111జీవోలో ఆగని అక్రమ నిర్మాణాలు

111జీవోలో ఆగని అక్రమ నిర్మాణాలు

•అనుమతులు నిల్..కన్స్ట్రక్షన్స్ ఫుల్
* కమ్మెట పంచాయతీ కార్యదర్శి ఫెయిల్యూర్
* పంచాయతీ కార్యదర్శి పై చర్యలేవి.
* పత్రిక కథనాలకు స్పందించని కార్యదర్శి, ఎంపీఓ
•111లో వెలుస్తున్న రోజుకొక్క అక్రమ నిర్మాణం
* పిర్యాదు చేసి 30 రోజులైనా చర్యలు శూన్యం
* నోటీసుల పేరుతో కాలయాపన చేస్తున్న పంచాయత్ రాజ్ అధికారులు

చేవెళ్ల,నేటిధాత్రి:

111జీవో ప్రాంతంలో ప‌లువురు భవనాలు కడుతున్నారు? ఎవ‌రి అండ చూసుకుని వీరంతా రెచ్చిపోతున్నారు? హెచ్ఎండీఏ అనుమ‌తి లేకుండా అక్ర‌మంగా నిర్మాణాలు క‌డుతుంటే.. అధికారులేం చేస్తున్నారు? 111 జీవో ప్రాంతాల్లో అక్ర‌మ నిర్మాణ‌ల్ని క‌డుతున్న విష‌యం అధికారులకు తెలియ‌దా? తెలిసినా, తెలియ‌న‌ట్లు న‌టిస్తున్నారా?అక్ర‌మ నిర్మాణాల్ని కూల్చివేయ‌కుండా పంచాయతీరాజ్, హెచ్ఎండిఎ అధికారులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు.

* అనుమతులు నిల్… కమర్షియల్ కన్స్ట్రక్షన్స్ ఫుల్.

ఈ బిల్డింగ్ నిర్మాణానికి హెచ్ఎండిఏ నుండి ఇలాంటి అనుమతులు లేవని, నిర్మాణం ఆపాలంటూ గతంలోనే 3 నోటీసులు ఇచ్చామని కమ్మెట పంచాయతీ కార్యదర్శి తెలిపారు.
ఇచ్చిన నోటీసులు బేఖాతరు చేస్తూ అనుమతులు లేకుండానే దర్జాగా జి+3 భవన నిర్మాణం చేపడుతున్నారని, నోటీసులను బేఖాతరు చేస్తూ ఈ బిల్డింగ్ నిర్మాణంలో గ్రౌండ్ ఫ్లోర్, జి ప్లస్ వన్ లో కమర్షియల్ షెటర్స్ నిర్మిస్తున్నారు. ఈ భవనాలు ఎనికెపల్లి ప్రధాన చౌరస్తా కావటంతో భారీగా అద్దె పర్పస్ కమర్షియల్ షెటర్లను నిర్మిస్తున్నారు. నిర్మాణాలకు గ్రామపంచాయతీ కార్యదర్శి అండ ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడో నోటీస్ ఇచ్చామని చెబుతున్న పంచాయతీ కార్యదర్శి మళ్లీ అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. కమ్మెట, ఎనికేపల్లి త్రిబుల్ వన్ జీవోలోనే ఉన్నాయి. కమ్మెట గ్రామపంచాయతీ పరిధిలో నిత్యం అక్రమ నిర్మాణాల జోరు కొనసాగు తుంది. నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిన పంచాయతీ కార్యదర్శి, మండలపంచాయతీ అధికారి, అక్రమ చర్యలపై చేతులేత్తేశారు.

* అక్రమాలకు ఊతమిస్తున్న అధికారులు

ముడిమ్యాల, గొల్లపల్లి, రావులపల్లి, మల్కాపూర్ గ్రామాలతో పాటు
కమ్మెట రెవెన్యూపరిధిలోని 111జీవోలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై వెలువడుతున్న వార్త పత్రిక కథనాలకు పంచాయతీరాజ్ అధికారులు స్పందించడం లేదు. గతంలో జరిగిన నిర్మాణాలు
పక్కన పెడితే, ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న బహుళ అంతస్తుల కమర్శియల్ అక్రమ నిర్మాణాలపై ఇసుమంత చర్యలు చేపట్టలేదు. అక్రమ నిర్మాణాలకు అధికారులే అక్రమ నిర్మాణాలను ప్రోత్సహి స్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీ కార్యదర్శి గతంలో ఎప్పుడో నోటిసులు ఇచ్చినవే తప్పితే మళ్లీ అటువైపు తొంగి చూసిన దాఖలాలు లేవు. కమ్మెట పంచాయతీ కార్యదర్శి, మండల పంచాయతీ అధికారులు ఫెయిల్యూర్ అయ్యారు.కమ్మెట పరిధిలో111జీవోలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై అధికారులు నిస్సహాయత తీరుపై విమర్శలకు దారితీస్తుంది. మండల ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శిపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

