జిల్లా కలెక్టర్ నెక్కొండలొ పర్యటన…

జిల్లా కలెక్టర్ నెక్కొండలొ పర్యటన

పంట నష్టం, కూలిపోయిన గృహాల పై సమీక్ష

రైతులకు ధైర్యం చెప్పిన కలెక్టర్

#నెక్కొండ, నేటి ధాత్రి:

వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద శనివారం నెక్కొండ మండలంలో పర్యటించారు. వర్షాల ప్రభావంతో నష్టపోయిన పంటలను, కూలిపోయిన గృహాలను, గోడలను ఆమె స్వయంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
రెడ్లవాడ, పెట్టకాలు బొడు తండా, నాజీ తండా, గ్రామాల్లో పంటలను కలెక్టర్కు చూపించిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల శ్రీనివాస్, మార్కెట్ డైరెక్టర్ కొమురయ్య తదితరులు. వెంకటాపురం, తోపనపల్లి గ్రామాల మధ్య తెగిపోయిన కల్వర్టులను పరిశీలించిన కలెక్టర్ మాట్లాడుతూ—ఈ కల్వర్టు గత సంవత్సరం కూడా ప్రమాదానికి గురైందని, ఆ సమయంలో తానూ అదే ప్రాంతాన్ని సందర్శించిన విషయాన్ని గుర్తుచేశారు.
పంట నష్టం సర్వేను వేగంగా పూర్తి చేయాలని, వ్యవసాయ శాఖ అధికారులు రెండు రోజుల్లోగా సర్వే ముగించాలని ఆమె ఆదేశించారు. పంట కోతకు సిద్ధంగా ఉండి వర్షంతో నిటమునిగిన వరి పంటను ప్రభుత్వం బైల్ మిల్లుల ద్వారా కొనుగోలు చేయడానికి అనుమతించిందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు.
అలాగే గ్రామాల్లో కూలిపోయిన గృహాలు, కూలిపోయిన ఇంటి గోడలపై రెవెన్యూ శాఖ సర్వే నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఈ పర్యటనలో తహసిల్దార్ వేముల రాజకుమార్, ఎంపీడీవో యసం లావణ్య, ఎంపీడీవో కార్యాలయ సుపరింటెండెంట్ దయాకర్, జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం…

సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ డా బెల్లయ్య నాయక్ అన్నారు.
బుధవారం ఐడిఓసి కార్యాలయంలో జరిగిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముందుగా
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరే పుష్ప గుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 77 సంవత్సరాల క్రితం తెలంగాణ గడ్డపై రాచరికానికి, నియంతృత్వానికి, పెత్తందారీ తనానికి వ్యతిరేకంగా సాయుధ వీరులు నిజాం నిరంకుశ రాజును, ఆనాటి రాచరిక వ్యవస్థను ముట్టడించి తెలంగాణ బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం సెప్టెంబర్ 17, 1948న మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ గడ్డపై ఆవిష్కృతమైందన్నారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం కోసం రాచరిక పోకడపై చేసిన తిరుగుబాటు అది పేర్కొన్నారు. తెలంగాణ అంటే త్యాగం. ఆ త్యాగాలకు ఆద్యుడు దొడ్డి కొమురయ్య, వరంగల్ కు చెందిన షేక్ బందగి భాను నాయక్ లకు నివాళులర్పించారు.
తమ ప్రాణాలను ఒడ్డి సాయుధ పోరాటానికి ఊపిరి పోసిన నాటి సాయుధ పోరాటంలో ఎందరో తమ జీవితాలను త్యాగం చేశారని కొనియాడారు. సర్వం కోల్పోయినా లక్ష్య సాధనలో వెనుకంజ వేయక ఆనాటి సాయుధ పోరాటంలో ప్రాణాలు వదిలిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు.
సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన రోజని, ఈ శుభదినాన్ని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. సెప్టెంబర్ 17, 1948న తెలంగాణ ప్రజలు నిజాం రాచరిక వ్యవస్థను కూలదోసి… ప్రజాస్వామ్య ప్రస్థానానికి నాంది పలికారన్నారు. ప్రజా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం 4 కోట్ల ప్రజల ఆకాంక్ష, వారి ఆలోచన, నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి, గడిచిన పదేళ్లలో ప్రజలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో తమ భాదలు తీరతాయని ఆశించారో అవి నెరవేరలేదన్నారు. ప్రభుత్వ ఆశ, ఆలోచన, ఆచరణ ప్రతీది ప్రజా కోణమేనని, అందుకే ఈ శుభ దినాన్ని ప్రజా పాలన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాణ త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాలన పారదర్శకంగా, బాధ్యతగా ఉండాలని, ప్రతి నిర్ణయంలో ప్రజల కోణం ఉండాలని, అమరుల ఆశయాలు ఉండాలని, యువత ఆకాంక్షలు ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన క్షణం నుండి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ, విధ్వంసమైన తెలంగాణ పునరుజ్జీవనానికి చర్యలు చేపట్టామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్,
ఏఎస్పి నరేష్ కుమార్, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజలు, పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

కొమురయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

కొమురయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట పట్టణంలో ఇటీవల మృతి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారుడు గుండెబోయిన కొమురయ్య కుమారులు శివకోటి,హరి ప్రసాద్ కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముందుగా కూర చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర సభ్యులు రాయుడి రవీందర్ రెడ్డి,పట్టణ అధ్యక్షుడు నాగేల్లి వెంకటనారాయణ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి వేనుముద్దల శ్రీధర్ రెడ్డి,ప్రచార కార్యదర్శి,మాజీ కౌన్సిలర్ మండల శ్రీనివాస్,మాజీ మార్కెట్ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, దేవుడు సదానందం, గంప రాజేశ్వర్, రావుల సతీష్, బీరం నాగిరెడ్డి, సంపంగి సాలయ్య, పైసా ప్రవీణ్,11వ వార్డు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version