మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనుల జాతర ప్రారంభం
ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
#నెక్కొండ, నేటి ధాత్రి:
నెక్కొండ మండలంలోని అప్పలరావుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పనుల జాతర కార్యక్రమాన్ని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరై మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అర్హత పొందిన పనులను ఎమ్మెల్యే మాధవరెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిందని ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధిని కల్పిస్తూ గ్రామాలను ఆర్థికంగా బలోపేతం చేయడం జరుగుతుందని ఈ పథకం ద్వారా ఆయిల్ ఫామ్, పండ్ల తోటలు, పంట సాగులు, గొర్రెల గేదెల షెడ్లకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఎంతో తోడ్పడుతుందని ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాన్ని సద్వినియోగపర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, అడిషనల్ పీడీ రేణుక, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బక్కి అశోక్, డిసిసి కార్యదర్శి హరిప్రసాద్, సాయి కృష్ణ, ఆవుల శ్రీనివాస్, తిరుమల్, బండి శివకుమార్, రావుల మైపాల్ రెడ్డి, సింగం ప్రశాంత్, ఉడుగుల అశోక్, వడ్డె ఏకాంబరం, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.