటే రాలేకపోయేవారు. వెహికల్ దిగి నడిచి వచ్చిన దుస్థితి ఉంది కూడా. బీఆర్ఎస్ పదేండ్ల హయాంలో కూడా మా గ్రామానికి అప్పటి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కూడా వచ్చే సాహసం చేయలేదు. కానీ, ఇటీవల ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఇష్టారీతిన మాట్లాడి వచ్చారు. రెచ్చగొట్టే ధోరణి ప్రదర్శించారు.

ఆయన మాటలతో అక్కడ లా అండ్ ఆర్డర్ ఇబ్బందులు ఎదురైతే ఎవరిది బాధ్యత?

వరంగల్ వెస్ట్ – నాయిని రాజేందర్ రెడ్డి

నాయిని రాజేందర్ ఈ రోజు చాలా పెద్ద పెద్ద మాటలు, స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ, ఎన్నికల ముందు వచ్చి మా (కొండా దంపతుల) మద్దతు అడిగారు. అప్పటి ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ను ఎన్నికల కదనరంగంలో తట్టుకోవాలంటే తనకి మా మద్దతు కావాలని ప్రాధేయ పడ్డారు. ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్సీతో వరంగల్ తూర్పులో తిరుగుతున్నారు.

వరంగల్ ఈస్టులో ఎలక్ట్రిసిటీ అధికారులకు పోస్టింగులు ఇప్పించుకుంటున్నారు మా ప్రమేయం లేకుండానే, ముఖ్యంగా రెడ్డి అధికారులకు పోస్టింగ్లు ఇచ్చుకుంటున్నారు.

తనకి సంబంధం లేని మా నియోజకవర్గంలో పోస్టింగులు ఇచ్చుకోవడం ఏంటి?

ఎంజీఎంలో ఆకస్మిక తనిఖీ చేపట్టి…. మాకు సమాచారం లేకుండా మా అధికార పరిధిలోకి చొచ్చుకురావడం సహేతుకం కాదు కదా.

జనగామ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాతో బాగానే ఉంటున్నరు.

స్టేషన్ ఘనపూర్: కడియం శ్రీహరి బీఆర్ఎస్ ను ముంచి మన పార్టీలోకి వచ్చిండు. స్థానిక కాంగ్రెస్ ఇంఛార్జీ ఇందిరకు చుక్కలు చూపిస్తున్నడు. ఆమె వర్గీయులను కూడా టార్చర్ చేస్తున్నడు. 200 నుంచి 300 మంది కడియం వేధింపులు తట్టుకోలేక నాకు చెప్పినా… నేను ఆయన నియోజకవర్గంలో ఇన్వాల్ కావడం లేదు. కానీ, జిల్లాలో ఏం చేస్తున్నాడో యావత్ రాష్ట్రమంతా తెలుస్తున్నది.

పాలకుర్తి యశశ్వినీ రెడ్డి:

ఈమె యాంటీ దయాకర్ రావు వర్గమే. నేను ఎన్నికల సమయంలో ఆమెకు బాగా సపోర్టు చేసిన. అన్ని విధాలుగా అండగా నిలిచిన. నన్ను ఇక్కడి నుంచి నిలబడాలని చాలామంది చెప్పినా… నిలబడకుండా వారికే మద్దతు ఇచ్చి గెలిపించినం.

డోర్నకల్: రాంచంద్రనాయక్: ఈ నియోజకవర్గంలో మనకు పెద్దగా పట్టు లేదు. కానీ, ఏజెన్సీ ఏరియా, నక్సలైట్ ప్రభావిత ప్రాంతంలో నాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగు ఉన్నది. నేను కూడా అక్కడి వారు ఎవరు వచ్చినా వారి పనులు చేయడం జరుగుతున్నది.

మహబూబాబాద్: ఇదే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వేం నరేందర్ రెడ్డి కేవలం ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే గెలిచారు. ఒక దఫా వేం నరేందర్ రెడ్డి, కొండా సురేఖ మీద కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే… ఆయనకు కేవలం 2 వేల ఓట్లు వచ్చాయి. డిలిమిటేషన్లో ఆయన సీటు ఎగిరిపోయిందని… అందుకు నేనే కారణమని నాపై కోపంతో ఉన్నట్టు ఉన్నారు వేం నరేందర్ రెడ్డి.

ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి విజయం

ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి పి ఆర్ టి యు టి ఎస్ సంఘ కృషి మేరకు ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లుల చెల్లింపులకై ప్రభుత్వం నిధుల విడుదల

ఇది ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి విజయం

చర్ల నేటిధాత్రి:

 

ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లుల కొరకు అలుపెరగని పోరాటం చేసిన ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుండు లక్ష్మణ్ పులగం దామోదర్ రెడ్డి పి ఆర్ టి యు టీఎస్ సంఘం పక్షాన పలుమార్లు ఇచ్చిన ప్రాతినిధ్యం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న బిల్లుల చెల్లింపునకు గాను రాష్ట్ర ప్రభుత్వం నేడు 700 కోట్ల రూపాయలు విడుదల చేయనుందని హర్షం వ్యక్తం చేశారు ముఖ్యంగా 270 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ మెడికల్ బిల్లుల చెల్లింపుకు గాను కేటాయించగా ఇప్పటికే జిల్లాల వారీగా మెడికల్ బిల్లుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంది మిగిలిన నిధులతో పెండింగ్ జిపియఫ్ పార్ట్ ఫైనల్స్ తుది చెల్లింపులు మరియు వేతన బకాయిల చెల్లింపు కూడ జరగనుంది
పెండింగ్ బిల్లుల సాధనలో ప్రభుత్వాన్ని ఒప్పించి నిధుల విడుదలకై అవిరామ కృషితో శ్రమిస్తూ ఉన్న ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి పిఆర్ టియుటిఎస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుండు లక్ష్మణ్ పులగం దామోదర్ రెడ్డి కు పి ఆర్ టి యు టి ఎస్ చర్ల మండల శాఖ చర్ల మండలం అధ్యక్షులు ఎస్ఎస్ఎస్ రవికుమార్ ప్రధాన కార్యదర్శి వీరభద్రం రాష్ట్ర జిల్లా కార్యదర్శులు వేణు శ్రీనివాస్ గురుమూర్తి కొల్లిపాక హరికృష్ణ రాజు వైవి రాజు పున్నం సారయ్య మీడియం రామకృష్ణ రమణయ్య హర్షం వ్యక్తం చేస్తూ పత్రికా ప్రకటన ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్

మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన హుజూరాబాద్ యువజన కాంగ్రెస్ నాయకులు

వీణవంక, (కరీంనగర్ జిల్లా):

నేటి ధాత్రి :హైదరాబాద్ లో సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులను మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులను నియమిస్తూ నియమక పత్రాలని విడుదల చేసిన భాగంగా అందులో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారిని తెలంగాణా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించడం జరిగింది నిన్న హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో హుజురాబాద్ నియోజకవర్గనికి

చెందిన యువజన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో యువజనకాంగ్రెస్ నియోజకవర్గం ఉపాధ్యక్షులు చిన్నాల శ్రీకాంత్ నియోజకవర్గం కార్యదర్శి ఉమ్మడి సందీప్ జమ్మికుంట పట్టణ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు బిసది వంశి తదితరులు పాల్గొన్నారు.

హోం మినిస్టర్‌ రాములమ్మ.

-తెలంగాణ తొలి మహిళా హోం మినిస్టర్గా విజయశాంతి.

FOR E-PAPER CLICK BELOW LINK

https://epaper.netidhatri.com/view/610/netidhathri-e-paper-3rd-june-2025

-తెలంగాణ కోసం అందరినీ ధిక్కరించిన ధీశాలి విజయశాంతి.

-నాలుగు సంవత్సరాల పాటు నిరంతరం పార్లమెంటు సమావేశాలను అడ్డుకున్న ఏకైక తెలంగాణ నాయకురాలు.

home minister vijayashanthi

-డిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

-బిఆర్‌ఎస్‌ను ఎదుర్కోవాలంటే ఉద్యమ కారులతోనే ఎదుర్కోవాలి.

-బిఆర్‌ఎస్‌ వైఫల్యాలను ఎండగట్టాలంటే విజయశాంతి లాంటి వాళ్లే కావాలి.

-ఉద్యమ ఆకాంక్షలు, కేసిఆర్‌ మోసాలు తెలిసిన నాయకురాలు విజయశాంతి.

-అధిష్టానం ఇప్పటికే స్పష్టతనిచ్చినట్లు తెలుస్తోంది.

-ఏపిలో కూడా మహిళా హోం మంత్రి వున్నారు.

-డైనమిక్‌ విజయశాంతికి హోం బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నారు.

-రాములమ్మ కాంగ్రెస్‌లో చేరినప్పుడే ఇచ్చిన మాట.

-తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఆనాడు పార్టీలో చేరారు.

-అప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్నారు.

-తెలంగాణ కోసం తల్లి తెలంగాణ ఏర్పాటు చేసిన విజయశాంతి.

-రాష్ట్ర ఏర్పాటు కోసం జీవితం త్యాగం చేసిన నాయకురాలు విజయశాంతి.

-ఏనాడు పదవుల కోసం ఆశించి రాజకీయాలు చేయలేదు.

-పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి కెరియర్‌ కూడా వదులుకున్నారు.

-ఎన్నికల రాజకీయాలలో పదవుల అనుభవించిన వారు త్యాగాలు అని చెప్పుకుంటున్నారు.

