ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి…

ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.

ములుగు జిల్లా, నేటిధాత్రి:

 

ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులు సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్లు సి హెచ్ మహేందర్ జి, సంపత్ రావు లతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.
ఈ రోజు ప్రజావాణి కార్యక్రమంలో 61 దరఖాస్తులు రాగా అత్యధికంగా భూ సమస్యలు 19, గృహ నిర్మాణ శాఖకు 10 పెన్షన్ 05, ఉపాధి కల్పనకు 04, ఇతర ఇతర శాఖలకు సంబంధించినవి 23 దరఖాస్తుల స్వీకరించగా వాటిని వెంటనే సంబంధిత అధికారులకు బదిలీ చేసి పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్, వివిధ జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి, పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు  పాల్గొన్నారు.

నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలి….

నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

ప్రభుత్వం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేటలో చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేటలో నిర్మితమవుతున్న ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రజలకు మరింత వేగవంతమైన వైద్య సేవలను అందించడం కోసం వైద్యులు, సిబ్బంది సంఖ్యను పెంపొందించేందుకు ప్రభుత్వ  వైద్య కళాశాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. 216 కోట్ల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టడం జరుగుతుందని,నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. అనంతరం హాజీపూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని తహసిల్దార్ శ్రీనివాస్ రావు దేశ్ పాండే తో కలిసి సందర్శించారు.భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను రికార్డులతో సరిచూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.జాతీయ రహదారి 63 నిర్మాణంలో భాగంగా భూసేకరణ కార్యక్రమానికి సంబంధించి అవార్డుల జారీ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.వివిధ రకాల ధ్రువపత్రాల కొరకు కార్యాలయానికి వచ్చే ప్రజల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, దరఖాస్తులను నిబంధనలకు లోబడి పరిశీలించి నిర్ణీత గడువులోగా ధ్రువపత్రాలు జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో రోడ్డు భవనాల శాఖ డి.ఈ.సజ్జత్ భాషా, ఈ.ఈ.లక్ష్మీనారాయణ, ఎ.ఈ.ఈ.అనూష,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

తాసిల్దార్ కార్యాలయంలో కలెక్టర్ అకస్మాత్తుగా తనిఖీలు..

తాసిల్దార్ కార్యాలయంలో కలెక్టర్ అకస్మాత్తుగా తనిఖీలు

భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

కలెక్టర్ సత్య శారద దేవి

#నెక్కొండ, నేటి ధాత్రి:

మండలంలోని తాసిల్దార్ కార్యాలయాన్ని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారదా దేవి అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు. తాసిల్దార్ కార్యాలయంలోని భూ భారతి రెవెన్యూ చట్టానికి సంబంధించిన ఫైళ్లను పరిశీలించారు. అనంతరం తాసిల్దార్ రాజ్ కుమార్ ను మండల వ్యాప్తంగా వచ్చిన ఫైళ్ళ వివరాలు అడిగి తెలుసుకుని రెండు రోజులలో భూ సమస్యల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులతో సిబ్బంది వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత దరఖాస్తులను ఎప్పటికప్పుడు కలెక్టర్ కార్యాలయానికి చేరవేయాలని అన్నారు. ఏమాత్రం అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని సిబ్బంది టీములుగా విడిపోయి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎప్పటికప్పుడు నివేదికను పంపించాలని అన్నారు.

నెక్కొండ సర్వేయర్ పై ఆగ్రహం

మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించిన వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి నెక్కొండ సర్వేయర్ కుశాల్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేయర్ భూభారతి దరఖాస్తులపై వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించక రెవెన్యూ కార్యాలయంలో ఏం చేస్తున్నావ్ అంటూ చురకలంటించారు. ఎక్కువ శాతం భూ సమస్యలు సర్వేయర్లు వెళ్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, వరంగల్ ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, నర్సంపేట డి ఏ ఓ శ్రీనివాస్, వరంగల్ డీఏవో ఫణి కుమార్, రెవెన్యూ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

భూముల సమస్యలు పరిష్కరించేందుకే.!

