మున్సిపల్ చైర్మన్ షాపు దగ్గర రోడ్డు ఆక్రమణ…

మున్సిపల్ చైర్మన్ షాపు దగ్గర రోడ్డు ఆక్రమణ

రోడ్ల విస్తరణ కు అడ్డు పడుతున్నారు

మార్నింగ్ వాకింగ్ లో రోడ్ల విస్తరణ పై ఎమ్మెల్యే ప్రజలకు హామీ

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లా కేంద్రంలో రాజావారి పాలిటెక్నిక్ కళాశాల దగ్గర మున్సిపల్ చైర్మన్ షాపు దగ్గర దాదాపు 10 ఫీట్ల స్థలం ఆక్రమించు కొని వారు వనపర్తి లో రోడ్ల విస్తరణ పనులు జెరగకుండా పదవిని హోదా అడ్డం పెట్టుకొని అడ్డుకోవడం సారి కాదని జిల్లా అఖిల పక్ష ఐక్యవేదిక అధ్యక్షులు డాక్టర్ సతీష్ యాదవ్ ఆవేదన వ్యక్తంచేశారు ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ షాపు నుండి కొలతలు తీసుకోని రోడ్డు సెంటర్ చేసి విస్తరణ కటి oగి చేయాలని ఆయన డిమాండ్ చేశారు
వనపర్తి లో గోపాల్పేట రోడ్డు, చిట్యాల రోడ్డు నుండి రాజీవ్ చౌక్ వరకు గత ప్రభుత్వంలో 80 శాతం పూర్తయిన రోడ్డు వెడల్పు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత విస్తరణ చేయలేదని వనపర్తి లో రోడ్డు వెడల్పు కాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నది ఎమ్మెల్యే రెండు సంవత్సరాలుగా రోడ్డు వెడల్పు చేస్తాము అంటూ, వాకింగ్ చేస్తూ ప్రజలకు హామీ ఇచ్చారని ఇచ్చి న హామీ నెరవేర్చలేదని ఆయన విమర్శించారు,జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే ప్లానింగ్ .బోర్డ్ వైస్ చైర్మన్ వెంటనే వనపర్తి లో పెబ్బేరు కొల్లాపూర్ కొత్తకోట రోడ్డును ప్రమా దాలు జెరగకుండా వెంటనే రోడ్డు కటి oగ్ చె యిoచాలని డాక్టర్ సతీష్ యాదవ్ డిమాండ్ చేశారు

జహీరాబాద్ మున్సిపాలిటీ ఏరియా 10 వ వార్డ్ లో ఎక్కడికక్కడ మురికి నీరు నిలిచిపోయింది..

జహీరాబాద్ మున్సిపాలిటీ ఏరియా 10 వ వార్డ్ లో ఎక్కడికక్కడ మురికి నీరు నిలిచిపోయింది

జహీరాబాద్ నేటి ధాత్రి:

10 వ వార్డ్ లో నాలాల కబ్జా చేసి వెంచర్లు చేసి డబ్బులు పోగేసుకున్నారు శాశ్వతంగా మొరిల్ల నిర్మాణానికి వెంచర్ లో ప్లాట్లు ముందు మురికి కాలువ స్థలాలను ఏర్పాటు చేసిన వారికే పర్మిషన్ ఇయ్యాలి నాలా కబ్జా చేసిన వారికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కానీ మురికి కాల్వల నిర్మాణానికి మున్సిపాలిటీ అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చిన జహీరాబాద్ ఆర్డిఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది కబ్జాకు గురైన నాలాల కబ్జా నుంచి తొలగించి శాశ్వత నిర్మాణానికి తోడ్పడాలని,,, 10 నంబర్ వార్డ్ మహమ్మద్ ఇమ్రాన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ,, కావాలని సమస్యలకు పరిష్కారం చూపాలి అని నూతనంగా ఎన్నికైన చైర్మన్ గారికి మరియు మున్సిపాలిటీ అధికారులకు కోరడం జరుగుతుంది ఈ మురికి నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో కాలనీలో నివసించే ప్రజలకు అనేక వ్యాధులు వస్తున్నాయి కాబట్టి తక్షణమే మురికి కాల్వలను నిర్మాణం పూర్తి చేయాలి అలాగే ఇరిగేషన్ అధికారులతో మున్సిపాలిటీ అధికారులు సాంప్రదించి గతంలో ఉన్న నాలా నక్షలో ఉన్నట్టుగా మురికి కాలువ నిర్మాణం చేస్తే గాంధీనగర్ కాలనీ గుల్షన్ నగర్ కాలనీ సలాం నగర్ కాలనీ జమాలి కాలనీ శాశ్వత పరిష్కారం చూపేలా మున్సిపాలిటీ అధికారులు వెంటనే పనులు ప్రారంభించాలి మరియు సీసీ రోడ్ల నిర్మాణం విద్యుత్ దీపాలు తాగునీటి సమస్యకు పరిష్కారం చెప్పాలన్నారు,

కబ్జాకు గురవుతున్న డిబిఎం 38 కెనాల్ భూమి..

