కార్మికుల డిమాండ్లపై మెమోరండం అందించిన ఏఐటియుసి యూనియన్..

కార్మికుల డిమాండ్లపై మెమోరండం అందించిన ఏఐటియుసి యూనియన్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

సింగరేణి కార్మికుల డిమాండ్లపై ఏఐటియుసి యూనియన్ పిలుపుమేరకు మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ సిహెచ్పీ లో యూనియన్ ఫిట్ సెక్రటరీ హరి రామకృష్ణ ఆధ్వర్యంలో సిహెచ్పి లో ధర్నా కార్యక్రమం వహించారు. ఏఐటియుసి యూనియన్ నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూనియన్ సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, వైస్ ప్రెసిడెంట్ ఇప్పకాయల లింగయ్య లు హాజరయ్యారు. సింగరేణి కార్మికుల యొక్క పలు డిమాండ్లతో కూడిన మెమొరాండం ను సిహెచ్పి ఇన్చార్జ్ ఏ చంద్రమౌళికి అందించారు. మెమోరాండంలో తెలిపిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, కార్మికులకు న్యాయం చేయాలని కోరుతున్నామని ఫిట్ సెక్రెటరీ హరి రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సిరాజ్ ,అబ్బాస్, నరేంద్ర ,రామారావు, శ్రీనివాస్, నరేందర్, శ్రీకాంత్, రవళి, వైష్ణవి, భవాని, అనిత, రజిత తదితరులు పాల్గొన్నారు.

తాసిల్దార్ కు వినతిపత్రం అందజేత…

తాసిల్దార్ కు వినతిపత్రం అందజేత

బిసి, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ నాయకులు

జమ్మికుంట, నేటి ధాత్రి :

 

బీసీలకు 42 శాతంవిద్యా,ఉద్యోగస్థానిక సంస్థల్లో రిజర్వేషన్ బిల్లుల రాజ్యాంగ 9వ షెడ్యూల్లో చేర్పు, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని మంగళవారం జమ్మికుంట మండల తహసీల్దార్ కు బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాలలో ఈ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మండల నాయకులు ఆధ్వర్యంలో జమ్మికుంట తహసీల్దార్ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు వీరన్న, అనిల్, శ్రీకాంత్, శాంతన్ ధర్మ సమాజ్ పార్టీ మండల నాయకులు, మాడుగుల సందీప్, సురేష్, సాగర్, మనోజ్, తదితరులు పాల్గొన్నారు.

మండల కేంద్రంలో ధర్నా చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు….

మండల కేంద్రంలో ధర్నా చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

అధికారుల సహాయంతో అక్రమ ఇసుక రవాణా

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

టేకుమట్ల మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పేరుతో కొందరు రెవెన్యూ అధికారులు, దళారులు కుమ్మక్కు కావడంతో ఇసుక పక్కదారి పడుతుందని, ఈ అక్రమ దందాను అరికట్టాలని శుక్రవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
ఈ సందర్భంగా కోటగిరి సతీష్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు తక్కువ ధరలలో ఇసుక అందించాలని స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ ఆదేశించినా దళారుల రంగ ప్రవేశంతో అనుమతులకు మించి ఇసుక తోడేస్తూ ఈ ప్రాంత వనరులు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ఒక టేకుమట్లే కాకుండా ఇసుక సౌకర్యం ఉన్న రేగొండ, శాయంపేట, మొగుళ్ళపల్లి, టేకుమట్ల, చిట్యాల మండలంలో క్వారీల ను ఓపెన్ చేసి, అన్ని మండలంలో నుండి తీసుకపోయేలా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క టేకుమట్ల మండలంలో రోజు 25 ట్రాక్టర్ల ఇసుకకు అనుమతి ఉంటే రోజు 200 నుండి 250 ఇసుక ట్రిప్పులు నడుస్తుండటంతో ఈ ప్రాంత ప్రజలు రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇసుకను అక్రమంగా డంప్ చేస్తున్న అక్రమార్కుల పైన కేసులు నమోదు చేయట్లేదని మామూలుగా ట్రాక్టర్లతో ఇసుక కొడుతున్న వారి పైన కేసులు అవుతున్నాయన్నారు. అక్రమ ఇసుక తరలించిన వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాకార్యక్రమం అనంతరం రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ విజయ్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

వర్కింగ్ జర్నలిస్టులు అందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ..!