-విజయశాంతి త్యాగం అంతకన్నా వెయ్యి రెట్లు ఎక్కవ.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
రాములమ్మ హోం మంత్రి కాబోతున్నారా? అంటే డిల్లీ సర్కిళ్లలో ఔననే సమాధానం వస్తోంది. మంత్రి వర్గ విస్తరణలో కచ్చితంగా ఎమ్మెల్సీ విజయశాంతిని మంత్రి వర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎమ్మెల్సీల నుంచి ఎవరూ మంత్రి లేరు. ఎమ్మెల్సీ కోటాలో ఆమెకు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం అనుకుంటున్నట్లు చెబుతున్నారు. పైగా బిసి సామాజిక వర్గానికి మరింత ప్రాదాన్యతనిచ్చినట్లు సంకేతాలు కూడా కాంగ్రెస్‌ పంపాలని అనుకుంటోంది. అందుకే ఆరు మంత్రి పదవులు ఇంకా భర్తీ చేయాల్సిన అవసరం వుంది. అయితే అవి ఇప్పుడే భర్తీ చేస్తారా? లేక ఇంకా కొంత కాలం ఆగి చేస్తారా? అన్నది త్వరలోనే తేలనుంది. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి డిల్లీ వెళ్లే అవకాశం కనిపిస్తోంది. పార్టీ పరమైన పదవులు ఇప్పటికే చాలా వరకు కొలిక్కి వచ్చాయి. అందుకు సంబంధించిన ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. పదవుల పంపకాలు దాదాపు పూర్తయినట్లే లెక్క. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు మాత్రమే మిగిలివున్నాయి. పార్టీ ఉపాధ్యక్ష పదవులు ఇంకా రాలేదని కొంత మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే కాంగ్రెస్‌లో వున్న పార్టీపరమైన సంప్రదాయం ప్రకారం ఎమ్మెల్యేలందరూ పార్టీ అటోమెటిగ్‌గా ఉపాధ్యక్షులౌతారు. ఇది అనాదిగా ఆపార్టీలో అనుసరిస్తున్న సంప్రదాయమే. అవి కూడా పూర్తయనట్లే లెక్క. ఇక మిగిలినవి మంత్రి పదవులు. నామినేటెడ్‌ కార్పోరేషన్‌పదవులు ఇంకా కొన్ని పెండిరగ్‌లో వున్నాయి. ముఖ్యమంత్రి డిల్లీ పర్యటనలో నామినేటెడ్‌ పదవులు ఒక కొలిక్కి వచ్చే అవకాశం వుంది. కాని మంత్రి పదవుల పంపకాలలో కొన్ని పీట ముడులున్నాయి. ఇప్పటి వరకు వస్తున్న సమాచారం మేరకు ఒక్క రాములమ్మకు మాత్రమే మంత్రి పదవి ఖాయమైందని తెలుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఆమె కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకురాలు. తెలంగాణ ప్రకటన వచ్చిన వెంటనే ఆమె కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో చేరుతామని బిఆర్‌ఎస్‌లో వున్నప్పుడు చెప్పిన మాటకు కట్టుబడి ఆమె కాంగ్రెస్‌లో చేరారు. ఆ సమయంలో ఆమె మెదక్‌ పార్లమెంటును పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె ఎన్నికల్లో పోటీచేసేందుకు పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదు. పార్టీ నుంచి సూచనలు వచ్చినా ఆమె పార్టీకి సేవ చేయడానికే పరిమితయ్యారు. అందుకే ఆమె 2018 ఎన్నికల్లో ప్రచార కమిటీ చైర్‌ పర్సన్‌గా బాద్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఆమెకు కాంగ్రెస్‌లో ప్రాధాన్యత దక్కడం లేదని ఎన్ని రకాల వార్తలు వచ్చినా స్పందించలేదు. తాను కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తిగా వున్నానని కూడా చెప్పలేదు. పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా ఆమె చేసుకుంటూ వెళ్లారు. అంతే తప్ప ఎక్కడా పార్టీపై ఇంత వరకు ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు. తాను చేసిన సేవలకు, తెలంగాణ ఉద్యమ కారిణిగా సరైన సమయంలో సరైన గుర్తింపు వస్తుందని మాత్రం నమ్మకంతో వున్నారు. ఆ నమ్మకమే ఇప్పుడు వరంగా మారింది. తెలంగాణ వచ్చిన సమయంలో పార్టీ ఆమెకు కొన్ని వాగ్ధానాలు చేసింది. పార్టీ అధికారంలోకి వస్తే సముచితస్ధానం కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఈ పదేళ్లలో ఆమె ఎన్ని రాజకీయ పరిణామాలు జరిగినా, కాంగ్రెస్‌లోనే వున్నది. ఓ దశలో రాములమ్మ కాంగ్రెస్‌లో వున్నట్లా? లేనట్లా? అంటూ వార్తలు కూడా వచ్చాయి. గత ఎన్నికల్లో ఎన్నికల ప్రచారానికి పిలుపు లేదని కూడా ఆమె ఎక్కడా ఒక్క ప్రకటన కూడా చేసింది లేదు. సమయం కోసం వేచి చూశారు. ఈ మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల ముందు వరకు కూడా ఆమెకు పదవి వస్తుందని ఎవరూ ఊహించలేదు. అంటే కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ ఎంత నిబద్దతతో వుంటుందో ఈ ఒక్క విషయంలోనే తేలిపోయింది. ఎంతో మంది పేరు ఎమ్మెల్సీల ఎంపికలో వచ్చినా, విజయశాంతికి ఇస్తారని ఎవరూ ఊహించలేదు. విజయశాంతి అంటే కాంగ్రెస్‌ పార్టీకి ఎంత విశ్వాసమో అర్దం చేసుకోవచ్చు. ఎందుకంటే విజయశాంతి అంటే సామాన్యురాలు కాదు. ఆమె ఒకప్పటి సినీ సూపర్‌ స్టార్‌. ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోయినా, మూడు దశాబ్దాల పాటు ఆమె సినీ పరిశ్రమను ఏలిన నటి. తెలుగు, తమిళ్‌, హిందీ భాషలలో ఆమె అగ్రశ్రేణి నటిగా ఓ వెలుగు వెలిగారు. దేశమంతా లేడీ అమితాబ్‌ అని కీర్తించేవారు. ఆమెతో లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు చేయడానికి నిర్మాతలు క్యూలో వుండేవారు. కేరిర్‌ పీక్‌ స్టేజ్‌లో వున్నప్పుడు ఆమె జై తెలంగాణ అన్నారు. ఇప్పటి వరకు సినిమా పరిశ్రమ ఇచ్చింది చాలు. ప్రేక్షకుల ప్రేమచాలు. ఇక తన పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడం కోసం వస్తున్నానని తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు. నిజానికి ఆమె రాజకీయంగా పదవులే కావాలనుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో పదవులు వచ్చేవి. తమిళనాడులో కూడా ఆమెకు పెద్ద పెద్ద పదవులే వచ్చేవి. ఎందుకంటే తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు విజయశాంతి ఎంతో సన్నిహితురాలు. ఆమె రాజకీయం చేయాలనుకుంటే తమిళనాడు నుంచికూడా ఎమ్మెల్యే అయ్యేది. మంత్రి అయ్యేది. కాని ఆమె తెలంగాన ఉద్యమంలోకి వచ్చారు. కేరీర్‌ వదులుకున్నారు. కోట్ల రూపాయల సంపాదన వద్దనుకున్నారు. కార్లు, అద్దాల మేడలు, ఏసి గదుల్లో జీవితం వదులుకొని ప్రజా క్షేత్రంలోకి వచ్చారు. తెలంగాణ ప్రజలకు తోడుగా పోరాటంలోకి దిగారు. తల్లి తెలంగాణ రాజకీయ పార్టీని పెట్టారు. తాను సంపాదించిన కోట్లాది రూపాయలను ఆమె ఉద్యమానికి ఖర్చు చేశారు. తల్లి తెలంగాణ పార్టీ నిర్వహణకు కోట్లు ఖర్చు చేశారు. నిజానికి ఆమె ఆ పార్టీని అలాగే నడిపి వుంటే ఆమె రాజకీయ భవిష్యత్తు మరోలా వుండేది. ఆమె ఎంతోమందికి రాజకీయ జీవితాన్ని ఇచ్చేది. కేసిఆర్‌ మాటలు నమ్మి, కేవలం తెలంగాణ కోసం పార్టీని టిఆర్‌ఎస్‌లో విలీనం చేసింది. ఆ సమయంలో ఎంతో మంది కేసిఆర్‌ పార్టీలో తల్లి తెలంగాణను విలీనం చేయొద్దని సూచించారు. కేసిఆర్‌ వల్ల మొదటికే మోసం వస్తుందని కూడా హెచ్చరించారు. ఎందుకంటే అప్పటికే తల్లి తెలంగాణ పార్టీ తెలంగాణ అంతటా విస్తరించింది. అన్ని జిల్లాల కమిటీలు వేయడం జరిగింది. టిఆర్‌ఎస్‌కు పోటీగా తల్లి తెలంగాణ ఎదిగింది. ఆ పార్టీ కోసం, ఉద్యమం కోసం కొన్ని వందల మంది తల్లి తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా పెద్దఎత్తున ఖర్చు చేసింది. వాళ్లందరికీ బిఆర్‌ఎస్‌లో సముచిత స్ధానం వుంటుందని విజయశాంతిని నమ్మించారు. చివరికి ఆమెను కూడా కేసిఆర్‌ నట్టెట ముంచారు. తొలుత విజయశాంతిని సొంత చెల్లెలుకన్నా ఎక్కువ అంటూ ఆమెను నమ్మించారు. తర్వాత ఆమె ప్రాధాన్యత తగ్గిస్తూ పోయారు. అయినా ఆమె ఏనాడు వెరవలేదు. తెలంగాణ కోసం మాత్రమే తాను వచ్చానని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప తనకు ప్రత్యేకమైన రాజకీయం అవసరంలేదని తేల్చి చెప్పారు. టి ఆర్‌ఎస్‌ నుంచి తప్పించినా, ఆమె చిరునవ్వుతోనే స్వాగతించింది. తాను కోరుకున్న రాష్ట్రం ఏర్పాటైందన్న సంతోషమే ఆమె ఎక్కువ పడిరది. తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర సాధనలో కీలకభూమిక పోషించిన చరిత్ర చాలనుకున్నది. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో చేరుతానన్న మాటను కూడా నిలబెట్టుకున్నది. ఆమె అంకితభావం కాంగ్రెస్‌ పార్టీ గుర్తించింది. అంతే కాదు తెలంగాణ ఉద్యమ సమయంలో విజయశాంతి పోరాట పటిమ కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యక్ష్యంగా చూసింది. డిసెంబర్‌ 9 ప్రకటన పరిణామాల తర్వాత జరిగిన ఉద్యమంలో విజయశాంతి చూపిన చొరవ అంతా ఇంతా ఇంతా కాదు. ఆ తర్వాత నాలుగేళ్ల పాటు సాగిన పార్లమెంటు సమావేశాలను ఏ ఒక్కనాడు సజావుగా సాగకుండా అడ్డుకున్న ఏకైన నాయకురాలు విజయశాంతి. నాలుగేళ్ల సుధీర్ఘ కాలం అంటే సామాన్యమైన విషయం కాదు. నిత్యం ఆమె సభ జరుగుతున్నంత సేపు నిలబడి నిరసన తెలియజేసేశారు. వెల్‌లోకి దూసుకెళ్లెవారు. ఆ అవకాశం దక్కనప్పుప్పుడు తనసీట్‌ వద్దనే నిలబడి నిరసన తెలియజేసేవారు. నిజానికి లోక్‌సభ సమావేశాలకు కేసిఆర్‌ పెద్దగా హజరయ్యేవారు కాదు. బడ్జెట్‌సమావేశాలకు కూడా వెళ్లేవారు కాదు. కాని విజయశాంతి ఏ ఒక్కరోజు కూడా వెళ్లకుండా వుండలేదు. నిరసన తెలియజేయని రోజంటూ లేదు. అలా నాలుగు సంవత్సరాల పాటు లోక్‌సభలో నిరవదిక నిరసన చేసిన ఏకైక నాయకురాలు విజయశాంతి. ప్రపంచ చరిత్రలోనే ఇది సరికొత్త రికార్డు అని కూడా చెప్పడంలో సందేహం లేదు. అలాంటి ఉద్యమకారిణి విజయశాంతి త్వరలో తెలంగాణ మంత్రి కానున్నారు. ఆమె చేసిన త్యాగం వృధా కాలేదు. కాస్త ఆలస్యం కావొచ్చు. కాని గుర్తింపు ఎప్పటికైనా పక్కా అనుకున్న ఆమె నమ్మకం మరోసారి నిలబడిరదనే చెప్పాలి.

