తూముల్లో తుమ్మ పొదలు..

తూముల్లో తుమ్మ పొదలు..!

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం: ప్రతీ ఏటా వర్షాకాలంలో కురిసే భారీ వర్షాలతో చెరువులు, కుంటలు నీటితో సమృద్ధిగా నిండిపోతున్నాయి. కానీ, నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు అవస్థలు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం వ్యాప్తంగా ఏడాకులపల్లి కొత్తూరు వాగు, రాళ్ల వాగు చెరువులు, మేదపల్లి శివారులో గుండం చెరువు, ఏనుగుల చెరువు, ఈదులపల్లిలో కప్పలగ వాగు చెరువు, రాచన్న వాగు చెరువు, గంగాపూర్లో చెరువులు ఉన్నాయి. ఆయా చెరువుల కింద దాదాపు 2 వేల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉందని అధికారుల లెక్కలు సూచిస్తున్నాయి. కానీ వాటి తూములు, సీసీ కాలువలు శిథిలావస్థకు చేరి 10 ఏళ్లు గడిచిన పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. 200 ఎకరాలకు కూడా నీరు చేరడం లేదు. దీంతో పుష్కలమైన నీటి వనరులు ఉన్నప్పటికీ రైతులు పండించే వివిధ రకాల పంటలకు నీరు అందకపోవడంతో ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శిథిలావస్థలో తూములు, కాలువలు..

ఝరాసంగం మండల వ్యాప్తంగా 7 పెద్ద చెరువులు ఉండగా, పొట్టిపల్లి, బర్దిపూర్, చిల్కపల్లి, చిలేపల్లి, ఎల్గోయి తదితర గ్రామాల్లో చిన్నచిన్న చెరువులు ఉన్నాయి. వాటి తూములు శిథిలావస్థకు చేరుకోగా, మట్టి కాలువలు ఉండటంతో చివరి ఆయకట్టు రైతులకు నీరు చేరడం లేదు. చెరువుల కింద ఉన్న ఆయకట్టు రైతులు వర్షాధార పంటలు మాత్రమే పండిస్తున్నారు. మరి కొంతమంది రైతులు చెరువుకు సమీపంలో ఉన్న రైతులు మోటర్లు బిగించుకొని పంటలు పండిస్తున్నారు. ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే ఉన్న రైతులు వర్షాధార పంటల పైనే ఆధారపడి ఉన్నారు. ఆయా గ్రామాలకు చెందిన ఆయకట్టు రైతులు,గ్రామస్తులు పలుమార్లు చెరువుల మరమ్మత్తులు చేయాలని అధికారులకు విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చెరువులకు సంబంధించిన కాలువలు, మరమ్మతు చేయాలని విజ్ఞప్తి చేశారు.

పలమనేరులో పెద్ద చెరువు రక్షణకు ఆదేశాలు…

*పలమనేరుకు తలమానికమైన పెద్ద చెరువును పరిరక్షించాలని

*అధికారులను
అదేశించిన ఎమ్మేల్యే అమర్..

పలమనేరు(నేటిధాత్రి)అగస్టు19:

పలమనేరుకు తలమానికమైన పెద్ద చెరువును పరిరక్షించాలని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆక్రమణదారుల కోసం అధికారులు చెరువుకు గండి కొట్టి చెరువులోని నీటిని రైతుల పంట పొలాల్లోకి వదిలేసారని పత్రికలలో రావడంపై ఆయన ఘాటుగా స్పందించారు. దీంతో మున్సిపల్ రెవిన్యూ మరియు ఇరిగేషన్ అధికారులతో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారుఈ సందర్భంగా చెరువుకు గండి కొట్టడానికి గల కారణాన్ని మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.చెరువు ఆయకట్టు ప్రాంతంలోని పలువురి ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బందులు ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో నీటిని మళ్లించినట్లు తెలిపారు. అయితే దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నీటిని మల్లించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ కట్టను తవ్వేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పట్టణ ప్రజలకు మరియు ఆయకట్టు రైతులకు ఇబ్బంది కలగకుండా వెంటనే కట్ట మరమ్మతు పనులు పునరుద్ధరించి సప్లై ఛానల్ ద్వారా నీటిని తరలించే చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. అందుకోసం అవసరమైన నిధులను వెంటనే తెప్పించేందుకు కృషి చేస్తానని ఆ దిశగా రెవిన్యూ అధికారుల సహకారంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక చెరువు ఆక్రమణలకు గురి కాకుండా వెంటనే హద్దులను గుర్తించి పరిరక్షించాలన్నారు.ఈ సమావేశంలో తహసిల్దార్, ఇన్బనాధన్, మున్సిపల్ కమిషనర్ ఎన్వీ. రమణారెడ్డి, ఇరిగేషన్ డిఈ చొక్కల నాయక్, ఏఈ లక్ష్మీనారాయణ లతో పాటు మున్సిపల్,రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version