కబ్జాకు గురవుతున్న డిబిఎం 38 కెనాల్ భూమి.

#చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు.

#భూమి ఆక్రమించుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

#కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వెంబడి ఉన్న డిబిఎం 38 కెనాల్ భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టి ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేస్తున్నారని కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాకతీయ కెనాల్ ఇరువైపుల ఎడమవైపు 120 మీటర్లు, కుడి వైపు 100 లీటర్లు వదిలివేసి నిర్మాణాలు చేసుకోవాలని గతంలో సంబంధిత అధికారులు సూచించారు. గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న మండల నాయకులు ఇష్ట రాజ్యాంగ కెనాల్ భూమిని ఆక్రమించుకొని అమాయకులకు అధిక రేటులకు అమ్ముకోవడం జరిగింది. నిర్మాణాలు చేపట్టే క్రమంలో అధికారులు నిబంధనలకు మించి ఇండ్ల నిర్మాణాలు చేపడితే తక్షణమే తొలగించబడతాయని హెచ్చరించిన కూడా కొందరు భూమి కొనుగోలు చేశారని . పూర్తిగా విషయం తెలుసుకున్న తర్వాత కొనుగోలు దారులు లబోదిబోమంటూ భూమి అమ్మిన నాయకులను ఆశ్రయించగా మీకు ఎలాంటి ఇబ్బంది జరగదు మేము చూసుకుంటామని భరోసా ఇవ్వడంతో నిర్మాణాలు ఇష్ట రాజ్యాంగ చేస్తున్నారు. నల్లబెల్లి మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై తక్షణమే సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని కబ్జాకు గురవుతున్న భూమిని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.

భూ కబ్జా కోరల్లో ప్రభుత్వ భూములు..

 

భూ కబ్జా కోరల్లో ప్రభుత్వ భూములు..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో. భూ కబ్జాదారులు రాత్రికి రాత్రి చెట్లు నాటుతూ పనులు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మండపల్లి గ్రామస్తుల కథనం ప్రకారం. మండపల్లి గ్రామంలోని సర్వే నెంబర్లు. 337. నంబర్లో 360 ఎకరాల. ప్రభుత్వ భూమి ఉన్నది. దీనిపై కన్నేసిన భూకబ్జాదారులు రాత్రిపూట దున్నటం భూమిలో రాత్రికి రాత్రి చెట్లు నాటడంతో గ్రామంలోని గ్రామస్తులు శనివారం రోజున రెవెన్యూ అధికారులకు సమాచారం అందించగా ఆర్ ఐ. దినేష్. జిపిఓ. రెవెన్యూ సిబ్బంది శనివారం రోజున. మండే పల్లి గ్రామానికి వెళ్లి భూములను పరిశీలించారు. గ్రామస్తులు అభిప్రాయం ప్రకారం భూమి రెవెన్యూకి చెందాలి లేకుంటే గ్రామ అభివృద్ధికి చెందాలి. అని అధికారులకు వివరిస్తూ భూమికి సంబంధించిన పత్రాలు ఉంటే రాత్రిపూట దున్నించడఏమిటి అని రాత్రిపూట చెట్లు పెట్టించడం ఏమిటని ఆరోపించారు ఇప్పటికే . గ్రామంలో భూమిని భూకబ్జాదారుల. ఆక్రమణకు గురవడంతో. గ్రామంలోని గ్రామపంచాయతీకి గాని పశువులు మేకలుమేయడానికి గాని. ఉపయోగించడానికి. వీలుగా ఉండేలా చర్యలు తీసుకుంటూ. గ్రామంలో పిల్లలను విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు లో క్రీడా ప్రాంగణానికి ఉపయోగపడేలా సంబంధిత అధికారులు రెవెన్యూ సిబ్బంది భూకబ్జాదారులపై చర్యలు తీసుకుంటూ ప్రభుత్వ భూములను కాపాడి ప్రతి గ్రామంలో ప్రజలకు మేలు కలిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో గ్రామంలో రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version