వర్కింగ్ జర్నలిస్టులు అందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ
సబ్ కలెక్టర్ మనోజ్ కి వినతిపత్రం అందజేశారు.

బెల్లంపల్లి నేటిధాత్రి

బెల్లంపల్లి పట్టణంలోని వర్కింగ్ జర్నలిస్టులు అందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ బెల్లంపల్లి టేకులబస్తీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ కి వినతిపత్రం అందజేశారు. ముందుగా సబ్ కలెక్టర్ ని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈ సందర్బంగా జర్నలిస్ట్ లు మాట్లాడుతూ పట్టణంలో చాలామంది జర్నలిస్టులు పేదరికంలో సొంత ఇళ్లు లేక అద్దె ఇళ్లల్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అదే విధంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించాలని కోరారు.కార్యక్రమంలో బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కారుకూరి సదానందం, ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ పాండే, కోశాధికారి కత్తుల నవీన్, కార్యవర్గ సభ్యులు ఎం భాస్కర్,కే రమేష్ తదితరులు పాల్గొన్నారు

టెక్స్టైల్ పార్క్ లో 3 వ.రోజు కొనసాగుతున్న కార్మికుల సమ్మె

టెక్స్టైల్ పార్క్ లో 3 వ.రోజు కొనసాగుతున్న కార్మికుల సమ్మె

కార్మికుల కూలి పెంపు పట్ల యజమానులు మొండి వైఖరి వీడాలి

వెంటనే కార్మికులతో చర్చలు జరిపి కూలీ పెంచాలి

సిరిసిల్లలో నేతన్న విగ్రహానికి వినతిపత్రం అందించి నిరసన కార్యక్రమం చేపట్టిన టెక్స్టైల్ పార్క్ కార్మికులు

కూలి పెంచే వరకు సమ్మె కొనసాగుతుంది

సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ డిమాండ్

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి )

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈ రోజు సిఐటియు ఆధ్వర్యంలో టెక్స్టైల్ పార్కులో కార్మికులకు ప్రభుత్వ వస్త్రాలకు రోజుకు 1000 /- రూపాయల వేతనం వచ్చే విధంగా పెంచాలని అదేవిధంగా ఒప్పంద గడువు ముగిసిన ప్రైవేటు వస్త్రానికి వెంటనే కూలి పెంచాలనే డిమాండ్లతో కార్మికులు చేపట్టిన సమ్మె 3 వ. రోజుకు చేరుకుంది ఈరోజు సమ్మెలో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నుండి నేతన్న విగ్రహం వరకు డిమాండ్లతో కూడిన ఫ్లకార్లతో ర్యాలీ చేపట్టి సమస్యలపై నేతన్న విగ్రహానికి వినతిపత్రం అందించడం జరిగినది.

ఈ సందర్భంగా సి.ఐ.టి.యు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ గారు మాట్లాడుతూ టెక్స్టైల్ పార్క్ కార్మికుల కూలీ పెంపు పట్ల యజమానులు మొండి వైఖరి వీడి వెంటనే చర్చలు జరిపి కార్మికులకు ప్రభుత్వ , ప్రైవేటు వస్త్రాల కూలి పెంచి సమ్మె విరమింపజేయాలని అన్నారు.యజమానులు కూలి పెంచే విధంగా సంబంధిత చేనేత జౌళి శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని లేకుంటే కూలి పెంచే వరకు సమ్మెను కొనసాగిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి , శ్రీకాంత్ , కిషన్ , ఆంజనేయులు , సంపత్ , వేణు , శ్రీధర్ , వేణు , రాజు , మనోహర్ , రాజశేఖర్ , ప్రశాంత్ , గణేష్ , రామచంద్రం , కనుకయ్య ,వరప్రసాద్ , మహేష్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version