మండల కేంద్రంలో ధర్నా చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు….

మండల కేంద్రంలో ధర్నా చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

అధికారుల సహాయంతో అక్రమ ఇసుక రవాణా

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

టేకుమట్ల మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పేరుతో కొందరు రెవెన్యూ అధికారులు, దళారులు కుమ్మక్కు కావడంతో ఇసుక పక్కదారి పడుతుందని, ఈ అక్రమ దందాను అరికట్టాలని శుక్రవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
ఈ సందర్భంగా కోటగిరి సతీష్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు తక్కువ ధరలలో ఇసుక అందించాలని స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ ఆదేశించినా దళారుల రంగ ప్రవేశంతో అనుమతులకు మించి ఇసుక తోడేస్తూ ఈ ప్రాంత వనరులు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ఒక టేకుమట్లే కాకుండా ఇసుక సౌకర్యం ఉన్న రేగొండ, శాయంపేట, మొగుళ్ళపల్లి, టేకుమట్ల, చిట్యాల మండలంలో క్వారీల ను ఓపెన్ చేసి, అన్ని మండలంలో నుండి తీసుకపోయేలా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క టేకుమట్ల మండలంలో రోజు 25 ట్రాక్టర్ల ఇసుకకు అనుమతి ఉంటే రోజు 200 నుండి 250 ఇసుక ట్రిప్పులు నడుస్తుండటంతో ఈ ప్రాంత ప్రజలు రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇసుకను అక్రమంగా డంప్ చేస్తున్న అక్రమార్కుల పైన కేసులు నమోదు చేయట్లేదని మామూలుగా ట్రాక్టర్లతో ఇసుక కొడుతున్న వారి పైన కేసులు అవుతున్నాయన్నారు. అక్రమ ఇసుక తరలించిన వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాకార్యక్రమం అనంతరం రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ విజయ్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version