*అతి త్వరలో రాయలపేట రోడ్డు విస్తరణ..
*నిర్వాసితులకు ఆందోళన వద్దు..
*అభిప్రాయ సేకరణ అనంతరమే రోడ్డు ఏర్పాటు.. ఎమ్మెల్యే అమర్..
పెద్దపంజాణి(నేటి ధాత్రి)
పెద్దపంజాణి మండలం రాయలపేటలోని రోడ్డు విస్తరణ పనులు అతి త్వరలో చేపట్టనున్నట్లు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఇరుకైన రోడ్లతో రాకపోకలకు ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతొందిఇలా ఉండగా ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో ఈ రోడ్డును విస్తరించేందుకు ప్రభుత్వం ద్వారా రూ. 4.4 కోట్ల దాకా మంజూరు చేయించారు. అయితే కొంతమంది అభ్యంతరాల మేరకు రోడ్డు విస్తరణ జరగకపోవడంతో ఊరికి వెలుపల బైపాస్ నిర్మాణాన్ని చేపట్టదలిచారు.ఈ విషయం తెలుసుకున్న మెజారిటీ గ్రామాల ప్రజలు రాయలపేట మీదుగానే రోడ్డును ఏర్పాటు చేయాలని ఈమధ్య ఎమ్మెల్యేకు విన్నవించారు. దీంతో రోడ్డును ఏర్పాటుకు అధికారులు మార్కింగ్ ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించడంతో రెండు రోజులుగా అధికారులు ఆ పనులను చేపడుతున్నారు.అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ భాగం రోడ్డు విస్తరణకు వెళ్లే అవకాశం ఉందని పలువురు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శనివారం రాయల్ పేట గ్రామంలో పర్యటించి మార్కింగ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎక్కడెక్కడ ఇబ్బంది తలెత్తుతుందో స్థానికులు అడిగి తెలుసుకున్నారు. దీనిపై ఎవరికి ఎటువంటి ఆందోళన వద్దని అధికారులు మరియు గ్రామస్తుల తో సమీక్ష నిర్వహించి అందరి అభిప్రాయ సేకరణ అనంతరమే పనులు చేపడతామని వారికి ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
