అక్రమ కలప వ్యాపారాన్ని అరికట్టాలి.
జహీరాబాద్ నేటి ధాత్రి:
అడవులు రక్షణకు ప్రభుత్వాలు పనిచేస్తుంటే, అక్రమార్కులు మాత్రం ధనార్జిని ధ్యేయంగా అక్రమ కల్ప వ్యాపారం నిర్వహిస్తున్నారు. జహీరాబాద్ నియోజకవర్గం లోని కోహిర్ ఝరాసంగం మొగుడం పల్లి మాడలాల శివారులో అక్రమంగా రవాణా జరుగుతున్న సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆయా గ్రాముల ప్రజలు అర్పిస్తున్నారు.
ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు హరితహారం లో భాగంగా చెట్లు నాటుతుంటే కాసులకు అలవాటుపడ్డ అక్రమార్కులు చెట్లను నరికి అక్రమ కల్ప వ్యాపారం నిర్వహిస్తున్న అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లేక కలప వ్యాపారులకు సహకరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ కల్ప వ్యాపారాన్ని అరికట్టి చెట్లు నరకకుండా చర్యలు తీసుకోవాలని ఆయ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.