జర్నలిస్టుల దీక్షా శిబిరాన్ని.!

జర్నలిస్టుల దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ సారయ్య

జర్నలిస్టులతో నాకున్న వ్యక్తిగత అనుబంధంతో సందర్శించాను

ఈ దీక్షను రాజకీయం చేయదలుచు కోలేదు.

జర్నలిస్టుల కోసమే ఈ డబుల్ బెడ్రూమ్స్ నిర్మాణం జరిగింది

ఇండ్లులేని పేద జర్నలిస్టులకు న్యాయం జరగాలి
….మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య

వరంగల్ తూర్పు,నేటిధాత్రి

 

వరంగల్ తూర్పు నియోజకవర్గం వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో గత తొమ్మిది రోజులుగా జరుగుతున్న దీక్షను మంగళవారం మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన జర్నలిస్టులతో తొమ్మిది రోజులుగా జరిగిన దీక్షల సమీకరణలను అడిగి తెలుసుకున్నారు.

journalists’ initiation camp

అనంతరం అయన మాట్లాడుతూ, ఉమ్మడి వరంగల్ జిల్లా పాత్రికేయులతో వ్యక్తిగత సంబంధం ఉంది. ఆ అభిమానంతోనే జర్నలిస్టుల శిభిరాన్ని వ్యక్తిగతంగ సందర్శించినట్లు తెలిపారు. దీక్షలు, నిరసనలు శాంతియుతంగా చేయడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని అన్నారు. జర్నలిస్టుల న్యాయం కోసం తన వంతు సహాయ సహకారాలు చేస్తానని ఈ సందర్బంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ముస్లింలతో కలిసి నమాజ్ చేసిన మాజీ ఎమ్మెల్సీ.!

