ఎమ్మెల్యే దొంతి సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు….

ఎమ్మెల్యే దొంతి సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని 25వ వార్డు నుండి పలువురు ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఆకర్షితులై టీపీసీసీ సభ్యులు,మాజీ కౌన్సిలర్ పెండెం లక్ష్మిరామానంద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.పార్టీలో చేరిన వారిలో నల్గొండ సంతోష్,నల్గొండ వంశీ,చీకటి శివమణి,ముద్రబోయిన రాజు,పుట్ట జగదీష్,పుట్ట రామస్వామి,జాటోతు వీరన్న,మురారి వినయ్,స్వామిశెట్టి రాజశేఖర్,చీకటి విజయ్,శ్రీనివాస్ ఉన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకూబ్ రెడ్డి,మాజీ ఎంపిటిసి కాట ప్రభాకర్,కాట రఘు,మెరుగు కిరణ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కును అందించిన పెండెం రామానంద్…

సీఎంఆర్ఎఫ్ చెక్కును అందించిన పెండెం రామానంద్

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణానికి చెందిన వడ్లకొండ సాంబయ్య ఇటీవల అనారోగ్య కారణాలతో కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం పొందాడు.కాగా అందుకు ఆర్థిక సహాయం కోసం ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం పథకం కింద స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో దరఖాస్తు చేసుకోగా లక్ష రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును సోమవారం ఆ వార్డు ఇంచార్జ్ కొంకిస అరుణ గౌడ్ చేతుల మీదుగా టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ అందజేశారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని రాజేందర్, మాజీ కౌన్సిలర్ పెండెం లక్ష్మీరామానంద్, మాజీ వార్డు సభ్యులు కొయ్యడి సంపత్ గౌడ్,గండి గిరి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

ప్రతి డ్రైవర్ కు ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం…

ప్రతి డ్రైవర్ కు ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం

మాట నిలబెట్టుకున్న సొంటి రెడ్డి

#నెక్కొండ, నేటి ధాత్రి:

క్కొండ మండల కేంద్రంలోని నవత ఆటో యూనియన్ సభ్యులందరికీ తన సొంత ఖర్చులతో ఉచితంగా ప్రమాద బీమా చేపిస్తానన్న మాట ప్రకారం. 160 మంది డ్రైవర్లకు సంవత్సరం పాటు ఉచితంగా ప్రమాద బీమా ఐదు లక్షల రూపాయల బీమా ఇన్సూరెన్స్ చేపించిన టిపిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి. బుధవారం మండల కేంద్రంలోని తహసిల్దార్ సెంటర్లో నవత ఆటో యూనియన్ అధ్యక్షుడు మోడెం సురేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఇన్సూరెన్స్ భీమ పత్రాలను నవత ఆటో యూనియన్ డ్రైవర్లకు అందించిన సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, ఈ సందర్భంగా సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ఒక సంవత్సరమే కాకుండా ఐదు సంవత్సరాలు కంటిన్యూగా ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ పాలసీ బీమా అందరికీ చెల్లిస్తానని ఇంకా ఎవరైనా డ్రైవర్లు ఉంటే వాళ్ల పేర్లు కూడా పంపించాలని ప్రతి ఒక్క డ్రైవర్ కు ఇన్సూరెన్స్ చాలా ముఖ్యమని యూనియన్ బాధ్యులకు తెలిపారు. డ్రైవర్ల అందరూ ప్రభుత్వానికి పరోక్షంగా సేవ చేస్తున్నారని, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుటలో డ్రైవర్ల పాత్ర కీలకమని, వీరి కుటుంబాలు వీరిపై ఆధారపడి ఉన్నాయని, ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే ఎవరో ఏదో సహాయం చేస్తారని ఎదురు చూడకుండా చట్టప్రకారం ఇన్సూరెన్స్ చేసి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని పొందే అవకాశం ప్రభుత్వం కల్పించిందని, ఇలాంటి ఇన్సూరెన్స్ లను వినియోగించుకోవాలని డ్రైవర్లకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి కి చిరు సన్మానం చేశారు .కార్యక్రమంలో నవత ఆటో యూనియన్ అధ్యక్షుడు మోడెం సురేష్, శ్రీరంగం శ్రీనివాస్, ఉల్లేరావు ప్రభాకర్, పెండ్యాల రాజు, బద్రు నాయక్, మోడెం రాజు, మహమ్మద్ అమీర్, నవత ఆటో యూనియన్ డ్రైవర్లు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version