భూముల సమస్యలు పరిష్కరించేందుకే రెవిన్యూ సదస్సులు

తహశీల్దార్ కృష్ణవేణి

మరిపెడ నేటిధాత్రి.

 

 

 

చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న భూమి హక్కుల సమస్యలను పరిష్కరించేందుకే భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ కృష్ణవేణి అన్నారు. మరిపెడ మండల పరిధిలోని రాంపురం, ఉల్లెపల్లి,భూక్య తండ, లూనావత్ తండా గ్రామాలలో నాల్గవరోజు నిర్వహిస్తున్న రెవిన్యూ సదస్సులలో భాగంగా రాంపురం గ్రామపంచాయతీలో తాసిల్దార్ కృష్ణవేణి మాట్లాడుతూ ప్రజలు, రైతులు ఎవరైనా సరే భూములకు సంబంధించిన హక్కుల విషయంలో రైతులు పడుతున్న బాధలపై,ఆధారాలతో కూడిన దరఖాస్తులను సమర్పిస్తే అవసరమైన చర్యలు తీసుకుంటూ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పూర్తి స్థాయి హక్కులు కల్పించనున్నట్లు తెలిపారు. మండల తాసిల్దార్ కృష్ణవేణి స్వయంగా ప్రజలతో మమేకమై వారు ఇచ్చే అర్జీలను కూలంకషంగా పరిశీలిస్తూ, సరైన రీతిలో రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. వారికి భూభారతి ద్వారా మేలు జరుగుతుందని చెప్పడం జరిగింది, ఈ అవకాశాన్ని మండలంలోని అన్ని గ్రామాల రైతులు, ప్రజలు వినియోగించుకుని లబ్ధి పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో మరిపెడ తాసిల్దార్ కృష్ణవేణి, గిర్ధవర్ శరత్ గౌడ్,జూనియర్ అసిస్టెంట్లు సందీప్,ప్రవీణ్,నరేష్,గ్రామపంచాయతీ సిబ్బంది హాఫీజ్,మెకానిక్ వెంకన్న,గ్రామ రైతులు రాంపల్లి నాగన్న,వంగ చిన్న వెంకన్న,సుదగానికి శంకర్,దిడ్డి వెంకన్న,చింతపల్లి మల్లేశం,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

భూ సమస్యల సత్వర పరిష్కారం కొరకై భూభారతి సదస్సులు.

భూ సమస్యల సత్వర పరిష్కారం కొరకై భూభారతి సదస్సులు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

 

మొగుళ్ళపల్లి, నేటి ధాత్రి:

 

 

 

భూ సమస్యల సత్వర పరిష్కారం కోసమే గ్రామాలలో భూభారతి రెవిన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహసిల్దార్ సునీత పేర్కొన్నారు. బుధవారం మండలంలోని అంకుషాపురం రంగాపురం గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయగా రైతుల నుండి పలు సమస్యలపై దరఖాస్తులను తహసిల్దార్ నేరుగా స్వీకరించడమైనది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆర్డీవో పాల్గొని రైతులకు సూచనలు ఇచ్చి అవకాశం వినియోగించుకోవాలని సూచించారు రైతుల నుండి వచ్చిన ప్రతి దరఖాస్తును రిజిస్టర్ లో నమోదు చేసుకొని దరఖాస్తుల ఆధారంగా రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ జరిపి భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్నారు. 5/06/2025 రోజున ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు గుడిపాడు వేములపల్లి గ్రామాలలో రెవెన్యూ సదస్సు నిర్వహించబడుతుందని ఆ గ్రామాలలో ఉన్న రైతుల భూమికి సంబంధించి ఎటువంటి సమస్య ఉన్న వారి దగ్గర ఉన్న ఆధారాలతో దరఖాస్తు చేసుకోవచ్చు ఈ రైతులుఅవకాశాన్ని వినియోగించుకోవాలని తాసిల్దారు కోరారు కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version