మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం, నిత్యావసరాలు అందజేత

చనిపోయిన కుటుంబానికి బియ్యంతో పాటు ఆర్థిక సహాయం అందజేసిన నాయకులు…..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలo లొ బదనపల్లి టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీకి చెందిన బూర్ల లక్ష్మీనారాయణ అనారోగ్యంతో మృతి చెందగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ స్పందించి వారి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని ఆదేశించగా.వారి కుటుంబానికి పరామర్శించి. తక్షణ సహాయం కింద బియ్యంతో పాటు ఇతర నిత్యవసర వస్తువులు సరుకులు అందజేసిన అధికారులు. అలాగే ప్రభుత్వపరంగా లక్ష్మీనారాయణ కుటుంబాన్ని ఆదుకుంటామని అధికారులు వెల్లడించారు.ఇట్టి విషయమై మృతుడు లక్ష్మీనారాయణ కుటుంబ పరిస్థితి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే .మహేందర్రెడ్డి ల దృష్టికి తీసుకువెళ్లి. వారి కుటుంబానికి ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా ఇందిరమ్మ కాలనీ సర్పంచ్ గడ్డం రచన మధుకర్ తెలిపారు. మృతి పై స్పందించి లక్ష్మీనారాయణ మృతి చెందగా వారి కుటుంబానికి కుటుంబానికి. బూర్ల లక్ష్మీనారాయణ కుటుంబాన్ని పరామర్శించి తన వంతు సహాయంగా ఇందిరమ్మ కాలనీ మాజీ ఉపసర్పంచ్.అల్వాల సాయిరాం .స్పందించి లక్ష్మీనారాయణ కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు అలాగే. కష్ట సమయంలో ప్రజల కు ఆపద సమయంలో వారి వారి కుటుంబాలకు.అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఇందిరమ్మ కాలనీ మాజీ ఉపసర్పంచ్ సాయిరాం తెలిపారు ఇట్టి కార్యక్రమంలో. వేముల నరేష్. కిషన్. ప్రశాంత్. నరసయ్య. రాకేష్ నాయకులు గ్రామ ప్రజలు పార్టీలకతీతంగా గ్రామంలో ప్రజలందరూ పాల్గొని పరామర్శించారు

జిల్లా కలెక్టర్ నెక్కొండలొ పర్యటన…

జిల్లా కలెక్టర్ నెక్కొండలొ పర్యటన

పంట నష్టం, కూలిపోయిన గృహాల పై సమీక్ష

రైతులకు ధైర్యం చెప్పిన కలెక్టర్

#నెక్కొండ, నేటి ధాత్రి:

వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద శనివారం నెక్కొండ మండలంలో పర్యటించారు. వర్షాల ప్రభావంతో నష్టపోయిన పంటలను, కూలిపోయిన గృహాలను, గోడలను ఆమె స్వయంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
రెడ్లవాడ, పెట్టకాలు బొడు తండా, నాజీ తండా, గ్రామాల్లో పంటలను కలెక్టర్కు చూపించిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల శ్రీనివాస్, మార్కెట్ డైరెక్టర్ కొమురయ్య తదితరులు. వెంకటాపురం, తోపనపల్లి గ్రామాల మధ్య తెగిపోయిన కల్వర్టులను పరిశీలించిన కలెక్టర్ మాట్లాడుతూ—ఈ కల్వర్టు గత సంవత్సరం కూడా ప్రమాదానికి గురైందని, ఆ సమయంలో తానూ అదే ప్రాంతాన్ని సందర్శించిన విషయాన్ని గుర్తుచేశారు.
పంట నష్టం సర్వేను వేగంగా పూర్తి చేయాలని, వ్యవసాయ శాఖ అధికారులు రెండు రోజుల్లోగా సర్వే ముగించాలని ఆమె ఆదేశించారు. పంట కోతకు సిద్ధంగా ఉండి వర్షంతో నిటమునిగిన వరి పంటను ప్రభుత్వం బైల్ మిల్లుల ద్వారా కొనుగోలు చేయడానికి అనుమతించిందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు.
అలాగే గ్రామాల్లో కూలిపోయిన గృహాలు, కూలిపోయిన ఇంటి గోడలపై రెవెన్యూ శాఖ సర్వే నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఈ పర్యటనలో తహసిల్దార్ వేముల రాజకుమార్, ఎంపీడీవో యసం లావణ్య, ఎంపీడీవో కార్యాలయ సుపరింటెండెంట్ దయాకర్, జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version