 

శ్రీనివాస్ రెడ్డి.
కమ్మెట పంచాయతీ సెక్రెటరీ

కమ్మెట రెవెన్యూ పరిధిలో111జీవోలో నిర్మిస్తున్న భవన నిర్మాణాలకు పంచాయతీ నుండి ఇలాంటి అనుమతులు, ఇంటినెంబర్ ఇవ్వబడదు. ఇప్పటికే నోటీసులు ఇచ్చాము. ఈ విషయాన్నీ పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. ఉన్నత అధికారుల ఆదేశాలు ఇస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

పలమనేరులో పెద్ద చెరువు రక్షణకు ఆదేశాలు…

*పలమనేరుకు తలమానికమైన పెద్ద చెరువును పరిరక్షించాలని

*అధికారులను
అదేశించిన ఎమ్మేల్యే అమర్..

పలమనేరు(నేటిధాత్రి)అగస్టు19:

పలమనేరుకు తలమానికమైన పెద్ద చెరువును పరిరక్షించాలని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆక్రమణదారుల కోసం అధికారులు చెరువుకు గండి కొట్టి చెరువులోని నీటిని రైతుల పంట పొలాల్లోకి వదిలేసారని పత్రికలలో రావడంపై ఆయన ఘాటుగా స్పందించారు. దీంతో మున్సిపల్ రెవిన్యూ మరియు ఇరిగేషన్ అధికారులతో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారుఈ సందర్భంగా చెరువుకు గండి కొట్టడానికి గల కారణాన్ని మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.చెరువు ఆయకట్టు ప్రాంతంలోని పలువురి ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బందులు ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో నీటిని మళ్లించినట్లు తెలిపారు. అయితే దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నీటిని మల్లించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ కట్టను తవ్వేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పట్టణ ప్రజలకు మరియు ఆయకట్టు రైతులకు ఇబ్బంది కలగకుండా వెంటనే కట్ట మరమ్మతు పనులు పునరుద్ధరించి సప్లై ఛానల్ ద్వారా నీటిని తరలించే చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. అందుకోసం అవసరమైన నిధులను వెంటనే తెప్పించేందుకు కృషి చేస్తానని ఆ దిశగా రెవిన్యూ అధికారుల సహకారంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక చెరువు ఆక్రమణలకు గురి కాకుండా వెంటనే హద్దులను గుర్తించి పరిరక్షించాలన్నారు.ఈ సమావేశంలో తహసిల్దార్, ఇన్బనాధన్, మున్సిపల్ కమిషనర్ ఎన్వీ. రమణారెడ్డి, ఇరిగేషన్ డిఈ చొక్కల నాయక్, ఏఈ లక్ష్మీనారాయణ లతో పాటు మున్సిపల్,రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

సికేపల్లిలో దళితుల స్మశాన ఆక్రమణలు తొలగింపు.

సికేపల్లిలో దళితుల స్మశాన ఆక్రమణలు తొలగింపు

రామచంద్రపురం(నేటి ధాత్రి) 

మార్చి 01: తిరుపతి జిల్లా, రామచంద్రాపురం మండలం, చిట్టతూరు కాలేపల్లి రెవెన్యూ గ్రామంలోని చిట్టత్తూరు ఆది ఆంధ్ర వాడకు చెందిన స్మశాన వాటికను ఆక్రమణలను తొలగించి, దళితులకు స్మశాన వాటిక ఏర్పాటు చేశారు. ఆర్ సి పురం తహసిల్దార్ కే వెంకటరమణ ఆదేశాల మేరకు
శనివారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, మండల సర్వేయర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో సర్వేనెంబర్ 358 /13 సర్వే 00.38 సెంట్లు స్మశాన స్థలాన్ని గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి ఆక్రమించుకోవడంతో దళితవాడ గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సర్వే నిర్వహించి ఆక్రమణలను వీఆర్వో వెంకటరమణ, నరసింహులు,జి రాజశేఖర్, బాబు, కమ్యూనిటీ సర్వేయర్ మణి, వీఆర్ఏ బాల, సుబ్రహ్మణ్యం, పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి లు తొలగించారు. స్మశాన వాటిక చుట్టూ జెసిబి తో ఫ్రెంచ్ ఏర్పాటు ఏర్పాటుచేసి దళితులకు స్మశాన వాటిక సౌకర్యం కల్పించారు. స్మశాన వాటిక స్థలంలో మామిడి చెట్ల ఉన్నాయి.ఆ మామిడి చెట్లను కూడా గ్రామస్తులు ఉపయోగించుకునేలా రెవెన్యూ అధికారులు అప్పజెప్పారు. దీంతో ఎన్నో ఏళ్లగా ఆక్రమణకు గురైన స్మశాన వాటిక ఏర్పాటు చేసినందుకు గ్రామానికి చెందిన దళితులు అధికారులకు, కృతజ్ఞతలు తెలిపారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version