వందేమాతరానికి 150 ఏళ్లు – దేశభక్తి జ్వాలలతో నెక్కొండ ప్రతిధ్వనించింది
#నెక్కొండ, నేటి ధాత్రి:
జాతీయ గేయం “వందేమాతరం” రచనకు 150 సంవత్సరాలు,(1875 నవంబర్ 7 న వందేమాతరం గేయం, రచించిన బంకిమ్ చంద్ర చటర్జీ రచించి 150 సంవత్సరాలు) పూర్తయిన సందర్భంగా, వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో దేశభక్తి ఉత్సాహం ఉరకలేసింది. మార్కెట్ ఆవరణలో, పాఠశాలల్లో, కాలనీల్లో, ప్రజా వేదికలపై వందేమాతరం గీతాలాపన ప్రతిధ్వనించింది.
పల్లె నుంచి పట్టణం దాకా “వందేమాతరం” నినాదాలు మారుమ్రోగాయి.
పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ తల్లి భారతమాతకు వందనములు అర్పించారు.
నెక్కొండ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి గేయాన్ని ఆలపించారు.
తమ 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివిన పాఠశాల వేదికపై నిలిచి గీతం పాడిన పూర్వ విద్యార్థులు మాణిక్యం తొ పాటు సీఐ సన్నాయిల శ్రీనివాస్ ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.
“వందేమాతరం 150వ వసంతం మనందరికీ గౌరవ దినం” అంటూ వారు గర్వంగా తెలిపారు.
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈడునూరి సాయికృష్ణ పిలుపు మేరకు పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పలువురు నాయకులు మాట్లాడుతూ
వందేమాతరం కేవలం గేయం కాదు, ఇది దేశాత్మక గౌరవానికి ప్రతీక. తల్లి భారతమాతకు మన అర్చన.”
అని అన్నారు.
పిల్లలు జాతీయ పతాకాలతో ఊరంతా దేశభక్తి నినాదాలు చేశారు.
సంస్కృతి, భక్తి, ఐక్యత సమన్వయమై నెక్కొండ మొత్తం “వందేమాతరం” స్వరంతో మార్మోగింది.