ముస్లింలతో కలిసి నమాజ్ చేసిన మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనా చారి

 

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బాంబులగడ్డ ఈద్గలో ముస్లిం మైనారిటీ తో ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్న మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి అనంతరం మాట్లాడుతూ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు అలాగే బిఆర్ ఎస్ ప్రభుత్వం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీ విద్యార్ధిని విద్యార్థుల కోసం వారి చదువుల అభ్యున్నతికోసం ప్రత్యేకమైన గురుకుల పాఠశాలలు నిర్మాణం చేశారు. ప్రతి రంజాన్ పండుగకు అందరికీ దుస్తువులు ఇఫ్తార్ విందు కార్యక్రమాలు ఇచ్చేవారు అంతే కాకుండా వారి కోసం ప్రత్యేకమైన నిధులు కేటాయించి వారి సంక్షేమానికి పెద్దపీట వేశారు అదంతా మీరు కళ్లారాచూశారు కనివిని ఎరుగని రీతిలో అన్నింటా పురోగతి సాధించాలనే సదుద్దేశంతో కేసీఆర్ ముందుకు నడిచారు మన జిల్లా కేంద్రంలోని నా వంతు పాత్ర పోషించి గతంలో మీ కోసం ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పటానో మీరు చూశారు… రానున్న మన బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో పెదవారికోసం అనేక ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేవిధంగా కృషి చేస్తాం అని తెలుపుకుంటూ నెల రోజుల నుండి ఎంతో భక్తిపవిత్రతతో పెద ధనిక అని అని బిన్న అభిప్రాయాలు లేకుండా మంచి మనస్తత్వంతో ఇన్ని రోజులు ఉపవాసాలు ఉండి ఓకె దగ్గర ఈ పండుగ వాతావరణం జరుపుకోవడం చాలా సంతోషంగా ఈ కార్యక్రమానికి పాల్గొని మిమ్మల్ని కలిసిందుకు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మరొక్క మారు అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. తెలిపారు

ఆర్ఎంపీలకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

ఆర్ఎంపీలకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఆర్.ఎం.పి నర్సంపేట డివిజన్ అధ్యక్షులు తాడబోయిన స్వామినాథ్

నర్సంపేట,నేటిధాత్రి:

 

ఆర్ఎంపీ,పీఎంపి వ్యవస్థ మనుగడ ప్రశ్నార్ధకంగా మారిన సమయంలో మద్దతుగా శాసనసభ మండలి కౌన్సిల్ లో గ్రామీణ ప్రజలకు రాష్ట్రంలోని 45 వేల ఆర్ఎంపీల సేవలు ఎంత అవసరమో వివరించి ఆర్ఎంపీలకు ట్రైనింగ్ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అంటూ ఖరాఖండిగా మాట్లాడారని ఆర్ఎంపీ,పిఎంపి అసోసియేషన్ నర్సంపేట డివిజన్ అధ్యక్షులు తాడబోయిన స్వామినాథ్ పేర్కొన్నారు.ఆర్.ఎం.పి ప్రతినిధుల సమక్షంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఆర్ఎంపీల సేవలను కొనియాడుతూ కరోనాకాలంలో ప్రాణాలకు తెగించి ప్రజాసేవ చేసిన సేవలను ప్రభుత్వం కూడా ఉపయోగించుకోవాలని తెలపడం అభినందనీయమని అన్నారు. ఇదేవిధంగా ఆర్ఎంపీల గుర్తింపు పట్ల అన్ని వేదికల మీద మొదటి నుంచి ఆర్ఎంపీ,పిఎంపి లకు మద్దతుగా నిలుస్తున్న ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం సార్ ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దలతో చర్చించి ఈ సమస్యను కౌన్సిల్లో లేవనెత్తడానికి ముఖ్య కారకులైన సందర్భం ఉందన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికార ప్రతిపక్ష నాయకులందరూ ఆర్ఎంపీలకు మద్దతుగా నిలవాలని స్వామినాథ్ కోరారు.
ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, కోదండరాం సార్ లకు నర్సంపేట డివిజన్ ఆర్ఎంపి,పిఎంపి అసోసియేషన్ తరుపున కృతజ్ఞతలు తెలిపారు.

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కలిసిన బిసి జేఏసీ నాయకులు.

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కలిసిన బిసి జేఏసీ నాయకులు

మంచిర్యాల,నేటి ధాత్రి:

బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు వడ్డేపల్లి మనోహర్ ఆధ్వర్యంలో బీసీల బాంధవుడు,బీసీల ఆశాజ్యోతి ఎమ్మెల్సీతీన్మార్ మల్లన్న ని హైదరాబాదులో తన ఆఫీసులో శనివారం కలిసి బీసీ ఉద్యమానికి,వెన్నుదన్నుగా నిలుస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ని ఘనంగా సన్మానించడం జరిగింది.అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని ప్రజల వరకు ఏ విధంగా తీసుకువెళ్లాలో మల్లన్న తో చర్చించడం జరిగింది.బీసీ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలుస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హామీ ఇచ్చారు. అలాగే మంచిరాల జిల్లావ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని గ్రామస్థాయి వరకు తీసుకొని పోవడం కోసము చర్చించారు.అదేవిధంగా బీసీ జేఏసీ రాష్ట్ర నాయకుడైన వట్టా జానయ్య యాదవ్ కూడా ఈ సమావేశంలో పాల్గొని మంచిర్యాల బీసీ జేఏసీ కి పలు సూచనలను,సలహాలను అందించడం జరిగింది.ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లా బీసీ జేఏసీ నాయకులు ఆవిడపు గణేష్,వేముల మల్లేష్,గుడిమల్ల వెంకటేశ్వర్లు,పిట్టల రవీందర్,ఎండి లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.

