గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో యువజన సంఘాల సమావేశం…

గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో యువజన సంఘాల సమావేశం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో యువజన సంఘాల సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా మండపల్లి గ్రామంలో స్థానిక సర్పంచి గాధగోని సాగర్ ఆధ్వర్యంలో యువజన సంఘాల సమావేశం నిర్వహిస్తూ. ప్రతి గ్రామంలో గ్రామాలు అభివృద్ధి జరగాలంటే గ్రామ యువత సహకరించాలని యువత చదువుతోపాటు గ్రామ అభివృద్ధికి సహకరించాలని ప్రతి గ్రామంలో గ్రామ అభివృద్ధి జరగాలంటే యువజన సంఘాల పాత్ర కీలకమని. ప్రతి గ్రామంలో అభివృద్ధి . యువజన పథంగా. యువజన సంఘాలు ఏర్పరచుకొని అందులో యువత పాలుపంచుకుంటూ చదువుతోపాటు గ్రామాన్ని అభివృద్ధితో పాటు అన్ని విషయాలు ప్రజలకు సంబంధించి కార్యక్రమాలు చేపడుతూ. అభివృద్ధి పథంలో ముందు ఉంచే బాధ్యత యువజన సంఘాలపై ఎక్కువగా ఉంటుందని. దీనిపై ప్రతి గ్రామంలో యువత యువకులు గ్రామ ప్రజలు అందరూ సహకరించి అభివృద్ధి పథంలో ముందు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు.

స్థానిక సర్పంచ్ సాగర్ఆధ్వర్యంలో వారంతపుసంతఏర్పాటు…

స్థానిక సర్పంచ్ సాగర్ఆధ్వర్యంలో వారంతపుసంతఏర్పాటు…

 

తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో మండేపల్లి సర్పంచ్ గాదగోనీ సాగర్ ఆధ్వర్యంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో వారసంతపు సొంత ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మండపల్లి గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ మండపల్లి వారసంతపు సంత ఏర్పాటు చేయడం జరుగుతుందని. కనుక ఈ వారంతపు సంతలు నిత్యావసర వస్తువులు తక్కువ ధరలకే దొరుకుతాయని ఇందులో కూరగాయలు కానీ నిత్యవసర వస్తువులు కానీ ఇతర ఏ వస్తువులైన అన్ని సదుపాయాలు ఉంటాయని ప్రజలు పట్టణాలకు వెళ్లి తీసుకువచ్చేఅవకాశలు లేకపోగా సమయం వృధాగా అందుబాటులో ఉండకపోవడంతోసమయం కలిసొస్తుందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటాయన్న ఉద్దేశంతో వారసంతపు సంత ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి వారం మూడు గంటలకు ప్రారంభమై సాయంకాలం ముగుస్తుందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరికీ అందుబాటులో విధంగా సహాయ సహకారాలు అందిస్తామని అదేవిధంగా రాబోయే రోజులలో పశువుల అంగడి కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రామ ప్రజలు గాని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గాని అందరు సహకరించి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తూ చుట్టుపక్కల గ్రామాల వారికి అందుబాటులో ఉండే విధంగా అందరు సహకరించాలని గ్రామంలో మైకు ద్వారా ప్రచారం నిర్వహించారుఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.

అతివేగంతో గ్రామంలో ప్రజలు పిల్లలను భయ ప్రాంతులకు గురిచేస్తున్న ఇసుక ట్రాక్టర్లు…

అతివేగంతో గ్రామంలో ప్రజలు పిల్లలను భయ ప్రాంతులకు గురిచేస్తున్న ఇసుక ట్రాక్టర్లు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి.

 

తంగళ్ళపల్లి మండలం మండే పల్లి గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా. గ్రామస్తులు ప్రజలు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ప్రభుత్వపరంగా ఇసుక వే బిల్లులు. మండల రెవెన్యూ అధికారుల ప్రభుత్వపరంగా ఇస్తుండగా. వాటికి అనుగుణంగా గ్రామంలో నుంచి వే బిల్లుల ద్వారా ఇసుక సరఫరా జరుగుతుండగా. దానికి సంబంధించి గ్రామంలో నడుస్తున్న ఇసుక ట్రాక్టర్లు ఇష్టానుసారంగా నడిపిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ. గ్రామంలో నిర్మితమైన కమానును ఢీ కొట్టుకుంటూ. గ్రామ ఇండ్లల్లో కరెంటు స్తంభాలను ఢీకొట్టుకుంటూ వైర్లు తెగిపోతున్న గ్రామంలో ఇండ్లలో విద్యుత్తు సరఫరా నిలిచిపోతున్న ఇండ్లలో ఏమి. ఏమి నష్టం జరుగుతున్న పట్టించుకోకుండా సదరు ట్రాక్టర్ డ్రైవర్లు గాని యజమానులు గాని ఇష్టానుపురూపంగా వాహనాల నడుపుతున్నారని మొన్నటికి మొన్న ఒక ట్రాక్టర్ ది ముంగటి చక్రం ఊడిపోయి పొలాల్లో పడిపోయిందని. ఇసుక ట్రాక్టర్ నడుపుతున్న చాలామంది మైనర్ పిల్లలు ఉన్నారని వారికి లైసెన్సులు కూడా లేవని గ్రామంలో ప్రజలు వీధులపై తిరగడానికి భయపడుతున్నారని. స్కూలు విద్యార్థులు గ్రామాలలో పిల్లలు పెద్దలు ముసలి వాళ్లు బయటకి రావడానికి భయపడుతున్నారని. దయచేసి వెంటనే సంబంధిత అధికారులు వచ్చి స్థానిక ఎస్సై గారు వచ్చి. గ్రామంలో జరుగుతున్న వాటిపై చర్యలు తీసుకుంటూ. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కేటాయించిన వే బిల్లుల ప్రకారం. నడిపించుకోవాలని. మేము ప్రభుత్వ అందించిన దానికి వ్యతిరేకం కాదు అని ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి నష్టం వాటిల్లకుండా నడుపుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ స్థానిక ఎస్సై. సంబంధిత రెవెన్యూ అధికారులు. రావాలని రాస్తారోకో ధర్నా నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. సంబంధిత రెవెన్యూ అధికారులు స్థానిక ఎస్సై గ్రామానికి వచ్చి గ్రామ ప్రజలతో చర్చించి ఇకపై ఇలాంటి సంఘటన పునవృతం కాకుండా. చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు ఇట్టి కార్యక్రమం

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version