రోడ్డెక్కిన రేకూర్తి ప్రజలు..

రోడ్డెక్కిన రేకూర్తి ప్రజలు

మాభూముల యొక్క రిజిస్ట్రేషన్లు కొనసాగించాలి -రేకుర్తి గ్రామ ప్రజలు

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రేకుర్తి శివారులోని భూములకు సంబంధించిన సర్వేనెంబర్లు 1 నుండి 230 వరకు ఉన్న భూముల్లో కలేక్టర్ ఆదేశాల మేరకు దాదాపు గత ఆరు నెలల నుండి రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం జరిగింది. రేకుర్తి రెవెన్యూ గ్రామానికి సంబoదించిన భూములను సెక్షన్ 22ఏలో నుండి తొలగించి రిజిస్ట్రేషన్ చేయాలని, కలెక్టర్ ను తప్పు ద్రోవ పట్టిస్తున్న క్రింది స్థాయి అధికారులను సస్పెండ్ చేయాలని, రేకుర్తి భూములు ఇన్ని రోజులు రిజిస్ట్రేషన్ మరియు మొటేషన్ అయ్యిన వాటిని ఇప్పుడు నిలిపివేయడంలో ఆంతర్యం ఏమిటని, కలెక్టర్ తహసీల్దార్ ను విచారణ చేసి నివేదికను ఇవ్వాలని అడిగిన కానీ ఇంత వరకు మోకా మీదకు వెళ్లి ఎలాంటి విచారణ చెప్పంటని తహసీల్దార్ అంటూ సంబంధిత భూబాధితులు రోడ్డుపై నిరసన చేయడం జరిగింది. ఈసందర్భంగా సంబంధిత భూయజమానులు గ్రామానికి సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం వలన గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇట్టి భూములలో ఇప్పటికే గ్రామ ప్రజలు గ్రామ పంచాయితీ మరియు పురపాలక సంఘం అనుమతులతో ఎనభై శాతం ఇండ్లు నిర్మించుకొని నివసించుచున్నామని, ఇట్టి ఇండ్లకు ఇంటి పన్ను మరియు అన్ని రకాల పన్నులు, గృహ రుణాలు కొన్ని సంవత్సరాల నుండి చెల్లించుచున్నామని, ఇంతకు ముందు కలెక్టర్ ఆదేశాలకు పూర్వము ఇట్టి భూములు అన్ని కరీంనగర్ మరియు గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు కాబడి అన్నింటిని అప్పటి ఎమ్మార్వో మరియు ఆర్డీవోలు వారి పేర్లమీద రెవెన్యూ రికార్డులలో జమాబంధి చేయడం జరిగిందని, అకస్మాత్తుగా రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం వల్ల గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నామని, భూములు అమ్ముకోలేక చాలా వివాహలు ఆగిపోయాయని, ఇంకా ఇలాగే కొనసాగేతే చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం పొంచి ఉందని కలెక్టర్కు అందజేసిన వినతి పత్రంలో పేర్కొన్నామని, ఇట్టి విషయంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని అట్టి సర్వే నంబర్లలో సంబంధిత అధికారులతో విచారణ జరిపి రిజిస్ట్రేషన్లు కొనసాగేలా చేయాలని రేకుర్తి గ్రామ ప్రజలు అధికారులను పత్రికా ముఖముగా కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version