యాజమాన్యాల సమస్యలు ఎమ్మెల్సీ దృష్టికి.

యాజమాన్యాల సమస్యలు ఎమ్మెల్సీ దృష్టికి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలో ప్రైవేట్ జూనియర్, డిగ్రీ కళాశాల యాజమాన్యాల సమస్యలను ఎమ్మెల్సీ అంజిరెడ్డికి దృష్టికి బుధవారం తీసుకువచ్చారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా ప్రైవేట్ కళాశాలలపై కక్షపూరిత దోరణి వుందని, వెంటనే ఫీజు రీయింబర్స్ చెల్లించేలా కృషిచేయాల్సిందిగా ఎమ్మెల్సీని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ ప్రభుత్వం పై వత్తిడి తీసుకువచ్చి వెంటనే రియంబర్స్ మెంట్ వచ్చేలా కృషి చేస్తా అని అన్నారు.

ఎమ్మెల్యే దొంతిని కలిసిన ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి.

ఎమ్మెల్యే దొంతిని కలిసిన ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి

నర్సంపేట, నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన పిఆర్టియు అధ్యక్షులు పింగిలి శ్రీపాల్ రెడ్డి హనుమకొండలోని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.ఈ కార్యక్రమంలో పిఆర్టియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి కి ఘన సన్మానం.

ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి కి ఘన సన్మానం

నడికూడ,నేటిధాత్రి:
వరంగల్,ఖమ్మం,నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నకైన పీ ఆర్ టీ యు టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్ రెడ్డిని నడికూడ మండల శాఖ తరఫున హనుమకొండ లోని జిల్లా కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్సీ గా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా హనుమకొండ జిల్లా పిఆర్టియు భవనానికి రావడం జరిగింది.పీఆర్ టీ యు నడికూడ మండల శాఖ అధ్యక్షులు అచ్చ సుదర్శన్, ప్రధానకార్యదర్శి కటుకోజ్వల సతీష్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డికి పూల బొకే అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలను,అపరిషృతంగా ఉంటున్న ఉపాధ్యాయుల సమస్యలపై మండలిలో మాట్లాడి సమస్యల పరిష్కారం దిశగా ముందుకెళ్లాలని వారు కోరారు.ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తానని ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పింగిళి శ్రీపాల్ రెడ్డి వారి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు నన్నే సాబ్,బేబీ రాణి పాల్గొన్నారు.

ఎమ్మెల్సీగా శ్రీ పాల్ రెడ్డి గెలుపు ఉపాధ్యాయుల విజయం.

ఎమ్మెల్సీగా శ్రీ పాల్ రెడ్డి గెలుపు ఉపాధ్యాయుల విజయం

నడికూడ,నేటిధాత్రి:
వరంగల్,ఖమ్మం,నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ పింగిళి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించడం ఉపాధ్యాయుల విజయమని నడికూడ మండలశాఖ పి ఆర్ టి యు అధ్యక్షులు అచ్చ సుదర్శన్ అన్నారు.ఇది పూర్తిగా ఉపాధ్యాయుల విజయమని, ఎవరెన్ని కుట్రలు చేసినా టీచర్ల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయాలనీ చూసిన అంతిమంగా ఉపాధ్యాయులు విజయం సాధించారని అన్నారు.ఈ విజయం లో పాలుపంచుకున్న ప్రతి ఉపాధ్యాయునికి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.నడికూడ మండల కేంద్రంలో అధ్యక్షులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలలో భాగంగా ఉపాధ్యాయులకు స్వీట్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖదికారి హనుమంతు రావు,నడికూడ మండల శాఖ ప్రధాన కార్యదర్శి కటుకోజ్వల సతీష్,రాష్ట్ర అధ్యక్షులు గొట్టేముక్కుల శ్రీనివాస్ రెడ్డి, మోడెం రాజేందర్ బాబు, నన్నే సాబ్,బూరుగు శంకర్,ప్రేమానందం,బాలాజీ, దొంతుల శ్రీనివాస్, శివచేతన్,శ్రావణ్ కుమార్,రాజు నాయక్, కృపమ్మ, సుమలత, జయ,శివకుమార్,రవీందర్, క్రిష్ణమ్ రాజు సింగ్,రామయ్య,సదానందం, సుభాని తదితరు లు పాల్గొన్నారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ను పర్యవేక్షించిన డీసీపీ,సీఐ.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ను పర్యవేక్షించిన డీసీపీ,సీఐ

పరకాల నేటిధాత్రి
వరంగల్, ఖమ్మం,నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పరకాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కలాశాలలో పోలింగ్ సరళిని డిసిపి పి రవీందర్ పర్యవేక్షించారు.అనంతరం పోలీస్ సిబ్బందికి తగిన సలహా సూచనలను తెలిపారు.కార్యక్రమంలో ఎమ్మార్వో విజయలక్ష్మి,సీ.ఐ క్రాంతి కుమార్,ఎస్ఐ రమేష్ బాబు.ఆర్ఐ దామోదర్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సజావుగా సాగిన గ్రాడ్యుయేట్,ఎమ్మెల్సీ ఎన్నికలు.!

