ఉక్కు మహిళ ఇందిరాగాంధీ జయంతి
నెక్కొండ, నేటి ధాత్రి:
నెక్కొండ మండల కేంద్రంలో ఇంద్ర గాంధీ జయంతి సందర్భంగా ఇంద్ర గాంధీ విగ్రహానికి నర్సంపేట టిపిసిసి సభ్యుడు రంజిత్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ నేడు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే నాయకురాలు, స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతిని దేశం స్మరించుకుంటూ దాని ప్రజాహితమే పరమ ధర్మంగా భావించి, కఠిన నిర్ణయాలు తీసుకున్న ఉక్కు మహిళగా ఆమె భారత రాజకీయాలకు చెరగని ముద్ర వేశారని గ్రీన్ రివల్యూషన్ నుండి పేదల సంక్షేమ పథకాల దాకా, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన శక్తి ఆమెదే.
దేశ ఐక్యత, భద్రత, మహిళ సాధికారత కోసం చేసిన ఆమె సేవలు నేటికీ ప్రజలకు ప్రేరణ ఇంద్ర గాంధీ సేవలను కొనియాడారు . ఈ కార్యక్రమంలో నెక్కొండ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి , మండల పార్టీ అధ్యక్షుడు బక్కీ అశోక్, నెక్కొండ పట్టణ అధ్యక్షుడు ఈదునూరి సాయి కృష్ణ, కుసుమ చెన్నకేశవులు ,కొల్లు వెంకటసుబ్బారెడ్డి, రామలింగేశ్వర ఆలయ చైర్మన్, కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, చల్ల పాపిరెడ్డి, మెరుగు విజయ్ ,గంధం సుధాకర్ ,మహమ్మద్ అన్వర్, ప్రభాకర్, రావుల మహిపాల్ రెడ్డి ,సింగం ప్రశాంత్, పోలిశెట్టి భాను, తదితరులు పాల్గొన్నారు.