సజావుగా సాగిన గ్రాడ్యుయేట్,ఎమ్మెల్సీ ఎన్నికలు

ఓటు హక్కు వినియోగించుకున్న తహసిల్దార్ వనజా రెడ్డి

జైపూర్,నేటి ధాత్రి:

మంచిర్యాల్ జిల్లాలో ఒకటి టీచర్స్,రెండు గ్రాడ్యుయేట్ స్థానాలనికి పోలింగ్ కేంద్రాలలో సంబంధిత ఎన్నికల అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను చేపట్టారు.జైపూర్ మండల కేంద్రం మండల పరిషత్ సెకండరీ పాఠశాలలోని మూడు పోలింగ్ భూతులలో గురువారం 8 గంటల నుండి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది.పరిమిత సంఖ్యలో ఓటర్లు ఉన్నప్పటికీ ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా స్థానిక తాసిల్దార్ వనజ రెడ్డి పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటు హక్కు వినియోగించుకుని మాట్లాడారు.పోలింగ్ ఏర్పట్లను బ్రహ్మాండంగా చేశామన్నారు.దీనితో ఎన్నికల విధానం సక్రమంగా కొనసాగిందన్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిశాయన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు: సిఐ..

ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు: సిఐ

మందమర్రి నేటి ధాత్రి:

election

 

మందమర్రి లోని సింగరేణి హైస్కూల్ లొ ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు:ఏర్పాటు చేసిన మంచిర్యాల్ జిల్లా
మందమర్రి సర్కిల్ పరది లోని పోలీస్ ఆధ్వర్యంలో రామగుండం కమిషనరెట్ ఆదేశాలు తో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలో మందమర్రిలొసింగరేణి హైస్కూల్ ఎన్నికల సెంటర్ లో పట్టభద్రుల,4182 టీచర్స్216 ఓటర్లు కొరకు ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మందమర్రి సిఐ శశిదర్ రెడ్డి తెలిపారు. రెండు జిల్లాల్లో 108 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలోని రెండు జిల్లాల్లో పోలీస్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగేలా అందరూ సహకరించాలని మందమర్రి సిఐ శశిదర్ రెడ్డి కోరారు.

election

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన.

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

భద్రాచలం నేటి ధాత్రి;
జిల్లాలోని 23 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకొనున్న 2022 మంది టీచర్లు*

టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియలో భాగంగా ఈ రోజు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ పరిశీలించారు.సింగరేణి కాలరీస్ బాలికల ఉన్నత పాఠశాల మరియు పాల్వంచ బొల్లోరుగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడ విధులలో ఉన్న అధికారులకు జిల్లా ఎస్పీ పలు సూచనలు చేయడం జరిగింది.జిల్లా వ్యాప్తంగా ఉన్న 23 పోలింగ్ కేంద్రాలలో 2022 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.

ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకున్న.!

ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకున్న యువనాయకుడు తెలుగుపాండు ముదిరాజ్.

జహీరాబాద్. నేటి. ధాత్రి:

ఝరాసంగం మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఝరాసంగం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో వారు ఓటు వేశారు. అనంతరం తెలుగు పాండు ముదిరాజ్ మాట్లాడుతూ.. “ఓటు వేయడం మన బాధ్యత. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది పెద్ద ఆయుధం. అందరూ బాధ్యతతో ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఓటు వేస్తేనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతాం” అని తెలిపారు. విద్యార్థులు రవి మహేష్ రెడ్డి,కుమార్,చంద్రశేఖర్ శ్రీశైలం యాదయ్య శ్యామ్ రావు ఓటు హక్కు వినియోగించుకున్నరు.

మొగుడంపల్లి మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్..

మొగుడంపల్లి మండలంలో ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

జహీరాబాద్. నేటి ధాత్రి:

మొగుడంపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఉపాధ్యాయుల, పట్టభద్రుల ఎన్నికలు గురువారం ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఓటర్లు ఉదయం నుంచే ఓటింగ్ కేంద్రాలకు చేరుకోవడంతో పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. ఉదయం 10 గంటల వరకు 10 % శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పోలింగ్ ముగింపు సమయానికి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. పోలీసు భద్రత మధ్య శాంతియుత వాతావరణంలో ఎన్నికల కొనసాగుతున్నాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version